Thursday 19 January 2017

PEDDAPURAM KINGS PATRONISATION


పెద్దాపురం సంస్థానాధీసుల పరిపాలనా - కళా పిపాశ
****************************************************
పెద్దాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు నది ప్రవహించడం వల్ల దీనికి " పొర్లు నాడు " అని పేరు వచ్చిందని అనేవారు. 'ఈ ఏలేరు ఆధారము వలననే పల్లపు భూములలోని చాలా బాగం సాగు చేయబడేది' . సుక్షేత్ర మైన పంటపొలాలు.. ఇక్కడ మెట్ట పంట (కర్రపెండలం) విరివిగా పండేది. పరిణామ క్రమంలో చెరకు పంట పెరిగి బెల్లం తయారీ ఊపందుకుంది.
గోదావరి జిల్లాలన్నిటిలో ఇతర తాలుకా గ్రామాలన్నిటినీ పోల్చి చూస్తే ఇక్కడ జన సంఖ్య తక్కువగా ఉన్నది. ఇక్కడ చదరపు మైలుకి (కిలోమీటరున్నర) కి సుమారు 331 మంది మాత్రమే కలరు.
పల్లపు తాలూకాల కంటే విద్యా విషయం లో వెనుకబడి వుంది. పురుషులలో నూటికి 5 శాతం ప్రజలు మాత్రమే చదవడం, వ్రాయడం నేర్చుకొన్నారు . --------------------------------------------------@ రాజా వత్సవాయి రాయ జగపతి వర్మ గారు.@
పెద్దాపుర సంస్థాన అభివృద్ధి
***************************
సంస్థానం లో గల అన్ని గ్రామాలకు వాడవాడ లా మంచినీటి నుయ్యల నిర్మాణం జరిగింది -
మెట్ట ప్రాంతాల సాగుకు అనువుగా చెరువులు త్రవ్వించడం జరిగింది. అన్ని గ్రామాలలో ఉచిత ఆయుర్వేద శాలలు అంటువ్యాదులు ప్రబలినప్పుడు పెదబ్రహ్మదేవం నుంచి ఆయుర్వేద వైద్యులు అన్ని గ్రామాలలో పర్యటించేవారు.... ఆయుర్వేద సత్ సంబందిత ఆశ్రమాలకు విరివిగా విరాళాలిచ్చి ప్రోత్సహించేవారు.
పెద్దాపురం సంస్థానమునకు పరిశిష్ఠమయిన కొఠామ్ ఎస్టేట్ ను తుని రాజధాని గా పరిపాలించిన వెంకట సింహాద్రి రాజుగారు ఆయుర్వేద శాస్త్రంలో దిట్ట వీరి యొక్క సీతా రామ నిలయ ముద్రాక్షరశాలలో అనేక వైద్య గ్రంధాలు ముద్రించబడినవి. అవి ప్రజలకు చేరువ కావడం కోసం బుర్రకధా , హరికధా కాలక్షేపాలకి ముందు, మద్య-మద్యలో, చివరలో వాటియొక్క ఆవశ్యకతలను వివరించమనే వారు - ప్రజలు మాత్రం మంత్రాలు - మూడాచారాలనే ఎక్కువగా నమ్ముకునేవారు .--------------------------------------------------------------------@ రాజా వత్సవాయి రాయ జగపతి వర్మ గారు.@
అంటరానితనం - అస్పృస్యత నివారణకు హరిజనులతో పండితులని మమేకం చేయడానికి పెద్దాపురం మహారాజు గొప్పపధకం ను "ప్రభు పాద రక్షా వశీకరణ" ( బహుళ ప్రాచుర్యం లో ఉన్న ఆసక్తి కరమైన ఈ కధని వేరే పోస్ట్ ద్వారా తెలియ జేస్తాను) ------------------------------------------------------------------- @ వంగలపూడి శివకృష్ణ @
పాలకులందరూ పేద ప్రజారహిత పెద్దాపురాన్ని కాంక్షించారు.
**************************************************************
అన్ని వృత్తులకీ సమాన ప్రాదాన్యం ఇచ్చారు . వారి యొక్క ఉత్పత్తులను అమ్ముకోవడానికి గ్రామగ్రామాన సంతలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభువులు నిత్యం ప్రజలతో మమేకం అవుతూనే వుండేవారు.
ప్రజలలో విద్యపై అవగాహన కల్పించడానికి గొప్ప కృషి చేసారు.
పండిత పోషణ ఘనం గా జరిగేది ... పండితులకు అగ్రహారాలు దానం గా ఇవ్వబడేవి.
పాలకులందరూ శ్రీ రామ భక్తులు కావడం చేత సంస్థానం లోని అన్ని గ్రామాలలోని అనేక చోట్ల శ్రీ రామాలయాలు నెలకొల్ప బడినవి ఇతర దేవాలయాల నిర్మాణానికి విరివిగా విరాళాలిచ్చారు.
