Friday 31 March 2017

మన పెద్దాపురం పేస్ బుక్ టీం - సేవే వాళ్ళ థీమ్

మన పెద్దాపురం పేస్ బుక్ టీం - సేవే వాళ్ళ థీమ్ - #సాక్షి
గ్రూపు ప్రారంభించి రెండు సంవత్సరాలు - #యువకుల నిస్వార్థమైన సేవని గుర్తించి అడుగుగడుగునా అండగా నిలబడ్డ ప్రతీ ఒక్కరికీ పేరు పేరు నా ధన్యవాదాలు... మీ అందరి స్ఫూర్తి తో మన చారిత్రిక పెద్దాపురం విశేషాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం ఈ సేవా ప్రస్థానాన్ని చివరి రక్తపు బొట్టువరకూ కొనసాగిస్తాం - ఇట్లు #మన_పెద్దాపురం_టీం



 - వంగలపూడి శివకృష్ణ

Kandra kota Nookalamma Thalli Jathara - Peddapuram





 - వంగలపూడి శివకృష్ణ

Organ Donation Rally by Mana Peddapuram Team




- వంగలపూడి శివకృష్ణ

స్ఫూర్తినిస్తున్న పెద్ద యువత - 10టీవీ - Mana Peddapuram Team



 - వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం ఊరు మనదిరా

 వంగలపూడి శివకృష్ణ

Mana peddapuram Face book team 2nd Anniversary





#ఈనాడు 31/03/2017 : మన పెద్దాపురం పేస్ బుక్ గ్రూప్ ద్వితీయ వార్షికోత్సవం - వేడుకలలో పాలుపంచుకున్న పెద్దాపురం యువకులకు, నాయకులకు, గ్రూపు సభ్యులకు - హీరో Viswant విశ్వంత్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు - వంగలపూడి శివకృష్ణ

పేస్ బుక్ గ్రూప్ టీం ద్వితీయ వార్షికోత్సవం




#సాక్షి 31/03/2017 : పేస్ బుక్ గ్రూప్ టీం ద్వితీయ వార్షికోత్సవం - మన పెద్దాపురం ఫేస్బుక్ టీం రెండవ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన అందరికీ ధన్యవాదాలు - వంగలపూడి శివకృష్ణ

Thursday 30 March 2017

యుగాది సృష్టి ఆరంభానికి నాంది

 
ఉగస్య ఆదే ఉగాది - యుగాది సృష్టి ఆరంభానికి నాంది
ఉదయం అభ్యంగన స్నానం,
ఇష్టదేవతారాధనం  - స్తోత్ర పారాయణం
నింబకుసుమ భక్షణం
పూర్ణకుంభదానమనే ధ్వజారోహణం
పంచాంగ శ్రవణం - సర్వ పాపహరణం  - వంగలపూడి శివకృష్ణ

ఈ ఉగాదికి స్వీట్ వార్నింగ్


దుర్ముఖి చాలా దుర్మార్గం చేసింది
నిత్య వసంతం ఇస్తుందనుకుంటే
నిట్ట నిలువునా ముంచేసి పోయింది
ఓయ్ హేమళంబి నువ్వైనా న్యాయం చేస్తావా - వంగలపూడి శివకృష్ణ

శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

 -


#మనపెద్దాపురం గ్రూపు సభ్యులందరికీ శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఆరు ఋతువులు ఆహ్లాదభరితమైనప్పుడు
ఆరు రుచులు అనునిత్యం ఆస్వాదిద్దాం

చేదు అనుభవాల సారంలోనూ ఓ తీపి జ్ఞాపకం నెమరువేద్దాం

దుర్ముఖి కి వీడ్కోలు చెప్తూ హేమలంబిని ఆహ్వానిద్దాం
వంగలపూడి శివకృష్ణ

మళ్ళీ వచ్చే ఉగాది కోసం


ముచ్చటగా మూడక్షరాల సందేశం
వర్తమానం నాకొక విరక్తి వచనం
చరిత్ర నాకొక ఆసక్తి కవిత
భవిష్యత్ పై ఆశ వదలని మనిషి నేను
ఎండమావుల్లో నీటిని వెతుక్కునే ఆశాజీవిని నేను
అందుకే మళ్ళీ వచ్చే ఉగాది కోసం నిరీక్షిస్తున్నాను - వంగలపూడి శివకృష్ణ

