Tuesday 10 January 2017

Peddapuram Municipality Chairman Sri Raja Suribabu Raju Bio Data



#పేరు : రాజా సూరిబాబు రాజు
#పూర్తిపేరు : శ్రీ రాజా వత్సవాయ లక్ష్మీ సూర్యనారాయణ జగపతి బహద్దరు మహారాజు
#జననం : 07 - 01 - 1954 (న్యూమరాలజీ టోటల్ = 9) రాజయోగం
#తల్లిదండ్రులు : శ్రీ సూర్యనారాయణ జగపతి శ్రీమతి నర్శిమూర్తియమ్మ దంపతులు
#విద్యాభ్యాసం : లూథరన్ హైస్కూల్, మహారాణీ కళాశాల, పెద్దాపురం

#రాజకీయం : మహారాణీ కళాశాల అధ్యక్షులుగా గెలుపు, కాంగ్రేస్ పట్టణ అద్యక్షులు... జిల్లా కాంగ్రేస్ యువ నాయకులు... మహారాణీ సత్రం కార్యనిర్వాహక అధ్యక్షులు...1999 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి సేవలు... రెండు సార్లు పెద్దాపురం పురపాలక సంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు

(అప్పటికే పెద్దాపురంలో అత్యంత బలంగా పాతుకుపోయిన కాంగ్రేస్ కంచుకోటని బద్దలు గొట్టి మొదటిసారి తెలుగుదేశం జెండాని ఎగురవేసిన మొట్టమొదటి పెద్దాపురం టి.డి.పి చైర్మన్ 31/03/2000 నుండి 30/03/ 2005 వరకూ మరియు రెండవసారి కూడా విజేతగా నిలిచి 03.07.2014 న చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు)

#తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అటు పార్టీ కార్యక్రమాలలో... మరియు నవ్యాంద్ర నిర్మాణంలో చురుకుగా పాల్గొంటూ... ఇటు #పెద్దాపురం ప్రథమ పౌరుడిగా ప్రముఖ పాత్ర పోషిస్తూ... అత్యంత ప్రభావశాలియైన రాజకీయనాయకుడిగా అందరి మన్ననలూ పొందుతూ... అందరినీ అక్కున చేర్చుకుంటూ చిన్న పిల్లల్ని సైతం ఆప్యాయంగా పలకరిస్తూంటారు.

#నియోజకవర్గంలో ప్రతీ కార్యక్రమానికీ హాజరవుతూ కష్టం అన్న ప్రతీఒక్కరినీ ఆదుకుంటూ... అనుకున్న అభివృద్ధి పనిని అందుకోవాల్సిన లక్ష్యాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా వదలని మనిషిగా #కులమతాలకి అతీతంగా పేదల సంక్షేమమే పరమావదిగా పరిపాలన చేసే#ప్రజానాయకులుగా పేరుపొందారు...

#పాలిటిక్స్ ఎన్నికలవరకే ... ఎన్నికల తర్వాత ప్రతీ పనీ ఊరి అభివృద్ధి కొరకే అని విశ్వసించే వారిలో మొదటి వరసలో వుంటారు ... ముక్కు సూటిగా వ్యవహరిస్తారు... నాన్చేధోరణి సహించరు.. న్యాయం ఎటు ఉంటే అటు నిలబడతారు అది అధికార పక్షమా... ప్రతి పక్షమా అనిచూడరు

#టెన్నీస్_చాంపియన్ గా ... హార్స్ రైడర్ గా... రైఫిల్ షూటర్ గా... ఇంకా అనేక క్రీడలలో ప్రావీణ్యులుగా... క్రీడాభ్యుదయానికి బాటలువేస్తూ క్రీడాకారులను అభినందిస్తూ ... ప్రోత్సహిస్తూ యువక్రీడాకారులలో స్పూర్తినింపుతున్నారు

#పెద్దాపురం_ప్రాశస్త్యాన్ని ప్రతిభింబింపజేసే ప్రతీ అంశాన్నీ గౌరవిస్తూ... పెద్దాపురం ప్రాముఖ్యతని ప్రతీ చోటా తెలియజేస్తూ... #పెద్దాపురం_చరిత్రని ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే ప్రతీఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు

