Thursday 19 January 2017

MANA PEDDAPURAM SURYA RAO HOTEL

మన పెద్దాపురం సూర్యారావు హోటల్
--------------------------------------
అణా కి ఒక టీ - రూపాయి కి భోజనం నుండి మొదలైన హోటల్ ప్రస్థానం పరిసరాల ప్రాంతాల పాలిట పూటకూళ్ళ ఇల్లై పేదప్రజల పలహార శాలగా మారి కడుపునింపింది ప్రేమను వండి వార్చే పాకశాస్త్ర ప్రావీణ్యుల ప్రయోగశాల గా పేరు గాంచింది పేరుకి శ్రీ వెంకటేశ్వరా హోటల్ & లాడ్జి అయినా మా పెద్దాపురం వాసులకి మాత్రం అది సూర్ర్రావు హోటలు గానే ప్రసిద్ధం
పెళ్లి విందును తలపింపచేసే మర్యాద పూర్వక ఆహ్వానం తోనే మన కడుపులు సగం నిండి పోతాయి పెద్దాపురం మరియు పరిసర ప్రాంతాలలోని ఏ ఒక్కరినైనా కదిపి పెద్దాపురం లో ఒక మంచి హోటలు పేరు చెప్పవయ్య అని అడిగితే వెంటనే చెప్పే ఒకే ఒక్క పేరు సూర్యారావు బోజన హోటల్.
ఇప్పుడు కలకపల్లి వారంటే జిల్లాలోనే పెద్దపేరు సూర్యారావు హోటల్ కి ఇప్పటి యజమాని శ్రీ కలకపల్లి రాంబాబు గారు ఆత్మ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) చైర్మన్ కూడా ...
మరి వీటన్నిటి వెనుక ఒక మనీషి నిరంతర తపన, శ్రమ, కృషి, అంకుటిత దీక్ష దాగివుంది అది తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి.
అలనాటి పెద్దాపురంలో మూడు పెద్ద హోటల్స్ ఉండేవి
1 . దివిలి సుబ్బారావు హోటలు
2. చిట్టబ్బాయి హోటలు
3. అయ్యర్ హోటలు -
దివిలి సుబ్బారావు గారి హోటలు లో సామాన్య సర్వరు గా ప్రారంబమైన కలకపల్లి సూర్యారావు గారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో అవమానాలు - హోటల్ సర్వర్ కి పిల్లనిస్తామా అంటూ అవహేళనలు
ఆ అవమానాలే తనకి జీవితం లో ఎదిగి సర్వెంట్ స్థాయి నుండి యజమానిగా మారాలన్న దృడ సంకల్పం ఏర్పడింది. అనుకున్నదే తడవుగా మిత్రుడు తో కలిసి హోటలు నుండి బయటకి వచ్చేసారు - అప్పటికే అయ్యర్ హోటల్ టీకి బాగా ఫేమస్ ఆ టీ ని మించిన విదంగా ఆ మిత్రులిద్దరూ కలిసి టీ స్టాల్ ఏర్పాటు చేసారు - అప్పటికే ఉన్న మూడు హోటల్స్ తాలూకు యజమానులు కస్టమర్స్ కి విలువిచ్చే వారు కారు - సాదారణంగానే శాంతం - సుగుణం - ఓపిక ఎక్కువ గల సూర్యారావు గారి టీస్టాల్ వద్ద మాత్రం దానికి భిన్నంగా కస్టమర్స్ కి మర్యాదలు ఆత్మీయ పలకరింపులు జరిగేవి ఇంకేముంది చూస్తుండగానే సీన్ మారిపోయింది సూర్యారావు గారి హోటలు దిన దిన ప్రవర్ధమానమై తమ హోటల్ కి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కడుపు నింపడమే ప్రాధమిక ధ్యేయంగా సంపాదనకి ద్వితీయ ప్రాధాన్యతనిస్తూ అత్యున్నతంగా అధునాకరించబడుతూ అంచలంచలుగా టీస్టాల్ నుండి హోటల్ - హోటల్ నుండి లాడ్జి కి ఎదిగిపోయింది - దాని ఎదుగుదలకి ముఖ్యకారకులైన కీర్తి శేషులు శ్రీ కలకపల్లి సూర్యారావు గారి జీవితం కష్టాన్ని నమ్ముకునే ప్రతీ ఒక్క యువకుడికీ అనుసరణీయం - ఆదర్శనీయం - మీ వంగలపూడి శివకృష్ణ
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...