Friday 20 January 2017

PLEASE DON'T CRITICIZE PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర - వంగలగోరుచుట్టు పై రోకలి పోటు --- పెద్దాపురానికి పైశాచికత్వపు వేటు
పెద్దాపురం పరిచయమే అక్కరలేని ఊరు.... !
ఇక్కడ గొప్ప విద్యావంతులున్నారు ---విప్లవ కారులున్నారు .......
సామాజిక కార్యకర్తలున్నారు --- కళాకారులున్నారు........
శిల్పులున్నారు --- శాస్త్రవేత్తలున్నారు ........
అత్యంత ప్రతిభావంతులు ఎందరో వున్నారు అంతకుమించి సర్వమత సామరస్యానికి ప్రతీక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ల సఖ్యత వుంది …… ప్రఖ్యాత దేవాలయాలున్నాయి ..... వెరసి 500 చరిత్ర ఉంది.... ! కానీ ఈ ప్రపంచానికి వాటితో పనిలేదు…. గురువింద గింజ తనక్రింద నలుపెరుగని చందం గా వీరికి ఎదుటి వారి జీవితాలలోని చేదు జ్ఞాపకాలను వెలికితీసి మరిచిపోయిన గాయాలను మరలా రేపి
పెద్దాపురం విధ్యాపురం గా పరిణితి చెందుతున్న దశలో కూడా ఈ ముష్కరులు వేశ్యాపురం గా ముద్ర వేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ బవిష్య యువత కూడా మాది పెద్దాపురం అని చెప్పుకోవడానికి తడబడేలా చేస్తున్నారు శరీరం లో అణువణువూ విషం నిండిన కొందరు సన్నాసులు.
ఇలాంటి వారితో మేము (పెద్దాపురం వాసులు ) వాగ్వివాదానికి దిగిన సందర్బాలెన్నో ... అలాంటి సందర్బమే ఒకసారి మా బందువు ఒకాయనతో ఎదురైతే……
అతని వ్యంగ్యానికి వికారానికి తట్టుకోలేక సహనం కొల్పోయి " అసలు వేశ్య లే లేని ఊరు ఉందా….. మీ ఊరి లో అందరూ ప్రతీవ్రతలేనా… అవును మా వూరిలో వూరికి చివర ఒకచోటే వుంటారు .... కాని మీకు వీధి వీధి కి ఒక్కరిద్దరు వుంటారు ….పోయి మీ ఇల్లు ఎలా నడుస్తుందో చూసుకోవయ్యా .
" అంటూ చెడా మడా ఇచ్చేశాను… దెబ్బకి అతను అందరిముందూ తల దించుకుని లోపలి వెళ్ళిపోయాడు (ఆ తరువాత ఆ విషయం తెల్సుకున్న మా అమ్మ నాకు బాగా ఇచ్చింది అనుకోండి అది వేరే విషయం )
ఏది ఏమైనప్పటికీ
మా వూరు పేరు పెద్దాపురం అని చెప్పుకోవడానికి ఎన్నడూ సిగ్గుపడను వెనక్కు తగ్గను....
............................................... .............................మీ వంగలపూడి శివకృష్ణపూడి శివకృష్ణ

KANNADA MOVIE APTHAMITRA ABOUT PEDDAPURAM

మన పెద్దాపురం వేశ్యాపురం కాదు : కళా వంతుల నిలయం దయచేసి వీడియో చూడండి 


-----------------------------------------------------------------------------------------
వేశ్యాపురంగా మనమే మార్చేసాం : 
=====================
@ పొరుగు రాష్ట్రాల చరిత్రలలో,… కధల్లో,…. ఇతిహాసాల్లో,…. మాటల్లో,… పాటల్లో,.... నాటకాల్లో,… చలనచిత్రాల్లో…. మన పెద్దాపురం నాట్య కళాకారిణి ల నిలయం…. @ స్వరాష్ట్రస్తులు సైతం .. నిస్సిగ్గుగా మా పెద్దాపురాన్ని వేశ్యా పురంగా చిత్రీకరిస్తుంటే పెద్దాపురం అసలు స్వరూపానికి అద్దంపట్టిన అత్యుత్తమ సన్నివేశాన్ని ఆంధ్రా ప్రజలకు అందించిన ప్రముఖ కన్నడ దర్శకులు పి. వాసు గారికి ధన్యవాదాలు !
================================
ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಮಹತ್ತರವಾದ ನೆರವು - ನಾವು (our peddapuram people) ಯಾವಾಗಲೂ ಮರೆಯಬೇಡಿ.... @ Thank you Sir @ మీ వంగలపూడి శివకృష్ణ @


పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

CHADALADA TIRUPATHI - THORLI TIRUPATHI HISTORY

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ


తొలితిరుపతి - - మనపెద్దాపురం - చదలాడ తిరుపతి
శృంగార వల్లభుని - స్వర్ణ రథ కాంతి
తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి
అయితే తూర్పు గోదావరి జిల్లాలోని మన పెద్దాపురం లోనే తిరుపతి వుందని
అదే తొలితిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు .. మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుందని ) చాలా మందికి తెలియదు.
విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ..
స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి
ఆలయ చరిత్ర :
--------------
ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో
ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.
అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా
ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.
ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట.
అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట
ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట
స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)
ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం)
ఆలయ విశిష్టత :
------------------
1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం )
2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది )
3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి
4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి.
5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది.
6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ
కార్యక్రమాలు - పూజా విధానం :
-------------------------------
1) నిత్య ధూప దీప నైవేద్యం
2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం
3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు
4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు :
----------------------------------------------------
బోజమహా రాజు
బట్టీ విక్రమార్క
రాణీ రుద్రమదేవి
శ్రీ కృష్ణ దేవరాయలు
పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు
లక్ష్మీ నర సాపురం రాజులు ( లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి .. బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు )
https://plus.google.com/+vangalapudisivakrishna/posts
వంగలపూడి శివకృష్ణ

PEDDAPURAM MANDAL KANDRAKOTA NOOKALAMMA HISTORY

మన పెద్దాపురం లోని కాండ్ర కోటని కన్నులారా చూతము రారండి
------------------------------------------------------------------
దయచేసి పూర్తిగా చదివి షేర్ చెయ్యండి.https://plus.google.com/+vangalapudisivakrishna/posts
పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్లు (గుడివాడ, సిరివాడ ల మీదుగా స్వచ్చమైన పల్లెటూరి వాతావరం దారి పొడవునా రోడ్దుకిరువైపులా చెట్లు, చెట్లకి అవతల పచ్చని పంట పొలాలు..... వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు, రవాణాకి వాడుతున్న ఎద్దుల బండ్లు. వూరి మద్యలో రామాలయం - రామకోవెల (రాంకోలు) మీద అష్టా చమ్మా ఆడుతూ పిల్లలు ... దృశ్య శ్రవణ యంత్రం (టెలివిజన్ - టివి ) వీక్షిస్తున్న వృద్దులు, పెద్దలు... ఊరంతా కల్మషం లేని మనుసులు.ఆ మనుషులని కంటికి రెప్ప లా కాపాడే నూకాలమ్మ అమ్మవారు)
వెరసి కనీసం ఒక్కసారైనా కాండ్రకోట ని కన్నులారా చూడవలసిందే ....................
కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడట అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపం లో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతు ని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారట అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధం లో ఓడిపోయారట !
ఆతని ఓటమి తరువాత ప్రజలపై కిమ్మేరుని పైశాచిక చర్యలు పెచ్చుమీరాయంట (అధికమయ్యాయి) ! ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తి ని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడట. ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశ ల లోని ఒక అంశ ను ధర్మకేతు మహారాజు తో పాటూ పంపిందట. ఆ యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు - స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి - వధించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడట
ఆ ఆది పరాశక్తి అంశే "నూకాలమ్మ అమ్మవారు" యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించినాడు -
అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మ గా ... కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా కొలువు తీరినారు .
పాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవం గా కన్నుల పండుగ గా జరిగే ఈ జాతరకి ఆంద్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రజలు తండోప తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు.
జాతర సమయంలో గ్రామస్తుల తో పాటుగా శ్రీ గీతా శివభక్త యువజన సంఘం దేవాలయ సందర్శకులకు - చిన్నపిల్లలకు విశిష్ట సేవలు అందించడం అబినందనీయం. బచ్చు ఫౌండేషన్ వారు కాండ్రకోట గ్రామాన్ని గ్రామంలోని విద్యాలయాలను అభి వృద్ధిపరచిన తీరు బహు ప్రశంసనీయం.
ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించాలని ఆశిస్తూ
మీ వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

