Thursday 30 March 2017

యుగాది సృష్టి ఆరంభానికి నాంది

 
ఉగస్య ఆదే ఉగాది - యుగాది సృష్టి ఆరంభానికి నాంది
ఉదయం అభ్యంగన స్నానం,
ఇష్టదేవతారాధనం  - స్తోత్ర పారాయణం
నింబకుసుమ భక్షణం
పూర్ణకుంభదానమనే ధ్వజారోహణం
పంచాంగ శ్రవణం - సర్వ పాపహరణం  - వంగలపూడి శివకృష్ణ

ఈ ఉగాదికి స్వీట్ వార్నింగ్


దుర్ముఖి చాలా దుర్మార్గం చేసింది
నిత్య వసంతం ఇస్తుందనుకుంటే
నిట్ట నిలువునా ముంచేసి పోయింది
ఓయ్ హేమళంబి నువ్వైనా న్యాయం చేస్తావా - వంగలపూడి శివకృష్ణ

శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

 -


#మనపెద్దాపురం గ్రూపు సభ్యులందరికీ శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఆరు ఋతువులు ఆహ్లాదభరితమైనప్పుడు
ఆరు రుచులు అనునిత్యం ఆస్వాదిద్దాం

చేదు అనుభవాల సారంలోనూ ఓ తీపి జ్ఞాపకం నెమరువేద్దాం

దుర్ముఖి కి వీడ్కోలు చెప్తూ హేమలంబిని ఆహ్వానిద్దాం
వంగలపూడి శివకృష్ణ

మళ్ళీ వచ్చే ఉగాది కోసం


ముచ్చటగా మూడక్షరాల సందేశం
వర్తమానం నాకొక విరక్తి వచనం
చరిత్ర నాకొక ఆసక్తి కవిత
భవిష్యత్ పై ఆశ వదలని మనిషి నేను
ఎండమావుల్లో నీటిని వెతుక్కునే ఆశాజీవిని నేను
అందుకే మళ్ళీ వచ్చే ఉగాది కోసం నిరీక్షిస్తున్నాను - వంగలపూడి శివకృష్ణ

MANA PEDDAPURAM FACEBOOK GROUP LOGO


 వంగలపూడి శివకృష్ణ

తెలుగు నూతన సంవత్సరానికి తెల్లవారింది - HAPPY UGADI POEM

తెలుగు నూతన సంవత్సరానికి తెల్లవారింది
కోకిల గానం వీనులకు విందు చేస్తుంది
వీధంతా వేప పువ్వు వాసన
ఇంటినిండా బంధువుల సందడి
సున్ని పిండి సిద్ధంగా ఉంది కొత్త బట్టలు కవ్విస్తున్నాయి
షడ్రుచులు నోరూరిస్తున్నాయి
లేచి చూస్తే అన్నీ టీవీ లోనే ఎదురుగా అంతా మామూలే
పంచాంగ శ్రవణం సకల పాప హరణం అంటూ టెలివిజన్ యాంకర్ల కృత్రిమ హడావుడి
ఉగాది వాట్స్ ఆప్ మెసేజ్ అయ్యి కూర్చుంది - పేస్ బుక్ లో హల్చల్ చేసింది నిజజీవితంలో నిద్రపోయింది - వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...