Monday, 18 January 2016

జవహార్ నవోదయా విద్యాలయ పెద్దాపురం - JAVAHAR NAVODHAYA VIDYALAYA PEDDAPURAM - JNV PEDDAPURAM

జవహార్ నవోదయా విద్యాలయ పెద్దాపురం - 

  గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ కలిగిన విద్యార్ధులకి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో 1985 వ సంవత్సరంలో నవోదయా విద్యాలయా సమితి (మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resource Development) , భారత ప్రభుత్వ విద్యా శాఖ యొక్క ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ) ప్రారంభం కాగా మొట్టమొదటి విద్యాలయం హర్యానా లో 05-03-1986 న స్థాపించడం జరిగింది తరువాతనెలలో 06-03-1986 న మహారాష్ట్రలో స్థాపించడం జరిగింది అదే క్రమంలో జనవరి 1989 లో మన పెద్దాపురంలో స్థాపించడం జరిగింది ఇలా భారతదేశం మొత్తం మీద 2014 నాటికి 596 విద్యా సంస్థలు నెలకొల్పబడ్డాయి (ఒక్క తమిళనాడు లో మాత్రం జవహార్ నవోదయా విద్యాలయం లేదు)



మన రాష్ట్రంలోనే 14 చోట్ల (జిల్లాకి ఒక్కటి ప్రకాశం జిల్లాకి రెండు)  జవహార్ నవోదయ విద్యా సంస్థలు ఉన్నాయి


@జవహార్నవోదయావిద్యాలయపెద్దాపురం ప్రిన్సిపాల్ @
31-01-2014 వరకూ ఎ. ఎస్ ఎన్ మూర్తి గారు ప్రిన్సిపాల్ గా కొనసాగి పదవీ విరమణ చెయ్యగా 
ప్రస్తుత జవహార్ నవోదయా విద్యాలయ పెద్దాపురం  ప్రిన్సిపాల్ గా వి. మునిరామయ్య గారు కొనసాగుతున్నారు 


@ప్రవేశంఅర్హత@
2016 - 2017 విద్యా సంవత్సరం జవహార్ నవోదయ విద్యాలయ  ప్రవేశానికి గానూ
9 - 13 సంవత్సరాల మద్య వయస్సుగల 5 వ తరగతి చదివే విద్యార్దుల నుండి 2015 సెప్టెంబరు వరకూ దరఖాస్తులు స్వీకరించారు. ప్రవేశ పరీక్ష జనవరి 9 - 2016 న  ఉదయం 11:30 కి జరగనుంది.


5వ తరగతి చదువుకునే విద్యార్థుల్లో అర్హులు ఈ ప్రవేశపరీక్షకు హాజరవుతారు. ఎంపికైన విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతినుంచి ఇంటర్మీడి యెట్ వరకు సెంట్రల్ సిలబస్తో ఉచిత విద్యను అభ్యసిస్తారు.

అర్హత వివరాలు :
విద్యార్ధి 9-13 సంవత్సరాల మద్య వయస్సుగల వాడై ఉండాలి.
5 వ తరగతి చదువుతూ ఉండాలి (గ్రామీణ ప్రాంత విద్యార్ధులు 3,4, మరియు 5 వ తరగతి చదివే వాడై ఉండాలి.)
ఒక విద్యార్ధి ఒక్కసారి మాత్రమే పరీక్ష వ్రాయడానికి అర్హుడు

@సీట్లురిజర్వేషన్లు@
జవహర్ నవోదయ ప్రవేశపరీక్షల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపికైన విద్యార్థులే సీట్లు పొందుతారు. ఢిల్లీ స్థాయిలో జరిగే ఈ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగవు. పరీక్షపత్రాలు కూడా ఢిల్లీ నుంచి వస్తాయి.

ఒక్క విద్యా సంవత్సరానికి గరిష్టంగా 80-90 మంది విద్యార్దులను మాత్రమే ఎంపిక చేసుకుంటారు గ్రామీణ ప్రాంత విద్యార్ధులకి 75% పట్టణ ప్రాంత విద్యార్ధులకి 25% సీట్లు మొత్తం సీట్లలో విద్యార్ధినులకి(ఆడపిల్లలకి 1/3 మూడు వంతులలో ఒక వంతు సీట్లు మరియు 3 శాతం వికలాంగులకి కేటాయించ బడతాయి అంటే ప్రతి వందమంది నవోదయ విద్యార్ధులలో 33 మంది అమ్మాయిలు ముగ్గురు వికలాంగులు ఖచ్చితం గా ఉంటారన్న మాట.

బారత దేశంలోనే ఒక విద్యార్ధి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, యూనిఫాం , ఉచిత నివాసం, భోజనం, విద్యా వసతిలను కల్పిస్తున్న ఒకే ఒక్క మొట్టమొదటి సంస్థ (11 - 12 తరగతులు చదివే జనరల్ (ఉన్నత కులానికి చెందిన) విద్యార్ధుల నుండి మాత్రం నెలకి 200 రూపాయలు నవోదయ వికాస నిధి పేరిట తీసుకుంటారు ఒక వేళ వారు దారిద్య రేఖకి దిగువన ఉన్నవారైతే చెల్లించనవసరం లేదు)
విద్యార్ధుల కి వసతిగృహాలు ఆరావళి, నీలగిరి, శివాలిక్ మరియు ఉదయగిరి వంటి పర్వతా ల పేర్లతో ఏర్పాటు చెయ్యబడతాయి

‘Hami Navodaya Hain’ అనే ప్రార్ధనా గీతంతో తరగతులు ప్రారంభం అవుతాయి
పూర్వపు గురుకులాలను తలపించేలా గొప్ప క్రమ శిక్షణతో కూడిన విద్య
ప్రతీ విద్యార్ధి తప్పని సరిగా బహుబాషా ప్రావీణ్యం ( కనీసం 3 బాషలు) పొందేలా శిక్షణ వుంటుంది
ప్రత్యేక ఆసక్తి ఉన్న 9 వ తరగతి చదివే విద్యార్ధులలో 30 శాతం మందిని ఎంపికచేసి ఇతర రాష్ట్రాల లోని నవోదయా విద్యాలయాలకి పంపించడం జరుగుతుంది, అక్కడివారిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది
ప్రతీ విద్యార్ధి లోనూ అంతర్లీనంగా ఉన్న కళలను వెలికి తీయడానికి ప్రతీ వారం ఒక విభిన్న కార్యక్రమం
సామ్ సంగ్ స్మార్ట్ లాబ్ టెక్నాలజీ ద్వారా సాంకేతిక పద్దతులలో శిక్షణ

రోజుకు రెండు గంటలు తప్పనిసరి క్రీడలు ప్రతీ సంవత్సరం క్రీడా సంబరం 3 రోజులు పాటూ జరిగే క్రీడోత్సవాలకు దాదాపు 50 నవోదయా విద్యాలయాలు పాల్గొంటాయి.

