Thursday, 3 December 2015

పెద్దాపురం చరిత్ర పద్యం - Poem on Peddapuram History


పెద్దాపురం చరిత్ర పద్యం 


-------------------------------
అయ్యా వినండి ఘన చరితం 
పెద్దపురమను మన చరితం 
సూర్య వంశోద్భావులు ఆంధ్ర క్షత్రియులు 
దుర్జయుడే మా మూల పురుషుడు 

పెదపాత్రుడు మా పెద్దయ్య 
నిర్మిచెను మా నగరమయా 

కృష్ణా జిల్లా కాండ్రపాడు లో
కొలువు దీరెను కోటకట్టుకుని 
గుడిమెట్టలోన గుఱ్ఱము తోడ్కొని 
భీమ కవీషుని శాపము గైకొని
స్వర్గము కేగిన సాగి పోతన్న 
మా పూర్వులలో ఒకడన్న

తెలుంగు రాయుడు తెగువ చూపెను 
భీమ కవీశుడే చెలిమి చేసెను 
వరాహ వధను విరమణ చేసి 
నృశింహ పురాణమంకితమిచ్చెను

వీరి మనుమడే రామరాజన్న 
రాజథానేమో వత్సవాయన్న
రాజ శేఖరుల మనోభీష్టమున
రాజధానాయె గృహనామం

పరిసరమందలి పాలకుల ద్రోలి 
పెద్దాపురమున కోటగట్టిన
తిమ్మ శిఖామణి తేజరిల్లెను
షేరు మహమ్మదు ఛత్రమునొంది

రాజాధి రాజు రమ్య బిరుదాశాలి
రాయరాజపరాజు రాజ జగపతి రాజు 
గెలిచే అవలీలగా చాల ధుర్గాలు
నీరాజనాలిచ్చే నానా నవాబులు

సార్వభౌమ తిమ్మ యుద్ధపటిమ 
ధుగరాజు మొదలైన దొరల భంగించి 
విశ్వంభరుని జేసె యుద్దవిరతు

జాపరల్లి వింధ్యగిరినవశేషమున్ చేయ
వెంకాంబ కుమరుండు ఉద్భవించేను   
ఘనరాజ మండలనిరోధమ్ము చేసి 
ఉద్దండ రాయుడై ఉద్ధరించేను  

మైనరాయెను గనుక
ముగ్గురు కుమారులు 
తిమ్మ జగపతి పేర
రాజ్య పాలన చేసే రాఘవమ్మ

రుస్తుం ఖానుండి కపటోపాయం
వత్సవాయ వంశమునకపాయం 
అంతః పుర స్త్రీలగ్నికి ఆహుతి 
బాల జగపతికి జైలు దుర్గతి 

విజయనగరపు రాజు విజయరామ రాజు 
అందించే తోడ్పాటు అవసరముగా 
హాజీ హుస్సేను హతాసుడాయెను
నూరుద్దీన్ ఖాన్ నెత్తురొడ్డేను 

బాల జగపతే రాజ జగపతై 
పాలించే పురమును జనరంజకముగా

విధ్వత్తిమ్మపతి విధ్వత్తు తోడ
సంస్థాన పాలనము చక్కగాను

మలి రాయ జగపతి పొందే సన్నద్దు 
ఇంగ్లీషు కుంఫిణీ ఇష్ట కార్యార్ధం

లేక కుమారులు రాయ జగపతికి నాడు 
కుంఫిణీ రగిలించే కుంపట్లు కొలువులో 

జగన్నాధ రాజడిగె రాజ్యాధికారం 
లక్ష్మీ నరసాయమ్మ తెలిపే ధిక్కారం

బంగారు మా తల్లి బుచ్చి సీతాయమ్మ 
అన్న సత్రాలెన్నో కట్టించె ఆశువుగా   
త్రవ్వించె తటాకము తెలివి తోడ
నేటికీ నిలెచెనవి 

రాయ జగపతి వర్మ రచియించె రుచిగా 
పెద్దాపుర సంస్థాన చరితమిదియె 

బ్రిటీషు కుంఫిణీ కంపు కార్యాలతో
రాజ్యాల రాజసం అంతరించేను
జమీను దారుల జల్సాల లోను 
మేజువాణీల మోజు రివాజై 
రోజు రోజుకీ జారిపోయెను 
పెద్దాపురమే మారిపోయెను
ప్రతిభా వంతులు పేరు చెప్పక 
ప్రగతి అన్నదే పారిపోయెను

