Thursday, 19 January 2017

PEDDAPURAM KING CHATURBHUJA TIMMA JAGAPATHI MAHA RAJU

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
పెద్దాపుర సంస్థాన చరిత్రము : చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు
-------------------------------------------------------------------------------
తిమ్మరాజు గారి కాలం పదునాల్గవ శతాబ్దం ఉత్తరార్ధం (1555-1607)
శ్రీ రాజా వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు సంస్థాన సంపాదకులు. ఆయన పరిసర ప్రాంతాలలో ఉన్న పాలకులు అందరినీ ఓడించి రాజ్యమును విస్తరింప చేసి పెద్దాపురం లో ఒక కోటను నిర్మించారంట.
తండ్రి శ్రీ వత్సవాయి పేర రాజు గారు, తల్లి గొట్టుముక్కల వారి ఆడపడుచు నారమాంబ గారు.
'తిమ్మరాజ శిఖామణి తేజరిల్లె
నతని కీర్తి నటించు శీతాద్రిసేతు
మధ్య పృధ్వీశ్వరాస్థాన మంటపములు'
- రామ విలాసము, అవతారిక, పు. 21.
ఆనాటి సుబేదారైన షేర్ మొహమ్మద్ ఖాన్ చతుర్బుజ తిమ్మ రాయ జగపతి బహద్దరు గారి యొక్క వీరోచిత కార్యాలను మెచ్చి ఒక కత్తి ని బహుమానం గా ఇచ్చాడట.
' షేరు మొహమ్మదు క్షీతిప శేఖరుఁ డద్భుత శౌర్య ధైర్య దు
ర్వారుఁడు మెచ్చి పైడిఁయొఱవాల్దన కేల నొసంగు వేళ దై
త్యారిసమానమూర్తి తన హస్తము మీఁ దుగ నందె వార్దిగం
భీరుఁడు వత్సవాయికుల పేరయ తిమ్మనృపాలుడుఁన్నతిన్’ - పైది, పు. 23.
విజయ నగర మహారాజు శ్రీ విజయరామరాజు గారు వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారి వీరత్వాన్ని వర్ణిస్తూ రచించిన చాటువు
ఆంభోజం కలయం సదృక్ష మవనే సాహిత్యరీత్యామ్ దృశో
ర్మాంధా తార మపార సంపది మహా బావే యశో రాశిషు
శత్రూణాం పురభంజనే దృతి గుణేకిం చోరగేంద్రంమతి
ప్రాగాల్భ్యే ప్రతిధాతి తిమ్మ నృపతిః పాకాహిత ప్రాభవః - విజయరామరాజు చాటువు
........................................................... మీ వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...