ఇక్కడ చదివిన విద్యార్ధులు దేశ విదేశాలలో అనేకమైన ఉన్నత స్థానాలలో వున్నారు సెప్టంబరు 2012 సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ వేడుక ఘనంగా జరుగగా ప్రపంచం నలుమూలలనుండీ అందరూ హాజరై పాత జ్ఞాపకాల్ని అందరితోనూ పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు

నవోదయా లో చదువుతున్న చదివిన ప్రతి విద్యార్ధికి
www.jnvalumini.com (జె న్ వి అల్యూమిని) పేరుతో ఉన్న ఒక వెబ్సైటు లోకి ప్రవేశం వుంటుంది - ఈ వెబ్ సైటు ద్వారా ఆయా నవోదయా విద్యాలయాల వివరాలు తెలుసుకొనేలా మరియు నవోదయా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు సౌలబ్యం వుంటుంది

ఇటీవల అంతర్గత మాట్రిమోనీ (నవోదయా అద్యాపకులు - నవోదయాలో చదివి స్థిరపడిన యువతీ యువకులకి పరస్పర అంగీకారంతో వివాహాలు జరగడం విశేషం)


మీ వంగలపూడి శివకృష్ణ

మహారాణీ సత్రం - S.R.V.B.S.J.B MAHA RANI CHOULTRY PEDDAPURAM

పెద్దాపురం సంస్థానం : మనసున్న మా అమ్మ బుచ్చి సీతాయమ్మ

శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి మహారాజు గారి మొదటి భార్య లక్ష్మీనరసాయమ్మ మరియు మూడవ భార్య బుచ్చి బంగారయ్యమ్మ లకు సౌందర్యవతి అయిన సవతి ఈమె


అందం -ఔధార్యం, దానం – సుగుణం, సహనం - సౌశీల్యం అనే పదాలకు నిలువెత్తు నిదర్శనం ఆమె రూపం
ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనగల ధీరోదాత్తత, మానసిక బలం ఆమె సొంతం


శ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజు గారు పెద్దాపురం సంస్థానాన్ని 1797 నుండి 1804 వరకూ పరిపాలించి మరణించిన తరువాత,

అంతపురం లో ఎన్నో అంతరాలు ...
లక్ష్మీ నరసాయమ్మ - బుచ్చి బంగారయమ్మ ల కలహాలు
రాజమందిరం చుట్టూ రాజకీయాలు
రాజమండ్రి జిల్లా కలక్టరు కుదిర్చిన రాజీ ప్రకారం
రాజ్యాధికారం నాదేనంటూ రాజా జగన్నాధ రాజుగారు ఆర్భాటం

భీమవరపుకోట వాస్తవ్యులతో బుచ్చి సీతాయమ్మ సింహాసనం కోసం 12 ఏళ్ళ సుదీర్ఘ న్యాయ పోరాటం.......................................................... ఇలా చెప్పుకుంటూ పోతే

మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారి జీవితం - రాణీవాసం - సింహాసనం ఏమీ వడ్డించిన విస్తరి కాదు ఎన్నోఒడిదుడుకులు ఎన్నెన్నో అడ్డంకులు మరెన్నో అవాంతరాలు అయినా ఆమె ఏనాడూ ఔన్నత్యాన్ని వీడలేదు, తాను ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి పారిపోలేదు.

అంతఃపుర స్త్రీగా అందుకుంటున్న గౌరవాలను పక్కనబెట్టి ఒక మహిళగా సామాన్య పేద గృహిణి జీవితంలోని కష్ట నష్టాలను ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేసారు .

అన్నార్తుల ఆకలి తీర్చే
అన్నదానాన్ని వ్రతం గా ఆచరించిన అమ్మ ఆమె
ధీనజనోద్ధరణని దైవంగా బావించి
పేదల పక్షాన నిలిచిన ప్రేమమూర్తి.

అన్నిదానములకన్న అన్నదనమే మిన్న
కన్నవారికంటే ఘనులు లేరు
ఎన్న గురునికన్న నెక్కువ లేరయా
విశ్వాధాబి రామ వినురవేమా ! అన్న వేమన్న నీతి పద్యం ఆమెకి నిత్య స్ఫూర్తి.



అందుకే, అన్నార్తుల ఆకలి తీర్చేందుకే, 1926 లో రాజ్యాధికారం చేపట్టిన రెండేళ్ళ వ్యవధిలోనే 1928 లో పెద్దాపురంలో అమ్మన్న అనే పెద్ద జమిందారు యొక్క ఇల్లు స్వాదినం చేసుకుని సత్రాన్ని నిర్మిచి ఆ సత్రానికి నిర్వహణ నిమిత్తం ఐదు వందల ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయ స్థలాన్ని కేటాయించింది. వెనువెంటనే ఒంటిమామిడి లో మరొక సత్రాన్ని ( ఈ సత్రం ఇప్పుడు కత్తిపూడి కి మార్చబడింది)

నిర్మింపచేసింది. నేటికీ ఈ సత్రాల ద్వారా ఎందరో పాద చారులు మరెందరో పేద విద్యార్ధులు మూడుపూటలా కడుపునిపుకుంటున్నారు.

ఆ తరువాత కాలంలో వ్యవసాయ స్థలం ద్వారా వచ్చే ఆదాయంలో సత్రాల నిర్వహణకు పోగా మిగులు నిధులను - ఉన్నత విద్యకోసం వేరు ప్రాంతాలకు వలస పోతున్న విద్యార్దుల సౌకర్యార్దం 1967 సంవత్సరంలో బుచ్చి సీతాయమ్మ గారి జ్ఞాపకార్ధం పెద్దాపురంలో శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహా రాణీ కళాశాల నిర్మాణం జరిగింది - ఈ నిర్మాణానికి శ్రీ రాజా వత్సవాయి కృష్ణమరాజ బహద్దరు గారు , భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, శ్రీ..ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు గారు ప్రముఖ పాత్ర వహించారు ఈ రెండు సత్రాలను 1969 వ సంవత్సరంలో జిల్లా పరిషత్ నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకుని అన్నదానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

భూమ్యాకాశాలు ఉన్నంత వరకూ ప్రపంచపటంలో పెద్దాపురం పేరు ఉన్నంత వరకూ మా అమ్మ బుచ్చి సీతాయమ్మ పేరు చరిత్రలో అజరామరమై నిలిచే వుంటుంది.