PEDDAPURAM HISTORY - SRI RAJA VATSAVAYA RAYA JAGAPATHI

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం సంస్ధానం చరిత్ర : శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి మహా రాజు

==================================
ఆంధ్ర గీర్వాణ బాషా కోవిదుడు
బహు శాస్త్ర విశారదుడు
ఉభయ బాషా కవి
వైఘాన ధర్మ చంద్రికాది గ్రంధ కర్త
శ్రీ రామ భక్తుడు
అస్మత్ ఆధ్యాత్మిక గురువరేణ్యుడు...... అయినటువంటి మా తాతయ్య గారు
శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి మహా రాజు గారికి ---------------------- మరియు
స్త్రీ ధర్మ పరిపాలకురాలు
సాధ్వీ మణి అయిన మా చిన్నమ్మ (బాబయ్యమ్మ)
శ్రీమతి బుచ్చియ్యంబా దేవి గారికి ..................................
తల్లి లేని నాకు ఆ లోటు తెలియకుండా ఎంతో ప్రేమతో పెంచి విద్యా బుద్దులు నేర్పి నా ఎదుగుదలకు కారణమై - నన్ను ఇంత ఉన్నత స్థితి కి తీసుకు వచ్చినందుకు కృతజ్ఞతతో ఈ గ్రంధం ను మీకు సమర్పిస్తున్నాను. - వత్సవాయి రాయ జగపతి వర్మ గారు
పూర్తి చరిత్ర కోసం క్రింద లింక్ చూడండి
https://plus.google.com/+vangalapudisivakrishna/posts

ENUGU LAXMANA KAVI PEDDAPURAM SAMSTHANAM

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
మన పెద్దాపురం : ఏనుగు లక్ష్మణ కవి
--------------------------------------
ఏనుగు లక్ష్మణ కవి గారు జన్మస్దలము పెద్దాపురము.
ఈయన క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు. 
ఏనుగు లక్ష్మణ కవి గారి తల్లిగారి పేరు పేరమాంబ, మరియు తండ్రిగారి పేరుతిమ్మకవి.
శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాతగారు"శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు".ఈయన ఒక ఏనుగును పోషించెవాడు.దానిని ఈయనకు పెద్దాపురం సంస్థాన పాలకులు బహుమతిగా యిచ్చారు.
అందుచే కాలక్రమేన వీరి యింటిపేరు ఏనుగు వారిగా స్దిరపడినది.
శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ద కవి' కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి, లక్ష్మణ కవి గారి సమ కాలికుడు. లక్ష్మణ కవి గారు, భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రి శతిని" తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీదఅనువాదం చేసినాడు.
సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు.
భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు
1. ఏనుగు లక్ష్మణ కవి
2. పుష్పగిరి తిమ్మన
3. ఏలకూచి బాల సరస్వతి. వీటన్నింటిలోను మిక్కిలి ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.
ఏనుగు లక్ష్మణ కవి గారి భర్తృహరి సుభాషిత నుండి
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.
ఏనుగు లక్ష్మణ కవి గారి యితర రచనలు
1.రామేశ్వర మహత్యము.
2.రామ విలాసం
3.సూర్య శతకము.
4.లక్ష్మీనరసింహ శతకము.
5.గంగా మాహాత్మ్యము

BATTUVAARI RAVI CHETTU A SMALL STORY ABOUT PEDDAPURAM

మన పెద్దాపురం : షణ్ముఖి వీరరాఘవ కవి
-------------------------------------------
శర్మ కాలక్షేపంకబుర్లు - భట్టువారి రావిచెట్టు నుండి సంగ్రహించబడినది

పెద్దాపురం సంస్థానాన్ని శ్రీశ్రీశ్రీ శ్రీవత్సవాయి తిమ్మ జగపతి ప్రభువుగా పరిపాలిస్తున్నకాలం. శ్రీవారి సంస్థానం లో నవరత్నాలుగా కవులు ఉండేవారట, 

కళలకు కాణాచి పెద్దాపురం.
ఆ నవరత్నాలలో అప్పటికే వృద్ధులైన శ్రీ షణ్ముఖి వీరరాఘవ కవిగారొకరు,
వీరిని ప్రభువు తాతగారు అని సంబోధించేవారట, ఇతరులు భట్టువారనేవారు..
రాజ్యం సుభిక్షం కాని ప్రభువులకొకటే చింత, సంతాన భాగ్యం లేకపోవడం. రాజదంపతులను పీడిస్తున్న బాధ, ఇది గమనించిన రామ మంత్రోపాసకులైన కవిగారు మండల కాలం దీక్షవహించి, తదుపరి రాజదంపతులను పుత్రుడు కలిగేలా ఆశీర్వదించేరు.
రాజదంపతులకు మగబిడ్డ కలిగేడు, ఆ శుభ సందర్భం లో రాజదంపతులు కవిగారికి నూరు ఎకరముల భూమిని బహుమతిగా, కవిగారి స్వగ్రామం అనపర్తిలో, ఊరికి పశ్చిమంగా ఒక కిలో మీటర్ దూరంలో,పట్టా ఇచ్చారు. ఈ పొలం మధ్యలో కవిగారొక రావి మొక్క నాటారు, రాక్షస నామ సంవత్సరంలో, 17వ శతాబ్దంలో. కవిగారు గతించారు కాని రావిచెట్టు పెరుగుతోంది.
తెల్ల దొర : కాటన్ మహాశయులు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ పనులలో బాగంగా చెట్టు పడగొట్టాల్సివచ్చింది. కానీ కవి గారి వంశీయులు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు
పూర్తి స్టొరీ కొరకు మీ వంగలపూడి శివకృష్ణ
https://plus.google.com/+vangalapudisivakrishna/posts

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

KASEE BATTA BRAHMAYYA SASTRI బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ


మన పెద్దాపురం సంస్థాన చరిత్రము : బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి
-----------------------------------------------------------------------
పెద్దాపురం సంస్థాన చరిత్రము ను విమర్శనాత్మకంగా రచించిన వారిలో విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు ఒకరు
1785 నాటికి పెద్దాపురం రాజ్యము అటు తోటపల్లి నుంచి ఇటు నగరం వరకు మొత్తం 585 గ్రామాలు మరియు పట్టణములతో విరాజిల్లింది అన్న విషయం నా ఇది వరకటి పోస్ట్ ల ద్వారా మీ అందరికీ తెలిసిందే
బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు .
తుని రాజా (పెద్దాపురం సంస్థానం లోని బాగం) వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు పెట్టించి శాస్త్రి గారి కుటుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత తమ’’ పెద్దాపురం సంస్థాన చరిత్ర ‘’రాయించి వెయ్యిన్నూట పదహారు రూపాయలు బహుమానంగా సమర్పించారు .ఇందులో శాస్త్రిగారి లోతైన చారిత్రిక అవగాహన ,పరిశీలనా ద్రుష్టి వ్యక్తమవుతుంది.
మీ వంగలపూడి శివకృష్ణ

Thursday 19 January 2017

PLEASE SEE HOW PEDDAPURAM KING'S SURNAME CHANGED TO VATSAVAYA FROM CHAGI



పెద్దాపురం సంస్థాన పాలకులు పూర్వము ఉత్తర దేశము నుండి వలస వచ్చి, గోదావరి, నెల్లూరు, కృష్ణా, విశాఖపట్టణం మండలాలలో స్థిర పడిన క్షత్రియ కుటుంబాలలో ఒక కోవకి చెందినవారు. 
వీరిలో మందపాటివారు - వత్సవాయి వారు అని రెండు వర్గాల వారు ముఖ్యులు. 
కాశ్యపస గోత్రానికి చెందిన మందపాటి వారు ఒంగోలు లోనూ, వశిష్ట గోత్రానికి చెందిన వత్సవాయి వారు పెద్దాపురం లోనూ పాలకులుగా ప్రసిద్ధి చెందారు. వత్సవాయి వారు సూర్య వంశోద్భావులగు ఆంధ్రక్షత్రియులలో మిక్కిలి గొప్పవారు. వీరి మూల పురుషుడు దుర్జయుడని, గుడిమెట్ల సాగిపోతరాజు వీరి పూర్వులలో ఒక్కడని. వీరి ముని మనమడు (మనవడు కి మనవడు ) అయిన వత్సవాయి శ్రీ రామ రాజు గారు కాలమున వత్సవాయి అనే గ్రామ వీరి రాజ్యానికి రాజధాని అవడం చేత వీరి ఇంటి పేరు వత్సవాయి అయ్యిందని తెలుస్తున్నది * ............................ మీ వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