కళలకు నెలవగు కళావంతులు 
కత్తికి కట్టి పసుపు భాసికం
అంగడి వేలం కన్నెరికం
అతివ బతుకు ఇహలోక నరకం


వందేళ్ళ ఘన చరిత మున్సిపాలిటీ 
వేశ్యాపురమన్న పాప్యులారిటీ 
రాజకీయ నాయకుల  కోతలు
రికార్డు డాన్సుల మోతలు 

కోటేశ్వరరావు గారి క్లారిటీ
బచ్చు ఫౌండేషన్ వారి చారిటీ 
ముప్పన వారిది హైస్కూలు 
బ్రిటీషు వారిది ఒక స్కూలు 
బచ్చు వారిదే ప్రతి అభివృద్ధి 

చేయలేదయ్యా సర్కారు మీరేదీ 
పేరుకి పెద్దది మా డివిజన్ 
ఏదయ్యా తమరి విజన్


గల్లీలన్నీ ఆట స్థలాలే 
క్రీడాస్పూర్తే క్షీణిస్తే 
యువత పరిస్థితి అధోగతే

పరిశుబ్రత పదమే కరవు
రోగాలకు ఆకరువు 
రోగులు వేలు - పడకలు పదులే 
ఏరియా ఆస్పత్రి అసలు స్థితి

అయ్యో ఆదిత్యా రోడ్డు 
మృత్యువుతో బేటీ ఫ్రెండు 
పాండవుల మెట్ట పాపముల పుట్ట 
సూర్య భగవానుడే సాక్షీ భూతం

మరిడి మాతల్లి మౌనమే మళ్ళీ
ప్రజా పంపిణీ - మోసాల కుంఫిణీ
లేదు ఏ రేషన్ - అంతా పరేషాన్ 
దొరికితే 6A కేసు - లేకుంటే నువ్వే బాసు 
విలేకర్లకూ వాటా ఉందోయ్

వీధికో సంఘం, గృహముకో గ్రూపు 
ఆ సంఘం ఈ సంఘం 
ఆ ఇజం ఈ ఇజం  
అన్ని ఇజాల నిజానిజాలు 
పోట్టకూటికే  ప్రతి సంఘం 
పేరుకి మాత్రం రణరంగం

కట్టమూరు లో బట్టీ సారాయి 
ఖాకీలకు నేతి మిఠాయి 

ఏనుగు లచ్చన్న 
వేదుల  సత్తన్న 
వీర్రాజు ముప్పన 
యాసలపు సూరన్న 
మళ్ళీ పుట్టండన్న మన పెద్దాపురమున 

వీర రాఘవమ్మ 
లక్ష్మీ నరసాయమ్మ 
 బుచ్చి సీతాయమ్మ 
పెద్దాడ కామమ్మ 
మమ్ము నడపండమ్మ 

వర్ణ చిత్రపు వెలుగు వాడిపోయేను 
తోలుబొమ్మల కదలిక ఆగిపోయేను 
సాముగరిడీ సచ్చి పోయేకదరా 
దౌర్భాగ్య నాయకా చావవేమిరా


పెండలమనేటి పంటే మాయం 
మెట్టలు మాయం గుట్టలు మాయం 
మరుభూమి మాయం - మాయం 
ఛీ .. మరుగు దొడ్దిలు ఖబ్జాలేనా ... ?

మర్లాం టు పెద్దాపురము 
స్కూలు చేరగా చిన్న పిల్లలు - 
తొక్కి సైకిలు పదిమైళ్ళు 
తొక్కి తొక్కి తొడ తుక్కై పోయి 
వెక్కి ఎడ్చుతూ అడిగే నేరుగా 

ఏదీ మా బస్సు పల్లెకు 
ఏంటి మీ స్టాండు చివరకు 
మా బ్రతుకాయెను బస్టాండు
బస్టాండాయెను భోగం బజారు