...................................................... ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ

మహారాణీ కళాశాల - MAHA RANI COLLEGE -S.R.V.B.S.J.B M.R. COLLEGE - PEDDAPURAM

మా మహారాణీ కళాశాల - కళావికాసానికి కోవెల




శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దరు మహారాణీ కాలేజీ

తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు

S.B.P.B.K. సత్యనారాయణ గారి విశేష కృషి

పెద్దాపురం ప్రజల బలమైన ఆకాంక్ష.

మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారి మంచి మనసు.







వెరసి మహారాణీ కాలేజీ ఆగష్టు 1967 వ సంవత్సరంలో మహారాణీ సత్రం యొక్క మిగులు నిధులు నుంచి రూ. 90,000/- కాలేజీ కి అవసరమైన స్థలం కొనుగోలు నిమిత్తం సర్వారాయ ఎడ్యుకేషన్ ట్రస్టు నిధులు నుంచి రూ, 50,000/- మరియు ఇంకా ఇతర అవసారాల నిమిత్తం అయిన ఖర్చులను శ్రీ ముప్పన అంకయ్య సోదరులు పెద్ద మనసుతో స్వచ్చందంగా ఇవ్వగా పెద్దాపురం పరిసర ప్రాంత విద్యార్ధుల ఆశాదీపం మహారాణీ కళాశాల స్థాపన ఘనంగా జరిగింది.

కళాశాల స్థాపనకి పురిగోల్పిన సంఘటనలు.
-----------------------------------------
1967 ఆరోజుల్లో పెద్దాపురం పేరుకి డివిజన్ ముఖ్య కేంద్రం అయినప్పటికీ అక్షరాస్యతా శాతం లో అట్టడుగు స్థానం లో వుండేది. యస్ యస్ యల్ సి చదివిన వారి సంఖ్య వేళ్ళ మీద లెక్కించవచ్చు అంత తక్కువగా ఉండేది. జిల్లాల్లో రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం లాంటి ప్రాంతాలలో మాత్రమే హైస్కూళ్ళు ఉండటంతో సుదూర ప్రాంతాలనుడి విద్యార్ధులు ఉన్నత విద్య కోసం పెద్దాపురం వచ్చేవారు. పెద్దాపురం ప్రజలలో ఎక్కువ శాతం మంది వ్యవసాయ, చేనేత, చేతి వృత్తులవారు కావడంతో చాలా మంది పేద విద్యార్ధులు యస్ యస్ యల్ సి అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులైనప్పటికీ కళాశాల చదువుల కోసం చెన్నపట్టణం పోలేక కన్నీళ్లు దిగమింగుకొని కార్మికులుగానే స్థిరపడి పోయేవారు.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రతీ విద్యార్ధికి ఉన్నత చదువులు చేరువకావాలనే సత్ సంకల్పం తో మహానుబావుల విశేష పరిశ్రమ వల్ల కళాశాల స్థాపన జరిగింది.

1967 లో పి. యు. సి (P.U.C), బి. ఎ (B.A) మరియు బి.కామ్ (B.Com) లలో 200 మంది విద్యార్ధులు-15 మంది స్టాఫ్ తో ప్రారంభమై,

తరువాత సంవత్సరమైన 1968 లో బి. ఎస్. సి(B.S.C) లో కొన్ని కాంబినేషన్లతో,

ఆ తరువాత 1969 సంవత్సరంలో పి. యు. సి ని సైన్స్, ఆర్ట్స్, కామర్స్, విభాగాలు లో రెండు సంవత్సరాల ఇంటర్ మీడియట్ గా మార్చడం,

జూలై 1987 లో అటానమస్ గా గుర్తిపు పొంది బి. ఎ - బి యెస్. సి కోర్సులలో గల అన్ని కాంబినేషన్ లు ( B.S.C. Mpac, Mpe – B.A. Epp, Ecf) లు జత చేయడం జరిగింది.

ఆ తరువాత 1993 - 94 నుంచి అటానమస్ వద్దు అనుకుని ఆంధ్రా యూనివర్సిటీ రెగ్యులేషన్ ఫాలో అవ్వడం,

2007 సంవత్సరం నుండి పి. జి కోర్సులు కూడా ప్రారంభించి -



18 ఎకరాల సువిశాల స్థలం, విశాలమైన క్రీడా ప్రాంగణం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, క్రమశిక్షణతో కూడిన విద్య - అంకిత బావాన్ని అలవరిచే ఎన్ సి సి (N.C.C) - సామాజిక బాద్యతను పెంపొందిచే ఎన్. యెస్. ఎస్. (N.S.S), రెడ్ క్రాస్ -




పూర్తి స్థాయి సాంకేతిక పరికరాలతో కూడిన లాబరేటరీ - ఇ క్లాస్ రూమ్స్ - విద్యార్ధులకు ఇంటర్నెట్ సౌకర్యం, అధునాతన లైబ్రరీ, తో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ దిన దిన ప్రవర్ధమాన మవుతూ నేటికి 2000 విద్యార్ధులు, 60 టీచింగ్ స్టాఫ్ మరియు 50 నాన్ టీచింగ్ స్టాఫ్ తో సరస్వతీ నిలయంగా శోభిల్లుతుంది.





ఈ కళాశాలలో చదివి పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఎందరో

నీతి నిజాయితీ కి మారు పేరుగా పిలువబడే రౌతులపూడి రైతుబిడ్డ చదివింది అర్ నారాయణమూర్తి మా కాలేజీ లోనే

గడచిన 48 సంవత్సరాలలో కూడా ఇక్కడ చదివిన ఏ ఒక్క విద్యార్ధి కూడా అసంతృప్తితో లేదంటే అది అతిశయోక్తికాదు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇతర కళాశాల ల యాజమాన్యం - అద్యాపకులు అందరూ ఈ కళాశాలలో చదివిన వారే

మన కాలేజీ నేర్చుకునే వాడికి చదువు

వచ్చి కూర్చునే వాడికి బ్రతుకు దెరువు నేర్పుతుంది అందుకే

బాగా చదివిన వారు విదేశాలలో

మిడిగా చదివిన వాడు మాస్టారు గానూ

అస్సలు చదవకుండా గ్రౌండ్ పట్టుకుని తిరిగిన వాడు పోలీసుగానూ సెటిల్ అయ్యిపోతాడని మా చౌదరి మాస్టారు ఛలోక్తులు విసిరే వారు.

