జవహార్ నవోదయా విద్యాలయ పెద్దాపురం -
గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ కలిగిన విద్యార్ధులకి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో 1985 వ సంవత్సరంలో నవోదయా విద్యాలయా సమితి (మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resource Development) , భారత ప్రభుత్వ విద్యా శాఖ యొక్క ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ) ప్రారంభం కాగా మొట్టమొదటి విద్యాలయం హర్యానా లో 05-03-1986 న స్థాపించడం జరిగింది తరువాతనెలలో 06-03-1986 న మహారాష్ట్రలో స్థాపించడం జరిగింది అదే క్రమంలో జనవరి 1989 లో మన పెద్దాపురంలో స్థాపించడం జరిగింది ఇలా భారతదేశం మొత్తం మీద 2014 నాటికి 596 విద్యా సంస్థలు నెలకొల్పబడ్డాయి (ఒక్క తమిళనాడు లో మాత్రం జవహార్ నవోదయా విద్యాలయం లేదు)
మన రాష్ట్రంలోనే 14 చోట్ల (జిల్లాకి ఒక్కటి ప్రకాశం జిల్లాకి రెండు) జవహార్ నవోదయ విద్యా సంస్థలు ఉన్నాయి
@జవహార్నవోదయావిద్యాలయపెద్దాపురం ప్రిన్సిపాల్ @
31-01-2014 వరకూ ఎ. ఎస్ ఎన్ మూర్తి గారు ప్రిన్సిపాల్ గా కొనసాగి పదవీ విరమణ చెయ్యగా
ప్రస్తుత జవహార్ నవోదయా విద్యాలయ పెద్దాపురం ప్రిన్సిపాల్ గా వి. మునిరామయ్య గారు కొనసాగుతున్నారు
@ప్రవేశంఅర్హత@
2016 - 2017 విద్యా సంవత్సరం జవహార్ నవోదయ విద్యాలయ ప్రవేశానికి గానూ
9 - 13 సంవత్సరాల మద్య వయస్సుగల 5 వ తరగతి చదివే విద్యార్దుల నుండి 2015 సెప్టెంబరు వరకూ దరఖాస్తులు స్వీకరించారు. ప్రవేశ పరీక్ష జనవరి 9 - 2016 న ఉదయం 11:30 కి జరగనుంది.
అర్హత వివరాలు :
విద్యార్ధి 9-13 సంవత్సరాల మద్య వయస్సుగల వాడై ఉండాలి.
5 వ తరగతి చదువుతూ ఉండాలి (గ్రామీణ ప్రాంత విద్యార్ధులు 3,4, మరియు 5 వ తరగతి చదివే వాడై ఉండాలి.)
ఒక విద్యార్ధి ఒక్కసారి మాత్రమే పరీక్ష వ్రాయడానికి అర్హుడు
@సీట్లురిజర్వేషన్లు@
జవహర్ నవోదయ ప్రవేశపరీక్షల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపికైన విద్యార్థులే సీట్లు పొందుతారు. ఢిల్లీ స్థాయిలో జరిగే ఈ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగవు. పరీక్షపత్రాలు కూడా ఢిల్లీ నుంచి వస్తాయి.
ఒక్క విద్యా సంవత్సరానికి గరిష్టంగా 80-90 మంది విద్యార్దులను మాత్రమే ఎంపిక చేసుకుంటారు గ్రామీణ ప్రాంత విద్యార్ధులకి 75% పట్టణ ప్రాంత విద్యార్ధులకి 25% సీట్లు మొత్తం సీట్లలో విద్యార్ధినులకి(ఆడపిల్లలకి 1/3 మూడు వంతులలో ఒక వంతు సీట్లు మరియు 3 శాతం వికలాంగులకి కేటాయించ బడతాయి అంటే ప్రతి వందమంది నవోదయ విద్యార్ధులలో 33 మంది అమ్మాయిలు ముగ్గురు వికలాంగులు ఖచ్చితం గా ఉంటారన్న మాట.
బారత దేశంలోనే ఒక విద్యార్ధి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, యూనిఫాం , ఉచిత నివాసం, భోజనం, విద్యా వసతిలను కల్పిస్తున్న ఒకే ఒక్క మొట్టమొదటి సంస్థ (11 - 12 తరగతులు చదివే జనరల్ (ఉన్నత కులానికి చెందిన) విద్యార్ధుల నుండి మాత్రం నెలకి 200 రూపాయలు నవోదయ వికాస నిధి పేరిట తీసుకుంటారు ఒక వేళ వారు దారిద్య రేఖకి దిగువన ఉన్నవారైతే చెల్లించనవసరం లేదు)
విద్యార్ధుల కి వసతిగృహాలు ఆరావళి, నీలగిరి, శివాలిక్ మరియు ఉదయగిరి వంటి పర్వతా ల పేర్లతో ఏర్పాటు చెయ్యబడతాయి
‘Hami Navodaya Hain’ అనే ప్రార్ధనా గీతంతో తరగతులు ప్రారంభం అవుతాయి
పూర్వపు గురుకులాలను తలపించేలా గొప్ప క్రమ శిక్షణతో కూడిన విద్య
ప్రతీ విద్యార్ధి తప్పని సరిగా బహుబాషా ప్రావీణ్యం ( కనీసం 3 బాషలు) పొందేలా శిక్షణ వుంటుంది
ప్రత్యేక ఆసక్తి ఉన్న 9 వ తరగతి చదివే విద్యార్ధులలో 30 శాతం మందిని ఎంపికచేసి ఇతర రాష్ట్రాల లోని నవోదయా విద్యాలయాలకి పంపించడం జరుగుతుంది, అక్కడివారిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది
ప్రతీ విద్యార్ధి లోనూ అంతర్లీనంగా ఉన్న కళలను వెలికి తీయడానికి ప్రతీ వారం ఒక విభిన్న కార్యక్రమం
సామ్ సంగ్ స్మార్ట్ లాబ్ టెక్నాలజీ ద్వారా సాంకేతిక పద్దతులలో శిక్షణ
రోజుకు రెండు గంటలు తప్పనిసరి క్రీడలు ప్రతీ సంవత్సరం క్రీడా సంబరం 3 రోజులు పాటూ జరిగే క్రీడోత్సవాలకు దాదాపు 50 నవోదయా విద్యాలయాలు పాల్గొంటాయి.
ఇక్కడ చదివిన విద్యార్ధులు దేశ విదేశాలలో అనేకమైన ఉన్నత స్థానాలలో వున్నారు సెప్టంబరు 2012 సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ వేడుక ఘనంగా జరుగగా ప్రపంచం నలుమూలలనుండీ అందరూ హాజరై పాత జ్ఞాపకాల్ని అందరితోనూ పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు
నవోదయా లో చదువుతున్న చదివిన ప్రతి విద్యార్ధికి
www.jnvalumini.com (జె న్ వి అల్యూమిని) పేరుతో ఉన్న ఒక వెబ్సైటు లోకి ప్రవేశం వుంటుంది - ఈ వెబ్ సైటు ద్వారా ఆయా నవోదయా విద్యాలయాల వివరాలు తెలుసుకొనేలా మరియు నవోదయా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు సౌలబ్యం వుంటుంది
ఇటీవల అంతర్గత మాట్రిమోనీ (నవోదయా అద్యాపకులు - నవోదయాలో చదివి స్థిరపడిన యువతీ యువకులకి పరస్పర అంగీకారంతో వివాహాలు జరగడం విశేషం)
మీ వంగలపూడి శివకృష్ణ
No comments:
Post a Comment