పెద్దాపుర సంస్థాన సరి హద్దులు - ఆదాయం - పరిణామక్రమం
పెద్దాపురం ప్రాచీన ఆంద్ర దేశము లో పురాతన సంస్థానములలో ఒకటి. ఇంచుమించు ఐదు వందల ఏళ్ల పూర్వ చరిత్ర కలది.
గోదావరి మండలము లోని చాలా భాగము,
కృష్ణా - గుంటూరు మండలాలలోని కొంత భాగము,
విశాఖ పట్టణం లోని కొన్ని గ్రామాలు అయిన తోటపల్లి, రంప , చోడవరం, మొదలగు మన్యం ప్రాంతాలు ఒకప్పటి పెద్దాపురం సంస్థానములోనివి.
సంస్థానములోని ముఖ్య పట్టణం అయిన "పెద్దాపురం" తూర్పు గోదావరి జిల్లా లో రాజ మహేంద్రవరం (ఇప్పటి రాజముండ్రి) కి ఈశాన్య దిక్కు గా పది కోసుల దూరంలో (కోసు = ఇంచుమించు 3.1/2 కిలో మీటర్లు) ఉన్నది.
1803 సంవత్సరం నాటికి పెద్దాపురం సంస్థానం ఆదాయం పది లక్షలు.
సాలు సరి పేష్కషు సాలుసరి పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఆరున్నర లక్షలు.
అంత పెద్ద సంస్థానం కాలక్రమంలో చిన్న చిన్న భాగాలుగా విభజించబడి చివరికి కొట్టాము, తుని ఎస్టేటు గా మారిపోయి, ఆ తరువాతి కాలంలో ఆంద్రప్రదేశ్ రాష్త్రం లో అంతర్భాగం అయ్యిపోయింది.
రాజా వేంకట సూర్య నారాయణ జగపతి రాజు గారి పేర నమోదయినటువంటి కొట్టాము ఎస్టేటు యొక్క రాబడి రెండున్నర లక్షలు పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఇరవై ఆరువేల నూట డెబ్బై మూడు రూపాయలు కొట్టాము ఎస్టేట్ యొక్క ముఖ్య పట్టణం తాండవ నది ఒడ్డున ఉన్న తుని. Ref : కిమ్మూరు కైఫీయతు https://plus.google.com/+vangalapudisivakrishna/posts
https://archive.org/details/kimmurukaifiyatu00unknsher