జనహితం కోసమే జన విజ్ఞాన వేదిక :
మూడనమ్మకాల నివారణ, ఆరోగ్య అవగాహన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలతో ప్రజలలో చైతన్యం తీసుకురావాలనే ఉన్నత లక్ష్యంతో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి.వి సత్యనారాయణ గారు, జిల్లా కార్యధర్శి లక్ష్మీనారాయణ, అనంతరావు గార్ల ఆద్వర్యంలో మన పెద్దాపురం జన విజ్ఞాన వేదిక నూతన కార్యవర్గం ఏర్పాటుచేయబడింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... గురజాడ కందుకూరి అడుగుజాడల్లో... సాహిత్యమైనా సాంకేతిక పరిజ్ఞానమైనా సమాజ శ్రేయస్సు కోరేవిధంగా ఉండాలన్నారు.
దేశం కోసం సైన్స్ - ప్రజలకోసం సైన్స్ - సమాజ శ్రేయస్సు కోసం సైన్స్ ఇదే జనవిజ్ఞాన వేదిక లక్ష్యం అన్నారు
పరిశుభ్రతపై ప్రజలకి సరైన అవగాహన లేకపోవడం వల్ల దేశంలో ఏటా 30 లక్షల మంది చిన్నారులు వాంతులు విరోచనాల భారిన పడి మృత్యువాత పడడం ఆందోళన కలిగించే విషయం అని వాపోయారు
క్యూబా వంటి దేశాలలో... ప్రతీ పది కుటుంబాలకి ఒక డాక్టర్ ఉంటారన్నారు ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన ఉంటుందన్నారు... మరి అటువంటి దేశాలతో పోల్చి చూస్తే మనం చాలా వెనుకబడిఉన్నాం అన్నారు
ఈ రోజుల్లో కూడా... సూర్యున్ని చూడటంలో చంద్రున్ని చూడటంలో... చివరికి "తల్లి తన పిల్లలకి పాలిచ్చే విషయంలో కూడా అనేకమైన అపోహలు ఉండటం బాధాకరం అన్నారు... అందుకే జన విజ్ఞాన వేదిక ద్వారా #తల్లి_పాల_వారోత్సవాలు #మహిళా_దినోత్సవం లు నిర్వహిస్తున్నామన్నారు.
#నూతన_కార్యవర్గం :
మహరాణీ కళాశాల అద్యాపకులు ధరణాలకోట గంగాధరుడు గారు అధ్యక్షులుగా వంగలపూడి శివకృష్ణ, రాజేశ్వరరావులు ఉపాధ్యక్షులుగా, కమలాకర్ గారు గౌరవ అధ్యక్షులుగా, శ్రీనివాసరావుగారు ప్రధాన కార్యధర్శిగా, టి.రాజేష్ రమణ, సూర్యనారాయణ, శైలజ, సత్యనారాయణ, కృష్ణమూర్తి, మోహనరావు, సురేష్ లు సహాయ కార్యదర్శిలుగా ఎంపికయ్యారు

No comments:
Post a Comment