ఊరంతా పెద్దలే
ఊరినిండా పేదలే

Friday, 27 November 2015

కాండ్ర కోట నూకాలమ్మ అమ్మవారు KANDRAKOTA NOOKALAMMA THALLI CHARITRA - PEDDAPRUAM

మన పెద్దాపురం లోని కాండ్ర కోటని కన్నులారా చూతము రారండి





పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్లు (గుడివాడ, సిరివాడ ల మీదుగా స్వచ్చమైన పల్లెటూరి వాతావరం దారి పొడవునా రోడ్దుకిరువైపులా చెట్లు, చెట్లకి అవతల పచ్చని పంట పొలాలు..... వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు, రవాణాకి వాడుతున్న ఎద్దుల బండ్లు. వూరి మద్యలో రామాలయం - రామకోవెల (రాంకోలు) మీద అష్టా చమ్మా ఆడుతూ పిల్లలు ... దృశ్య శ్రవణ యంత్రం (టెలివిజన్ - టివి ) వీక్షిస్తున్న వృద్దులు, పెద్దలు... ఊరంతా కల్మషం లేని మనుసులు.ఆ మనుషులని కంటికి రెప్ప లా కాపాడే నూకాలమ్మ అమ్మవారు) వెరసి కనీసం ఒక్కసారైనా కాండ్రకోట ని కన్నులారా చూడవలసిందే ....................



కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడట అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపం లో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతు ని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారట అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధం లో ఓడిపోయారట !


ఆతని ఓటమి తరువాత ప్రజలపై కిమ్మేరుని పైశాచిక చర్యలు పెచ్చుమీరాయంట (అధికమయ్యాయి) ! ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తి ని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడట. ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశ ల లోని ఒక అంశ ను ధర్మకేతు మహారాజు తో పాటూ పంపిందట. ఆ యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు - స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి - వధించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడట

ఆ ఆది పరాశక్తి అంశే "నూకాలమ్మ అమ్మవారు" యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించినాడు -

అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మ గా ... కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా కొలువు తీరినారు .

పాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవం గా కన్నుల పండుగ గా జరిగే ఈ జాతరకి ఆంద్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రజలు తండోప తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు.


జాతర సమయంలో గ్రామస్తుల తో పాటుగా శ్రీ గీతా శివభక్త యువజన సంఘం దేవాలయ సందర్శకులకు - చిన్నపిల్లలకు విశిష్ట సేవలు అందించడం అబినందనీయం. బచ్చు ఫౌండేషన్ వారు కాండ్రకోట గ్రామాన్ని గ్రామంలోని విద్యాలయాలను అభి వృద్ధిపరచిన తీరు బహు ప్రశంసనీయం.



ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించాలని ఆశిస్తూ 
మీ వంగలపూడి శివకృష్ణ

ఏనుగు లక్ష్మణ కవి ENUGU LAXMANA KAVI - PEDDAPURAM

మన పెద్దాపురం : ఏనుగు లక్ష్మణ కవి

--------------------------------------------------------------------------------------

ఏనుగు లక్ష్మణ కవి గారు జన్మస్దలము పెద్దాపురము (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో వున్నది)

ఈయన క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు.
ఏనుగు లక్ష్మణ కవి గారి తల్లిగారి పేరు పేరమాంబ, మరియు తండ్రిగారి పేరుతిమ్మకవి.

శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాతగారు"శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు".ఈయన ఒక ఏనుగును పోషించెవాడు.దానిని ఈయనకు పెద్దాపురం సంస్థాన పాలకులు బహుమతిగా యిచ్చారు.

అందుచే కాలక్రమేన వీరి యింటిపేరు ఏనుగు వారిగా స్దిరపడినది.
శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ద కవి'కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి, లక్ష్మణ కవి గారి సమ కాలికుడు. లక్ష్మణ కవి గారు, భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రి శతిని" తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీదఅనువాదం చేసినాడు.
సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు.

భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు
1. ఏనుగు లక్ష్మణ కవి
2. పుష్పగిరి తిమ్మన
3. ఏలకూచి బాల సరస్వతి. వీటన్నింటిలోను మిక్కిలి ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.

ఏనుగు లక్ష్మణ కవి గారి భర్తృహరి సుభాషిత నుండి
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.

