Thursday 19 January 2017

మన పెద్దాపురం : అజరామర శిల్పులు PEDDAPURAM ARCHITECTURES


మన పెద్దాపురం : అజరామర శిల్పులు - అగ్నికుల క్షత్రియులు - 1
గొల్లల మామిడాడ గాలి గోపురం ఎప్పుడైనా చూసారా ? దానిని కట్టిన శిల్పాచార్యుడు మన పెద్దాపురం వాసి కీ.శే బుడత సూర్యారావు గారు ఎంతమందికి తెలుసు... బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు
..

అందుకే పెద్దాపురం చరిత్రను ప్రపంచానికి పరిచయడమే ప్రధమ లక్ష్యంతో ప్రారభించబడిన ఈ గ్రూప్ ద్వారా మన అజరామర శిల్పులందరి గురించి చెప్పదలుచుకున్నాం ... !
..
పెద్దాపురం శిల్పకళ :
ఎంతో ప్రసిద్ధమైన ఈ శిల్పకళ పెద్దాపురం సంస్థానంలో చాళుక్యుల పరిపాలన కాలంలోనే పురుడు పోసుకుంది. అయితే కాలక్రమంలో ఆదరణ కరువవడం మూలాన ఈకళ దాదాపు అంతరించిపోయింది అదే క్రమంలో ఒకప్పుడు రాజరికాలలో ఒక వెలుగు వెలిగి అంతర్ కలహాల వల్ల దుర్భర దారిద్యాన్ని అనుభవించి పొట్ట చేతబట్టుకుని పొరుగు ప్రాంతాలు వలసపోయిన అగ్నికుల క్షత్రియులు ఆ శిల్పకళకు జీవం పోశారు ఎంతో మహత్తరమైన ఈ కళను ప్రపంచ దేశాలలో నిలపడం ద్వారా పెద్దాపురానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చారు.
..
గొల్లల మామిడాడ శ్రీకోదండ రాముని ఆలయం గణాంకాలు:
1889 లో ఆలయ నిర్మాణం జరిగింది 1939లో ఈ ఆలయంను పునః నిర్మించారు. ఆ తరువాత 1950లో 160 అడుగుల ఎత్త్తెన 9 అంతస్థులతో ఒక గాలిగోపురం తూర్పు ముఖం గా నిర్మించారు. ఈ గాలిగోపురం నిర్మాణం లో బుడత సూర్యారావు గారు కూలీగా పనిచేశారు, తిరిగి 1958 లో 200 అడుగుల ఎత్తయిన 11 అంతస్థుల గోపురాన్ని పశ్చిమ వైపు నిర్మించారు. ఈ నిర్మాణానికి పనిచేసిన శిల్పకళాకారులందరికీ శ్రీ బుడత సూర్యారావు గారే నేతృత్వం వహించారు. ఈ గోపురాలపై రామాయణ గాథను బొమ్మల రూపంలో మన బుడత సూర్యారావు గారు చక్కగా వివరించారు.
..
ఆయన ఈ గోపురం నిర్మాణం కోసం ఎంత కృషి చేశారంటే ఆ గోపురాన్ని చూసిన ఎవ్వరైనా సరే అది 50 సంవత్సరాల క్రితం కట్టిన గోపురం అంటే నమ్మరు అది అత్యంత పురాతన మైనది అని పూర్వకాలం మహా శిల్పులు కట్టింది అని కథలు కథలు గా చెప్పుకుంటుంటారు. ఒక్క సారి అది పెద్దాపురం వాసులు కట్టింది అని నిరూపించగానే అవాక్కయిపోయి శిల్పాచార్యులకి శిరశు వంచి నమస్కారం చేస్తారు. మన పెద్దాపురం స్థాయిని అంత ఎత్తులో నిలబెట్టిన గొప్ప శిల్పకారులని కనీసం స్మరించుకోలేమా ... ! అందుకే మహా కళాకారులారా ... !
వందలాది వందనాలు అందుకోనగ అర్హులై చందన పూమాళికలను మీ సందిట చేర్చుకోండి. మీ కళా దాహాన్ని శిలా సృష్టితోనే తీర్చుకోండి - ధన్యవాదాలతో మీ వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...