Tuesday 20 October 2015

పెద్దాపుర సంస్థాన ఆదాయం PEDDAPURA SAMSTHANAM BORDERS, INCOME, TRADITION AND CULTURE

పెద్దాపుర సంస్థాన సరి హద్దులు - ఆదాయం - పరిణామక్రమం 



పెద్దాపురం ప్రాచీన ఆంద్ర దేశము లో పురాతన సంస్థానములలో ఒకటి. ఇంచుమించు ఐదు వందల ఏళ్ల పూర్వ చరిత్ర కలది.

గోదావరి మండలము లోని చాలా భాగము,
కృష్ణా - గుంటూరు మండలాలలోని కొంత భాగము,

విశాఖ పట్టణం లోని కొన్ని గ్రామాలు అయిన తోటపల్లి, రంప , చోడవరం, మొదలగు మన్యం ప్రాంతాలు ఒకప్పటి పెద్దాపురం సంస్థానములోనివి.

సంస్థానములోని ముఖ్య పట్టణం అయిన "పెద్దాపురం" తూర్పు గోదావరి జిల్లా లో రాజ మహేంద్రవరం (ఇప్పటి రాజముండ్రి) కి ఈశాన్య దిక్కు గా పది కోసుల దూరంలో (కోసు = ఇంచుమించు 3.1/2 కిలో మీటర్లు) ఉన్నది.

1803 సంవత్సరం నాటికి పెద్దాపురం సంస్థానం ఆదాయం పది లక్షలు.



సాలు సరి పేష్కషు సాలుసరి పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఆరున్నర లక్షలు.

అంత పెద్ద సంస్థానం కాలక్రమంలో చిన్న చిన్న భాగాలుగా విభజించబడి చివరికి కొట్టాము, తుని ఎస్టేటు గా మారిపోయి, ఆ తరువాతి కాలంలో ఆంద్రప్రదేశ్ రాష్త్రం లో అంతర్భాగం అయ్యిపోయింది.


రాజా వేంకట సూర్య నారాయణ జగపతి రాజు గారి పేర నమోదయినటువంటి కొట్టాము ఎస్టేటు యొక్క రాబడి రెండున్నర లక్షలు పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఇరవై ఆరువేల నూట డెబ్బై మూడు రూపాయలు కొట్టాము ఎస్టేట్ యొక్క ముఖ్య పట్టణం తాండవ నది ఒడ్డున ఉన్న తుని. Ref : కిమ్మూరు కైఫీయతు https://plus.google.com/+vangalapudisivakrishna/posts

https://archive.org/details/kimmurukaifiyatu00unknsher

పెద్దాపురం సంస్థాన పాలకులు ఇంటి పేరు వత్సవాయి - RULERS OF PEDDAPURAM VATSAVAYI DYNASTY AND THEIR HORIZEN





' పెద్దాపురం సంస్థాన పాలకులు ఇంటి పేరు వత్సవాయి'


పెద్దాపురం సంస్థాన పాలకులు పూర్వము ఉత్తర దేశము నుండి వలస వచ్చి, గోదావరి, నెల్లూరు, కృష్ణా, విశాఖపట్టణం మండలాలలో స్థిర పడిన క్షత్రియ కుటుంబాలలో ఒక కోవకి చెందినవారు.




వీరిలో మందపాటివారు - వత్సవాయి వారు అని రెండు వర్గాల వారు ముఖ్యులు.


కాశ్యపస గోత్రానికి చెందిన మందపాటి వారు ఒంగోలు లోనూ, వశిష్ట గోత్రానికి చెందిన వత్సవాయి వారు పెద్దాపురం లోనూ పాలకులుగా ప్రసిద్ధి చెందారు. వత్సవాయి వారు సూర్య వంశోద్భావులగు ఆంధ్రక్షత్రియులలో మిక్కిలి గొప్పవారు. వీరి మూల పురుషుడు దుర్జయుడని, గుడిమెట్ల సాగిపోతరాజు వీరి పూర్వులలో ఒక్కడని. వీరి ముని మనమడు (మనవడు కి మనవడు ) అయిన వత్సవాయి శ్రీ రామ రాజు గారు కాలమున వత్సవాయి అనే గ్రామ వీరి రాజ్యానికి రాజధాని అవడం చేత వీరి ఇంటి పేరు వత్సవాయి అయ్యిందని తెలుస్తున్నది *
                                                                                                                     మీ వంగలపూడి శివకృష్ణ

చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు - CHATHURBUJA TIMMARAYA JAGAPATHI BAHADDARU (1555 - 1607) PEDDAPURAM

పెద్దాపుర సంస్థాన చరిత్రము : చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు

                                తిమ్మరాజు గారి కాలం పదునాల్గవ శతాబ్దం ఉత్తరార్ధం (1555-1607)


శ్రీ రాజా వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు సంస్థాన సంపాదకులు. ఆయన పరిసర ప్రాంతాలలో ఉన్న పాలకులు అందరినీ ఓడించి రాజ్యమును విస్తరింప చేసి పెద్దాపురం లో ఒక కోటను నిర్మించారంట.

