Tuesday 17 January 2017

SOCIAL ACTIVITIES OF MANA PEDDAPURAM FACE BOOK GROUP

మన పెద్దాపురం పేస్ బుక్ గ్రూప్ పెద్దాపురం అభివృద్ధి కార్యక్రమాలు
29-03-2015 మన పెద్దాపురం గ్రూపు ప్రారంభం (పెద్దాపురం చరిత్ర ప్రపంచానికి పరిచయం చేయడానికి నాంది) 

13-12-2015 మహా రక్తదాన శిబిరం (రక్తదాతలు 175 MEMBERS)

29-03-2016 చారిత్రిక నడక (వెంకటేశ్వర స్వామి గుడి నుండి మునిసిపల్ ఆఫీస్ వరకూ - పెద్దాపురం చరిత్ర పాట విడుదల)


05-06-2016 పర్యావరణ పరిరక్షణ దినోత్సవం (మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వద్ద 1000 మొక్కలు పంపిణీ )


13-08-2016 ప్రాణదాన ఉద్యమం (2000 మంది తో అవయవదాన అంగీకార పత్రాలపై సంతకాల సేకరణ)

29-08-2016 తెలుగు బాషా దినోత్సవ వేడుకలు (56 అక్షరాలు 56 మొక్కలు)

04-09-2016 మట్టి గణపతే మహా గణపతి (2000 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ)

02-10-2016 చారిత్రక గాంధీ విగ్రహ (పునః స్థాపన (ఆ రోడ్డుకి మహాత్మా గాంధీ రోడ్డుగా నామకరణ) 

09-10-2016 స్వచ్ఛ సైన్యం (CLEAN ARMY పేరుతో పట్టణం లోని 7 బస్టాప్ ల సుందరీకరణ)

16-10-2016 దత్తత వార్డుల పరిశుభ్రతా కార్యక్రమాల పనులకు శ్రీకారం (21వ వార్డు తో మొదలు)

18-12-2016 గ్రీన్ బ్లడ్ డొనేషన్ క్యాంపు (రక్తదాతలు100 MEMBERS) 

01-01-2017 వెన్నుముక్క వ్యాధి పీడితుడు బొగ్గు బాలాజీకి శాశ్వతగూడు (Rs. 1, 70, 000 ఆర్ధిక సహాయం )



ప్రతీ రోజూ పెద్దాపురం చరిత్ర పరిచయం చేస్తూనే ఉన్నాం ...
ప్రతీ సమస్య పైనా చర్చిస్తున్నాం ... స్పందిస్తున్నాం ... 
ప్రతీ ఒక్కరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ...

ప్రతీ అనారోగ్యానికి చిట్కాలందిస్తున్నాం ...
ప్రతీ వార్తా మీకు చేరవేస్తున్నాం ...
ప్రతీ నిముషం అందుబాటులోనే ఉంటున్నాం ... రక్తం అందిస్తున్నాం ...
ప్రతీ సేవా కార్యక్రమం లో పాలుపంచుకుంటున్నాం ...

ప్రతీ వార్డూ పరిశుభ్రంగా ఉండాలని ఆశిస్తున్నాం
కులం లేదు మతం లేదు మేమంతా ఒక్కటే 
ఏక తాటి పై ఉన్నాం ... చిత్తశుద్దితో ఉన్నాం ... 


అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటాం అందరికీ అండగా ఉంటాం
అవయవ దానం చేస్తాం శాశ్వతం గా జీవిస్తాం ధరిత్రి లోనూ... చరిత్రలోనూ


పెద్దాపురం యువకుల ఐక్యత వర్ధిల్లాలి ... జై పెద్దాపురం.... జై జై పెద్దాపురం 




పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...