ఇక్కడ చదివిన వారు కవులుగా - కళా కారులుగా, క్రీడాకారులుగా, రచయితలుగా, రాజకీయనాయకులుగా సమాజంలోని అన్ని శాఖలోనూ ఉద్యోగాలను అధిరోహించిన వారిలో వున్నారు. జ్ఞానం - విజ్ఞానం, వినోద - విలువలు, నీతి - నిజాయితీ, నిర్భీతి, లాంటి అనేక లక్షణాల సమ్మేళనం ఇక్కడ చదివిన విద్యార్ధుల సొంతం.



లక్షల జీతాలకు ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నా మా తల్లి మహారాణి కాలేజీ పై మమకారం చావక తనువు చాలించే వరకూ ఇక్కడే సేవలందించిన మహానుభావులైన మాస్టార్లకు ... పి. హెచ్. డి లు (P.H.D) ఎమ్. ఫిల్ M. Fill లు చేసి విద్యార్ధుల అభివృద్దే ధ్యేయంగా నిరంతరం తపిస్తున్న శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దరు మహారాణీ కళాశాల ఆచార్య దేవులకు పాదాభి వందనం తెలియ జేసుకుంటూ
                                                                                                                                మీ వంగలపూడి శివకృష్ణ

బచ్చు ఫౌండేషన్ - BATCHU FOUNDATION PEDDAPURAM


మన పెద్దాపురం :: బచ్చు కోటేశ్వరరావు



పది మంది బచ్చు కోటేశ్వరరావు లు కావాలి పెద్దాపురానికి





శ్రీ బచ్చు కోటేశ్వరరావు గారు 1949 లో మన పెద్దాపురం లో పుట్టి …................

శ్రీ వీర్రాజు ఉన్నత పాఠశాల, (Veerraju High School) పెద్దాపురం లో విద్య అబ్యాసించి లయోలా కాలేజీ విజయవాడ ... బనారస్ హిందూ యూనివర్సిటీ ... ఆపై ఆంధ్రా మెడికల్ కాలేజీ నందు పట్టబద్రుడై విల్లింగ్డన్ హాస్పిటల్ - నవ ఢిల్లీ లో రెసిడెన్సీ ట్రైనింగ్ …........ ఆపై చికాగో …. అలా ఆయన విద్యా ప్రస్తానం అంచలంచెలుగా సాగి ఈరోజు ఓత్సాహిక భారతీయ వైద్య విద్యార్దులకు దిశానిర్దేశకుడు గా అందిస్తున్న సేవలకు తానా (Telugu Association of North America (TANA), దానా (Devanga Association of North America (DANA) మరియు ఎ.టి.ఎ (the American Telugu Association (ATA) ) నుంచి మంచి గుర్తింపు లబించిది.

బచ్చు ఫౌండేషన్ - ఆవిర్భావం :
-----------------------------
1984 హృదయ విధారక భోపాల్ దుర్ఘటన … వేలాది మంది మరణం ... అనేక మంది తీవ్ర అనారోగ్యాల పాలు కావడం నేపద్యంలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా బృందాలతో పాటుగా ... బచ్చు కోటేశ్వరరావు గారి నేతృత్వంలో ని అమెరికా నుండి వచ్చిన డాక్టర్ల బృందం కొన్ని నెలల పాటు ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చెయ్యడం……… క్యాంపు అయిపోయిన తర్వాత ఆ బృందాన్ని మన పెద్దాపురానికి కూడా రప్పించడం జరిగింది... ఇక్కడి దీనుల ఆక్రందనలు పేద ప్రజల దీనావస్థ కళ్ళారా చూసి చలించి పోయి...................................... ఆ తర్వాతా అలాంటి మెడికల్ క్యాంపు లు అనేకం ఏర్పాటు చేసి కంటికి సంబదించిన చికిత్సలు, సర్జరీలు, కళ్ళద్దాల పంపిణీ ............... మొదలగునవి చేయడం ఆరంబించారు కాలక్రమం లో అదే బచ్చు ఫౌండేషన్ గా ఆవిర్బవించింది అయితే బచ్చు ఫౌండేషన్ ఆవిర్భావానికి శ్రీ బచ్చు కోటేశ్వరరావు గారిలో స్ఫూర్తి నింపిన సంగతి వేరే వుంది..............

బచ్చు ఫౌండేషన్ స్థాపన – స్ఫూర్తి
=====================

శ్రీ రాయ జగపతి గారి మరణం తర్వాత ఆతని సతీమణి అయిన మహారాణి శ్రీమతి బుచ్చి సీతాయమ్మ గారు పెద్దాపురం పరిసర ప్రాంతాలలో మరియు అనేక చోట్ల అనేకానేక సంక్షేమ కార్యకలాపాల లో బాగంగా,,,,,,,,, మహారాణీ అన్నదాన సత్రాన్ని పెద్దాపురం, కత్తిపూడి లలో ప్రారంబించడం….. ...... నేటికీ నిరంతరాయంగా నిత్యం అనేక మంది పేదవారు, దూర ప్రాంత నిరుపేద విద్యార్దులు రెండు పూటలా అక్కడ కడుపునింపు కోవడం చూసి ……. ..............

శ్రీ బచ్చు కోటేశ్వరరావు గారి లో మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారి స్ఫూర్తి సామాజిక స్పృహ ని తట్టిలేపింది….................

1986 నుంచీ బచ్చు ఫౌండేషన్ విద్య - వైద్యం, పారిశుద్యం, రక్షిత మంచినీరు, క్రీడాబ్యుదయం, కనీస సౌకర్యాల కల్పన ... మొదలగు ప్రజాహిత కార్యక్రమాల ద్వారా పెద్దాపురం మరియు పరిసర ప్రాంతాల సమూల అభివృద్ధి పై దృషి సారించింది...................

పెద్దాపురం పరిసర ప్రాంతాలలోని అనేక విద్యాలయాల పునర్నిర్మాణం ............................



మౌలిక సదుపాయాల కల్పన (పుస్తకాలు, బెంచీలు, కుర్చీలు) విద్యార్దులకు ఉపకార వేతనాలు .......................................................................................................



మురికి వాడలలోని పాఠశాలలకు వెళ్ళని పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలకు వెళ్ళేలా ప్రోత్సహించడం…...................................................................................