తండ్రి శ్రీ వత్సవాయి పేర రాజు గారు, తల్లి గొట్టుముక్కల వారి ఆడపడుచు నారమాంబ గారు.

'తిమ్మరాజ శిఖామణి తేజరిల్లె
నతని కీర్తి నటించు శీతాద్రిసేతు
మధ్య పృధ్వీశ్వరాస్థాన మంటపములు'

- రామ విలాసము, అవతారిక, పు. 21.

ఆనాటి సుబేదారైన షేర్ మొహమ్మద్ ఖాన్ చతుర్బుజ తిమ్మ రాయ జగపతి బహద్దరు గారి యొక్క వీరోచిత కార్యాలను మెచ్చి ఒక కత్తి ని బహుమానం గా ఇచ్చాడట.

' షేరు మొహమ్మదు క్షీతిప శేఖరుఁ డద్భుత శౌర్య ధైర్య దు
ర్వారుఁడు మెచ్చి పైడిఁయొఱవాల్దన కేల నొసంగు వేళ దై
త్యారిసమానమూర్తి తన హస్తము మీఁ దుగ నందె వార్దిగం
భీరుఁడు వత్సవాయికుల పేరయ తిమ్మనృపాలుడుఁన్నతిన్’ - పైది, పు. 23.

విజయ నగర మహారాజు శ్రీ విజయరామరాజు గారు వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారి వీరత్వాన్ని వర్ణిస్తూ రచించిన చాటువు





ఆంభోజం కలయం సదృక్ష మవనే సాహిత్యరీత్యామ్ దృశో
ర్మాంధా తార మపార సంపది మహా బావే యశో రాశిషు
శత్రూణాం పురభంజనే దృతి గుణేకిం చోరగేంద్రంమతి
ప్రాగాల్భ్యే ప్రతిధాతి తిమ్మ నృపతిః పాకాహిత ప్రాభవః - విజయరామరాజు చాటువు


-------------------------------------------------------------- మీ వంగలపూడి శివకృష్ణ


https://plus.google.com/+vangalapudisivakrishna/posts

Monday 19 October 2015

వడ్ల గింజలు - SRI PADA SUBRAMANYA SASTRY

మన పెద్దాపురం - వడ్ల గింజలు   శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి గారు 