PEDDAPURAM PRINCELY STATE INCOME ACCORDING TO KIMMURU KAIFEEYATH

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
పెద్దాపుర సంస్థాన సరి హద్దులు - ఆదాయం - పరిణామక్రమం (ఒకప్పటి)
-----------------------------------------------------------------------
పెద్దాపురం ప్రాచీన ఆంద్ర దేశము లో పురాతన సంస్థానములలో ఒకటి. ఇంచుమించు ఐదు వందల ఏళ్ల పూర్వ చరిత్ర కలది.
గోదావరి మండలము లోని చాలా భాగము, 
కృష్ణా - గుంటూరు మండలాలలోని కొంత భాగము,
విశాఖ పట్టణం లోని కొన్ని గ్రామాలు అయిన తోటపల్లి, రంప , చోడవరం, మొదలగు మన్యం ప్రాంతాలు ఒకప్పటి పెద్దాపురం సంస్థానములోనివి.
సంస్థానములోని ముఖ్య పట్టణం అయిన "పెద్దాపురం" తూర్పు గోదావరి జిల్లా లో రాజ మహేంద్రవరం (ఇప్పటి రాజముండ్రి) కి ఈశాన్య దిక్కు గా పది కోసుల దూరంలో (కోసు = ఇంచుమించు 3.1/2 కిలో మీటర్లు) ఉన్నది.
1803 సంవత్సరం నాటికి పెద్దాపురం సంస్థానం ఆదాయం పది లక్షలు.
సాలు సరి పేష్కషు సాలుసరి పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఆరున్నర లక్షలు.
అంత పెద్ద సంస్థానం కాలక్రమంలో చిన్న చిన్న భాగాలుగా విభజించబడి చివరికి కొట్టాము, తుని ఎస్టేటు గా మారిపోయి, ఆ తరువాతి కాలంలో ఆంద్రప్రదేశ్ రాష్త్రం లో అంతర్భాగం అయ్యిపోయింది.
రాజా వేంకట సూర్య నారాయణ జగపతి రాజు గారి పేర నమోదయినటువంటి కొట్టాము ఎస్టేటు యొక్క రాబడి రెండున్నర లక్షలు పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఇరవై ఆరువేల నూట డెబ్బై మూడు రూపాయలు కొట్టాము ఎస్టేట్ యొక్క ముఖ్య పట్టణం తాండవ నది ఒడ్డున ఉన్న తుని. ........................................................... మీ వంగలపూడి శివకృష్ణ
Ref : కిమ్మూరు కైఫీయతు

PEDDAPURAM SIVALAYAM HISTORY



పెద్దాపురం శివాలయం ఒకప్పుడు పట్టణ శివారు ప్రాంతం ఇక్కడ చాలా కాలం క్రితం స్మశానం ఉండేదిగా తెలుస్తుంది .... పెద్దాపురం సంస్థానాన్ని రాజా వత్సవాయ జగపతి మహా రాజు గారు పరిపాలించే కాలంలో ఒక మహా సాధువు హిమాలయా, కాశీ తదితర యాత్రలను ముగించుకుని తన సొంత గ్రామము తరలి పోయే దారిలో పెద్దాపురం సంస్థానం లోని ఒకా నొక సత్రం నందు బస చేయడం జరిగిందట .... ఆయన వద్ద గల ఎద్దుల బండిలో కాంతులీనీతూ ఒక మహా శివ లింగం ఉండటాన్ని గమనించిన గ్రామ ప్రజలు ఆ శివ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయమని కోరారట సాధువు ఎంత మాత్రం ఒప్పుకోక పోవడంతో ... గ్రామ ప్రజలు రాజు గారి వద్దకు తీసుకు వెళ్లి ఒప్పించి మహా రాజు సమక్షం లోనే శివ లింగ ప్రతిష్ఠ చేయించడం జరిగిందట ... అప్పటి నుండీ భక్తులు పరమ శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్దలతో పూజించుకుంటున్నారు - దేవాలయానికి 1969 ప్రాంతంలో పెద్దాపురం శిల్పులతో గోపురం నిర్మింపచేయడం జరిగింది - పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

PEDDAPURAM KING CHATURBHUJA TIMMA JAGAPATHI MAHA RAJU

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
పెద్దాపుర సంస్థాన చరిత్రము : చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు
-------------------------------------------------------------------------------
తిమ్మరాజు గారి కాలం పదునాల్గవ శతాబ్దం ఉత్తరార్ధం (1555-1607)
శ్రీ రాజా వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు సంస్థాన సంపాదకులు. ఆయన పరిసర ప్రాంతాలలో ఉన్న పాలకులు అందరినీ ఓడించి రాజ్యమును విస్తరింప చేసి పెద్దాపురం లో ఒక కోటను నిర్మించారంట.
తండ్రి శ్రీ వత్సవాయి పేర రాజు గారు, తల్లి గొట్టుముక్కల వారి ఆడపడుచు నారమాంబ గారు.
'తిమ్మరాజ శిఖామణి తేజరిల్లె
నతని కీర్తి నటించు శీతాద్రిసేతు
మధ్య పృధ్వీశ్వరాస్థాన మంటపములు'
- రామ విలాసము, అవతారిక, పు. 21.
ఆనాటి సుబేదారైన షేర్ మొహమ్మద్ ఖాన్ చతుర్బుజ తిమ్మ రాయ జగపతి బహద్దరు గారి యొక్క వీరోచిత కార్యాలను మెచ్చి ఒక కత్తి ని బహుమానం గా ఇచ్చాడట.
' షేరు మొహమ్మదు క్షీతిప శేఖరుఁ డద్భుత శౌర్య ధైర్య దు
ర్వారుఁడు మెచ్చి పైడిఁయొఱవాల్దన కేల నొసంగు వేళ దై
త్యారిసమానమూర్తి తన హస్తము మీఁ దుగ నందె వార్దిగం
భీరుఁడు వత్సవాయికుల పేరయ తిమ్మనృపాలుడుఁన్నతిన్’ - పైది, పు. 23.
విజయ నగర మహారాజు శ్రీ విజయరామరాజు గారు వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారి వీరత్వాన్ని వర్ణిస్తూ రచించిన చాటువు
ఆంభోజం కలయం సదృక్ష మవనే సాహిత్యరీత్యామ్ దృశో
ర్మాంధా తార మపార సంపది మహా బావే యశో రాశిషు
శత్రూణాం పురభంజనే దృతి గుణేకిం చోరగేంద్రంమతి
ప్రాగాల్భ్యే ప్రతిధాతి తిమ్మ నృపతిః పాకాహిత ప్రాభవః - విజయరామరాజు చాటువు
........................................................... మీ వంగలపూడి శివకృష్ణ