చుట్టుపక్కల భూస్వాములు-జమిందారులతో మాట్లాడి - పాఠశాలలు నిర్మాణం జరిగింది.
అప్పట్లో తునిలో వేద పాఠశాల ని - 30, 000 (ముపై వేల రూపాయల) తో 1922 లో రాణీ గోశా ఆస్పత్రి ని - 1923 లో డబ్బై వేల రూపాయలతో ఉన్నత పాఠశాలని నిర్మించడం జరిగింది
పాదచారులు పేదలకు మూడు పూటలా కడుపు నింపే నిమిత్తం - రాయ జగపతి (1797 - 1804) రెండవ బార్య అయిన బుచ్చి సీతాయమ్మ గారు పెదాపుర సంస్థానాన్ని పరిపాలించిన కాలం (1828 - 1833) లో పెద్దాపురం లో ఒక సత్రం మరియు ఒంటిమామిడి – కత్తిపూడి - తుని లలో అన్నదాన సత్రాల నిర్మాణం జరిగింది.
పెద్దాపురంలో అమ్మన్న అనే జమిందారు యొక్క ఇల్లు స్వాదినం చేసుకుని సత్రాన్ని నిర్మిచిందని ఆ సత్రానికి నిర్వహణ నిమిత్తం ఐదు వందల ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయ స్థలాన్ని కేటాయించినాదని. ఆ తరువాత కాలంలో వచ్చే ఆదాయంలో సత్రాల నిర్వహణకు పోగా మిగులు నిధులను - ఉన్నత విద్యకోసం వేరు ప్రాంతాలకు వలస పోతున్న విద్యార్దుల సౌకర్యార్దం బుచ్చి సీతాయమ్మ గారి జ్ఞాపకార్ధం పెద్దాపురంలో శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహా రాణీ కళాశాల నిర్మాణం జరిగిందని - ఈ నిర్మాణానికి శ్రీ రాజా వత్సవాయి కృష్ణమరాజ బహద్దరు గారు , భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, శ్రీ..ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు గారు ప్రముఖ పాత్ర వహించారని - ఏనుగుల వీరాస్వామి వారు తన రచన అయిన "కాశీ యాత్ర చరిత్ర" లో పేర్కొనడం జరిగింది. ------
@ ఏనుగుల వీరాస్వామి @
కళలకు కాణాచిపెద్దాపురం
**************************
శిల్ప కళా, స్వర్ణ, కుమ్మరి, చేనేత, ఒక వెలుగు వెలిగాయి.
సంప్రదాయ కళలైన , పులి నృత్యం - గరగ - తోలుబొమ్మలాటలు - బుర్రకధ - సాము గరిడీ - కోలాటం - కబడ్డీ - కుస్తీ లు బహు ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి నుండి కళాకారులు ఇతర రాష్ట్రాలకు సైతం ప్రదర్శనలకు వెళ్ళేవారు .
కలియుగ భీముడు జగత్ ప్రసిద్ద మల్లయుద్ధ వీరుడు *కోడి రామమూర్తి నాయుడు* (1880 - 1938) పెద్దాపురం సంస్థానము తుని పాలకుల ప్రోత్సాహంతో అనేకమంది యువకులకి మల్లయుద్ద మెలుకువలు నేర్పారు.
*నాట్యకళ* లో పెద్దాపురం కళావంతులు ఆరితేరిన వారు మాండూక శబ్దానికి జనరంజకం గా నాట్యం చేయడం అంటే సామాన్య విషయం కాదు . కానీ ఆ నాట్యాన్ని పెద్దాపురం నాట్య కళాకారిణిలు అలవోకగా చేసే వారు
*తైలవర్ణ చిత్రకళ* (ఆయిల్ పెయింటింగ్స్) ను ఎంతగానో ప్రోత్సహించారు
ఇక్కడి కళాకారులు 18వ శతాబ్దం లో కేరళ, ముంబాయి నగరాలకు సైతం వెళ్లి వారి వారి చిత్రరాజాలను ప్రదర్సనకి ఉంచారు
పెద్దాపురం సంస్థానము వారు పోషించిన ప్రముఖ పండితులు :
**************************************************************
శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు (ఏనుగు లక్ష్మణ కవి గారి ముత్తాత)
వెలుతురుపల్లి విశ్వనాధ కవి
ఏనుగు లక్ష్మణ కవి
పరవస్తు వేంకట రంగా చార్యులు
వేదుల సత్యనారాయణ శాస్త్రి
కాశీబట్ట బ్రహ్మయ్య శాస్త్రి
చిలుకూరి సోమనాధ శాస్త్రి
పింగళి సూర్యనార్యుడు
హోతా వేంకటకృష్ణ కవి
చావలి రామశాస్త్రి
సలజర్ల గంగరాజు
ఆణివిల్ల వేంకట శాస్త్రి …….
ఇంకా మరికొందరు.................. @రాజా వత్సవాయి రాయ జగపతి వర్మ గారు.@

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...