పెద్దాపురం పెరుగు పోరాటం : కొన్ని సంఘటనలు చాలా చిన్నవే అయినా చాలా ఆసక్తి కరంగా ఉంటాయి - ఆశక్తికరంగా ఉంటూనే ఎంతో స్ఫూర్తినీ ఇస్తాయి అలాంటి ఒక ఆసక్తి కరమైన చిన్న అంశమే పెద్దాపురం పెరుగు పోరాటం.
అలనాడు భారత దేశమంతా "పశుసంపద" "పాడిపంటలు" ఎక్కువగా విలసిల్లిన రోజుల్లో రైతులు వారి వారి ప్రాంతాలనుండి పెరుగు కుండలను కావిళ్ళతోనూ ఆడవారు తట్టలలోనూ పెట్టుకుని పరిసరప్రాంతాలకు వ్యాపార కేంద్రమైన పెద్దాపురానికి మోసుకొచ్చేవారట. సరిగ్గా ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉన్న ప్రాంతంలో పెరుగు అమ్మకాలు జోరుగా సాగేవంట - సాయంత్రం ప్రాంతంలో ప్రజలు చిన్న చిన్న మట్టి పాత్రలతో "ముంత పెరుగు" ను కొనుక్కొని ఇంటికి తీసుకుని పోయేవారంట,
వ్యాపారం మంచి లాభదాయకంగా సాగుతున్న దశలో పెరుగు విక్రయదారులు పన్ను చెల్లించాల్సిందిగా పురపాలక సంఘం ఆజ్ఞలు జారీ చేసిందట పురపాలక సంఘ తీరుపై ఆగ్రహించిన వినియోగ, విక్రయదారులు పెద్ద ఎత్తున పురపాలక సంఘానికి పోయి వారి అసంతృప్తి వ్యక్తం చేసారంట
అయినా దిగిరాని దొరతనానికి నిరశనగా పెరుగు విక్రయదారులు వారి మద్దత్తు దారులు ఆంజనేయస్వామి గుడి వద్ద బైఠాయించి పెద్దాపురంలో పెరుగు అమ్మకాలు నిలుపుదల చేసారంట నిరశన తీవ్రతను గమనించిన ఏలిన వారు దిగివచ్చి పన్ను ఎత్తివేసారంట ఆకాలం లో ఈ సంఘటన రైతు విజయంగా చిరు వ్యాపారస్తుల విజయంగా ప్రజా విజయంగా పేరుపొంది పెద్దాపురం పేరు ప్రతీ ఊరిలో మారు మోగిపోయిందంట.... చాలా ఆసక్తి కరం గా ఉంది కదా .... !
ఇలాంటి మరుగున పడిపోయిన కథలెన్నో ... అవన్నీ మీముందుకు తీసుకొచ్చే చిన్న ప్రయత్నం మన పెద్దాపురం గ్రూప్ ద్వారా ... మీ వంగలపూడి శివకృష్ణ
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
No comments:
Post a Comment