PEDDAPURAM KINGS PATRONISATION


పెద్దాపురం సంస్థానాధీసుల పరిపాలనా - కళా పిపాశ
****************************************************
పెద్దాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు నది ప్రవహించడం వల్ల దీనికి " పొర్లు నాడు " అని పేరు వచ్చిందని అనేవారు. 'ఈ ఏలేరు ఆధారము వలననే పల్లపు భూములలోని చాలా బాగం సాగు చేయబడేది' . సుక్షేత్ర మైన పంటపొలాలు.. ఇక్కడ మెట్ట పంట (కర్రపెండలం) విరివిగా పండేది. పరిణామ క్రమంలో చెరకు పంట పెరిగి బెల్లం తయారీ ఊపందుకుంది.
గోదావరి జిల్లాలన్నిటిలో ఇతర తాలుకా గ్రామాలన్నిటినీ పోల్చి చూస్తే ఇక్కడ జన సంఖ్య తక్కువగా ఉన్నది. ఇక్కడ చదరపు మైలుకి (కిలోమీటరున్నర) కి సుమారు 331 మంది మాత్రమే కలరు.
పల్లపు తాలూకాల కంటే విద్యా విషయం లో వెనుకబడి వుంది. పురుషులలో నూటికి 5 శాతం ప్రజలు మాత్రమే చదవడం, వ్రాయడం నేర్చుకొన్నారు . --------------------------------------------------@ రాజా వత్సవాయి రాయ జగపతి వర్మ గారు.@
పెద్దాపుర సంస్థాన అభివృద్ధి
***************************
సంస్థానం లో గల అన్ని గ్రామాలకు వాడవాడ లా మంచినీటి నుయ్యల నిర్మాణం జరిగింది -
మెట్ట ప్రాంతాల సాగుకు అనువుగా చెరువులు త్రవ్వించడం జరిగింది. అన్ని గ్రామాలలో ఉచిత ఆయుర్వేద శాలలు అంటువ్యాదులు ప్రబలినప్పుడు పెదబ్రహ్మదేవం నుంచి ఆయుర్వేద వైద్యులు అన్ని గ్రామాలలో పర్యటించేవారు.... ఆయుర్వేద సత్ సంబందిత ఆశ్రమాలకు విరివిగా విరాళాలిచ్చి ప్రోత్సహించేవారు.
పెద్దాపురం సంస్థానమునకు పరిశిష్ఠమయిన కొఠామ్ ఎస్టేట్ ను తుని రాజధాని గా పరిపాలించిన వెంకట సింహాద్రి రాజుగారు ఆయుర్వేద శాస్త్రంలో దిట్ట వీరి యొక్క సీతా రామ నిలయ ముద్రాక్షరశాలలో అనేక వైద్య గ్రంధాలు ముద్రించబడినవి. అవి ప్రజలకు చేరువ కావడం కోసం బుర్రకధా , హరికధా కాలక్షేపాలకి ముందు, మద్య-మద్యలో, చివరలో వాటియొక్క ఆవశ్యకతలను వివరించమనే వారు - ప్రజలు మాత్రం మంత్రాలు - మూడాచారాలనే ఎక్కువగా నమ్ముకునేవారు .--------------------------------------------------------------------@ రాజా వత్సవాయి రాయ జగపతి వర్మ గారు.@
అంటరానితనం - అస్పృస్యత నివారణకు హరిజనులతో పండితులని మమేకం చేయడానికి పెద్దాపురం మహారాజు గొప్పపధకం ను "ప్రభు పాద రక్షా వశీకరణ" ( బహుళ ప్రాచుర్యం లో ఉన్న ఆసక్తి కరమైన ఈ కధని వేరే పోస్ట్ ద్వారా తెలియ జేస్తాను) ------------------------------------------------------------------- @ వంగలపూడి శివకృష్ణ @
పాలకులందరూ పేద ప్రజారహిత పెద్దాపురాన్ని కాంక్షించారు.
**************************************************************
అన్ని వృత్తులకీ సమాన ప్రాదాన్యం ఇచ్చారు . వారి యొక్క ఉత్పత్తులను అమ్ముకోవడానికి గ్రామగ్రామాన సంతలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభువులు నిత్యం ప్రజలతో మమేకం అవుతూనే వుండేవారు.
ప్రజలలో విద్యపై అవగాహన కల్పించడానికి గొప్ప కృషి చేసారు.
పండిత పోషణ ఘనం గా జరిగేది ... పండితులకు అగ్రహారాలు దానం గా ఇవ్వబడేవి.
పాలకులందరూ శ్రీ రామ భక్తులు కావడం చేత సంస్థానం లోని అన్ని గ్రామాలలోని అనేక చోట్ల శ్రీ రామాలయాలు నెలకొల్ప బడినవి ఇతర దేవాలయాల నిర్మాణానికి విరివిగా విరాళాలిచ్చారు.
చుట్టుపక్కల భూస్వాములు-జమిందారులతో మాట్లాడి - పాఠశాలలు నిర్మాణం జరిగింది.
అప్పట్లో తునిలో వేద పాఠశాల ని - 30, 000 (ముపై వేల రూపాయల) తో 1922 లో రాణీ గోశా ఆస్పత్రి ని - 1923 లో డబ్బై వేల రూపాయలతో ఉన్నత పాఠశాలని నిర్మించడం జరిగింది
పాదచారులు పేదలకు మూడు పూటలా కడుపు నింపే నిమిత్తం - రాయ జగపతి (1797 - 1804) రెండవ బార్య అయిన బుచ్చి సీతాయమ్మ గారు పెదాపుర సంస్థానాన్ని పరిపాలించిన కాలం (1828 - 1833) లో పెద్దాపురం లో ఒక సత్రం మరియు ఒంటిమామిడి – కత్తిపూడి - తుని లలో అన్నదాన సత్రాల నిర్మాణం జరిగింది.
పెద్దాపురంలో అమ్మన్న అనే జమిందారు యొక్క ఇల్లు స్వాదినం చేసుకుని సత్రాన్ని నిర్మిచిందని ఆ సత్రానికి నిర్వహణ నిమిత్తం ఐదు వందల ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయ స్థలాన్ని కేటాయించినాదని. ఆ తరువాత కాలంలో వచ్చే ఆదాయంలో సత్రాల నిర్వహణకు పోగా మిగులు నిధులను - ఉన్నత విద్యకోసం వేరు ప్రాంతాలకు వలస పోతున్న విద్యార్దుల సౌకర్యార్దం బుచ్చి సీతాయమ్మ గారి జ్ఞాపకార్ధం పెద్దాపురంలో శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహా రాణీ కళాశాల నిర్మాణం జరిగిందని - ఈ నిర్మాణానికి శ్రీ రాజా వత్సవాయి కృష్ణమరాజ బహద్దరు గారు , భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, శ్రీ..ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు గారు ప్రముఖ పాత్ర వహించారని - ఏనుగుల వీరాస్వామి వారు తన రచన అయిన "కాశీ యాత్ర చరిత్ర" లో పేర్కొనడం జరిగింది. ------
@ ఏనుగుల వీరాస్వామి @
కళలకు కాణాచిపెద్దాపురం
**************************
శిల్ప కళా, స్వర్ణ, కుమ్మరి, చేనేత, ఒక వెలుగు వెలిగాయి.
సంప్రదాయ కళలైన , పులి నృత్యం - గరగ - తోలుబొమ్మలాటలు - బుర్రకధ - సాము గరిడీ - కోలాటం - కబడ్డీ - కుస్తీ లు బహు ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి నుండి కళాకారులు ఇతర రాష్ట్రాలకు సైతం ప్రదర్శనలకు వెళ్ళేవారు .
కలియుగ భీముడు జగత్ ప్రసిద్ద మల్లయుద్ధ వీరుడు *కోడి రామమూర్తి నాయుడు* (1880 - 1938) పెద్దాపురం సంస్థానము తుని పాలకుల ప్రోత్సాహంతో అనేకమంది యువకులకి మల్లయుద్ద మెలుకువలు నేర్పారు.
*నాట్యకళ* లో పెద్దాపురం కళావంతులు ఆరితేరిన వారు మాండూక శబ్దానికి జనరంజకం గా నాట్యం చేయడం అంటే సామాన్య విషయం కాదు . కానీ ఆ నాట్యాన్ని పెద్దాపురం నాట్య కళాకారిణిలు అలవోకగా చేసే వారు
*తైలవర్ణ చిత్రకళ* (ఆయిల్ పెయింటింగ్స్) ను ఎంతగానో ప్రోత్సహించారు
ఇక్కడి కళాకారులు 18వ శతాబ్దం లో కేరళ, ముంబాయి నగరాలకు సైతం వెళ్లి వారి వారి చిత్రరాజాలను ప్రదర్సనకి ఉంచారు
పెద్దాపురం సంస్థానము వారు పోషించిన ప్రముఖ పండితులు :
**************************************************************
శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు (ఏనుగు లక్ష్మణ కవి గారి ముత్తాత)
వెలుతురుపల్లి విశ్వనాధ కవి
ఏనుగు లక్ష్మణ కవి
పరవస్తు వేంకట రంగా చార్యులు
వేదుల సత్యనారాయణ శాస్త్రి
కాశీబట్ట బ్రహ్మయ్య శాస్త్రి
చిలుకూరి సోమనాధ శాస్త్రి
పింగళి సూర్యనార్యుడు
హోతా వేంకటకృష్ణ కవి
చావలి రామశాస్త్రి
సలజర్ల గంగరాజు
ఆణివిల్ల వేంకట శాస్త్రి …….
ఇంకా మరికొందరు.................. @రాజా వత్సవాయి రాయ జగపతి వర్మ గారు.@

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

SANITARY WORKERS OF PEDDAPURAM


మన పెద్దాపురం పారిశుధ్య కార్మికులకి మనస్పూర్తి గా కృతజ్ఞతలు తెలియజేయండి మిత్రులారా .... !



