Thursday, 2 November 2017

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం)


అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలో భాగమైన ఏలేశ్వరం ప్రాంతంలో తిమ్మ జగపతి మహారాజు ప్రజల కోసం పెద్ద చెరువు త్రవ్వించాడట ఐతే విచిత్రంగా లింగంపర్తి వైపు గట్టు ఎప్పుడూ తెగిపోతుండెదట. బండ్లకొద్దీ మట్టివేసి ఏనుగులచేత త్రొక్కించి గట్టు బిగించినా కూడా కొట్టుకుపోయేదట.

అప్పుడు వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారికి కలలో ఒక దేవత కనిపించి అక్కడికి నిత్యం పాలు తెచ్చే గొల్లాలమ్మ అనే ముసలిదాన్ని అక్కడ నిలిపి ఆమెపై గట్టు వేసేస్తే ఆగట్టు నిలుస్తుందని చెప్పిందట.

ఈ విషయాన్ని ఎలా వెల్లడి చేయాలో అర్ధంకాక తీవ్రమైన మనోవేదన తోనే ముసలవ్వని పిలిచి జరిగిన విషయం నివేదించారట మహారాజు గారు

గ్రామరక్షణార్ధం ఆ అవ్వ అందుకు సిద్ధపడిందట. తెగిపోయే గట్టు దగ్గర గొల్లలమ్మను నిలబెట్టి మట్టితో కప్పేసి గట్టు వేశా ట అప్పటి నుండి విచిత్రంగా గట్టు కొట్టుకుపోవడం నిలిచి పోయిందట. నాటినుండీ ఆమెను గ్రామ ప్రజలంతా దేవతగా కొలుస్తారు. ఆమెకు మదుం కూడా కట్టించారు. అదే గొల్లాలమ్మ మదుం. ఆ మదుందగ్గర తొల్లాలమ్మా !!! అని పిలిస్తే ఓయ్ అని తిరిగి శబ్దం వస్తుందట. ఆమె జాతర రోజున మొక్కుబళ్ళుగా కోళ్ళు, మేకలు విశేషంగా కొస్తారు. ఆమెను మొక్కుకుంటే ఏ కోరిక అయినా తీరుతుందని. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తండోప తండాలుగా జాతరకు వస్తారు. విశేషమేమంటే ఉదయం నుంచీ మంచి జోరుగా వచ్చేజనం ప్రొద్దుగూకే టప్పడికి ఒక్కరు కూడా కనపడరు. రాత్రికి అక్కడ ఉండరాదని అమ్మ వారి ఆదేశమట. అది అసలే అడవి ప్రాంతం కావడంతో పాములు, మండ్రగబ్బలు క్రూరమృగాలు ఎక్కువగా సంచరించేవి అయితే ఆ అమ్మవారి పేరు తలిస్తే మాత్రం అవి ఏమీ చేయవని అక్కడి వాళ్ళనమ్మకం.

#గోదావరి_జానపదుల_నిసర్గ నుండి
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Tuesday, 25 April 2017

HAPPY BIRTHDAY WISHES IN TELUGU

మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు 

మీలాంటి మంచి మనుషులైన
వేలాది మందిని నాకు దగ్గర చేసిన 
లక్ష లక్షణాల ఒక్కొక్క అక్షరానికి 
కోటాను కోట్ల నమస్కారాలతో

వంగలపూడి శివకృష్ణ

Friday, 21 April 2017

శ్రీ రాజా వత్సవాయ జగపతి బహద్దరు మహరాణీ బుచ్చి సీతాయమ్మ దేవి చరిత్ర - Peddapuram Queen Butchi Seethayamma Devi




మేని ముసుగులో మానవత్వం 
అన్నార్తుల ఆకలి తీర్చే దాతృత్వం
మనసున్న మా అమ్మ - బుచ్చి సీతాయమ్మ
శ్రీ రాజా వత్సవాయ జగపతి బహద్దరు మహరాణీ బుచ్చి సీతాయమ్మ దేవి




పెద్దాపురం సంస్థానం : మనసున్న మా అమ్మ బుచ్చి సీతాయమ్మ
-------------------------------------------------------------------
శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి మహారాజు గారి మొదటి భార్య లక్ష్మీనరసాయమ్మ మరియు మూడవ భార్య బుచ్చి బంగారయ్యమ్మ లకు సౌందర్యవతి అయిన సవతి ఈమె
అందం -ఔధార్యం, దానం – సుగుణం, సహనం - సౌశీల్యం అనే పదాలకు నిలువెత్తు నిదర్శనం ఆమె రూపం
ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనగల ధీరోదాత్తత, మానసిక బలం ఆమె సొంతం
శ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజు గారు పెద్దాపురం సంస్థానాన్ని 1797 నుండి 1804 వరకూ పరిపాలించి మరణించిన తరువాత,

