Wednesday, 11 January 2017

HAPPY BHOGI, SANKRANTHI, KANUMA - PLEASE DON'T CUT THE TREES IN THIS FESTIVAL - HUGE CAMPAIGN IS GOING ON BY VANGALAPUDI SIVA KRISHNA & TEAM PEDDAPURAM

మిత్రులందరికీ ముందుగా #భోగిపండుగ శుభాకాంక్షలు
ఈ భోగిపండుగకు #పచ్చనిచెట్లు నరకకండి - నరకనివ్వకండి
భోగి పులకల్లోనే, భోగి పళ్ళుతోనే, భోగి పిడకలతోనే పండుగ అందాలు
భోగి పండుగ నాడు భోగి స్నానం చేసే బంధువులందరికీ భోగ భాగ్యాలు 
భగభగ మండేటి ఆ భోగి మంటల్లో భస్మం అయిపోవాలి బాదరబందీలు
తగల బెట్టేయండి తమో రజ గుణాలు - తగలబెట్టమాకండి పచ్చని చెట్లు
ఆ రోజుల్లో నెలగంట పెట్టిన నాటినుండీ మకర సంక్రమణం ముందు రోజు (భోగి) వరకూ మేము ఎంతో ఉత్సాహంతో " #ఎప్పుడు_ఎప్పుడు_పండుగ_ఏడాది_పండుగ - # వేసినోళ్లది_పుణ్యం_వెయ్యనోళ్లది_పాపం" అంటూ నినాదాలిస్తూ ఇంటింటికీ తిరిగి పిడకలు, పుల్లలు, కిరసనాయిలు సేకరించే వాళ్ళం ... పొలాల గట్ల వెంబడి తిరిగి ఏరు పిడకలు, ఎండుతాటాకులు సేకరించేవాళ్ళం మోడుబారి విరిగిపడిపోగా మూలన పడవేసిన కొబ్బరి దుంగలను, తుమ్మ మోడులను మోసుకొచ్చి మంట కోసం దాచే వాళ్ళం .... పండుగ నాడు #భోగిమంటలో వెయ్యడం కోసం ఆవుపేడతో తయారు చేసిన భోగి పిడకల దండలు ఎవరు ఎక్కువ చేస్తారా అని పోటీ పడే వాళ్ళం మరి ఇప్పుడో అదేమీ లేదు సరి కదా...
#వృక్షో_రక్షతి_రక్షితః అంటూ ప్రతీ ఒక్కరూ పూజించుకునే పవిత్ర భారతదేశంలో మన తెలుగు వారి పండుగ భోగి పేరు చెప్పి ఒక్క బోగి రోజే... మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లక్షల వృక్షాలు నరికి వేతకు గురవుతున్నాయి - ఇది చాలా విచారించదగ్గ వాస్తవమైన విషయం - ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్ద భోగి మంటలు వేయాలనే ఉత్సాహంతో పోటీపడి మరీ పచ్చని చెట్లు నరికి వేస్తున్నారు ... పర్యావరణానికి కీడు చేస్తున్నారు... అనేక సార్లు ఈ చెట్లు నరికే ప్రక్రియలో భారీ భోగిమంటలు వేయాలనే ఆత్రుతతో అనేక ప్రమాదాలు కొనితెచ్చుకుని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలెన్నో... !
అందుకే సాంప్రదాయాన్ని ఆచార వ్యవహారాల్ని అడ్డదారులు పట్టిస్తూ ఆడంబరాలకు పోయి అతుత్సాహం ప్రదర్శిస్తూ పర్యావరణానికీ పెనుముప్పుగా పరిణమించే పరిస్థితుల నుండీ ప్రతీ ఒక్కరూ దూరంగా వుండాలని... ఈ పరమ పవిత్రమైన పండుగను మన ఆంధ్రుల అసలు సిసలు సాంప్రదాయ పద్దతిలో మంచి ఆహ్లాదకరమైన వాతావరంలో అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ... #మీ_వంగలపూడి_శివకృష్ణ - మన పెద్దాపురం టీం 

Tuesday, 10 January 2017

Peddapuram Municipality Chairman Sri Raja Suribabu Raju Bio Data



#పేరు : రాజా సూరిబాబు రాజు
#పూర్తిపేరు : శ్రీ రాజా వత్సవాయ లక్ష్మీ సూర్యనారాయణ జగపతి బహద్దరు మహారాజు
#జననం : 07 - 01 - 1954 (న్యూమరాలజీ టోటల్ = 9) రాజయోగం
#తల్లిదండ్రులు : శ్రీ సూర్యనారాయణ జగపతి శ్రీమతి నర్శిమూర్తియమ్మ దంపతులు
#విద్యాభ్యాసం : లూథరన్ హైస్కూల్, మహారాణీ కళాశాల, పెద్దాపురం

