Thursday, 2 November 2017

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం)


అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలో భాగమైన ఏలేశ్వరం ప్రాంతంలో తిమ్మ జగపతి మహారాజు ప్రజల కోసం పెద్ద చెరువు త్రవ్వించాడట ఐతే విచిత్రంగా లింగంపర్తి వైపు గట్టు ఎప్పుడూ తెగిపోతుండెదట. బండ్లకొద్దీ మట్టివేసి ఏనుగులచేత త్రొక్కించి గట్టు బిగించినా కూడా కొట్టుకుపోయేదట.

అప్పుడు వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారికి కలలో ఒక దేవత కనిపించి అక్కడికి నిత్యం పాలు తెచ్చే గొల్లాలమ్మ అనే ముసలిదాన్ని అక్కడ నిలిపి ఆమెపై గట్టు వేసేస్తే ఆగట్టు నిలుస్తుందని చెప్పిందట.

ఈ విషయాన్ని ఎలా వెల్లడి చేయాలో అర్ధంకాక తీవ్రమైన మనోవేదన తోనే ముసలవ్వని పిలిచి జరిగిన విషయం నివేదించారట మహారాజు గారు

గ్రామరక్షణార్ధం ఆ అవ్వ అందుకు సిద్ధపడిందట. తెగిపోయే గట్టు దగ్గర గొల్లలమ్మను నిలబెట్టి మట్టితో కప్పేసి గట్టు వేశా ట అప్పటి నుండి విచిత్రంగా గట్టు కొట్టుకుపోవడం నిలిచి పోయిందట. నాటినుండీ ఆమెను గ్రామ ప్రజలంతా దేవతగా కొలుస్తారు. ఆమెకు మదుం కూడా కట్టించారు. అదే గొల్లాలమ్మ మదుం. ఆ మదుందగ్గర తొల్లాలమ్మా !!! అని పిలిస్తే ఓయ్ అని తిరిగి శబ్దం వస్తుందట. ఆమె జాతర రోజున మొక్కుబళ్ళుగా కోళ్ళు, మేకలు విశేషంగా కొస్తారు. ఆమెను మొక్కుకుంటే ఏ కోరిక అయినా తీరుతుందని. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తండోప తండాలుగా జాతరకు వస్తారు. విశేషమేమంటే ఉదయం నుంచీ మంచి జోరుగా వచ్చేజనం ప్రొద్దుగూకే టప్పడికి ఒక్కరు కూడా కనపడరు. రాత్రికి అక్కడ ఉండరాదని అమ్మ వారి ఆదేశమట. అది అసలే అడవి ప్రాంతం కావడంతో పాములు, మండ్రగబ్బలు క్రూరమృగాలు ఎక్కువగా సంచరించేవి అయితే ఆ అమ్మవారి పేరు తలిస్తే మాత్రం అవి ఏమీ చేయవని అక్కడి వాళ్ళనమ్మకం.

#గోదావరి_జానపదుల_నిసర్గ నుండి
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...