మన పెద్దాపురం : చాగంటి వారి మొట్టమొదటి ఉపన్యాసం పెద్దాపురంలోనే :
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
శంకర శతక కర్త శ్రీ చాగంటి సుందర శివ రావు గారు మరియు శ్రీమతి చాగంటి సుశీలమ్మ దంపతుల ప్రధమ సంతానంగా 1959 జులై 14 న జన్మించిన శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చిన్నతనం నుంచీ తల్లి తండ్రుల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు, ఎక్కడ ఆధ్యాత్మిక సభలు జరిగినా చటుక్కున వాలిపోయే చాగంటి వారు సుమారు 25 సంవత్సరాల క్రితం పూజ్యశ్రీ మాతా శివ చైతన్య నందిని గారు లలిత సహస్రనామ పారాయణం నిమిత్తం పెద్దాపురం వస్తున్నారన్న సంగతి తెలుసుకుని ఎంతో ఉత్సాహంగా పెద్దాపురం వచ్చారు. ఆ అద్యాత్మికసభలో మాతా శివ చైతన్య గారు కాసేపు ఉపన్యసించి, ఉపన్యాసం మధ్యలో ఎవరైనా భాగవతం గురించి మాట్లాడవలసినదిగా కోరారట. అయితే అప్పటికే అన్నిఆధ్యాత్మిక విషయాలపై గురుదేవులు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి ద్వారా అవగాహన పెంచుకున్న చాగంటివారు మాట్లాడానికి తటపటాయించే లోపు వారి పక్కనున్న ఒక మిత్రుడు చాగంటి కోటేశ్వరరావు గారిని ముందుకు నెట్టారంట, ఆరోజు భాగవతం గురించి తనకు తెలిసిన విషయాల్ని సభలో అందరిముందూ ఉపన్యసించారంట అలా అమ్మ పూజ్యశ్రీ మాతా శివచైతన్య దేవి ఆశీస్సులతో పెద్దాపురం లో ప్రారంభమైన ఆయన ఉపన్యాస ప్రస్థానం అతని గురుదేవులు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి ప్రోత్సాహం, సహ ధర్మ చారిణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారి సహవాసంలో ఎలాంటి మలుపు తీసుకుందో ఎన్ని కోట్ల హిందువుల హృదయాలను భక్తిభావంతో నింపేసిందో , ఎంతమంది టెలివిజన్ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిందో నాలాంటి అరకొర భక్తులు మీకు చెప్పనవసరం లేదు. ఆ మహానుభావుడు ఇలాగే యావత్ భారతానికి ఆధ్యాత్మిక వెలుగులు పంచాలని, మతాన్ని మానవత్వం తో మిళితం చేసి మూర్ఖ జనసందోహాన్ని మంచిమార్గం పట్టిస్తూ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ - మీ వంగలపూడి శివకృష్ణ మన పెద్దాపురం టీం
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
No comments:
Post a Comment