Monday, 2 January 2017

HELP POOR DONATE POOR - LET US SEE THE BEGGERS LESS SOCIETY @ PEDDAPURAM

పెద్దాపురం- వంగలపూడి శివకృష్ణ
ఈ నూతన సంవత్సరాన్ని 
రోడ్డు మీద నిద్రించే అభాగ్యులతో జరుపుకుందాం రండి 
ఇరగ కాసే ఎండలోనూ రోడ్డు మీదే వారి జీవనం 
ఎముకలు కొరికే చలిలోనూ రోడ్డుమీదే వారి జీవనం
ఎండకు_ఎండుతూ ... చలికి_వణుకుతూ... 
వీధిలలో నిద్రించే అభాగ్యులతో ...
గత ఎనిమిది సంవత్సరాలుగా
నూతన సంవత్సారాన్ని జరుపుకుంటున్నాం...
ప్రతీ సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వారికి  ఆహరం, బట్టలు, దుప్పట్లు పంచుతూ నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకోవడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ



LET US WELCOME THIS NEW YEAR PURELY @PEDDAPURAM

పెద్దాపురం : #మద్యపాన రహిత సమాజం కోసం భారీ ర్యాలీ
#పాశ్చాత్యసంస్కృతి ప్రభావంతో నేటియువత నూతన సంవత్సరాన్ని మద్యం మత్తులో ఆహ్వానిస్తుండాన్ని నిరశిస్తూ... ది. 30.12.2016 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక పెద్దాపురం వెంకటేశ్వర స్వామి గుడినుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకూ... భారీ ర్యాలీ నిర్వహించారు
SFI, జన విజ్ఞాన వేదిక, ఐద్వా , డి వై ఎప్ ఐ, ప్రజానాట్యమండలి,ఉపాధ్యాయ సంఘం,
మన పెద్దాపురం పేస్ బుక్ గ్రూపులు సంయుక్తంగా మరియు మద్యపాన రహిత సమాజాన్ని ఆకాంక్షించే అందరూ కలసికట్టుగా
#వెంకటేశ్వరస్వామి వారి గుడి వద్దనుండి #మునిసిపల్_సెంటర్ వరకూ నడిచి...
మునిసిపల్ కార్యాలయం వద్ద మానవహారం గా ఏర్పడి మద్యం వల్ల ఏటా అనేక కుటుంబాలు చిద్రమైపోతున్నాయని ఇది చాలా భాదాకరమని... మరీ ముఖ్యంగా యువత పాశ్చాత్య పోకడలు పోతూ... మద్యం సేవించి వేగంగా వాహనాలు నడుపుతూ... రోడ్డు ప్రమాదాల భారిన పడుతుండడం విచారించదగ్గ విషయం అని ఆయా సంఘాల నాయకులు వాపోయారు... మద్య రహిత దేశం త్వరలోనే రావాలని ఆకాంక్షించారు...






- వంగలపూడి శివకృష్ణ

PEDDAPURAM SPORTS AND SPORTS PERSONALITIES

పెద్దాపురం - వంగలపూడి శివకృష్ణ

2016 లో మన పెద్దాపురం క్రీడాకారులు అనేక క్రీడంశాలలో, ఎన్నో విజయాలతో జయకేతనం ఎగురవేశారు. సరయిన ప్రోత్సహాలు సదుపాయాలు లేకున్నా, మన పెద్దాపురం క్రీడాకారులు రెట్టించిన ఉత్సహంతో తలెత్తుకుని నిలబడ్డారు.
పట్టణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలలో మన క్రీడాకారులు ప్రతిభ కనపరిచారు.
క్రికెట్ లో స్టీఫెన్,
టెన్నిస్ లో ముప్పన సూర్య ప్రకాష్,
షటిల్ లో మహేష్, కరీముల్లా
చదరంగం లో ముప్పన జ్ఞాన సాయి సంతోష్
హెమ్మర్ త్రో లో ఓం నమశివాయ
హై జంప్ లో పెదకామరాజు
కరాటే, ఫుట్ బాల్ లో శ్రీనివాస్ రాజ్
రోప్ స్కిప్పింగ్, అథెలిటిక్స్ లో సిద్దార్థ
బాడీ బిల్డింగ్ లో మౌనింద్ర
ఇలా ఇంకా అనేక మంది క్రీడాకారులు.

రాబోవు 2017 లో మన క్రీడాకారులకు మరింత ప్రోతాహం లభించి, మన పెద్దాపురం నుంచి మరింతమంది క్రీడాకారులు ముందుకు రావాలని, మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటూ, అందరికి All the Best & Wish you a Happy New Year. - BY Peddapuram Chess










SAY NO TO ALCOHOL @PEDDAPURAM


మద్యానికి బానిసై నిండు జీవితాల్ని నాశనం చేసుకుంటున్న వారికోసం మద్యం వద్దు - మంచినీళ్లు ముద్దు - తాగి తందనాలాడద్దు - జీవితాల్ని మద్యం రాక్షసికి పణంగా పెట్టద్దు అంటూ ర్యాలీ చేసాం

