Friday 20 January 2017

PLEASE DON'T CRITICIZE PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర - వంగలగోరుచుట్టు పై రోకలి పోటు --- పెద్దాపురానికి పైశాచికత్వపు వేటు
పెద్దాపురం పరిచయమే అక్కరలేని ఊరు.... !
ఇక్కడ గొప్ప విద్యావంతులున్నారు ---విప్లవ కారులున్నారు .......
సామాజిక కార్యకర్తలున్నారు --- కళాకారులున్నారు........
శిల్పులున్నారు --- శాస్త్రవేత్తలున్నారు ........
అత్యంత ప్రతిభావంతులు ఎందరో వున్నారు అంతకుమించి సర్వమత సామరస్యానికి ప్రతీక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ల సఖ్యత వుంది …… ప్రఖ్యాత దేవాలయాలున్నాయి ..... వెరసి 500 చరిత్ర ఉంది.... ! కానీ ఈ ప్రపంచానికి వాటితో పనిలేదు…. గురువింద గింజ తనక్రింద నలుపెరుగని చందం గా వీరికి ఎదుటి వారి జీవితాలలోని చేదు జ్ఞాపకాలను వెలికితీసి మరిచిపోయిన గాయాలను మరలా రేపి
పెద్దాపురం విధ్యాపురం గా పరిణితి చెందుతున్న దశలో కూడా ఈ ముష్కరులు వేశ్యాపురం గా ముద్ర వేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ బవిష్య యువత కూడా మాది పెద్దాపురం అని చెప్పుకోవడానికి తడబడేలా చేస్తున్నారు శరీరం లో అణువణువూ విషం నిండిన కొందరు సన్నాసులు.
ఇలాంటి వారితో మేము (పెద్దాపురం వాసులు ) వాగ్వివాదానికి దిగిన సందర్బాలెన్నో ... అలాంటి సందర్బమే ఒకసారి మా బందువు ఒకాయనతో ఎదురైతే……
అతని వ్యంగ్యానికి వికారానికి తట్టుకోలేక సహనం కొల్పోయి " అసలు వేశ్య లే లేని ఊరు ఉందా….. మీ ఊరి లో అందరూ ప్రతీవ్రతలేనా… అవును మా వూరిలో వూరికి చివర ఒకచోటే వుంటారు .... కాని మీకు వీధి వీధి కి ఒక్కరిద్దరు వుంటారు ….పోయి మీ ఇల్లు ఎలా నడుస్తుందో చూసుకోవయ్యా .
" అంటూ చెడా మడా ఇచ్చేశాను… దెబ్బకి అతను అందరిముందూ తల దించుకుని లోపలి వెళ్ళిపోయాడు (ఆ తరువాత ఆ విషయం తెల్సుకున్న మా అమ్మ నాకు బాగా ఇచ్చింది అనుకోండి అది వేరే విషయం )
ఏది ఏమైనప్పటికీ
మా వూరు పేరు పెద్దాపురం అని చెప్పుకోవడానికి ఎన్నడూ సిగ్గుపడను వెనక్కు తగ్గను....
............................................... .............................మీ వంగలపూడి శివకృష్ణపూడి శివకృష్ణ

