Thursday 19 January 2017

SLOGANS FOR CLEAN TOWN BY PEDDAPURAM TEAM

ప్రతీ ఊరి బాగు కోసం కొన్ని నినాదాలు షేర్ చెయ్యండి

పరిసరాల పరిశుభ్రత - ప్రతిఒక్కరి భాద్యత
మొక్కవోని దీక్షతో - మొక్క నాటుదాం
చేయి చేయి కలుపుదాం - చెట్లు పెంచుదాం 
ప్రతి ఇంటా పచ్చదనం - దేశానికి ఆభరణం
స్వచ్ఛమైన సైన్యం - పచ్చదనం కోసం
ఒకే ఒక్క వాక్యం - పరిశుభ్రతే సౌఖ్యం
ప్రకృతిని ప్రేమించు - నూరేళ్లు జీవించు
పారిశుద్యమే - ప్రగతికి చిహ్నం
ఇంటిటా టాయిలెట్టు - ఆరోగ్యానికి తొలి మెట్టు
మన యువకుల కలయిక - అభివృద్ధికి కదలిక
ఊరి యువత జోరు - స్వచ్ఛత కై పోరు
పరిసరాలు పరిశుభ్రo - పర్యావరణం భద్రం
అపరిశుభ్రత నివారించు - అనారోగ్యం నిరోధించు
చెత్త వేయవద్దు - తప్పు చేయవద్దు
ఆరోగ్యం మన హక్కు - పరిశుభ్రతే దిక్కు
వీధి మనది ఊరు మనది - అణువణువూ మనది
ఇంటింటా మరుగు దొడ్డి - ఊరంతా ఆరోగ్యం
మరుగుదొడ్డి వాడు బహిరంగ మలవిసర్జన వీడు
మరుగుదొడ్డి నిర్మిద్దాం - ఆడవారి ఆత్మగౌరవం కాపాడదాం
టాయిలెట్ కట్టుకో - బ్రతుకు బాట దిద్దుకో
పచ్చదనం పరిశుభ్రం - ప్రగతికి సోపానం
అపరిశుభ్రతపై అదుపు - ఆరోగ్యానికి పొదుపు
పరిసరాలు పచ్చగా - మన జీవితాలు చక్కగా
పరిసరాలు పరిశుభ్రం - రోగాలకు బహు దూరం
తిండి కేంటి తొందర - చేయి కడుగు ముందర
అపరిశుభ్రం తుడిచివేద్దాం - అంటువ్యాధుల్ని తరిమేద్దాం
కాలవలో చెత్త వేయకు - దోమలకు ఇల్లు కట్టకు
నీరు నిలువనీయకు - ఊరు పాడుచేయకు
నీరు కలుషితమైతే - ఊరు కలుషిత మౌతుంది
నీటిని పొదుపుగా వాడు - నీటి కొరత నివారించు
చెత్త వేసేముందు నిదానం - పరిశుభ్రతే మన నినాదం
సెల్లు ఫోను వీడరా - ఊరు బాగు చూడరా
( మీ వంగలపూడి శివకృష్ణ - వంగలపూడి గ్రామపంచాయతీ వారి సౌజన్యంతో ) - వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...