#రాజకీయం : మహారాణీ కళాశాల అధ్యక్షులుగా గెలుపు, కాంగ్రేస్ పట్టణ అద్యక్షులు... జిల్లా కాంగ్రేస్ యువ నాయకులు... మహారాణీ సత్రం కార్యనిర్వాహక అధ్యక్షులు...1999 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి సేవలు... రెండు సార్లు పెద్దాపురం పురపాలక సంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు

(అప్పటికే పెద్దాపురంలో అత్యంత బలంగా పాతుకుపోయిన కాంగ్రేస్ కంచుకోటని బద్దలు గొట్టి మొదటిసారి తెలుగుదేశం జెండాని ఎగురవేసిన మొట్టమొదటి పెద్దాపురం టి.డి.పి చైర్మన్ 31/03/2000 నుండి 30/03/ 2005 వరకూ మరియు రెండవసారి కూడా విజేతగా నిలిచి 03.07.2014 న చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు)

#తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అటు పార్టీ కార్యక్రమాలలో... మరియు నవ్యాంద్ర నిర్మాణంలో చురుకుగా పాల్గొంటూ... ఇటు #పెద్దాపురం ప్రథమ పౌరుడిగా ప్రముఖ పాత్ర పోషిస్తూ... అత్యంత ప్రభావశాలియైన రాజకీయనాయకుడిగా అందరి మన్ననలూ పొందుతూ... అందరినీ అక్కున చేర్చుకుంటూ చిన్న పిల్లల్ని సైతం ఆప్యాయంగా పలకరిస్తూంటారు.

#నియోజకవర్గంలో ప్రతీ కార్యక్రమానికీ హాజరవుతూ కష్టం అన్న ప్రతీఒక్కరినీ ఆదుకుంటూ... అనుకున్న అభివృద్ధి పనిని అందుకోవాల్సిన లక్ష్యాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా వదలని మనిషిగా #కులమతాలకి అతీతంగా పేదల సంక్షేమమే పరమావదిగా పరిపాలన చేసే#ప్రజానాయకులుగా పేరుపొందారు...

#పాలిటిక్స్ ఎన్నికలవరకే ... ఎన్నికల తర్వాత ప్రతీ పనీ ఊరి అభివృద్ధి కొరకే అని విశ్వసించే వారిలో మొదటి వరసలో వుంటారు ... ముక్కు సూటిగా వ్యవహరిస్తారు... నాన్చేధోరణి సహించరు.. న్యాయం ఎటు ఉంటే అటు నిలబడతారు అది అధికార పక్షమా... ప్రతి పక్షమా అనిచూడరు

#టెన్నీస్_చాంపియన్ గా ... హార్స్ రైడర్ గా... రైఫిల్ షూటర్ గా... ఇంకా అనేక క్రీడలలో ప్రావీణ్యులుగా... క్రీడాభ్యుదయానికి బాటలువేస్తూ క్రీడాకారులను అభినందిస్తూ ... ప్రోత్సహిస్తూ యువక్రీడాకారులలో స్పూర్తినింపుతున్నారు

#పెద్దాపురం_ప్రాశస్త్యాన్ని ప్రతిభింబింపజేసే ప్రతీ అంశాన్నీ గౌరవిస్తూ... పెద్దాపురం ప్రాముఖ్యతని ప్రతీ చోటా తెలియజేస్తూ... #పెద్దాపురం_చరిత్రని ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే ప్రతీఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు

#చారిత్రక_పెద్దాపుర పునర్నిర్మాణానికి పునాధిరాళ్లు పేరుస్తూ... పునర్వైభవానికి విశేషకృషి చేస్తూ... పురపాలక సర్వతోముఖాభివృద్ధికి సర్వదాకృషి చేస్తున్న #పెద్దాపురం_ప్రథమపౌరులు - #శ్రీరాజా_సూరిబాబురాజు గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలనీ... ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య సుఖ సంతోషాలతో వర్థిల్లాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ...#మీ_వంగలపూడి_శివకృష్ణ
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Welcome Clean Army Peddapuram

పెద్దాపురం  - వంగలపూడి శివకృష్ణ
క్లీన్ కమిట్ మెంట్ ఆప్ #క్లీన్ఆర్మీ
చలికి చలించని #స్వచ్ఛసైనికులు తీసుకొచ్చిన మార్పు
రండి స్వచ్ఛమైన మనసుతో సంకల్పిద్దాం
చేయి చేయి కలుపుదాం #స్వచ్ఛపెద్దాపురం సాధిద్దాం