KANNADA MOVIE APTHAMITRA ABOUT PEDDAPURAM

మన పెద్దాపురం వేశ్యాపురం కాదు : కళా వంతుల నిలయం దయచేసి వీడియో చూడండి 


-----------------------------------------------------------------------------------------
వేశ్యాపురంగా మనమే మార్చేసాం : 
=====================
@ పొరుగు రాష్ట్రాల చరిత్రలలో,… కధల్లో,…. ఇతిహాసాల్లో,…. మాటల్లో,… పాటల్లో,.... నాటకాల్లో,… చలనచిత్రాల్లో…. మన పెద్దాపురం నాట్య కళాకారిణి ల నిలయం…. @ స్వరాష్ట్రస్తులు సైతం .. నిస్సిగ్గుగా మా పెద్దాపురాన్ని వేశ్యా పురంగా చిత్రీకరిస్తుంటే పెద్దాపురం అసలు స్వరూపానికి అద్దంపట్టిన అత్యుత్తమ సన్నివేశాన్ని ఆంధ్రా ప్రజలకు అందించిన ప్రముఖ కన్నడ దర్శకులు పి. వాసు గారికి ధన్యవాదాలు !
================================
ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಮಹತ್ತರವಾದ ನೆರವು - ನಾವು (our peddapuram people) ಯಾವಾಗಲೂ ಮರೆಯಬೇಡಿ.... @ Thank you Sir @ మీ వంగలపూడి శివకృష్ణ @


పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

CHADALADA TIRUPATHI - THORLI TIRUPATHI HISTORY

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ


తొలితిరుపతి - - మనపెద్దాపురం - చదలాడ తిరుపతి
శృంగార వల్లభుని - స్వర్ణ రథ కాంతి
తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి
అయితే తూర్పు గోదావరి జిల్లాలోని మన పెద్దాపురం లోనే తిరుపతి వుందని
అదే తొలితిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు .. మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుందని ) చాలా మందికి తెలియదు.
విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ..
స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి
ఆలయ చరిత్ర :
--------------
ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో
ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.
అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా
ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.
ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట.
అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట
ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట
స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)
ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం)
ఆలయ విశిష్టత :
------------------
1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం )
2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది )
3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి
4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి.
5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది.
6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ
కార్యక్రమాలు - పూజా విధానం :
-------------------------------
1) నిత్య ధూప దీప నైవేద్యం
2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం
3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు
4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు :
----------------------------------------------------
బోజమహా రాజు
బట్టీ విక్రమార్క
రాణీ రుద్రమదేవి
శ్రీ కృష్ణ దేవరాయలు
పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు
లక్ష్మీ నర సాపురం రాజులు ( లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి .. బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు )
https://plus.google.com/+vangalapudisivakrishna/posts
వంగలపూడి శివకృష్ణ

PEDDAPURAM MANDAL KANDRAKOTA NOOKALAMMA HISTORY

మన పెద్దాపురం లోని కాండ్ర కోటని కన్నులారా చూతము రారండి
------------------------------------------------------------------
దయచేసి పూర్తిగా చదివి షేర్ చెయ్యండి.https://plus.google.com/+vangalapudisivakrishna/posts
పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్లు (గుడివాడ, సిరివాడ ల మీదుగా స్వచ్చమైన పల్లెటూరి వాతావరం దారి పొడవునా రోడ్దుకిరువైపులా చెట్లు, చెట్లకి అవతల పచ్చని పంట పొలాలు..... వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు, రవాణాకి వాడుతున్న ఎద్దుల బండ్లు. వూరి మద్యలో రామాలయం - రామకోవెల (రాంకోలు) మీద అష్టా చమ్మా ఆడుతూ పిల్లలు ... దృశ్య శ్రవణ యంత్రం (టెలివిజన్ - టివి ) వీక్షిస్తున్న వృద్దులు, పెద్దలు... ఊరంతా కల్మషం లేని మనుసులు.ఆ మనుషులని కంటికి రెప్ప లా కాపాడే నూకాలమ్మ అమ్మవారు)
వెరసి కనీసం ఒక్కసారైనా కాండ్రకోట ని కన్నులారా చూడవలసిందే ....................
కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడట అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపం లో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతు ని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారట అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధం లో ఓడిపోయారట !
ఆతని ఓటమి తరువాత ప్రజలపై కిమ్మేరుని పైశాచిక చర్యలు పెచ్చుమీరాయంట (అధికమయ్యాయి) ! ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తి ని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడట. ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశ ల లోని ఒక అంశ ను ధర్మకేతు మహారాజు తో పాటూ పంపిందట. ఆ యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు - స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి - వధించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడట
ఆ ఆది పరాశక్తి అంశే "నూకాలమ్మ అమ్మవారు" యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించినాడు -
అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మ గా ... కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా కొలువు తీరినారు .
పాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవం గా కన్నుల పండుగ గా జరిగే ఈ జాతరకి ఆంద్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రజలు తండోప తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు.
జాతర సమయంలో గ్రామస్తుల తో పాటుగా శ్రీ గీతా శివభక్త యువజన సంఘం దేవాలయ సందర్శకులకు - చిన్నపిల్లలకు విశిష్ట సేవలు అందించడం అబినందనీయం. బచ్చు ఫౌండేషన్ వారు కాండ్రకోట గ్రామాన్ని గ్రామంలోని విద్యాలయాలను అభి వృద్ధిపరచిన తీరు బహు ప్రశంసనీయం.
ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించాలని ఆశిస్తూ
మీ వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

