Friday 24 February 2017

మన పెద్దాపురం ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు - ఆచార్య విస్సా అప్పారావు - Vissa Apparao Peddapuram



మన పెద్దాపురం ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు - ఆచార్య విస్సా అప్పారావు
జననం : 1884 ఏప్రిల్ 24, పెద్దాపురం
తల్లి తండ్రులు : రామచంద్రుడు మరియు మాణిక్యాంబ ( తండ్రి చారిత్రక పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగి)
ప్రాథమిక విద్యాభ్యాసం : పెద్దాపురం, అమలాపురం
ఉన్నత విద్యాభ్యాసం : రాజమండ్రి ఆర్ట్స్, మద్రాసు ప్రెసిడెన్సీ  కళాశాల
ఉద్యోగం : రాజమండ్రిఅనంతపురం, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల
మరణం : 1966 జూలై 30 తేదీ హైదరాబాద్

విస్సా అప్పారావు గారి విశిష్టతలు వైవిధ్యాలు :

విస్సా అప్పారావు గారు ఏకసంతాగ్రాహి పెద్దాపురం లో ప్రాధమిక విద్యాభ్యాసం చదివే రోజుల్లోనే రామాయణ మహా భారతాలు బట్టీ పట్టేసారు, అతి చిన్న వయసులోనే సంగీతం, నృత్యం, చిత్రలేఖనంకళల్లో ప్రావీణ్యం సంపాదించారు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, తమిళం, కన్నడం వంటి ఇతర భాషలు మాట్లాడగల బహుభాషా కోవిదులు,

రాజమండ్రి లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసే కాలంలోనే ఆయన అనేక మైన చారిత్రక వ్యాసాలు వ్రాయడం జరిగింది... అందులో పాడవజ్ఞాతవాస వత్సర వ్యాప్తి నిర్ణయము, ఐన్ స్టీన్ సాపేక్ష వాద సిద్ధాంతములు ప్రశంసలు అందుకున్నాయి

శ్రీ విస్సా అప్పారావు గారు అనేక పుస్తకాలు, కీర్తనలు కూడా రచించడం జరిగింది : 
త్యాగరాజ కీర్తనలు - 1947
క్షేత్రయ్య పదాలు - 1950
పరమాణు శక్తి - 1952
వ్యాసావళి - 1956
ఆకాశం - 1960 (భారత ప్రభుత్వ అవార్డు లభించింది)
విజ్ఞానం విశేషాలు - 1964
నృత్య సంగీత వ్యాస రత్నావళి - 1966
ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు - 1962

రామదాసు కీర్తనలు ... ఇంకా మరెన్నో రచియించిన  శ్రీ విస్సా అప్పారావు గారు ప్రముఖ కవి, రచయిత, జాతీయ అవార్డు గ్రహీత, యక్షగాన వాజ్మయం, జానపద విజ్ఞానాలను యావత్ భారతదేశానికి పరిచయం చేసిన ఒకానొక మేటి ఘనాపాటీ, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళాశాల ప్రిన్సిపాల్, చెళ్ళపిళ్ళ వేంకటకవి గారి ప్రియ మిత్రులు - గాన కళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్ర కళాశాల మొదలైన సంస్థలను స్థాపించారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు పాలన మండలిలోను, ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీలోను, రేడియో మొదలైన సంస్థల సలహా సంఘాల సభ్యులుగా పనిచేశారు. మద్రాసు సంగీత అకాడమి మూల స్తంభాలలో వీరు ఒకరు...  అన్నింటికీ మించి ఆ కాలంలోనే ఆయన కుమారుడికి వర్ణాంతర వివాహం జరిపించిన ఒక గొప్ప సంఘ సంస్కర్త కూడా... అంత గొప్ప వ్యక్తి అయిన శ్రీ విస్సా అప్పారావు గారు ఆంధ్రులు కావడం అందునా మన పెద్దాపురం వాసులు కావడం మనందరి అదృష్టం                                                 
                                                                    ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ 

Monday 6 February 2017

PEDDAPURAM MR COLLEGE SPORTS మన మహారాణీ కళాశాల క్రీడావికాసానికి కోవెల

మన పెద్దాపురం మహారాణీ కళాశాల క్రీడలకు, నేషనల్ క్యాడెట్ కోర్స్ & నేషనల్ సర్వీస్ స్కీం, కి రాష్ట్రము మొత్తం ప్రసిద్ధి చెందిది, మన విద్యార్థులు అనేక విభాగాలలో దినదినాభి వృద్ధి చెందుతూ రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉండటం గర్వించ దగ్గ విషయం ... ఇదే రీతిలో రానున్న సంవత్సరంలో కూడా ప్రిన్సిపాల్ , అధ్యాపకుల, విద్యార్థుల సమిష్టి భాగస్వామ్యంతో కళాశాల కి పునర్వైభవం రావడం ఖచ్చితంగా జరుగుతుందన్న ఆశాభావంతో 

                                                                                                                                 వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...