#చారిత్రక_పెద్దాపుర పునర్నిర్మాణానికి పునాధిరాళ్లు పేరుస్తూ... పునర్వైభవానికి విశేషకృషి చేస్తూ... పురపాలక సర్వతోముఖాభివృద్ధికి సర్వదాకృషి చేస్తున్న #పెద్దాపురం_ప్రథమపౌరులు - #శ్రీరాజా_సూరిబాబురాజు గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలనీ... ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య సుఖ సంతోషాలతో వర్థిల్లాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ...#మీ_వంగలపూడి_శివకృష్ణ
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Welcome Clean Army Peddapuram

పెద్దాపురం  - వంగలపూడి శివకృష్ణ
క్లీన్ కమిట్ మెంట్ ఆప్ #క్లీన్ఆర్మీ
చలికి చలించని #స్వచ్ఛసైనికులు తీసుకొచ్చిన మార్పు
రండి స్వచ్ఛమైన మనసుతో సంకల్పిద్దాం
చేయి చేయి కలుపుదాం #స్వచ్ఛపెద్దాపురం సాధిద్దాం

Clean Army at MRO Office Peddapuram by Vangalapudi Siva Krishna

పెద్దాపురం - వంగలపూడి శివకృష్ణ

హాట్సాప్ స్వచ్ఛ సైన్యం 08/01/2017 MRO Office
ఊరి పరిశుభ్రత మా గురుతర బాధ్యత
#స్వచ్ఛత_పరిశుభ్రత మా  పెద్దాపురం గ్రూపు సభ్యుల జీవన విధానం లో ఒక భాగం అయ్యిపోయింది - అపరిశుభ్రత పై యుద్ధానికి మేమంతా సిద్ధం ...
మాతో పాటూ ఈరోజు 6th Ward దత్తతదారు #దినేష్_రాజు గారు కూడా #క్లీన్_ఆర్మీ లో పాల్గొనడం జరిగింది... కార్యక్రమంలో పాల్గొన్న గ్రూపుమెంబర్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు...

Peddapuram Girl Excellent Performance to Accent Bagavdhgeetha Slokas

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

History of Kattamuru Peddapuram

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం మహారాజా వారు శ్రీ రామునికి కట్నం గా సమర్పించిన వూరు కట్టమూరు
వర్ణించ తరమా ఈ వూరి సొగసులు
ఏలేరు వంపులు
పచ్చని పైరులు 
పైరులకి కొలనులు
పశువులకు చెరువులు
ఊరి మద్యలో జోడుగుళ్ళు
ఊరి నిండా పెంకుటిల్లు
కల్మషం లేని మనుషులు
పెద్దాపురం మహారాజా శ్రీ రాజా రాయపరాజ మహారాజు గారు(1607-1649)
శ్రీ రామునకుఁ కట్టమూరున గట్టించే గుళ్ళూ గోపురములు మంటపములు,
గంభీర జల తటాకమును త్రవ్వించె గృహస్తపురంబున సుస్థిరముగఁ
బొలుపుగా వాల్మీకిపురి కాండ్రకోటను ఫలభూజవాటికల్ పదిలపరచే"
అని ఏనుగు లక్ష్మణ కవి రచించిన రామ విలాసము లో ఇలా వర్ణించాడు
గుడులు గోపురములు :
పట్టాభిరాములవారి గుడి మరియు కేశవ స్వాములవారి గుడి, శివాలయము, వినాయకుని గుడి, షిరిడి సాయిబాబావారి దేవాలయము, వీరబ్రహ్మం గారి ఆలయము, ఊరి మొదట్లో కనకదుర్గ గుడి, ఊరి చివరన పోలేరమ్మ తల్లి ఆలయము, ఇంకా శ్రీరాముని కోవెలలు, ఆంజనేయుని గుడులు కలవు.
చెఱువులు :
మంచి నీటి చెఱువు, రాయన చెఱువు, బాపనవీధి చెఱువు, కిత్తా చెఱువు, గంగరావి చెఱువులు
పాఠశాలలు :
ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మూడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలు

Welcome to the Kota Sattemma Festival Peddapuram Near Pandavula Metta & Navodaya Peddapuram

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

శ్రీ సత్తెమ్మ అమ్మవారి 43వ జాతర మహోత్సవానికి స్వాగతం-సుస్వాగతం
మన పెద్దాపురం పాండవుల మెట్ట దగ్గర కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ అమరగిరి సత్తెమ్మ అమ్మ వారి 43 వ జాతర మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం
"ఓం ఐం హ్రిం శ్రీం శ్రీ సత్యాంబికాయైనమః"
"అమ్మదయ అపారం - అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే"
త్రైయానిక పంచాయతన చండీ యాగం : 13 జనవరి 2017 నుండి 15 జనవరి 2017 వరకూ
సత్తెమ్మ అమ్మవారి జాతర : 15 జనవరి 2017 న (కనుమ రోజు) అంగరంగ వైభవంగా
ప్రసిద్ద స్పటిక విఘ్నేశ్వర పూజ, త్రిభైరవ = వటుక, స్వర్ణాకర్షణ, మహాకాలభైరవ మంత్రోచ్ఛారణ
సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పినట్టు వర్ణింపబడిన నవదుర్గా స్తోత్రం నిత్య పారాయణం = "ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా"
భక్తులు అందరూ పెద్ద ఎత్తున ఈ జాతర మహోత్సవం లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతారని.... జాతర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ కోరి ప్రార్ధిస్తున్నాము .... ఇట్లు మన పెద్దాపురం టీం ఆలయ కమిటీ తరపున

Peddapuram Pandavula Metta Amaragiri Sattemma Kota Sattemma Temple History by Vangalapudi Siva Krishna