PEDDAPURAM HISTORY - SRI RAJA VATSAVAYA RAYA JAGAPATHI

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం సంస్ధానం చరిత్ర : శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి మహా రాజు

==================================
ఆంధ్ర గీర్వాణ బాషా కోవిదుడు
బహు శాస్త్ర విశారదుడు
ఉభయ బాషా కవి
వైఘాన ధర్మ చంద్రికాది గ్రంధ కర్త
శ్రీ రామ భక్తుడు
అస్మత్ ఆధ్యాత్మిక గురువరేణ్యుడు...... అయినటువంటి మా తాతయ్య గారు
శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి మహా రాజు గారికి ---------------------- మరియు
స్త్రీ ధర్మ పరిపాలకురాలు
సాధ్వీ మణి అయిన మా చిన్నమ్మ (బాబయ్యమ్మ)
శ్రీమతి బుచ్చియ్యంబా దేవి గారికి ..................................
తల్లి లేని నాకు ఆ లోటు తెలియకుండా ఎంతో ప్రేమతో పెంచి విద్యా బుద్దులు నేర్పి నా ఎదుగుదలకు కారణమై - నన్ను ఇంత ఉన్నత స్థితి కి తీసుకు వచ్చినందుకు కృతజ్ఞతతో ఈ గ్రంధం ను మీకు సమర్పిస్తున్నాను. - వత్సవాయి రాయ జగపతి వర్మ గారు
పూర్తి చరిత్ర కోసం క్రింద లింక్ చూడండి
https://plus.google.com/+vangalapudisivakrishna/posts

ENUGU LAXMANA KAVI PEDDAPURAM SAMSTHANAM

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
మన పెద్దాపురం : ఏనుగు లక్ష్మణ కవి
--------------------------------------
ఏనుగు లక్ష్మణ కవి గారు జన్మస్దలము పెద్దాపురము.
ఈయన క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు. 
ఏనుగు లక్ష్మణ కవి గారి తల్లిగారి పేరు పేరమాంబ, మరియు తండ్రిగారి పేరుతిమ్మకవి.
శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాతగారు"శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు".ఈయన ఒక ఏనుగును పోషించెవాడు.దానిని ఈయనకు పెద్దాపురం సంస్థాన పాలకులు బహుమతిగా యిచ్చారు.
అందుచే కాలక్రమేన వీరి యింటిపేరు ఏనుగు వారిగా స్దిరపడినది.
శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ద కవి' కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి, లక్ష్మణ కవి గారి సమ కాలికుడు. లక్ష్మణ కవి గారు, భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రి శతిని" తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీదఅనువాదం చేసినాడు.
సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు.
భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు
1. ఏనుగు లక్ష్మణ కవి
2. పుష్పగిరి తిమ్మన
3. ఏలకూచి బాల సరస్వతి. వీటన్నింటిలోను మిక్కిలి ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.
ఏనుగు లక్ష్మణ కవి గారి భర్తృహరి సుభాషిత నుండి
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.
ఏనుగు లక్ష్మణ కవి గారి యితర రచనలు
1.రామేశ్వర మహత్యము.
2.రామ విలాసం
3.సూర్య శతకము.
4.లక్ష్మీనరసింహ శతకము.
5.గంగా మాహాత్మ్యము