అంతపురం లో ఎన్నో అంతరాలు ... 
లక్ష్మీ నరసాయమ్మ - బుచ్చి బంగారయమ్మ ల కలహాలు 
రాజమందిరం చుట్టూ రాజకీయాలు 
రాజమండ్రి జిల్లా కలక్టరు కుదిర్చిన రాజీ ప్రకారం 
రాజ్యాధికారం నాదేనంటూ రాజా జగన్నాధ రాజుగారు ఆర్భాటం 
భీమవరపుకోట వాస్తవ్యులతో బుచ్చి సీతాయమ్మ సింహాసనం కోసం 12 ఏళ్ళ సుదీర్ఘ న్యాయ పోరాటం... ఇలా చెప్పుకుంటూ పోతే

మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారి జీవితం - రాణీవాసం - సింహాసనం ఏమీ వడ్డించిన విస్తరి కాదు ఎన్నోఒడిదుడుకులు ఎన్నెన్నో అడ్డంకులు మరెన్నో అవాంతరాలు అయినా ఆమె ఏనాడూ ఔన్నత్యాన్ని వీడలేదు, తాను ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి పారిపోలేదు.
అంతఃపుర స్త్రీగా అందుకుంటున్న గౌరవాలను పక్కనబెట్టి ఒక మహిళగా సామాన్య పేద గృహిణి జీవితంలోని కష్ట నష్టాలను ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేసారు .
అన్నార్తుల ఆకలి తీర్చే
అన్నదానాన్ని వ్రతం గా ఆచరించిన అమ్మ ఆమె 
ధీనజనోద్ధరణని దైవంగా బావించి
పేదల పక్షాన నిలిచిన ప్రేమమూర్తి.
అన్నిదానములకన్న అన్నదనమే మిన్న
కన్నవారికంటే ఘనులు లేరు
ఎన్న గురునికన్న నెక్కువ లేరయా
విశ్వాధాబి రామ వినురవేమా ! అన్న వేమన్న నీతి పద్యం ఆమెకి నిత్య స్ఫూర్తి.

అందుకే, అన్నార్తుల ఆకలి తీర్చేందుకే, 1926 లో రాజ్యాధికారం చేపట్టిన రెండేళ్ళ వ్యవధిలోనే 1928 లో పెద్దాపురంలో అమ్మన్న అనే పెద్ద జమిందారు యొక్క ఇల్లు స్వాదినం చేసుకుని సత్రాన్ని నిర్మిచి ఆ సత్రానికి నిర్వహణ నిమిత్తం ఐదు వందల ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయ స్థలాన్ని కేటాయించింది. వెనువెంటనే ఒంటిమామిడి లో మరొక సత్రాన్ని ( ఈ సత్రం ఇప్పుడు కత్తిపూడి కి మార్చబడింది) నిర్మింపచేసింది. నేటికీ ఈ సత్రాల ద్వారా ఎందరో పాద చారులు మరెందరో పేద విద్యార్ధులు మూడుపూటలా కడుపునిపుకుంటున్నారు.

ఆ తరువాత కాలంలో వ్యవసాయ స్థలం ద్వారా వచ్చే ఆదాయంలో సత్రాల నిర్వహణకు పోగా మిగులు నిధులను - ఉన్నత విద్యకోసం వేరు ప్రాంతాలకు వలస పోతున్న విద్యార్దుల సౌకర్యార్దం 1967 సంవత్సరంలో బుచ్చి సీతాయమ్మ గారి జ్ఞాపకార్ధం పెద్దాపురంలో శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహా రాణీ కళాశాల నిర్మాణం జరిగింది - ఈ నిర్మాణానికి శ్రీ రాజా వత్సవాయి కృష్ణమరాజ బహద్దరు గారు , భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, శ్రీ..ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు గారు ప్రముఖ పాత్ర వహించారు ఈ రెండు సత్రాలను 1969 వ సంవత్సరంలో జిల్లా పరిషత్ నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకుని అన్నదానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

భూమ్యాకాశాలు ఉన్నంత వరకూ ప్రపంచపటంలో పెద్దాపురం పేరు ఉన్నంత వరకూ మా అమ్మ బుచ్చి సీతాయమ్మ పేరు చరిత్రలో అజరామరమై నిలిచే వుంటుంది.