ఓ పారిశుధ్య కార్మికుడా - పచ్చదనం ప్రేమికుడా ... !
పరిశుభ్రత కారకుడా .. పరోక్ష వైద్యుడా …!
ప్రజా ఆరోగ్యానికి ప్రధమ రక్షకుడా … ! 
ప్రణామాలు ప్రణామాలు ప్రణామాలు నీకు

ఆ మూడు రోజులూ వరుణుడూ మేము ఒక్కటిగా కలిసిపోయి
దోర్లేసాం దున్నేసాం దుమ్మెత్తి పోసేసాం - ఇక భారం మీదే మా బాధ్యత మీదే

*** మాకు బుద్దులు లేవు ఈ జన్మకి ఇక రావు ***

సుందర నగరమంతా చిందరవందరగా చెత్తమయం చేసేసి నీ చిత్త శుద్ధిని ప్రశ్నింపచూస్తాం మేము !

నువ్వు మురికి కూపాల వెంట మగ్గితే మాకెందుకు ముగ్గితే మాకెందుకు - రొచ్చుల సహవాసంతో రోగాల బారిన పడి రొప్పితేను మాకెందుకు రోదిస్తే మాకెందుకు ?

మీ కష్టాల్ మాకెందుకు కన్నీళ్లు మాకెందుకు
జీతాలు రాకపోతే మాకెందుకు మాకెందుకు

మీ కదలు మీ వ్యధలు మీ భాధలు మీ గాధలు
మాకెందుకు మాకెందుకు మాకెందుకు మాకెందుకు

మీరేమైతే మాకెందుకు ఈ ఊరేమైతే మాకెందుకు

మేము మళ్ళీ మొదలెడతాం సుందర నగరమంతా చిందరవందరగా చెత్తమయం చేసేసి నీ చిత్త శుద్ధిని ప్రశ్నింపచూస్తాం ఎందుకంటే

*** మాకు బుద్దులు లేవు ఈ జన్మకి ఇక రావు ***
మిత్రులందరూ ఒక్కసారి ఆలోచించాలని కోరుతూ.. మీ వంగలపూడి శివకృష్ణ

 - వంగలపూడి శివకృష్ణ

MANA PEDDAPURAM VALU TIMMAPURAM HISTORY

మన పెద్దాపురం వాల్మీకి పురం - వాలు తిమ్మాపురం
అవును అది వాల్మీకిపురమే - వాలు తిమ్మాపురం గా మారిన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
ఈ చిన్ని కధ చదవండి.
------------------------
ప్రచస్థాముని పుత్రుడైన "రత్నాకరుడు" నైమికారణ్యములో దారితప్పిపోయి ఒక బోయవాడికి దొరుకుతాడు. సంతానం లేని ఆ బోయ వేటగాడు రత్నాకరున్ని తన వెంట తీసుకు పోయి, పెంచి పెద్దచేసి విలు విద్య, వేటలలో ప్రావీణ్యున్ని చేసి యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాడు.దారిదోపిడి , దొంగతనము లను వృత్తిగా తీసుకొని బాటసారులను చంపి ధనాన్ని దోచుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రత్నాకరునికి ఒకరోజు అడవి దారిలో "నారద మహర్శి" కనిపిస్తాడు. రత్నాకరుడు నారద మహర్షి ని దోచుకునే ప్రయత్నము చేయగా ...
"ధనం దోచుకు పోగలవు కానీ పాపపుణ్యాలు దోచుకు పోలేవు - నీ కుటుంబ సబ్యులు కూడా నీ పాపాన్ని పంచుకోవడానికి ముందుకు రారు" అని హితబోధ చేస్తాడు.
తన జీవన విదానం మీద విరక్తి చెందిన రత్నాకరుడు అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొంది వాల్మీకి మహర్షి గా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం సమీపించి మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, ఆంధ్ర దేశంలో ఉన్న"గోదావరి నదితీరం"లో విశ్రమించి విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని తన రామాయణ కావ్యంలొ పేర్కొన్నాడు.
ఆ సమయం లోనే ఉద్యానవనాన్ని తలపించే ఈ గ్రామం లో కొంత కాలం నివశించాడు ఆయన సంచరించి న ప్రాంతం కావడం చేత అది వాల్మీకి పురం గా ప్రశస్తి కెక్కింది. వాల్మీకి మహర్షి ఉన్న ప్రాంతమంతా నిత్యం రామ నామ స్మరణతో మారు మ్రోగుతూ వుండటం వల్ల సాక్షాత్ హనుమంతుల వారే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామీ వారిగా ఇక్కడ కొలువు తీరడం జరిగిందనేది పౌరాణిక కధనం.
ఆ తరువాత కాలంలో హనుమంతుని మహా భక్తులైనటువంటి జమ్మి వంశస్తులు - శ్రీ జమ్మి హనుమ్మద్దీక్షితులు గారిచే 1831 వ సంవత్సరంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించ బడటం - 1993 వ సంవత్సరం లో ఆలయ పునర్నిర్మాణం జరిగి నేటికీ జమ్మి వంశస్థులే వంశ పారంపర్యం గా నిర్వాకులుగా అర్చకులు గా సేవలందిస్తున్నారు.
వత్సవాయ వంశస్తుల పాలన వరకూ కూడా ఆ గ్రామం వాల్మీకి పుర అగ్రహారం గానే పిలువబడింది. వత్సవాయ వంశస్థులైన శ్రీ తిమ్మరాయ జగపతి గారి విస్తార మైన దానాల చేత అది వాలు 'తిమ్మాపురం' గ్రామం గా పరిణితి చెందివుండవచ్చు అనేది చరిత్రకారుల అబిప్రాయం.
ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ "ఏనుగు లక్ష్మణ కవి" రచించిన రామ విలాసము లోని ఒక వాక్యం ఈ వాదనలకు కొంత బలం తీసుకువస్తుంది చదవండి
"బొలుపుగా వాల్మీకిపురంబున ఫలభూజవాటికల్ పదిలపరచే"
------------------------------------------------------------------------------
తెలంగాణా లో పాలకుర్తి మండలం లోని "వల్మీడి"
రాయల సీమ లోని చిత్తూరు జిల్లాకి చెందిన "వాయల్పాడు"
మన తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురం మండలానికి చెందిన "వాలు తిమ్మాపురం" లు ఒకప్పుడు వాల్మీకి పురం గా వెలుగొందినవే అనడానికి చారిత్రిక పౌరాణిక కారణాలనేకం ఉన్నాయి.
చరిత్ర ఎప్పుడూ పునరావృత్త మవుతూనే ఉంటుంది పౌరాణిక కాలం దాటి, నాటి రెడ్డి రాజులు తదుపరి తిమ్మ రాయ జగపతి లు కాలం లో నిత్యరామ నామ స్మరణ సాగే వాల్మీకి పుర అగ్రహారం గా ఫల వృక్షాలతో నిండిపోయి ఉద్యానవనం గా విలసిల్లిన వాల్మీకి పురానికి దాదాపు 15 కోట్ల రూపాయల వ్యయంతో పదిన్నర ఎకరాల స్థలంలో ఇక్కడ నిర్మించబోయే నాచురల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అలాగే ఉద్యాన వన పంటల పరిరక్షణా కేంద్రాల నిర్మాణం తో మళ్ళీ పూర్వ వైభవం రానుంది. అది తొందరగా రావాలని ఆకాంక్షిస్తూ మీ వంగలపూడి శివకృష్ణ - మన పెద్దాపురం టీం

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

MANA PEDDAPURAM YOUTH HELPING POOR AT OLD AGE HOME, AMG PEDDAPURAM








కటిక దారిద్ర్యం కదం తొక్కితే
కూటికి కరువై కడుపు మండితే
బ్రతుకు బరువనే జనం పెరిగితే
నీ అర్చనలు - అభిషేకాలు
శాంతపరచునా…? సర్వేశ్వరుణ్ణి

పేదల పక్షం నిలిచే పూజ
ఎండిన డొక్కల నింపే యజ్ఞం
వారి నవ్వులే నిత్య హారతి
వారి సందడే సంబరాలు రా
వారి ఆనందోత్సవమే ఆ శ్రీ వారికి బ్రహ్మోత్సవం

తెలుసుకో ఓ నేస్తం … !
సమస్త దేవతా స్తోత్ర సారాంశం
మమతలు పంచే మానవత్వమే.