BATTUVAARI RAVI CHETTU A SMALL STORY ABOUT PEDDAPURAM

మన పెద్దాపురం : షణ్ముఖి వీరరాఘవ కవి
-------------------------------------------
శర్మ కాలక్షేపంకబుర్లు - భట్టువారి రావిచెట్టు నుండి సంగ్రహించబడినది

పెద్దాపురం సంస్థానాన్ని శ్రీశ్రీశ్రీ శ్రీవత్సవాయి తిమ్మ జగపతి ప్రభువుగా పరిపాలిస్తున్నకాలం. శ్రీవారి సంస్థానం లో నవరత్నాలుగా కవులు ఉండేవారట, 

కళలకు కాణాచి పెద్దాపురం.
ఆ నవరత్నాలలో అప్పటికే వృద్ధులైన శ్రీ షణ్ముఖి వీరరాఘవ కవిగారొకరు,
వీరిని ప్రభువు తాతగారు అని సంబోధించేవారట, ఇతరులు భట్టువారనేవారు..
రాజ్యం సుభిక్షం కాని ప్రభువులకొకటే చింత, సంతాన భాగ్యం లేకపోవడం. రాజదంపతులను పీడిస్తున్న బాధ, ఇది గమనించిన రామ మంత్రోపాసకులైన కవిగారు మండల కాలం దీక్షవహించి, తదుపరి రాజదంపతులను పుత్రుడు కలిగేలా ఆశీర్వదించేరు.
రాజదంపతులకు మగబిడ్డ కలిగేడు, ఆ శుభ సందర్భం లో రాజదంపతులు కవిగారికి నూరు ఎకరముల భూమిని బహుమతిగా, కవిగారి స్వగ్రామం అనపర్తిలో, ఊరికి పశ్చిమంగా ఒక కిలో మీటర్ దూరంలో,పట్టా ఇచ్చారు. ఈ పొలం మధ్యలో కవిగారొక రావి మొక్క నాటారు, రాక్షస నామ సంవత్సరంలో, 17వ శతాబ్దంలో. కవిగారు గతించారు కాని రావిచెట్టు పెరుగుతోంది.
తెల్ల దొర : కాటన్ మహాశయులు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ పనులలో బాగంగా చెట్టు పడగొట్టాల్సివచ్చింది. కానీ కవి గారి వంశీయులు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు
పూర్తి స్టొరీ కొరకు మీ వంగలపూడి శివకృష్ణ
https://plus.google.com/+vangalapudisivakrishna/posts

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

KASEE BATTA BRAHMAYYA SASTRI బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ


మన పెద్దాపురం సంస్థాన చరిత్రము : బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి
-----------------------------------------------------------------------
పెద్దాపురం సంస్థాన చరిత్రము ను విమర్శనాత్మకంగా రచించిన వారిలో విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు ఒకరు
1785 నాటికి పెద్దాపురం రాజ్యము అటు తోటపల్లి నుంచి ఇటు నగరం వరకు మొత్తం 585 గ్రామాలు మరియు పట్టణములతో విరాజిల్లింది అన్న విషయం నా ఇది వరకటి పోస్ట్ ల ద్వారా మీ అందరికీ తెలిసిందే
బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు .
తుని రాజా (పెద్దాపురం సంస్థానం లోని బాగం) వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు పెట్టించి శాస్త్రి గారి కుటుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత తమ’’ పెద్దాపురం సంస్థాన చరిత్ర ‘’రాయించి వెయ్యిన్నూట పదహారు రూపాయలు బహుమానంగా సమర్పించారు .ఇందులో శాస్త్రిగారి లోతైన చారిత్రిక అవగాహన ,పరిశీలనా ద్రుష్టి వ్యక్తమవుతుంది.
మీ వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...