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Thursday, 20 April 2017

ఆత్మ గౌరవానికి అసలు అర్ధం చెప్పిన మన పెద్దాపురం కథ - చదవండి చదివించండి MAGAPU SARABHA KAVI

మన పెద్దాపురం కధలు - వంగలపూడి శివకృష్ణ



మన పెద్దాపురం సంస్థానం - మాగాపు శరభకవి

MAGAM ఈ పేరు విన్నారా ఎటు చదివినా ఒకేలా ఉండే ఊరు మన తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలానికి చెందిన ఒక అందమైన గ్రామము.


శరభకవి గారు ఒకరోజు #రాజా_వత్సవాయ_తిమ్మజగపతి_మహారాజు గారిని కలవడానికి పెద్దాపురం వచ్చారట ఆ సమయంలో మహారాజా వారు మంత్రి దండనాథాగ్రణులు మరియు సైనిక సంపత్తి ఆస్థాన పండితులతో ముఖ్యమైన చర్చలో ఉన్నారట చాలా సేపటి తర్వాత మహారాజు గారు శరభకవిని లోపలికి పిలిచారట, అప్పటికే శరభకవి పేరు రాజ్యమంతా మారు మోగి ఉండటం వల్ల శరభకవి ఆకారం చూసిన వెంటనే #ఇతడా_శరభకవి అని అందరి ముందు అనేశారట. “అంతే మహా రాజు గారి ఏక వచన ప్రయోగానికి కోపగించుకున్న శరభ కవి



ఇతడా రంగదభంగ సంగర చమూహేతిచ్ఛటాపాలకో
ద్ధ్తకీలాశలభాయమానరిపురాడ్ధారాశ్రు ధారానవీ
న తరంగిణ్యబలాఅమాగమసమా నందత్పయోధిస్తుతా
యతశౌర్యోజ్వలుడైన వత్సవయ తిమ్మక్షావరుం డీతడా


అంటూ మొదలు పెట్టి 60 సార్లు  ఏక వచన ప్రయోగం చేసాడట - అయినప్పటికీ పండిత ప్రియుడైన మహారాజు శరభ కవికి కనకాభి షేకం చేయించి మాగాం అనే అగ్రహారాన్ని దానం గా ఇచ్చి పంపించాడాట



సేకరణ:వత్సవాయ రాయజగపతి వర్మ #పెద్దాపురం_సంస్థాన_చరితం, శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రుల వారి ఇతర గ్రంథాలనుండి



పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

చారిత్రిక పెద్దాపురం - రాజకీయ ప్రస్థానం - Peddapuram Municipality Centinary Celebrations 100 Years of Peddapuram Municipality వందేళ్ళ పెద్దాపురం మున్సిపాలిటీ కి వందనం







వందేళ్ళ పెద్దాపురం మున్సిపాలిటీ కి వందనం
-----------------------------

శత వసంతాల పురపాలకం
పెద్దాపురం ప్రాచీన వైభవానికి తలమానికం
పాలక సేవక సమ్మేళనమై
ప్రజానీకానికి భవభాందవులై
మమ్ము ఏలిన సత్కళా సంపన్నులు
మన పెద్దాపురం చైర్ పర్సన్ లు

పెద్దాపురం సంస్థానం 1847 వరకూ వత్సవాయ సూర్యనారాయణ జగపతి బహదూర్ పాలన కొనసాగింది. 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ / జాన్ వాట్స్ కంపెనీ పెద్దాపురంను ఆక్రమించడం జరిగింది. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురంను రెవిన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు నిర్మించారు. 1857 తిరుగుబాటు తర్వాత భారత దేశం లో కంపెనీ పాలన రద్దు చేయబడి 1858 నుండి బ్రిటీష్ రాజ్ ఆవిర్భవించింది. ఆ తరువాత కొంత కాలానికి 1902 లో బ్రిటీషు వారిచే "టౌన్ హాల్" నిర్మించబడి 1915 లో రాష్ట్రంలో నే రెండవ మున్సిపాలిటీ గా పెద్దాపురం ఆవిర్భవించబడింది. శ్రీ. వి. కె అనంత కృష్ణ అయ్యర్ మరియు శ్రీ. అభినవ పట్నాయక్ లు బ్రిటీషు గవర్నమెంటు వారిచే నియమించబడి 1915 నుండి 1918 వరకూ పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్ మెన్ లుగా వ్యవహరించగా వీరి అనంతరం బ్రిటీషు వారిచే నియమింపబడిన పెద్దాపురం వాస్తవ్యుడైన మొట్టమొదటి చైర్మెన్