మన పెద్దాపురం మానవీయ కోణాలు - క్రమం తప్పని దానాలు
అరకొర ఆదాయాలు అయినా సాగే సహాయాలు - వంగలపూడి శివకృష్ణ

MANA PEDDAPURAM MARLAVA - A SMALL VILLAGE IN PEDDAPURAM CONSTITUENCY

మంచికి నెలవు మన పెద్దాపురం మర్లావ
-----------------------------------------
మచి నీరడిగితే మజ్జిగిచ్చేటంత
మంచి మర్యాదలకి మనసున్న మనుషులకి పుట్టినూరు
ఆ మట్టి గాలి సోకితే మనలో మార్పు మొలకెత్తుతుంది.
మమతలు చిగురించుతాయి.
మానవీయత విరభూస్తుంది.
ఆ ఊరి సెలయేటి నీటి ఘోష
వారి స్వచ్చమైన పల్లెయాస
ఆద్యాత్మిక జీవనయానం
ఆద్యంతం దైవ సమానం
అందుకే మన పెద్దాపురం మర్లావ మంచికి నెలవు - మమతల కొలువు
ఆ ఊరు ఆది నుండీ కూడా కళలకి ప్రసిద్ధి
ప్రతీ ఏటా వినాయక చవితి కి ఈ ఊరి వారే పాత్ర దారులై ప్రదర్శించే నాటకాలు
పరిసర ప్రాంతాలను సైతం రంజింపజేస్తాయి.
కాకినాడ వాస్తవ్యులు కాళ్ళకూరి నారాయణ రావు గారు వేశ్యా సంస్కృతి పై విమర్శనాత్మకంగా విరచించిన చింతామణి నాటకం అనేక సార్లు ఈ గ్రామంలో ప్రదర్శించబడింది.
అలాగే సత్య హరీశ్చంద్ర నాటకం నేటికీ ప్రతీ ఏటా వినాయక చవితికి ప్రదర్శించ బడుతుంది.
గతించిన చరిత్ర వైభవాన్ని మన కళ్ళకు కట్టినట్లు చూపించగల సజీవ కళ నాటకం మాత్రమే అలాంటి గొప్ప కళని - నేటికీ సజీవంగా ఉంచాలన్న మర్లావ వాసుల తాపత్రయానికి ధన్యవాదాలు చెప్తూ మీ వంగలపూడి శివకృష్ణ




పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

HAPPY RAMADAN CELEBRATIONS AT PEDDAPURAM

ఈదుల్‌ ఫితర్‌ - ఈద్ ముబారక్
------------------------------------
ప్రతీ అక్షరంలో ప్రేమత్వం ప్రతీ ఆచరణలో దైవత్వం
"రంజాన్" ప్రపంచమానవాళికి మానవతా నిఘంటువు
144 అధ్యాయాలు, 6232 వచనాలు
దాతృత్వం, ధార్మిక చింతనల ప్రదాయిని *దివ్య ఖురాన్*
ఫజర్‌, జోహార్‌, అసర్‌, మగరీబ్‌ అన్నీఅల్లాకి దగ్గరయ్యేదుకు చేసే - "నమాజ్"
సూర్యోదయ పూర్వంలో - "సహార్"
సూర్యాస్తమ తదుపరిలో - "ఇప్తార్"
నియంత్రణా శక్తి నిచ్చే నిష్టాగరిష్ఠ ఉపవాస దీక్ష - "రోజా"
దైవభీతి పరాయణత – సేవానిరతి తత్పరతల - "తఖ్వా"
ఏకాగ్ర చిత్తానికి - "ఏతెకాఫ్"
శక్తి వంతమైన రాత్రి - "షబ్‌-ఎ-ఖదర్‌"
దీన జనబాంధవ్యం 'జకాత్' ఔర్ ' ఫిత్రా'
ఇలా మనిషి జ్వలిస్తూన్నా జనస్రవంతికి వెలుగులు పంచాలనే మహోత్తరమైన సందేశాన్ని మానవాళి కి అందించిన మహోన్నత మతనియామానికి సలాం@ వాలేకుం సలాం - ఇస్లాం ------------ వంగలపూడి శివకృష్ణ మనపెద్దాపురం టీం













పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

BRAHMARSHI CHAGANTI KOTESWARA RAO'S FIRST HOLY SPEACH AT PEDDAPURAM

మన పెద్దాపురం : చాగంటి వారి మొట్టమొదటి ఉపన్యాసం పెద్దాపురంలోనే :
శంకర శతక కర్త శ్రీ చాగంటి సుందర శివ రావు గారు మరియు శ్రీమతి చాగంటి సుశీలమ్మ దంపతుల ప్రధమ సంతానంగా 1959 జులై 14 న జన్మించిన శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చిన్నతనం నుంచీ తల్లి తండ్రుల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు, ఎక్కడ ఆధ్యాత్మిక సభలు జరిగినా చటుక్కున వాలిపోయే చాగంటి వారు సుమారు 25 సంవత్సరాల క్రితం పూజ్యశ్రీ మాతా శివ చైతన్య నందిని గారు లలిత సహస్రనామ పారాయణం నిమిత్తం పెద్దాపురం వస్తున్నారన్న సంగతి తెలుసుకుని ఎంతో ఉత్సాహంగా పెద్దాపురం వచ్చారు. ఆ అద్యాత్మికసభలో మాతా శివ చైతన్య గారు కాసేపు ఉపన్యసించి, ఉపన్యాసం మధ్యలో ఎవరైనా భాగవతం గురించి మాట్లాడవలసినదిగా కోరారట. అయితే అప్పటికే అన్నిఆధ్యాత్మిక విషయాలపై గురుదేవులు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి ద్వారా అవగాహన పెంచుకున్న చాగంటివారు మాట్లాడానికి తటపటాయించే లోపు వారి పక్కనున్న ఒక మిత్రుడు చాగంటి కోటేశ్వరరావు గారిని ముందుకు నెట్టారంట, ఆరోజు భాగవతం గురించి తనకు తెలిసిన విషయాల్ని సభలో అందరిముందూ ఉపన్యసించారంట అలా అమ్మ పూజ్యశ్రీ మాతా శివచైతన్య దేవి ఆశీస్సులతో పెద్దాపురం లో ప్రారంభమైన ఆయన ఉపన్యాస ప్రస్థానం అతని గురుదేవులు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి ప్రోత్సాహం, సహ ధర్మ చారిణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారి సహవాసంలో ఎలాంటి మలుపు తీసుకుందో ఎన్ని కోట్ల హిందువుల హృదయాలను భక్తిభావంతో నింపేసిందో , ఎంతమంది టెలివిజన్ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిందో నాలాంటి అరకొర భక్తులు మీకు చెప్పనవసరం లేదు. ఆ మహానుభావుడు ఇలాగే యావత్ భారతానికి ఆధ్యాత్మిక వెలుగులు పంచాలని, మతాన్ని మానవత్వం తో మిళితం చేసి మూర్ఖ జనసందోహాన్ని మంచిమార్గం పట్టిస్తూ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ - మీ వంగలపూడి శివకృష్ణ మన పెద్దాపురం టీం




పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

MANA PEDDAPURAM SURYA RAO HOTEL

మన పెద్దాపురం సూర్యారావు హోటల్
--------------------------------------
అణా కి ఒక టీ - రూపాయి కి భోజనం నుండి మొదలైన హోటల్ ప్రస్థానం పరిసరాల ప్రాంతాల పాలిట పూటకూళ్ళ ఇల్లై పేదప్రజల పలహార శాలగా మారి కడుపునింపింది ప్రేమను వండి వార్చే పాకశాస్త్ర ప్రావీణ్యుల ప్రయోగశాల గా పేరు గాంచింది పేరుకి శ్రీ వెంకటేశ్వరా హోటల్ & లాడ్జి అయినా మా పెద్దాపురం వాసులకి మాత్రం అది సూర్ర్రావు హోటలు గానే ప్రసిద్ధం
పెళ్లి విందును తలపింపచేసే మర్యాద పూర్వక ఆహ్వానం తోనే మన కడుపులు సగం నిండి పోతాయి పెద్దాపురం మరియు పరిసర ప్రాంతాలలోని ఏ ఒక్కరినైనా కదిపి పెద్దాపురం లో ఒక మంచి హోటలు పేరు చెప్పవయ్య అని అడిగితే వెంటనే చెప్పే ఒకే ఒక్క పేరు సూర్యారావు బోజన హోటల్.
ఇప్పుడు కలకపల్లి వారంటే జిల్లాలోనే పెద్దపేరు సూర్యారావు హోటల్ కి ఇప్పటి యజమాని శ్రీ కలకపల్లి రాంబాబు గారు ఆత్మ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) చైర్మన్ కూడా ...
మరి వీటన్నిటి వెనుక ఒక మనీషి నిరంతర తపన, శ్రమ, కృషి, అంకుటిత దీక్ష దాగివుంది అది తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి.
అలనాటి పెద్దాపురంలో మూడు పెద్ద హోటల్స్ ఉండేవి
1 . దివిలి సుబ్బారావు హోటలు
2. చిట్టబ్బాయి హోటలు
3. అయ్యర్ హోటలు -
దివిలి సుబ్బారావు గారి హోటలు లో సామాన్య సర్వరు గా ప్రారంబమైన కలకపల్లి సూర్యారావు గారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో అవమానాలు - హోటల్ సర్వర్ కి పిల్లనిస్తామా అంటూ అవహేళనలు
ఆ అవమానాలే తనకి జీవితం లో ఎదిగి సర్వెంట్ స్థాయి నుండి యజమానిగా మారాలన్న దృడ సంకల్పం ఏర్పడింది. అనుకున్నదే తడవుగా మిత్రుడు తో కలిసి హోటలు నుండి బయటకి వచ్చేసారు - అప్పటికే అయ్యర్ హోటల్ టీకి బాగా ఫేమస్ ఆ టీ ని మించిన విదంగా ఆ మిత్రులిద్దరూ కలిసి టీ స్టాల్ ఏర్పాటు చేసారు - అప్పటికే ఉన్న మూడు హోటల్స్ తాలూకు యజమానులు కస్టమర్స్ కి విలువిచ్చే వారు కారు - సాదారణంగానే శాంతం - సుగుణం - ఓపిక ఎక్కువ గల సూర్యారావు గారి టీస్టాల్ వద్ద మాత్రం దానికి భిన్నంగా కస్టమర్స్ కి మర్యాదలు ఆత్మీయ పలకరింపులు జరిగేవి ఇంకేముంది చూస్తుండగానే సీన్ మారిపోయింది సూర్యారావు గారి హోటలు దిన దిన ప్రవర్ధమానమై తమ హోటల్ కి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కడుపు నింపడమే ప్రాధమిక ధ్యేయంగా సంపాదనకి ద్వితీయ ప్రాధాన్యతనిస్తూ అత్యున్నతంగా అధునాకరించబడుతూ అంచలంచలుగా టీస్టాల్ నుండి హోటల్ - హోటల్ నుండి లాడ్జి కి ఎదిగిపోయింది - దాని ఎదుగుదలకి ముఖ్యకారకులైన కీర్తి శేషులు శ్రీ కలకపల్లి సూర్యారావు గారి జీవితం కష్టాన్ని నమ్ముకునే ప్రతీ ఒక్క యువకుడికీ అనుసరణీయం - ఆదర్శనీయం - మీ వంగలపూడి శివకృష్ణ
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

మన పెద్దాపురం : అజరామర శిల్పులు PEDDAPURAM ARCHITECTURES


మన పెద్దాపురం : అజరామర శిల్పులు - అగ్నికుల క్షత్రియులు - 1
గొల్లల మామిడాడ గాలి గోపురం ఎప్పుడైనా చూసారా ? దానిని కట్టిన శిల్పాచార్యుడు మన పెద్దాపురం వాసి కీ.శే బుడత సూర్యారావు గారు ఎంతమందికి తెలుసు... బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు
..

అందుకే పెద్దాపురం చరిత్రను ప్రపంచానికి పరిచయడమే ప్రధమ లక్ష్యంతో ప్రారభించబడిన ఈ గ్రూప్ ద్వారా మన అజరామర శిల్పులందరి గురించి చెప్పదలుచుకున్నాం ... !
..
పెద్దాపురం శిల్పకళ :
ఎంతో ప్రసిద్ధమైన ఈ శిల్పకళ పెద్దాపురం సంస్థానంలో చాళుక్యుల పరిపాలన కాలంలోనే పురుడు పోసుకుంది. అయితే కాలక్రమంలో ఆదరణ కరువవడం మూలాన ఈకళ దాదాపు అంతరించిపోయింది అదే క్రమంలో ఒకప్పుడు రాజరికాలలో ఒక వెలుగు వెలిగి అంతర్ కలహాల వల్ల దుర్భర దారిద్యాన్ని అనుభవించి పొట్ట చేతబట్టుకుని పొరుగు ప్రాంతాలు వలసపోయిన అగ్నికుల క్షత్రియులు ఆ శిల్పకళకు జీవం పోశారు ఎంతో మహత్తరమైన ఈ కళను ప్రపంచ దేశాలలో నిలపడం ద్వారా పెద్దాపురానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చారు.
..
గొల్లల మామిడాడ శ్రీకోదండ రాముని ఆలయం గణాంకాలు:
1889 లో ఆలయ నిర్మాణం జరిగింది 1939లో ఈ ఆలయంను పునః నిర్మించారు. ఆ తరువాత 1950లో 160 అడుగుల ఎత్త్తెన 9 అంతస్థులతో ఒక గాలిగోపురం తూర్పు ముఖం గా నిర్మించారు. ఈ గాలిగోపురం నిర్మాణం లో బుడత సూర్యారావు గారు కూలీగా పనిచేశారు, తిరిగి 1958 లో 200 అడుగుల ఎత్తయిన 11 అంతస్థుల గోపురాన్ని పశ్చిమ వైపు నిర్మించారు. ఈ నిర్మాణానికి పనిచేసిన శిల్పకళాకారులందరికీ శ్రీ బుడత సూర్యారావు గారే నేతృత్వం వహించారు. ఈ గోపురాలపై రామాయణ గాథను బొమ్మల రూపంలో మన బుడత సూర్యారావు గారు చక్కగా వివరించారు.
..
ఆయన ఈ గోపురం నిర్మాణం కోసం ఎంత కృషి చేశారంటే ఆ గోపురాన్ని చూసిన ఎవ్వరైనా సరే అది 50 సంవత్సరాల క్రితం కట్టిన గోపురం అంటే నమ్మరు అది అత్యంత పురాతన మైనది అని పూర్వకాలం మహా శిల్పులు కట్టింది అని కథలు కథలు గా చెప్పుకుంటుంటారు. ఒక్క సారి అది పెద్దాపురం వాసులు కట్టింది అని నిరూపించగానే అవాక్కయిపోయి శిల్పాచార్యులకి శిరశు వంచి నమస్కారం చేస్తారు. మన పెద్దాపురం స్థాయిని అంత ఎత్తులో నిలబెట్టిన గొప్ప శిల్పకారులని కనీసం స్మరించుకోలేమా ... ! అందుకే మహా కళాకారులారా ... !
వందలాది వందనాలు అందుకోనగ అర్హులై చందన పూమాళికలను మీ సందిట చేర్చుకోండి. మీ కళా దాహాన్ని శిలా సృష్టితోనే తీర్చుకోండి - ధన్యవాదాలతో మీ వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

