మన పెద్దాపురం కధలు - వంగలపూడి శివకృష్ణ
మన పెద్దాపురం సంస్థానం - మాగాపు శరభకవి
MAGAM ఈ పేరు విన్నారా ఎటు చదివినా ఒకేలా ఉండే ఊరు మన తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలానికి చెందిన ఒక అందమైన గ్రామము.
శరభకవి గారు ఒకరోజు #రాజా_వత్సవాయ_తిమ్మజగపతి_మహారాజు గారిని కలవడానికి పెద్దాపురం వచ్చారట ఆ సమయంలో మహారాజా వారు మంత్రి దండనాథాగ్రణులు మరియు సైనిక సంపత్తి ఆస్థాన పండితులతో ముఖ్యమైన చర్చలో ఉన్నారట చాలా సేపటి తర్వాత మహారాజు గారు శరభకవిని లోపలికి పిలిచారట, అప్పటికే శరభకవి పేరు రాజ్యమంతా మారు మోగి ఉండటం వల్ల శరభకవి ఆకారం చూసిన వెంటనే #ఇతడా_శరభకవి అని అందరి ముందు అనేశారట. “అంతే మహా రాజు గారి ఏక వచన ప్రయోగానికి కోపగించుకున్న శరభ కవి
ఇతడా రంగదభంగ సంగర చమూహేతిచ్ఛటాపాలకో
ద్ధ్తకీలాశలభాయమానరిపురాడ్ధారాశ్రు ధారానవీ
న తరంగిణ్యబలాఅమాగమసమా నందత్పయోధిస్తుతా
యతశౌర్యోజ్వలుడైన వత్సవయ తిమ్మక్షావరుం డీతడా
అంటూ మొదలు పెట్టి 60 సార్లు ఏక వచన ప్రయోగం చేసాడట - అయినప్పటికీ పండిత ప్రియుడైన మహారాజు శరభ కవికి కనకాభి షేకం చేయించి మాగాం అనే అగ్రహారాన్ని దానం గా ఇచ్చి పంపించాడాట
సేకరణ:వత్సవాయ రాయజగపతి వర్మ #పెద్దాపురం_సంస్థాన_చరితం, శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రుల వారి ఇతర గ్రంథాలనుండి
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
No comments:
Post a Comment