క్రీడా - సాంస్కృతిక కార్యక్రమాలు .. వ్యాయామ శాలలకు ఆర్ధిక సాయం ... వ్యాయామ పరికరాలు అందజేయుట …. క్రీడా ప్రాంగణాల అబివృద్ది…...........................................


పెద్దాపురం లోని పురాతన దేవాలయాలు... వాటి పూర్వ వైభవాన్ని సంతరించుకోనేలా కృషి
కైలాసభూమిల (స్మశానవాటిక) పునరుద్దరణ
కరువు సమయాలలో టాంకర్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు మంచినీటి సరఫరా
నిరుపేద మరియు వికలాంగులకు నిత్యావసరాల పంపిణీ ద్వారా చేయూత
విజయదశమి .... పవిత్ర రంజాన్ ... క్రిస్టమస్ వేడుకులకు విందులు, దానాలు, ప్రార్ధనల ద్వారా సర్వ మత సామరస్యానికి కృషి చేయడం


ఇలా రాజకీయాలకు ... రాష్ట్ర ప్రభుత్వాలకు .... సమాన రీతిలో పెద్దాపురం అభివృద్ధి గావిస్తున్న శ్రీ బచ్చు కోటేశ్వరరావు గారు తరచూ చెప్పే మాట
@*నాకు చదువునిచ్చి U.S.A లో పెద్ద డాక్టర్ గా పేరు పొందటానికి కారణమైన నా స్వస్థలం పెద్దాపురం పట్టణ పరిది లో వున్నా పాఠశాలల అభివృద్ధి విద్యా సౌకర్యాలు పెంపొందిచి చిన్నారులందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్ది నా ప్రజలందరి ముఖాల్లో చిరునవ్వులు చూడటమే నా లక్ష్యం దాని కోసమే దానికోసమే ఈ సంస్థ స్థాపించాను. నా ఆదాయంలో 75 శాతం ఈ అబివృద్ది పనులకే వెచ్చించ దలచాను*@

అంతటి మహోన్నత వ్యక్తి మన పెద్దాపురం వాసి కావడం మన అదృష్టం .... శ్రీ బచ్చు కోటేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకుని ... మన నవ పెద్దాపుర నిర్మాణ బవిష్యసారధి ల ఆవిర్భావాన్ని కాంక్షిస్తూ ...

మీ వంగలపూడి శివ కృష్ణ - మన పెద్దాపురం

లూథరన్ హైస్కూలు - Luthern High School Peddapuram - L.H.S Peddapuram

మన పెద్దాపురం లూథరన్ హైస్కూలు 


వంద సంవత్సరాల ఈ స్కూలు
నిరంతర విద్యాప్రగతికి ఆనవాలు
పెద్దాపురం లూథరన్ హైస్కూలు
స్థాపించిన ఎడ్మన్ ఇమ్మానుయెల్ కి జేజేలు
ఈ స్కూలు పేరు పేరు చెప్తే పులకించే పూర్వ విద్యార్ధుల సాక్ష్యం
శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును అనే భవనం మీద వాక్యం.
కోత పండుగ
క్రిస్మస్ వేడుక
కళా వేదిక
క్రీడా కూడిక
'H' ఆకారం భవంతి
గాలికి వేళ్ళాడే స్కెలిటన్
పీటర్ మాస్టారి ఫుట్ బాల్ అసోసియేషన్ ….

ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో మదుర స్మృతులు ఇక్కడ చదివిన విద్యార్థులకే కాదు పెద్దాపురం లోని ప్రతి విద్యార్ధికీ ……………………… ఇలా


పెద్దాపురం చరిత్ర లో చెరగని ముద్ర వేసి తనకో పేజీ లిఖించుకొని ఎందరో విద్యార్ధులకు అశాదీపం అయిన లూథరన్ హైస్కూల్ చరిత్రలోని కొన్ని మైలు రాళ్ళు మీకోసం …….



అక్షరాస్యతా శాతం లో అట్టడుగు స్థాయిలో ఉన్న పెద్దాపురాన్ని విద్యాపురంగా వెలుగొందించాలన్న ఆశయంతో ఎడ్మన్ మహాశయుడు (Dr. Edman Emmanuel. M.D డా \\ ఎడ్మన్ ఇమ్మానుయెల్ ఎం డి) 1891 లో ఒక ఇల్లు ని అద్దెకి తీసుకుని ప్రైమరీ స్కూల్ ని స్థాపించడం జరిగింది.

ఆ తరువాత రెవ హెచ్ ఇ. ఇసాక్సన్ H.E. Isaac-son గారు 1897 లో స్కూలుని నాలగవ తరగతి వరకూ పెంచగా....!

శ్రీ మద్దిరాల రామారావు పంతులు గారు లూథరన్ హైస్కూలు మొట్టమొదటి హిందూ మరియు భారతీయ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఘనత వహించారు.

16-02-1900 సంవత్సరం లో ప్రభుత్వ గుర్తింపు పొంది 475 మంది విద్యార్ధులు మరియు 18 మంది గురువులతో పూర్తి స్థాయి విద్యాలయంగా ఆవిర్బవించింది. (ఒక మిషినరీ స్కూల్ లో టీచర్స్ అందరూ హిందువులే కావడం గొప్పవిషయం)

రెవ కె ఎల్ వాల్టర్స్ (Rev. K.L. Walters) గారు ఈ స్కూల్ కి 6 ఎకరాల స్థలమును సంపాదించి ఇవ్వగా 1906 లో ఇప్పటి బ్రాంచి స్కూలు ఉన్న ఒక భవనం ను కొని దానికి మరమత్తులు - మార్పు లు చేర్పులు చేయించడం ( రీ మోడలింగ్) స్కూల్ మిషనరీ నుండి మిషన్ కౌన్సిల్ కి మార్పు చెందడం వడి వడి గా జరిగి పోయాయి.


పాఠశాల భవనం నిర్మించేందుకు 25.11.1911 న శంఖుస్థాపన చేసి 29.10.2012 నాటికి H - ఆకారంలో వుండే ఒక బారీ భవంతిని రూ. 38000/- వ్యయంతో నిర్మించడం జరిగింది. (ఈ స్కూల్ నిర్మాణానికి కావాల్సిన రూ 38000/- డబ్బు కోసం "రెవ హుస్స్" (Rev Huss - మహాశయుడు తనకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భూమిని అమ్మి ఇవ్వడం జరిగింది.)

రెవ హెచ్ హెచ్ సిపెస్ (Rev. H.H. Sipes) గారు ఈ స్కూలు కి మొట్టమొదటి మేనేజర్ గా 1912 నుండి 1917 వ సంవత్సరం వరకూ సేవలందిచగా.