MANA PEDDAPURAM FACEBOOK GROUP LOGO


 వంగలపూడి శివకృష్ణ

తెలుగు నూతన సంవత్సరానికి తెల్లవారింది - HAPPY UGADI POEM

తెలుగు నూతన సంవత్సరానికి తెల్లవారింది
కోకిల గానం వీనులకు విందు చేస్తుంది
వీధంతా వేప పువ్వు వాసన
ఇంటినిండా బంధువుల సందడి
సున్ని పిండి సిద్ధంగా ఉంది కొత్త బట్టలు కవ్విస్తున్నాయి
షడ్రుచులు నోరూరిస్తున్నాయి
లేచి చూస్తే అన్నీ టీవీ లోనే ఎదురుగా అంతా మామూలే
పంచాంగ శ్రవణం సకల పాప హరణం అంటూ టెలివిజన్ యాంకర్ల కృత్రిమ హడావుడి
ఉగాది వాట్స్ ఆప్ మెసేజ్ అయ్యి కూర్చుంది - పేస్ బుక్ లో హల్చల్ చేసింది నిజజీవితంలో నిద్రపోయింది - వంగలపూడి శివకృష్ణ

Saturday 25 March 2017

MR. College Principal's Son Given Rs. 10000 to Mana Peddapuram Group

మహారాణీ కళాశాల ప్రిన్సిపల్ #శ్రీ_రావు_ప్రభాకరరావు గారి కుమారుడు #రావు_సూర్యభరత్గారు #పరిశుభ్ర_పెద్దాపురం కోసం #మనపెద్దాపురం పేస్ బుక్ టీం కి పదివేలు రూపాయలు అందించినందుకు ధన్యవాదాలు.
#సూర్యభరత్_రావు గారి తోడ్పాడు తోడుగా ప్రపంచ పరిశుభ్రతా చరిత్రలో పెద్దాపురం స్థానం సుస్థిరం చేద్ధాం మనమంతా చేయికలిపితే అదేమీ పెద్ద విషయం కాదు రండి #క్లీన్_ఆర్మీ తో చేతులు కలపండి మార్పుని స్వాగతించండి. 
#మన_పెద్దాపురం_టీం






 వంగలపూడి శివకృష్ణ

Saheed Bhagath singh Cermony at Peddapuram








వంగలపూడి శివకృష్ణ

JOHAR BAGATH SING @PEDDAPURAM

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, వర్దంతి సభ పెద్దాపురం నువ్వులగుంటవీధిలో జరిగింది. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ప్రజానాట్యమండలి, #మనపెద్దాపురం ఫేస్ బుక్ టీమ్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. 
ఈ కార్యక్రమంలో పాల్గోన్న అందరికీ ధన్యవాదాలు..
ఇంక్విలాబ్ జిందాబాద్..
జోహార్ అమరవీరులకు








వంగలపూడి శివకృష్ణ

MANA PEDDAPURAM FACE BOOK GROUP HELPED POOR PATIENT



ఈయన ఎవరో గుర్తు పట్టారా ? గుర్తు పట్టలేక పోతున్నారా ... ! అయితే వినండి
సరిగ్గా 5 నెలల క్రితం ఇతని కోసం కొందరు యువకులు
పుట్టిన రోజు వేడుకలు మానేసి ఆ డబ్బు ఆయనకీ ఇచ్చారు
కొందరు దీపావళి సంబరాలు సంబరాలు మానేసి డబ్బు సేకరించారు 
కొందరు సంత మార్కెట్ లో జోలి పట్టి అర్ధించి డబ్బు సేకరించారు
ఒక #యువసేన వారికోత్సవ వేడుకల్లో అతని జీవితాన్ని నిలబెట్టటమే లక్ష్యం చేసుకుంది
ఒక #వార్తాపత్రిక సామాజిక భాద్యతకి అద్దం పట్టింది
ఒకవ్యక్తి విదేశాలలో ఉంటూనే వారి నిండు జీవితం నిలబెట్టడం కోసం ఆరాటపడ్డాడు
#మనపెద్దాపురం పేస్ బుక్ గ్రూప్ ఈ కార్యక్రమాలన్నిటికీ సమన్వయ కర్తగా నిలిచింది
ఇప్పటికైనా గుర్తు పట్టారా ఆయన ఎవరో... బహుశా చెప్ప నవసరం లేదేమో... కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి - చాలా ఆనందం గా ఉంది - అందరికీ ధన్యవాదాలు / పాదాభి వందనాలు

వంగలపూడి శివకృష్ణ

MANA PEDDAPURAM FACEBOOK TEAM LOGO




పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...