Friday 21 April 2017

శ్రీ రాజా వత్సవాయ జగపతి బహద్దరు మహరాణీ బుచ్చి సీతాయమ్మ దేవి చరిత్ర - Peddapuram Queen Butchi Seethayamma Devi




మేని ముసుగులో మానవత్వం 
అన్నార్తుల ఆకలి తీర్చే దాతృత్వం
మనసున్న మా అమ్మ - బుచ్చి సీతాయమ్మ
శ్రీ రాజా వత్సవాయ జగపతి బహద్దరు మహరాణీ బుచ్చి సీతాయమ్మ దేవి




పెద్దాపురం సంస్థానం : మనసున్న మా అమ్మ బుచ్చి సీతాయమ్మ
-------------------------------------------------------------------
శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి మహారాజు గారి మొదటి భార్య లక్ష్మీనరసాయమ్మ మరియు మూడవ భార్య బుచ్చి బంగారయ్యమ్మ లకు సౌందర్యవతి అయిన సవతి ఈమె
అందం -ఔధార్యం, దానం – సుగుణం, సహనం - సౌశీల్యం అనే పదాలకు నిలువెత్తు నిదర్శనం ఆమె రూపం
ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనగల ధీరోదాత్తత, మానసిక బలం ఆమె సొంతం
శ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజు గారు పెద్దాపురం సంస్థానాన్ని 1797 నుండి 1804 వరకూ పరిపాలించి మరణించిన తరువాత,

అంతపురం లో ఎన్నో అంతరాలు ... 
లక్ష్మీ నరసాయమ్మ - బుచ్చి బంగారయమ్మ ల కలహాలు 
రాజమందిరం చుట్టూ రాజకీయాలు 
రాజమండ్రి జిల్లా కలక్టరు కుదిర్చిన రాజీ ప్రకారం 
రాజ్యాధికారం నాదేనంటూ రాజా జగన్నాధ రాజుగారు ఆర్భాటం 
భీమవరపుకోట వాస్తవ్యులతో బుచ్చి సీతాయమ్మ సింహాసనం కోసం 12 ఏళ్ళ సుదీర్ఘ న్యాయ పోరాటం... ఇలా చెప్పుకుంటూ పోతే

మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారి జీవితం - రాణీవాసం - సింహాసనం ఏమీ వడ్డించిన విస్తరి కాదు ఎన్నోఒడిదుడుకులు ఎన్నెన్నో అడ్డంకులు మరెన్నో అవాంతరాలు అయినా ఆమె ఏనాడూ ఔన్నత్యాన్ని వీడలేదు, తాను ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి పారిపోలేదు.
అంతఃపుర స్త్రీగా అందుకుంటున్న గౌరవాలను పక్కనబెట్టి ఒక మహిళగా సామాన్య పేద గృహిణి జీవితంలోని కష్ట నష్టాలను ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేసారు .
అన్నార్తుల ఆకలి తీర్చే
అన్నదానాన్ని వ్రతం గా ఆచరించిన అమ్మ ఆమె 
ధీనజనోద్ధరణని దైవంగా బావించి
పేదల పక్షాన నిలిచిన ప్రేమమూర్తి.
అన్నిదానములకన్న అన్నదనమే మిన్న
కన్నవారికంటే ఘనులు లేరు
ఎన్న గురునికన్న నెక్కువ లేరయా
విశ్వాధాబి రామ వినురవేమా ! అన్న వేమన్న నీతి పద్యం ఆమెకి నిత్య స్ఫూర్తి.

అందుకే, అన్నార్తుల ఆకలి తీర్చేందుకే, 1926 లో రాజ్యాధికారం చేపట్టిన రెండేళ్ళ వ్యవధిలోనే 1928 లో పెద్దాపురంలో అమ్మన్న అనే పెద్ద జమిందారు యొక్క ఇల్లు స్వాదినం చేసుకుని సత్రాన్ని నిర్మిచి ఆ సత్రానికి నిర్వహణ నిమిత్తం ఐదు వందల ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయ స్థలాన్ని కేటాయించింది. వెనువెంటనే ఒంటిమామిడి లో మరొక సత్రాన్ని ( ఈ సత్రం ఇప్పుడు కత్తిపూడి కి మార్చబడింది) నిర్మింపచేసింది. నేటికీ ఈ సత్రాల ద్వారా ఎందరో పాద చారులు మరెందరో పేద విద్యార్ధులు మూడుపూటలా కడుపునిపుకుంటున్నారు.

ఆ తరువాత కాలంలో వ్యవసాయ స్థలం ద్వారా వచ్చే ఆదాయంలో సత్రాల నిర్వహణకు పోగా మిగులు నిధులను - ఉన్నత విద్యకోసం వేరు ప్రాంతాలకు వలస పోతున్న విద్యార్దుల సౌకర్యార్దం 1967 సంవత్సరంలో బుచ్చి సీతాయమ్మ గారి జ్ఞాపకార్ధం పెద్దాపురంలో శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహా రాణీ కళాశాల నిర్మాణం జరిగింది - ఈ నిర్మాణానికి శ్రీ రాజా వత్సవాయి కృష్ణమరాజ బహద్దరు గారు , భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, శ్రీ..ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు గారు ప్రముఖ పాత్ర వహించారు ఈ రెండు సత్రాలను 1969 వ సంవత్సరంలో జిల్లా పరిషత్ నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకుని అన్నదానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

భూమ్యాకాశాలు ఉన్నంత వరకూ ప్రపంచపటంలో పెద్దాపురం పేరు ఉన్నంత వరకూ మా అమ్మ బుచ్చి సీతాయమ్మ పేరు చరిత్రలో అజరామరమై నిలిచే వుంటుంది.

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...