మన పెద్దాపురం - వడ్ల గింజలు కథని ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి గారు రచించారు. ఈ కథ 1941 సంవత్సరం ఆంధ్రవారపత్రిక లో ప్రచురించబడింది. శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి కథలు రెండవ సంపుటంలో ఈ కథను మరి కొన్ని మంచి కథలతో పాటూ మళ్ళీ ప్రచురించారు. కథలో వెళ్ళే ముందు రచయిత గురించి తెలుసుకొందాం.
రచయిత పరిచయం
శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు ఏప్రిల్ నాలుగవ తేది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిష్యం, ధర్మ శాస్త్రాలను అభ్యసించి అవధానాలు కూడా చేసారు. వీరు పిఠాపురం సంస్థాన కవులు శ్రీ వేంకట రామకృష్ణ కవి గారి శిష్యులు. శ్రీపాద గారు సుమారు 75 కథలు వ్రాసారు. ఇంకా నాటకాలు, రేడియో నాటికలు, నవలలు, పద్య రచనలు కూడా చేసారు. శ్రీపాద గారి సాహిత్య సేవకు 1956 లో కనకాభిషేకం జరిగింది.
కథ
తణుకుకి చెందిన తంగిరాల శంకరప్ప చదరంగంలో దిట్ట. పెద్దాపురం మహరాజు దర్శనం కోసం శంకరప్ప కోటకు చేరుకుంటాడు. పేద బ్రాహ్మడయిన శంకరప్పకి కోటలోకి ప్రవేశం లభించదు. ఠానేదారు, దీవాంజీలు శంకరప్పకి కోటలోకి అనుమతి లభించకుండా అడ్డుపడి వీధిలోకి గెంటేస్తారు. దిగులుతో సత్రానికి చేరుకున్న శంకరప్పని చూసి పేదరాసి పెద్దమ్మ ఓదారుస్తుంది. మహరాజు దర్శనం సంపాదించడానికి ఉపాయం చెప్తుంది. ముందు పట్టణంలో పేరు తెచ్చుకుని తద్వారా మహరాజు దర్శనం సంపాదించమని హితబోధ చేస్తుంది. శంకరప్పకి జ్ఞానోదయం కలిగి ఊరి మీద పడతాడు.
అంచెలంచలుగా పెద్దాపురంలోని చదరంగ ప్రావీణ్యులనందరినీ ఓడించి, తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఊరిలో శంకరప్ప పేరు మారు మ్రోగుతుంది. ఈ వార్త చివరికి మహరాజుని చేరి, శంకరప్ప గురించి వాకబు చేస్తాడు. శంకరప్ప చదరంగ ప్రావీణ్యం గురించి తెలుసుకుని తనతో ఆడవలసిందిగా కబురు పంపుతాడు.పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని శంకరప్ప పల్లకీలో కోటకు వెళ్ళి మహరాజుతో చదరంగం ఆడడానికి సిద్ధపడుతాడు. ఆటలో తను గెలిస్తే చదరంగంలో మొదటి గడిలో ఒక వడ్ల గింజ, రెండో గడిలో రెండు వడ్ల గింజలు, మూడో గడిలో నాలుగు వడ్ల గింజలు ఇలా చదరంగంలోని అన్ని గడులలో గింజలు రెట్టింపు చేసుకుంటూ ఇవ్వాలని కోరుతాడు.
చదరంగం ఆటలో మహరాజు శంకరప్పని ఓడించాడా? లేక శంకరప్ప గెలిచి తను కోరుకున్న వడ్లగింజలని రాజు దగ్గర నుండి అందుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే!
శ్రీపాద గారు కథలని నడిపించే విధానం చాలా బాగుంటుంది. మామూలుగా ప్రతి కథలో, నవలలో, నాటికలో రచయిత అపుడపుడూ మన ముందుకు వచ్చి కథ ఉద్దేశం చెప్తూ ఉంటారు. శ్రీపాద గారి కథలలో పాత్రలు మాట్లాడుకుంటూ కథని చెప్తూ ఉంటాయి. మాటలు ఎక్కడా ఆగవు, కథతో పాటూ మాటలు కూడా ఆగుతాయి. ఈ మాటలు కూడా వేగంగా తూటాల్లాగా పేలుతూ వెళ్ళిపోతాయి.
కథలో శంకరప్ప ప్రధానంగా నాలుగు, అయిదు ఆటలు ఆడుతాడు. ముందుగా వీధి అరుగులో ఆడుకుంటున్న ఒక ఇద్దరు చిన్న తరహా ఆటగాళ్ళయిన శాస్త్రి, యాజులుతో మొదలుపెట్టి చేయి తిరిగిన పోటుగాళ్ళతో ఆడే విధానం శ్రీపాద గారు మనకి కళ్ళకి కట్టినట్టు చెప్తారు. ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళే కొద్దీ ఆట కూడా వారి తరహాలో, వారి అంతస్థుకి తగినట్టు వారి ఇళ్ళు, భవనాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాన్ని మనం బాగా దగ్గరగా చూడగలం ఈ కథలో. మూడు, నాలుగు ఎత్తుల్లో ఆట ముగించేసరికి శాస్త్రి, యాజులు శంకరప్పకి ప్రియ శిష్యులయిపోతారు. అప్పటినుండీ చివరివరకు గురువుగారిని అంటిపెట్టుకునే ఉంటారు.
రాజనర్తకి రంగనాయకి తన విటుడుతో ఆడే ఆటలో శంకరప్ప ఇంటి బయట నుండి గోడ చాటుగా వారి మాటలు వింటూ వారి ఆటలో పాల్గొనే సన్నివేశం చాలా ఆసక్తిగా ఉంటుంది. శంకరప్ప ఆటే కాదు, మాటలు కూడా పదునుగా ఉంటాయి. ఈ మాటలు పౌరుషంలో కోటలు దాటే విధంగా ఉంటాయి. దాట్ల అప్పల నరసింహారాజు గారి మేనల్లుడు విజయరామరాజుతో ఆడేముందు అతిథులకి మర్యాదలు, ఆడేటపుడు సపర్యలు అప్పటి కాలం రాచమర్యాదలని మనకి మళ్ళీ గుర్తు చేస్తాయి. ఆటలో శంకరప్ప ఏకాగ్రతకి భంగం కలిగించడానికి అతని పక్కన ఇద్దరు చక్కని చుక్కలని కూర్చుని తాంబూలం అందిస్తూ ఉంటారు. మహరాజుతో ఆడేటపుడు కూడా ఇంకొంచెం పెద్ద మోతాదులో ఈ మర్యాదలు ఉంటాయి. మహారాజుతో ఆట హోరాహోరీగా ఆరు నెలలపాటూ సాగడం, ఆట మధ్యలో వీరిద్దరి సంభాషణ మనల్ని బాగా ఆకట్టుకుంటాయి.
చివరగా వడ్లగింజల వరం కోరిక చదువుతూ ఉంటే మనకి సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో మీనా కోరిక గుర్తుకు వస్తుంది. ఆ కోరికకి స్పూర్తి మన వడ్లగింజలు కథ నుండే అన్నమాట!












Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...