First Ncc Officer of Luthern High School Mr. Rudra Raju

1932 శ్రీ వి సి హెచ్ జాన్ గారు మొట్టమొదటి ఇండియన్ మేనేజర్ గా ఘనత వహించి 1936 లో ఈ స్కూలు యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకను ఘనంగా నిర్వహించారు.



1945 లో శ్రీ ఎ డానియెల్ గారు ప్రధానోపాధ్యాయులు గా ఉన్న కాలాన్ని పెద్దాపురం లూథరన్ హై స్కూల్ కి స్వర్ణ యుగం గా చెప్పవచ్చు 55 మంది టీచర్స్ , 768 విద్యార్ధినీ - విద్యార్ధులు మరియు స్కూలుకి చేర్చి ఉన్న భవనంలో 87 మంది విద్యార్ధులతో స్కూలు కళకళలాడిపోయేది.




1954 నుండీ 1965 వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన ఎం ప్రకాశం గారు స్కూలుని కేవలం విద్యకే పరిమితం చేయకుండా (ఎక్ష్రా కర్రిక్యులర్) - క్రీడలు - కళలు కి కూడా సమాన ప్రాధాన్యాన్నిచ్చి విద్యార్ధులు అన్ని రంగాలలోనూ నిష్ణాతులయ్యేలా ప్రోత్సహించారు.


ఆ ప్రయత్నం లో భాగంగానే అల్ ఇండియా జమ్బోరీ - (స్కౌట్) ని 1964 వ సంవత్సరంలో స్కూల్ కి తీసుకురావడం - స్కూల్ కి ఒక జెండాను రూపొందించడం - శ్రీ అర్. సూర్యనారాయణ గారు ( ఆర్ట్ & స్కౌట్ టీచర్) గారిచే స్కూలుకి ఒక గేయాన్ని రచింప చేయటం ( స్కూల్ సాంగ్) జరిగింది.


శ్రీ బి శామ్యూల్ గారు 1967 నుండి 1976 సంవత్సరం వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి స్కూలు కి నాచురల్ సైన్స్ లాబోరేటరీ ని నిర్మించి డైమండ్ జూబ్లీ వేడుకలను 1975 సంవత్సరం లో ఘనంగా నిర్వహించారు.


1978 నుండి 1991 వరకూ వి ఎస్ డేవిడ్ రాజు గారు ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి అదనపు సెక్షన్స్ ను ఉద్యోగులను నియమించి సుదీర్ఘ కాలం స్కూలుకి సేవలందించిన వ్యక్తిగా గుర్తింపు పొందడం జరిగింది.


1991 నుండి 1994 వరకూ జాన్ పీటర్ గారు ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహించడం జరిగింది. పీటర్ గారు స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడే ఫుట్ బాల్ అసోషియేషన్ ను స్థాపించి విద్యార్ధులకి విద్యార్ధులకి శిక్షణ ఇచ్చేవారు. ఈయన హయాం లోనే 1992 లో సెంటినరీ ఇయర్ అఫ్ లూథరన్ హైస్కూలు ని ఘనంగా నిర్వహించి స్కూలు స్థాపకుడు అయినటువంటి డా ఎడ్మన్ ఇమ్మానుయెల్ గారి విగ్రహం స్కూలు ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది.




1995 నుంచి 1998 వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన ఎం శ్యాం సుధాకర్ గారు (ఎం. ప్రకాశం గారి తనయుడు) లూథరన్ బ్రాంచ్ ని లూథరన్ హై స్కూలుని క్లబ్ చేసి విద్యార్ధుల సౌకర్యార్ధం అదనంగా స్కూలు వెనుక బాగం వైపు ఆరు తరగతి గదులను నిర్మించడం జరిగింది.


1998 నుండి 2003 వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన వి జె ఎస్ పాలన్ గారు స్కూలు భవనం యొక్క పైకప్పు (రూఫ్) ని ధృడంగా ఉండేలా మార్చి - తలుపులు కిటికీ లు బలంగా ఉండేలా ఏర్పాటు చేయించడం జరిగింది.


2003 నుండి 2006 వరకూ జి నళిని గారు ప్రధాన ఉపాద్యాయురాలు గా పనిచేసి స్కూలుకి సైన్స్ & సాస్కృతిక విభాగాలలో అనేక అవార్డులు సంపాదించి పెట్టి 2005-2006 విద్యాసంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాద్యాయురాలు బహుమతి ని అందుకోవడం జరిగింది అంతే కాకుండా . స్కూలుకి డబుల్ క్లాస్ రూం వసతిని కల్పించి కళావేదిక (స్టేజి) పైకప్పు ని ఏర్పాటు చేయించారు.


2006 నుండి 2011 వరకూ ప్రధాన ఉపాద్యాయురాలు గా పనిచేసిన ఎస్ మేరీ గ్రేస్ గారు ముందు ఉన్నటువంటి పాత భవనాన్ని పాక్షికంగా తొలగించి ఇప్పుడు బయటికి కనిపించే పెద్ద భవనాన్ని 2011 లో తన ఉద్యోగ కాలం చివరలో నిర్మింప చేయడం జరిగింది.


2011 లో స్కూలు కరస్పాండెంట్ బి. జాన్ పీటర్ గారు స్కూలు భవనం యొక్క వంద సంవత్సరాల వేడుక (సెంటినరీ ఇయర్ అఫ్ ది స్కూల్ బిల్డింగ్) ని 31.10.2011 న నిర్వహించడం జరిగింది మరియు గోలి రామారావు గారి అద్యక్షతన పూర్వ విద్యార్ధులంతా ఒక కమిటీ గా ఏర్పడి స్కూలు భవనాన్ని పటిష్ఠ పరచాలనే నిర్ణయాన్ని తీసుకుని తదనుగుణంగా ప్రణాలికలు సిద్దం చేసుకోవడం జరిగింది.