Clean Army at MRO Office Peddapuram by Vangalapudi Siva Krishna

పెద్దాపురం - వంగలపూడి శివకృష్ణ

హాట్సాప్ స్వచ్ఛ సైన్యం 08/01/2017 MRO Office
ఊరి పరిశుభ్రత మా గురుతర బాధ్యత
#స్వచ్ఛత_పరిశుభ్రత మా  పెద్దాపురం గ్రూపు సభ్యుల జీవన విధానం లో ఒక భాగం అయ్యిపోయింది - అపరిశుభ్రత పై యుద్ధానికి మేమంతా సిద్ధం ...
మాతో పాటూ ఈరోజు 6th Ward దత్తతదారు #దినేష్_రాజు గారు కూడా #క్లీన్_ఆర్మీ లో పాల్గొనడం జరిగింది... కార్యక్రమంలో పాల్గొన్న గ్రూపుమెంబర్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు...

Peddapuram Girl Excellent Performance to Accent Bagavdhgeetha Slokas

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

History of Kattamuru Peddapuram

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

పెద్దాపురం మహారాజా వారు శ్రీ రామునికి కట్నం గా సమర్పించిన వూరు కట్టమూరు
వర్ణించ తరమా ఈ వూరి సొగసులు
ఏలేరు వంపులు
పచ్చని పైరులు 
పైరులకి కొలనులు
పశువులకు చెరువులు
ఊరి మద్యలో జోడుగుళ్ళు
ఊరి నిండా పెంకుటిల్లు
కల్మషం లేని మనుషులు
పెద్దాపురం మహారాజా శ్రీ రాజా రాయపరాజ మహారాజు గారు(1607-1649)
శ్రీ రామునకుఁ కట్టమూరున గట్టించే గుళ్ళూ గోపురములు మంటపములు,
గంభీర జల తటాకమును త్రవ్వించె గృహస్తపురంబున సుస్థిరముగఁ
బొలుపుగా వాల్మీకిపురి కాండ్రకోటను ఫలభూజవాటికల్ పదిలపరచే"
అని ఏనుగు లక్ష్మణ కవి రచించిన రామ విలాసము లో ఇలా వర్ణించాడు
గుడులు గోపురములు :
పట్టాభిరాములవారి గుడి మరియు కేశవ స్వాములవారి గుడి, శివాలయము, వినాయకుని గుడి, షిరిడి సాయిబాబావారి దేవాలయము, వీరబ్రహ్మం గారి ఆలయము, ఊరి మొదట్లో కనకదుర్గ గుడి, ఊరి చివరన పోలేరమ్మ తల్లి ఆలయము, ఇంకా శ్రీరాముని కోవెలలు, ఆంజనేయుని గుడులు కలవు.
చెఱువులు :
మంచి నీటి చెఱువు, రాయన చెఱువు, బాపనవీధి చెఱువు, కిత్తా చెఱువు, గంగరావి చెఱువులు
పాఠశాలలు :
ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మూడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలు

Welcome to the Kota Sattemma Festival Peddapuram Near Pandavula Metta & Navodaya Peddapuram

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

శ్రీ సత్తెమ్మ అమ్మవారి 43వ జాతర మహోత్సవానికి స్వాగతం-సుస్వాగతం
మన పెద్దాపురం పాండవుల మెట్ట దగ్గర కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ అమరగిరి సత్తెమ్మ అమ్మ వారి 43 వ జాతర మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం
"ఓం ఐం హ్రిం శ్రీం శ్రీ సత్యాంబికాయైనమః"
"అమ్మదయ అపారం - అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే"
త్రైయానిక పంచాయతన చండీ యాగం : 13 జనవరి 2017 నుండి 15 జనవరి 2017 వరకూ
సత్తెమ్మ అమ్మవారి జాతర : 15 జనవరి 2017 న (కనుమ రోజు) అంగరంగ వైభవంగా
ప్రసిద్ద స్పటిక విఘ్నేశ్వర పూజ, త్రిభైరవ = వటుక, స్వర్ణాకర్షణ, మహాకాలభైరవ మంత్రోచ్ఛారణ
సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పినట్టు వర్ణింపబడిన నవదుర్గా స్తోత్రం నిత్య పారాయణం = "ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా"
భక్తులు అందరూ పెద్ద ఎత్తున ఈ జాతర మహోత్సవం లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతారని.... జాతర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ కోరి ప్రార్ధిస్తున్నాము .... ఇట్లు మన పెద్దాపురం టీం ఆలయ కమిటీ తరపున

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...