Thursday 19 January 2017

POOR PEOPLE'S DIWALI CELEBRATIONS AT PEDDAPURAM

దీపావళిలో దీనజనావళి - పేదవాడి లోగిలిలో దీపాలే దీపావళి

ఇది మా ఇంట్లో దీపావళి - మరి మీ ఇంట్లో దీపావళి ఎలాఉంటుంది.?

దీపావళి : ఈ పేరు వింటేనే అందరికీ టపాసుల చప్పుల్లు, పిండివంటల ఘుమఘుమలు, కొందరికి కొత్తబట్టలు గుర్తొస్తాయి. మరి పేదవాడి ఇంట్లో దీపావళి ఎలాఉంటుంది... ? చూద్దామా...!



#పండుగకి_ఇంకా_నెలరోజులు - అమ్మతో బేరసారాలు... ఈ బే‌రం ఎప్పటికీ తెగదు, నాకు దెబ్బలు... అమ్మకి కన్నీళ్ళు

#పండుగకి_ఇంకా_15_రోజులు - డబ్బున్న నేస్తంతో దోస్తీ... వాడికి వంద సిసింద్రీలు, జువ్వలు కూ‌‌రితే నాకు ఐదు ఇస్తాడు.

#పండగరోజు... అన్ని ఇల్లూ మా ఇల్లే... వీధంతా మాదే... ప్రతీ ఇంటి ముందూ పేలేవి ప్రమాధకరమైనవి మేమే పేలుస్తాం. మా దృష్టిలో డబ్బులు వారివి ఆనందం మాది... వారి దృష్టిలో ఆనందం వారిది రిష్క్ మాది.

పక్కింట్లో... పిండి వంటలు...
సువాసన తగ్గిపోయేవరకూ మా ఇంటికి రావు... అవి వచ్చే సరికి మా ఆకలి సగం సచ్చి పోయేది

#పండగతర్వాతరోజు ... ఇదే మారోజు ఈరోజు కోసమే మేము నెల రోజులుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసాం... నిన్న రాత్రంతా మొక్కుకున్నాం వారి టపాసులు వెలగకూడదు అని... వెలగని టపాసుల వేటలో ఊరంతా తిరిగి అలసిపోయాం...

ఆకలిలో నిన్నటి పక్కింటి పిండి వంటల అమృతం తినేసి ఆనందంగా పడుకున్నాం... ఇక సాయంత్రం మా ఇంటి దగ్గర టపాసుల మోత... టపాసులు కాల్చడంలో చిత్ర విచిత్రాలు అన్నీ చేస్తాం... డబ్బున్న నేస్తాలు మా ఇంటికి చుట్టాలు... వారికి మాత్రం మా ఇంటి దగ్గర అన్ని పలహారాలు వేడిగా... వేడి వేడిగా... సువాసన పోకుండానే అందిస్తాం అది మా పేదవారి రాచమర్యాద

పైన హెడ్డింగ్ చూసి పాపం పేదవారు అనుకోకండి
మా పేదవాడు ఎక్కడా తగ్గడు పండగ చేసుకోవడం లేటవ్వచ్చేమోగానీ చేసుకోవడం మాత్రం పక్కా... మీ వంగలపూడి శివకృష్ణ 

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...