మీ వంగలపూడి శివకృష్ణ

Temple at Peddapuram Pandavula Metta - Amaragiri Sattemma మన పెద్దాపురం అమరగిరి ‘అమ్మ - శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు :

మన పెద్దాపురం అమరగిరి ‘అమ్మ - శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు :

గ్రామ దేవత గా పిలవబడే శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు మన పెద్దాపురం జగ్గంపేట వెళ్ళే మార్గ తొలిలో శ్రీ శక్తిపీఠం నందు కొలువై ఉంది..
ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అనగా సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు ఉత్సవాలు జరగడం ఆనవాయితీ.ఈ సంవత్సరం కూడా ఏంతో వైభవంగా ఉత్సవాలని నిర్వహించడానికి ఆలయ కమిటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది



ఆలయ విశేషాలు :
------------------
1.మన పెద్దాపురం చారిత్రిక గిరుల అయిన "అమరగిరి" (పాండవులమెట్ట) చెంతన ఈ శక్తిపీఠం వుండడం విశేషం..
2. ఓం ఐం హ్రిం శ్రీం శ్రీ సత్యాంబికాయైనమః’ అన్న మంత్రోచ్చరణతో విరాజిల్లుతుంది ఈ ఆలయం
3. ఈ ఆలయం చుట్టూ అష్టదిక్కులయందు నాగుల విగ్రహాలతో నాగదిగ్బంధనం ఉంటుంది
4.ఆలయ ప్రాంగణంలో అష్టోత్తర- శత నామావళిలతో దేవీ కీర్తించబడుతుంది. ఈ ఆలయంలో త్రిభైరవమూర్తులు కొలువై వుండడం కూడా చెప్పుకోదగ్గ విషయం. కాలభైరవ.. వటుక భైరవ.. స్వర్ణాకర్షణ భైరవ రూపాల్లో భైరవమూర్తి దర్శనమిస్తాడు.
5. స్ఫటిక విఘ్నేశ్వరుడు యిక్కడ చాలా ప్రసిద్ధి ..
7. ఈ ఆలయం నందు ఉండు ఉప ఆలయం నందు శ్రీ వరాహి అమ్మవారు నిజరూపంలో ప్రతిరోజు తెల్లవారుఝామున గం.4 నుండి గం.5వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది.
8.శ్రీ శక్తిపీఠంనందు శ్రీ చక్రయంత్ర సహిత వనదుర్గాదేవికి ఘనంగా యజ్ఞయాగాదులను నిర్వహించడం జరుగుతుంది.
9.దూప.. దీప.. నైవేద్య ప్రసాదాలతో నిత్యం అలరారే శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు జాతర సమయంలో గరగ ప్రభలతో భక్తులకు దర్శనమిస్తారు.
ఆ తల్లి దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ!!
మన పెద్దాపురం TeaM

పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది.... ? History Behind Name of Peddapuram

 పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది.... ? 


అనే విషయం లో భిన్న కధనాలున్నాయి.

పెద్దాపురం ను పెదపాత్రుడు ఆక్రమించుకొన్నాడు - పెద్దాపురం పేరే మార్చేయాలి అనే వాదనలూ ఉన్నాయి ....

అవి పక్కన పెడితే పెద్దాపురం పేరుకి సంబంధించి కిమ్మూరు కైఫీయతు - పెద్దాపురం సంస్థాన చరిత్రము లనుండి నేను అర్ధం చేసుకున్నది తెలియజేస్తున్నాను - తప్పులు వుంటే పెద్దలు దయచేసి తెలియచేయండి సరిచేస్తాను.


పార్ధాపురం >>>>> కిమ్మూరు సీమ >>>>>> పొర్లునాడు >>>>>>> పెద్దాపురం
---------------------------------------------------------------------------------------------------

పార్ధాపురం:
పురాణాలు, స్థానిక చరిత్రల ప్రకారం పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడ నివశించడం జరిగింది
(దానికి సాక్ష్యాలు ఇంకా "అమరగిరి - పాండవుల మెట్ట" మీద సజీవంగానే వున్నాయి).
పాండవ మధ్యముడు అయినటువంటి అర్జునుడి పేరు మీద (అర్జునుడి కి పార్ధ అనే పేరు కూడా వున్నది) "పార్ధాపురం" అనే పేరుతో ఈ ప్రాంతమంతా పిలువబడేది. కాలక్రమంలో ఈ "పార్ధాపురం" కాస్తా వ్యవహారం లో (పలుగాకుల నోల్లబడి) "పెద్దాపురం" గా స్థిరపడింది.



కిమ్మూరు :

పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు పెద్దాపురం ఉన్న ప్రాంతాన్ని పెద్దాపురం పరిసర ప్రాంతాలను కిమ్మెరుడు అనే కిరాత రాజు పరిపాలించే వాడు ఆ కారణం చేత ఈ ప్రాంతమంతా అతని పేరునే కిమ్మూరు సీమ గా వ్యవహరింపబడేది (కిమ్మెరుని వధ కధ కోసం నా కాండ్రకోట ని కన్నులారా చూతము రారండి ని చూడండి)


పొర్లునాడు :
పెద్దాపురం పిఠాపురం ల మద్య ఏలేరు నది ప్రవహించడం మూలాన ఆంధ్రరాష్ట్రం అంతా ఈ రెండు ప్రాంతాలను పొర్లునాడు అని పిలిచేవారు.




పెద్దాపురం పేరు వెనక వృత్తాంతం :
ఈ ప్రాంతం గజపతిల ఆదీనం లోనికి రాకముందు రెడ్డిరాజులు పాలించేవారు అల్లాడ వేమారెడ్డి వంశం లోని వాడైన రెడ్డి వెంకటప్పనాయుడు కిమ్మూరు, కొవ్వాడ, గురుగుమిల్లి, గూటాల, క్రొత్తపల్లి ని పరిపాలిస్తున్నప్పుడు అతని సరదారు గా ఉన్నటువంటి ఇసుకపల్లి పెరుమాళ్ల పాత్రుడు అధీనంలో ఈ కిమ్మూరు సీమ వుండేది.

ఇతని అనంతరం ఇతని వంశంలోని వాడే అయిన " పెద్దాపాత్రుడు "** సిబ్బంది కి, సైన్యానికి అయిన వ్యయం పోగా మిగిలిన ఆదాయమంతా తమకి పంపాలనే ఒప్పందం మీద రెడ్డి రాజుల ఆమోదంతో ఈ కిమ్మూరు సీమకి పరిపాలకుడయ్యెను.

ఆ తరువాత అప్పటి కిమ్మూరు సీమ లో బాగంగా వున్నా తమిరే అనే గ్రామానికి ఉత్తర బాగాన ఉన్నటువంటి రెండు పెద్ద పెద్ద మెట్టలని చదును చేయించి అక్కడ ఒక్క కోటని కట్టించి చుట్టూ మట్టి గోడ పెట్టించి వాటిపై చుట్టూ బురుజులు తీర్పించి ఆ కోటలో అతను నివాసముంటూ ప్రజలు నివశించ దానికి వీలుగా ఒక పేటను కట్టించి దానికి అతని పేరు మీదనే " పెద్దాపురం "** అని పేరు పెట్టాడు.

చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలవడంతో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం కావడంతో ఇక్కడికి జనాల వలసలు పెరిగాయి. (ఆ తరువాత కాలంలో నీటి సమస్యల ఇక్కడినుండీ వలస పోయారు చాలామంది) తరువాత విస్సమ్మ అనే రెడ్డి వనిత రెండువేల పౌజులకు వత్సవాయి ముసలి తిమ్మరాజు గారికి (చతుర్బుజ తిమ్మ జగపతి మహారాజు) గారికి తాకట్టు పెట్టడం జరిగింది.

ఆ తరువాత వత్సవాయి వంశస్తులు పెద్దాపురాన్ని సుబిక్షంగా పరిపాలించిన విధానం మీకు తెలిసిందే ...... !

తప్పులు వుంటే మన్నించండి సవరణలు తెలియజేస్తే తప్పక సరిచేయగలను

....................................................................ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ

A Painful Story about Ragavamma Peddapuram - పెద్దాపురం సంస్థానం : పరమ సాధ్వీ మణి - త్యాగశీలి రాగమ్మ గారు :

పెద్దాపురం సంస్థానం : పరమ సాధ్వీ మణి - త్యాగశీలి రాగమ్మ గారు :


కటిక రాయికైనా కన్నీరు తెప్పించే రాగమ్మగారి జీవిత కధ తప్పక చదవాల్సిందే
భారత దేశంలో వీరనారీ మణుల చరిత్రలు కోకొల్లలు ... అదే కోవకి చెందుతుంది మన పెద్దాపురం రాగమ్మగారి గారి చరితం.
బార్యగా అమ్మగా మహారాణీగా పరువు నిలుపుకునే ప్రయత్నంలో ప్రాణత్యాగానికి పాల్పడ్డ పరమ సాధ్వీ మణిగా ఆమె చరిత్రలో నిలిచి పోయింది.
రుస్తుం ఖానుండి విద్రోహానికి బలి అయ్యిపోయిన రాగమ్మ గారి జీవిత చరిత్ర చదివితే కటిక రాయికైనా కన్నీరు రాక మానదు 




గొట్టుముక్కల భగవాన్ రాజు గారి ముద్దుల కూతురు అయిన శ్రీ గొట్టుముక్కల రాగమ్మ గారు వత్సవాయి ఉద్దండ రాయజగపతి బహద్దరు గారిని వివాహం చేసుకుని తిమ్మ రాజ జగపతి, భలబద్ర రాజ జగపతి, సూరపరాజు అనే ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది. ఉద్దండ రాయుడు గారు పెద్దాపురం సంస్థానాన్ని 1688 నుండి 1714 వరకూ పరిపాలించి 1714 లో కన్ను మూసే సమయానికి పెద్ద కుమారుడైన తిమ్మరాజ జగపతికి 10 సంవత్సరాలే కావడంతో, ముగ్గురు కుమారులు మైనరులు కావడం వల్ల - పెద్దకుమారుని సింహాసనాన్ని అధిష్టింప చేసి అతని పేర రాగమ్మ గారే 1714 నుండి రాజ్య పాలన కావించారు.పేద ప్రజారహిత పెద్దాపురం ప్రాభవాన్ని కాంక్షించిన పరమ సాధ్వీమణి రాగమ్మ గారు పెద్దాపురం తాలుకాలో రాగంపేట గ్రామాన్ని మరియు అక్కడికి దగ్గరలో ఉన్న రాగమ్మ చెరువు ఈమె చలవ వలననే ఏర్పరచ బడినవి.


రుస్తుం ఖాన్ విద్రోహ చర్యకి బలి అయిపోయిన రాగమ్మ
రుస్తుం ఖాన్ పెద్దాపురం కోటని ఆక్రమించుకోవాలనే కుతంత్రంతో పాడవుల మెట్ట దగ్గరకి వచ్చి వేచి వుండి తన కుమారుడైన నూరుద్దీన్ ఖాన్ ను రాగమ్మ గారి వద్దకి పంపి రాజ్యం - రాజ్య వ్యవహారాలకి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి రాజకుమారులను పంపించాల్సిందిగా కోరాడు (నూరుద్దీన్ ఖాన్ ముగ్గురు రాజ కుమారులకు మంచి మిత్రుడు) రుస్తుం ఖాన్ యొక్క దుర్మార్గ పూరిత ఆలోచన తెలియని రాగమ్మ గారు అమాయకంగా అనాలోచితంగా ముగ్గురు నీ రుస్తుం ఖాన్ దగ్గరకి ఎటువంటి సైన్యం లేకుండా పపించింది. రుస్తుం ఖాన్ వారిని సాదరంగా తన డేరాలోకి పిలిపించి అత్యంత ప్రేమ నటిస్తూ సలసల మరిగే నూనె ను జొన్న వెన్నులలో పోయించి వీపుల మీద కొట్టించి అత్ కిరాతకం గా హతమార్చెను ( చనిపోయే నాటికి రాగమ్మ గారి పెద్ద కొడుకైన తిమ్మరాజ జగపతి కి 34 సంవత్సరాలు మరియు ఏడాది వయస్సున్న బాలుడు కలడు)
రుస్తుం ఖాన్ పెద్దాపురం కోటని ఆక్రమించు కోవడానికి వస్తున్న వార్తని వేగులు(గూఢ చారులు) ద్వారా తెలుసుకున్న రాగమ్మ గారు. తురుష్కుల భారిన పడకూడదని (తురుష్కులు అంతపుర స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారు మహారాణులను వివస్త్రలు చేసి వీధుల వెంబడి ఊరేగించేవారు. అంతపుర కాంతలపై హత్యాచారాలకు తెగబడి అతి కిరాతకంగా వేధించి చంపేసేవారు) అందుచేత ఏడాది వయసున్న బాలుడు జగపతి ని కోట దాటించి విజయనగరం పంపించే ఏర్పాట్లు చేసి కోట గేట్లు మూయించేసారు.
సంస్థాన సేవకులలో అత్యంత విశ్వాస పాత్రుడైన చల్లా పెద్ది ని అంతపురానికి నిప్పు పెట్టమని ఆజ్ఞాపించి మొదట తానే అగ్నికి ప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసుకుంది ఆమె వెంట అంతపుర స్త్రీలందరూ అగ్నికి ఆహుతయ్యారు.
మీ వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...