శ్రీ పింగళి కృష్ణారావు పంతులు గారు (1918 – 1921)
శ్రీ గోలి పెద కొండయ్య గారు (1921 – 1924) పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు
శ్రీ గుర్రాల కృష్ణా రావు గారు (1924-1926)
శ్రీ ముప్పన చిన వీర్రాజు గారు (1926-1928)
శ్రీ చల్లా దొరయ్య గారు (1928-1931)
శ్రీ జనాబ్ ఇస్మాయిల్ ఖాన్ సాహెబ్ గారు (1931-1933)
శ్రీ నియోగి వెంకట సుబ్బారావు గారు (1933-1934)
శ్రీ గొల్లకోట వెంకట రత్నం గారు (1934-1936)
శ్రీ జనాబ్ M.A కరీం సాహెబ్ గారు (1938-1941)
శ్రీ ముప్పన చిన అంకయ్య గారు (1943-1947)
శ్రీ ముప్పన పెద వీరభద్ర రావు గారు (1947-1952)
శ్రీ చల్లా వెంకట రావు గారు (1952-1956)

శ్రీ ముప్పన రామారావు గారు (1956 – 1972 & 1981- 1986) వరుసగా 4 సార్లు పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై 1961-66 కాలానికి ఛాంబర్ చైర్మెన్ గా ఏకగ్రీవం గా ఎన్నిక కాబడి ఇప్పటి వరకూ ఎక్కువ కాలం చైర్మన్ గా చేసిన వ్యక్తి గా గుర్తింపు పొందారు.

శ్రీమతి తాళ్ళూరి గంగా భవాని గారు (1987-1992)
శ్రీమతి బచ్చు శ్రీదేవి గారు (1995-2000)
శ్రీమతి ముప్పన శ్యామలాంబ గారు (2005-2010)
శ్రీ రాజా వత్సవాయ సూరిబాబు రాజు గారు (2000 – 2005 & 2014 - ) రెండవ సారి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు

దినదిన ప్రవర్ధమాన మవుతూ నానాటికీ విస్తరిచబడుతూ నేటికి 28 వార్డులకు చేరుకున్న మన పెద్దాపురం మున్సిపాలిటీ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని పేదప్రజారహిత పెద్దాపురం కావాలని ఆకాంక్షిస్తూ ... మీ వంగలపూడి శివకృష్ణ

గమనిక: పైన ఉదహరించిన వాటి మద్య కాలాలలో ఏదేని కారణం చేత చైర్మన్ ఎన్నికలు నిర్వహించనప్పుడు ఆర్ డి. ఓ గారు గానీ జాయింటు కలక్టరు వారు గానీ లేక ఇతర అధికారులెవరైనా కానీ పురపాలకం నిర్వాహక భాద్యతను చేపట్టడం జరుగుతుంది దీనినే “స్పెషల్ ఆఫీసర్” పాలన గా వ్యవరిస్తారు.

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Wednesday, 19 April 2017

పెద్దాపురం సంస్థానం - రాజరిక ప్రస్థానం PEDDAPURAM PRINCELY STATE

చారిత్రక పెద్దాపురం - ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న మహా సంస్థానం
చరిత్రకారులు కొనియాడిన శతాబ్దాల ఘన చరితను ఇప్పటి యువకులు, రచయితలు, నాయకులు, పండితులు విస్మరించి ఉండవచ్చు కానీ పెద్దాపురం ప్రజలు ఎప్పటికీ మననం చేసుకుంటూనే ఉంటారు

పొరపాటున మర్చిపోయినా పెద్దాపురం మట్టిలో అణువణువూ నిక్షిప్తమై ఉన్న అలనాటి ఘన చరిత్ర నా లాంటి వారినెందరినో మట్టి వాసనై తట్టి లేపుతుంది ఉజ్వల చరితాన్ని ఉద్వేగంతో వర్ణించి ఉత్తేజ భరతుణ్ణి చేస్తుంది ప్రపంచానికి నన్ను పునః పరిచయం చేయి అని ప్రేమగా శాశిస్తుంది

పెద్దాపురమా నీకు వందనం : చివరి ఊపిరి వరకూ పెద్దాపురం చరిత్రను పరిచయం చేస్తూనే ఉంటా - జై పెద్దాపురం - జై జై పెద్దాపురం




పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Monday, 17 April 2017

CTO Office Peddapuram Cleaned by Mana Peddapuram Youth



పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...