MAKING PLANTATION WITH THE POOR @PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
Help the Poor and Made them Plantation మేము బొగ్గు బాలాజీ కుటుంబానికి సహాయం అందించాం... వారు మా ఋణం తీర్చుకోలేనిది కన్నీటి పర్యంతమయ్యారు ... మా ఋణం తీర్చుకునేదానికి బదులుగా  వారిని మొక్కను నాటమని అది పెరిగి  పెద్దయ్యే వరకూ సంరక్షించామని అభ్యర్ధించాం
బొగ్గు బాలాజీ గారి ఇద్దరి పాపలతో వాళ్ళ ఇంటి ముందు మొక్కలు నాటించిన మన పెద్దాపురం గ్రూప్ సభ్యులు 



Mana Peddapuram Fan Made Video



పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

A POOR FAIMILY FROM PEDDAPURAM HELPED BY MANA PEDDAPURAM FACEBOOK TEAM AND EENAADU PAPER

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

నిరుపేదకు శాశ్వత గూడు
ధన్యవాదాలు .... #ఈనాడు
#దాతలందరికీ ధన్యవాదాలు ... #కృతజ్ఞతలు శ్రీ రాజా సూరిబాబు రాజు గారు... శ్రీ బొడ్డు బంగారుబాబు గారు... వేముల రాము గారు.... #బొగ్గు బాలాజీ కుటుంబ శాశ్వత నివాసానికి గృహ ప్రవేశ కార్యక్రమానికి మంచి మనసుతో కొబ్బరికాయ కొట్టి జ్యోతి ప్రజ్వలన చేసి మొదలుపెట్టినందుకు...
ఎదో చేసాం లే అన్నట్టుగా కాకుండా ఒక కుటుంబం పూర్తిగా నిలబడే వరకూ అండదండగా ఉన్న వారికీ.. అలాగే ఆ కుటుంబానికి జరిగే ప్రతీ సహాయాన్ని అభినందించి.... మమ్మల్ని మరియు దాతల్ని ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతాభి వందనాలు _/\_

ఇది అక్షరాలా... అక్షర విజయం... #ఈనాడు #మనపెద్దాపురం అక్షరాలు సాధించిన అద్భుత విజయం అక్షరాల ప్రేరణతో కదిలొచ్చిన సహాయం
అక్షరరూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక (కాళోజీ)
వందటన్నుల ఉపన్యాసాల కన్నా ఒక ఔన్సు ఆచరణ మేలు & ప్రార్థించే పెదవులకన్నా సాయంచేసే చేతులు మిన్న ... ఈ సూక్తులు/సామేతలు ఎంత మందిని కదిలించించాయో... కదా !
నీతులు... సామేతలు... ఆణిముత్యాల్లాంటి అక్షరాలతో నిండు జీవితానికి నీడనిచ్చిన #ఈనాడు వారికి... #మనపెద్దాపురం పేస్ బుక్ గ్రూపుకి
వీరితోపాటూ #బొగ్గుబాలాజీ అంశాన్ని భుజానికెత్తుకొని అండగా నిలిచిన అన్ని ఇతర ప్రింట్, సోషల్ మీడియాల అక్షరాలకు... వ్యక్తులకు... మన పెద్దాపురం గ్రూపు సభ్యులకు... ఆర్థిక సహాయం అందించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు... BY VANGALAPUDI SIVA KRISHNA - PEDDAPURAM

FIGHTING FOR QUIT BLACK ASH FROM PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

PLEASE RESPOND & SHARE THIS POST UNTILL
#QUIT_BLACK_ASH From #PEDDAPURAM_CONSTITUENCY
ఏమిటి ఈ బూడిద భూతం - ఇంకెన్నాళ్లీ. దురాగతం
మా కళ్ళల్లో నల్లని కుళ్ళు - పోస్తారే పాపిస్టోళ్లు .... !
మా వినతులు.. విజ్ఞాపనలు.. కన్నీళ్లతో అభ్యర్ధనలు
నిమ్మకు నీరెత్తనట్లుగా - అస్సలు వినరెందుకు వీళ్ళు ... ?
నల్ల బూడిద వెనుక ఉన్న - తెల్లని ఆ చొక్కాలు ఎవరు ... ?
సామాన్యుడి సహనం చచ్చి పోతే - బతికిబట్ట కట్టేదెవరు ?
దాదాపు సంవత్సర కాలంగా ఎడతెగని పోరాటాలు .... అనేక మార్లు అధికారులకి వినతులు ... మన పెద్దాపురం గ్రూప్ ద్వారా కలక్టరు, జాయింట్ కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇమెయిల్ అభ్యర్ధనలు... ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో వరుస కధనాలు... పురపాలక సంఘం కౌన్సిల్ మీటింగ్ లలో తీవ్రమైన చర్చలు ... నియంత్రణా చర్యలు చేపట్టకపోతే కఠిన చర్యలు... అంటూ అధికారుల ఆజ్ఞలు ఆదేశాలు... ధర్నాలు రాస్తారోకో లతో ప్రజా సంఘాల ఆందోళనలు ....
అయినా కూడా #ప్యాక్టరీల_యాజమాన్యాల నుండి వీసమెత్తు చలనం రావడం లేదంటే దీనిని ఎలా అర్ధం చేసుకోవాలో కూడా అర్ధం కావడం లేదు... ఏమి చేద్దాం అందరూ దయచేసి స్పందించండి మిత్రులారా...

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...