PRAGATHI & BASHYAM SCHOOLS PEDDAPURAM - KINDLY THINK ONCE IS IT REALLY GOOD TO YOU


మన పెద్దాపురం : విద్యాసంస్థలూ... మీకిది తగునా ?
పెద్దాపురం అంటే మీకు ఎందుకంత వివక్ష ...
ఒక పేరు మోసిన హీరో పెద్దాపురం లో షూటింగ్ జరుపుకుని రాజమండ్రి లో చిత్రీకరణ జరుపుకున్న మా సినిమా అని మీడియాకి చెపుతున్నాడు.... నటుడు కదా వాడు కానివ్వండి ... !
ఒక పేరు మోసిన పొలిటీషియన్ తన ప్రతిపక్ష నాయకున్ని నువ్వు పెద్దాపురం వేశ్యావా అని అడుగుతున్నాడు ... ఛీ అన్నా వినడు వాడు పోనివ్వండి ... !
మీకేమయ్యిందయ్యా మహానుభావులు 'ప్రగతి కి 'భాష్యం' చెప్పాల్సిన మీరే పక్కదారి పట్టిస్తారా పర్మిషన్ లు పెద్దాపురంవి,
పన్నులు పెద్దాపురంకి,
పరిధి పెద్దాపురంది -
అనుమతులూ అభివృద్ధీ అంతా పెద్దాపురందే కదా ... ?
మరి పేరెందుకయ్యా మారింది - మా ఊరు ఏమంత నేరం చేసింది
అది ఊరిమీద వివక్షా మరేమన్నానా సెలవీయండి ... దయచేసి సందేహ నివృత్తి చేయండి.
మనవి : మీ ఉద్దేశ్యం అదే అయితే అది క్షమించరాని నేరం - ఒక వేళ అలా కాకపోతే దయచేసి పేరు మార్చండి అని అభ్యర్థిస్తున్నాం - దయచేసి దీన్ని ప్రాంతీయ విబేధంగా చూడవద్దు హక్కుని అడగడం తప్పుకాదని భావిస్తూ ఒకవేళ తప్పే అయితే సరిదిద్దుకుంటానని తెలియజేస్తూ - మీ వంగలపూడి శివకృష్ణ- వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం పెరుగు పోరాటం A SMALL STORY ABOUT POOR CURD SELLERS


పెద్దాపురం పెరుగు పోరాటం : కొన్ని సంఘటనలు చాలా చిన్నవే అయినా చాలా ఆసక్తి కరంగా ఉంటాయి - ఆశక్తికరంగా ఉంటూనే ఎంతో స్ఫూర్తినీ ఇస్తాయి అలాంటి ఒక ఆసక్తి కరమైన చిన్న అంశమే పెద్దాపురం పెరుగు పోరాటం.
అలనాడు భారత దేశమంతా "పశుసంపద" "పాడిపంటలు" ఎక్కువగా విలసిల్లిన రోజుల్లో రైతులు వారి వారి ప్రాంతాలనుండి పెరుగు కుండలను కావిళ్ళతోనూ ఆడవారు తట్టలలోనూ పెట్టుకుని పరిసరప్రాంతాలకు వ్యాపార కేంద్రమైన పెద్దాపురానికి మోసుకొచ్చేవారట. సరిగ్గా ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉన్న ప్రాంతంలో పెరుగు అమ్మకాలు జోరుగా సాగేవంట - సాయంత్రం ప్రాంతంలో ప్రజలు చిన్న చిన్న మట్టి పాత్రలతో "ముంత పెరుగు" ను కొనుక్కొని ఇంటికి తీసుకుని పోయేవారంట,
వ్యాపారం మంచి లాభదాయకంగా సాగుతున్న దశలో పెరుగు విక్రయదారులు పన్ను చెల్లించాల్సిందిగా పురపాలక సంఘం ఆజ్ఞలు జారీ చేసిందట పురపాలక సంఘ తీరుపై ఆగ్రహించిన వినియోగ, విక్రయదారులు పెద్ద ఎత్తున పురపాలక సంఘానికి పోయి వారి అసంతృప్తి వ్యక్తం చేసారంట
అయినా దిగిరాని దొరతనానికి నిరశనగా పెరుగు విక్రయదారులు వారి మద్దత్తు దారులు ఆంజనేయస్వామి గుడి వద్ద బైఠాయించి పెద్దాపురంలో పెరుగు అమ్మకాలు నిలుపుదల చేసారంట నిరశన తీవ్రతను గమనించిన ఏలిన వారు దిగివచ్చి పన్ను ఎత్తివేసారంట ఆకాలం లో ఈ సంఘటన రైతు విజయంగా చిరు వ్యాపారస్తుల విజయంగా ప్రజా విజయంగా పేరుపొంది పెద్దాపురం పేరు ప్రతీ ఊరిలో మారు మోగిపోయిందంట.... చాలా ఆసక్తి కరం గా ఉంది కదా .... !
ఇలాంటి మరుగున పడిపోయిన కథలెన్నో ... అవన్నీ మీముందుకు తీసుకొచ్చే చిన్న ప్రయత్నం మన పెద్దాపురం గ్రూప్ ద్వారా ... మీ వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

HAPPY BAKRID CELBRATIONS AT PEDDAPURAM

ఈద్ ముబారక్ - ఈదుజ్జహ
--------------------------------------
ఇస్లాం నియమాల్లో...తృతీయస్థానం
'జుల్ హాజ్ ' ప్రథమంలో 'హాజ్' కి పయనం
'హుల్ హరామ్' - 'కాబా'లో సప్త ప్రదక్షిణం
కాబా అభిముఖమున 'ఖిభ్లా' ప్రార్ధన
'ఖుత్భా' ఆరాధన 'ఖుర్భానీ' నివేధన
ప్రవక్త 'ఇబ్రహీము' తనయుని బలిదానం
బాలుడు 'ఇస్మాయిల్' త్యాగానికి నిదర్శనం
జుల్ హాజ్ దశమంలో 'బక్రీద్' పర్వదినం
ఇలా ఈ పర్వదినం అడుగడుగునా నిగూడమై ఉన్న దైవారాధనా విధాన వైవిద్యానికి ప్రణమిల్లుతూ... యావత్ ప్రపంచానికీ బక్రీద్ శుభాకాంక్షలు... మీ వంగలపూడి శివకృష్ణ
బడీ ఈద్ - ఈ పెద్ద పండుగ విశ్వాశానికి ప్రతీక.
--------^^--------^-^--------^^--------^^--------^^--------
ఇబ్రహీం ఖలీలుల్లా రజియల్లాహు తాలా అనే పైగంబర్‌ దంపతులు చేపట్టిన నియమనిష్టల ఫలితంగా వారికి ఇస్మాయిల్‌ జబీవుల్లా అనే ఏకైక కొడుకు ఉన్నాడు. అయితే వారి భక్తిని, త్యాగాన్ని పరీక్షించడానికి అల్లా తన కొడుకును బలి ఇవ్వాల్సిందిగా ఇబ్రహీం కలలో కనిపించి ఆజ్ఞాపిస్తాడు.... దైవ నిర్ణయాన్ని శిరసావహించడమే మార్గదర్శకంగా భావించిన ఆ దంపతులు తమ కుమారుడిని బలి ఇవ్వడానికి నిర్ణయించి, అతడిని సిద్ధం చేస్తారు. దైవాదేశం మేరకు ఆ బాలుడిని సుదూర ప్రాంతమైన అడవుల్లోకి తీసుకెళ్లి బలిపీఠంపై పీక కోయడానికి తండ్రి సిద్ధమవుతుండగా... ఆ ఖుర్బానీ ప్రక్రియను ఆపి వేయాలని దైవవాణి వినిపిస్తుంది. దైవ వాక్కు వృథాగా పోవద్దని, ఇస్మాయిల్‌ జబీవుల్లాస్థానంలో అటుగా వచ్చిన ఓ పొట్టేలును బలి ఇవ్వాలని ఆదేశిస్తుంది. లోకకళ్యాణం కోసమే ఈ సంఘటన జరిగిందని, తమ సంతానానికి ఎలాంటి కీడు జరగరాదనే భావించి ముస్లింలు ఆ నాటి నుంచి బక్రీద్‌ నెలలో పొట్టేళ్లను (నెమరువేసే జంతువులను) ఖుర్బానీ ఇవ్వడం పరిపాటిగా మారింది. - వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...