అతడొక అజరామర శిల్పి - తిరుమల అలిపిరి లో హనుమంతుని నిపిలి
పెద్దాపురం శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపిన వజ్రసంకల్పి
పెద్దాపురం శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపిన వజ్రసంకల్పి
తిరుమల తిరుపతి దేవస్థాన కార్య నిర్వహణ అధికారి #శ్రీ_పివి_ఆర్_కె_ప్రసాద్ గారు రచించిన#సర్వం_సంభవం అనే ఆధ్యాత్మిక సంచికలో చోటు దక్కించుకున్న ప్రతిభాశాలి మన తోగు లక్ష్మణ స్వామి
మన పెద్దాపురం పాశీల వారి వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం మొదలుకుని పెద్దాపురం సామర్లకోట మధ్యన ఉన్న ప్రసన్నఆంజనేయ స్వామి అలాగే భారత దేశంలోనే ఎత్తైన హనుమంతుని విగ్రహాలు #మహారాష్ట్ర - నండూర్ #ఒడిస్సా - రూర్కెలా, #ఆంధ్రప్రదేశ్ - పరిటాల, ఇంకా అనేక చోట్ల భారీ హనుమంతుని విగ్రహాలు నిర్మించడం జరిగింది.
వారి అనంతరం వారి కుమారులు #తోగు_జాన్_బాబు గారు ఇదే వృత్తిని స్వీకరించి అనేక చోట్ల ఇలాంటి శిల్పాలు నిర్మించడం జరిగింది - ఇటీవలే శ్రీకాకుళం లో నిర్మించ బోతున్న భారత దేశంలో నే అత్యంత ఎత్తైన 173 అడుగుల విగ్రహానికి శంఖుస్థాపన చేసి కొన్ని అనివార్య కారణాల వలన తప్పుకున్నారు.
ఇలాంటి ఎందరో శిల్పకళా ప్రతిభావంతులు మన పెద్దాపురం లో ఉన్నారు ఔత్సాహిక శిల్ప కళాకారులకు ఈ విద్య లోని మెళకువలు నేర్పే కేంద్రం పెద్దాపురం లో ఏర్పాటు చేస్తే బావుంటుంది అని ఆశిస్తూ పెద్దాపురం శిల్ప కళాకారులకి ధన్యవాదాలు చెప్తూ - మీ వంగలపూడి శివకృష్ణ
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
No comments:
Post a Comment