పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
పూర్వకాలంలో గ్రామ ప్రజలందరినీ ప్రమాదాల నుండి కాపాడుతూ, అన్నదాతలైన రైతుల పంటలను కాపాడుతూ, సకాలంలో వర్షాలు కురిసేలా చేస్తూ, అకాల మృత్యు భయాన్ని పారద్రోలే గ్రామ దేవతగా పెద్దాపురం మహారాజా వారి కోటలో #కోటసత్తెమ్మ అమ్మవారు* వెలిసారు
కోట సత్తెమ్మ #అమరగిరిసత్తెమ్మ గా ఆవిర్భవించిన విధానం
ఆలయ వ్యవస్థాపకులలో ఒకరైనటువంటి కీ.శే. #శ్రీ_చలపతి రావు గారికి అమ్మ వారు కలలో కనిపించి రాజుగారి కోటలో కొలువై ఉన్న విషయం తెలుపగా చలపతి రావు గారు ఆ విషయాన్ని ప్రధాన ఆలయము, ఉపఆలయ వ్యవస్థాపకులు #శ్రీ_పప్పలనాగరాజు* గారికి తెలియజేయడం జరిగింది వెనువెంటనే ఇద్దరూ రాజు గారి కోట సమీపించి అమ్మవారి మూల విగ్రహాన్ని గుర్తించి జగ్గంపేట రోడ్డు సమీపంలో ప్రతిష్టించడం జరిగింది (ఇప్పటికీ ఆ మూల విగ్రహం ఆలయం లోనే ఉంది)
ఆనాటి నుండీ పెద్దాపురం అమరగిరి - పాండవుల మెట్ట సమీపంలో కొలువైన శ్రీ సత్తెమ్మ అమ్మవారు - *కోట సత్తెమ్మ అమ్మవారి నుండి అమరగిరి అమ్మగా* వెలుగొందుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై ... అష్ట ఐశ్వర్య సుఖసంతోషాలు సిరి సంపదలిచ్చే అమ్మగా ... గజ్జిల, పేద గoదo, పప్పల వారికి కుటుంబ దేవత గా వేలుగోoదినది మరియు అనేకులు అమ్మను కుటుంబ దేవతగా ఆరాధన చేస్తున్నారు...
అమరగిరి సత్తెమ్మ అమ్మవారు అష్టాదశ హస్తాలతో దుష్ట శక్తులను రూపుమాపే అభయ స్వరూపిణిగా #ఓం_ఐం_హ్రిం_శ్రీం_శ్రీ_సత్యాంబికాయైనమః' అన్న మంత్రోచ్చరణతో విరాజిల్లే అమరగిరి సత్తెమ్మ అమ్మవారిగా... భక్తుల పూజలందుకొంటున్నారు,
ప్రస్తుతం శ్రీ శక్తిపీఠంగా అలరారుతున్న ఈ ఆలయానికి 1973 ప్రాంతం నుండీ పప్పల నాగరాజు దంపతులు ప్రధాన అర్చకులుగా వ్యవరిస్తూ అనేక యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ అమ్మవారి సేవచేసారు, అనంతరం వారి కుమారుడు శ్రీ పెదబాబు గారు (గురువర్యులు) అమ్మవారికి ఘనంగా ఉయ్యాల తాళ్ల ఉత్సవం మరియు భోగినుండి కనుమ వరకూ అత్యంతవైభవంగా మేళతాళాలతో, గరగ నృత్యాలతో, బాణా సంచాతో తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన జాతరలో ఒకటిగా ఈ జాతర మహోత్సవం జరిపిస్తున్నారు -
ఈ కార్యక్రమానికి అమ్మవారి భక్తులు, పెద్దాపురం ప్రజలు, పోలీసు, అగ్నిమాపక, వైద్య శాఖ మరియు పురపాలక సంఘం వారి సహాయ సహకారాలతో, ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అమ్మవారి ఆలయ సంరక్షణాభివృద్ది చేస్తూండటం గమనార్హం
1. ఆలయం ఎదురుగా ఉన్న కోట సత్తెమ్మ పంచ మహా వృక్షం - మర్రి, వేప, జువ్వి, నేరేడు, రావి వృక్షాల మిళితమై పరమ పవిత్రతను సంతరించుకుంది.
2. ఈ ఆలయం చుట్టూ నాగుల విగ్రహాలతో అష్ట నాగదిగ్బంధనం ఉంటుంది.
3. ఆలయ ప్రాంగణంలో అమ్మవారు అష్టోత్తర- శత నామావళిలతో కీర్తించబడతారు.
4. ఆలయంలో త్రిభైరవమూర్తులు (కాలభైరవ.. వటుక భైరవ.. స్వర్ణాకర్షణ భైరవ) కొలువై వుండడం కూడా చెప్పుకోదగ్గ విషయం.
5. స్ఫటిక విఘ్నేశ్వరుడు యిక్కడ చాలా ప్రసిద్ధి ..
6. నవ దుర్గా స్తోత్ర పారాయణం తో కూడిన చిత్రాలు నవ దుర్గలు (శైలపుత్రి దుర్గ, బ్రహ్మచారిణి దుర్గ, చంద్రఘంట దుర్గ, కూష్మాండ దుర్గ, స్కందమాత దుర్గ, కాత్యాయని దుర్గ, కాళరాత్రి దుర్గ, మహాగౌరి దుర్గ, సిద్ధిధాత్రి దుర్గ )
7. ఈ ఆలయం నందు ఉండు ఉప ఆలయం నందు శ్రీ వరాహి అమ్మవారు నిజరూపంలో ప్రతిరోజు తెల్లవారుఝామున గం.4 నుండి గం.5వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది.
8. .శ్రీ శక్తిపీఠంనందు శ్రీ చక్రయంత్ర సహిత వనదుర్గాదేవికి ఘనంగా యజ్ఞయాగాదులను నిర్వహించడం జరుగుతుంది.
9. దూప.. దీప.. నైవేద్య ప్రసాదాలతో నిత్యం అలరారే శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు జాతర సమయంలో గరగ ప్రభలతో భక్తులకు దర్శనమిస్తారు. #మీ_వంగలపూడి_శివకృష్ణ
No comments:
Post a Comment