Wednesday 18 January 2017

మన పెద్దాపురం మహానటి అంజలీ దేవి Anjali Devi Statue at Peddapuram

మన పెద్దాపురం మహానటి అంజలీ దేవి - వికీ పీడియా నుండి

అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన అంజలీదేవి (ఆగష్టు 241927 - జనవరి 132014) 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత.  ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్తపి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది 

బాల్యం
అంజలీదేవి 1927ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లాపెద్దాపురంలో జన్మించింది ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.

చిత్ర సమాహారం

నటిగా

1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996 లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.[7] సువర్ణసుందరిఅనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993) మరియు పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.

నిర్మాతగా అంజలీ పిక్చర్స్

అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973) మరియు చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు మరియు చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.

కుటుంబం

ఆమె భర్త ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు. ఆమెకు ఇద్దరు కుమారులు.


Anjali Devi Birthday celbrations at Old Busstand Peddapuram Anjali devi Statue

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...