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
పూర్వకాలంలో గ్రామ ప్రజలందరినీ ప్రమాదాల నుండి కాపాడుతూ, అన్నదాతలైన రైతుల పంటలను కాపాడుతూ, సకాలంలో వర్షాలు కురిసేలా చేస్తూ, అకాల మృత్యు భయాన్ని పారద్రోలే గ్రామ దేవతగా పెద్దాపురం మహారాజా వారి కోటలో #కోటసత్తెమ్మ అమ్మవారు* వెలిసారు
కోట సత్తెమ్మ #అమరగిరిసత్తెమ్మ గా ఆవిర్భవించిన విధానం
ఆలయ వ్యవస్థాపకులలో ఒకరైనటువంటి కీ.శే. #శ్రీ_చలపతి రావు గారికి అమ్మ వారు కలలో కనిపించి రాజుగారి కోటలో కొలువై ఉన్న విషయం తెలుపగా చలపతి రావు గారు ఆ విషయాన్ని ప్రధాన ఆలయము, ఉపఆలయ వ్యవస్థాపకులు #శ్రీ_పప్పలనాగరాజు* గారికి తెలియజేయడం జరిగింది వెనువెంటనే ఇద్దరూ రాజు గారి కోట సమీపించి అమ్మవారి మూల విగ్రహాన్ని గుర్తించి జగ్గంపేట రోడ్డు సమీపంలో ప్రతిష్టించడం జరిగింది (ఇప్పటికీ ఆ మూల విగ్రహం ఆలయం లోనే ఉంది)
ఆనాటి నుండీ పెద్దాపురం అమరగిరి - పాండవుల మెట్ట సమీపంలో కొలువైన శ్రీ సత్తెమ్మ అమ్మవారు - *కోట సత్తెమ్మ అమ్మవారి నుండి అమరగిరి అమ్మగా* వెలుగొందుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై ... అష్ట ఐశ్వర్య సుఖసంతోషాలు సిరి సంపదలిచ్చే అమ్మగా ... గజ్జిల, పేద గoదo, పప్పల వారికి కుటుంబ దేవత గా వేలుగోoదినది మరియు అనేకులు అమ్మను కుటుంబ దేవతగా ఆరాధన చేస్తున్నారు...
అమరగిరి సత్తెమ్మ అమ్మవారు అష్టాదశ హస్తాలతో దుష్ట శక్తులను రూపుమాపే అభయ స్వరూపిణిగా #ఓం_ఐం_హ్రిం_శ్రీం_శ్రీ_సత్యాంబికాయైనమః' అన్న మంత్రోచ్చరణతో విరాజిల్లే అమరగిరి సత్తెమ్మ అమ్మవారిగా... భక్తుల పూజలందుకొంటున్నారు,
ప్రస్తుతం శ్రీ శక్తిపీఠంగా అలరారుతున్న ఈ ఆలయానికి 1973 ప్రాంతం నుండీ పప్పల నాగరాజు దంపతులు ప్రధాన అర్చకులుగా వ్యవరిస్తూ అనేక యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ అమ్మవారి సేవచేసారు, అనంతరం వారి కుమారుడు శ్రీ పెదబాబు గారు (గురువర్యులు) అమ్మవారికి ఘనంగా ఉయ్యాల తాళ్ల ఉత్సవం మరియు భోగినుండి కనుమ వరకూ అత్యంతవైభవంగా మేళతాళాలతో, గరగ నృత్యాలతో, బాణా సంచాతో తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన జాతరలో ఒకటిగా ఈ జాతర మహోత్సవం జరిపిస్తున్నారు -
ఈ కార్యక్రమానికి అమ్మవారి భక్తులు, పెద్దాపురం ప్రజలు, పోలీసు, అగ్నిమాపక, వైద్య శాఖ మరియు పురపాలక సంఘం వారి సహాయ సహకారాలతో, ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అమ్మవారి ఆలయ సంరక్షణాభివృద్ది చేస్తూండటం గమనార్హం
1. ఆలయం ఎదురుగా ఉన్న కోట సత్తెమ్మ పంచ మహా వృక్షం - మర్రి, వేప, జువ్వి, నేరేడు, రావి వృక్షాల మిళితమై పరమ పవిత్రతను సంతరించుకుంది.
2. ఈ ఆలయం చుట్టూ నాగుల విగ్రహాలతో అష్ట నాగదిగ్బంధనం ఉంటుంది.
3. ఆలయ ప్రాంగణంలో అమ్మవారు అష్టోత్తర- శత నామావళిలతో కీర్తించబడతారు.
4. ఆలయంలో త్రిభైరవమూర్తులు (కాలభైరవ.. వటుక భైరవ.. స్వర్ణాకర్షణ భైరవ) కొలువై వుండడం కూడా చెప్పుకోదగ్గ విషయం.
5. స్ఫటిక విఘ్నేశ్వరుడు యిక్కడ చాలా ప్రసిద్ధి ..
6. నవ దుర్గా స్తోత్ర పారాయణం తో కూడిన చిత్రాలు నవ దుర్గలు (శైలపుత్రి దుర్గ, బ్రహ్మచారిణి దుర్గ, చంద్రఘంట దుర్గ, కూష్మాండ దుర్గ, స్కందమాత దుర్గ, కాత్యాయని దుర్గ, కాళరాత్రి దుర్గ, మహాగౌరి దుర్గ, సిద్ధిధాత్రి దుర్గ )
7. ఈ ఆలయం నందు ఉండు ఉప ఆలయం నందు శ్రీ వరాహి అమ్మవారు నిజరూపంలో ప్రతిరోజు తెల్లవారుఝామున గం.4 నుండి గం.5వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది.
8. .శ్రీ శక్తిపీఠంనందు శ్రీ చక్రయంత్ర సహిత వనదుర్గాదేవికి ఘనంగా యజ్ఞయాగాదులను నిర్వహించడం జరుగుతుంది.
9. దూప.. దీప.. నైవేద్య ప్రసాదాలతో నిత్యం అలరారే శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు జాతర సమయంలో గరగ ప్రభలతో భక్తులకు దర్శనమిస్తారు. #మీ_వంగలపూడి_శివకృష్ణ




















Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...