ఏనుగు లక్ష్మణ కవి గారి యితర రచనలు
1.రామేశ్వర మహత్యము.
2.రామ విలాసం
3.సూర్య శతకము.
4.లక్ష్మీనరసింహ శతకము.
5.గంగా మాహాత్మ్యము

ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ

పెద్దాపుర సంస్ధాన చరిత్ర లో ఒక పేజీ - A Page on Peddapuram History

పెద్దాపుర సంస్ధానచరిత్ర లో ఒకపేజీ : వత్సవాయి రాయజగపతి వర్మ గారు

ఆంధ్ర గీర్వాణ బాషా కోవిదుడు
బహు శాస్త్ర విశారదుడు
ఉభయ బాషా కవి
వైఘాన ధర్మ చంద్రికాది గ్రంధ కర్త
శ్రీ రామ భక్తుడు
అస్మత్ ఆధ్యాత్మిక గురువరేణ్యుడు...... అయినటువంటి మా తాతయ్య గారు
శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి మహా రాజు గారికి ---------------------- మరియు

స్త్రీ ధర్మ పరిపాలకురాలు
సాధ్వీ మణి అయిన మా చిన్నమ్మ (బాబయ్యమ్మ)
శ్రీమతి బుచ్చియ్యంబా దేవి గారికి ..................................




తల్లి లేని నాకు ఆ లోటు తెలియకుండా ఎంతో ప్రేమతో పెంచి విద్యా బుద్దులు నేర్పి నా ఎదుగుదలకు కారణమై - నన్ను ఇంత ఉన్నత స్థితి కి తీసుకు వచ్చినందుకు కృతజ్ఞతతో ఈ గ్రంధం ను మీకు సమర్పిస్తున్నాను. - వత్సవాయి రాయ జగపతి వర్మ గారు

పెద్దాపురం మరిడమ్మ తల్లి - PEDDAPURAM MARIDAMMA THALLI JAATHARA VISESHALU

పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర విశేషాలు : 

17 వ శతాబ్దములో పెద్దాపురంలో మానోజి “ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవత గా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసారు
17 వ శతాబ్దములో ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడివి గా వుండేధి. ఒక సారి ఆ అడవులో పశువుల కాపరులకి “ 16 ఏళ్ల యువతి కనిపించి “ నేనుచింతపల్లి వారి ఆడపడుచుని . నేను ఈ ప్రదేశములో వున్నాను అని మా వాళ్ళకి చెప్పండి . “ అని చెప్పి అంతర్థానము అయ్యింది ..............................

ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లి వారికి జరిగింది అంతా చెప్పారు... ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ “ మానోజి “ చెరువు దగ్గరకి వొచ్చి చుట్టూ ప్రక్కల ప్రాంతములు వెతకగా ................ !

వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతి రూపము దర్శనమిచింది . .. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్టించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప ధీప, నైవేధ్యములు చెల్లించి ఆరాధించటము ప్రారంభించారు.

ప్రతీ సంవత్సరము ఆషాఢ మాసము లో నెల రోజుల పాటు ఈ మరిడమ్మ అమ్మ వారి జాతర ఎంతో వైభవము గా జరుగుతాది .కాని ఈ సంవత్సరం 2015 అధిక ఆషాడ మాసం, అపురూప గోదావరిపుష్కరాలు సందర్భంగా 67 రోజుల పాటు జాతర జరుగును .
రాష్ట్ర నలుమూలల నుండి మరిడమ్మ అమ్మ వారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూంటారు ఒక్క ఆది వారం రోజునే దాదాపు 40 నుండి 50 వేల మంది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం.............................. 
పూర్వం కలరా లాంటి భయంకర వ్యాధుల నుండి .. ఆ గ్రామ ప్రజలను రక్షించే అమ్మవారుగా ఎన్నో మహిమలు చూపించింది . పిలిస్తే పలికే ఈ అమ్మవారిని చుట్టుప్రక్కల గ్రామాల వారు కులదైవము గా ఆరాధిస్తారు
ఈ విషయం మీ అందరికీ సుపరిచితమే……….................... !
* అయితే మీరు తప్పని సరిగా తెలుసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయాలు ...... ఎన్నో*** .................................. !
మరిడమ్మ జాతర జేష్ఠ మాసం లోని అమావాస్య నుండి ప్రారంభ మై ఆషాడమాసం లో ని అమావాస్య వరకూ ముప్పై ఒక్క రోజులు జరుగుతుంది……


**ఉయ్యాల తాడి **
=============
జేష్ఠ మాసం లోని అమావాస్య నుండి ప్రారంభ మై ఆషాడమాసం లో ని అమావాస్య వరకూ ముప్పై ఒక్క రోజులు జరిగే ఈ జాతరలో భాగంగా…… సరిగ్గా బహులైక జేష్ఠ అమావాస్యకు పక్షం (పదిహేను రోజులు) ముందు అమ్మ వారికి ఉయ్యాల తాడిని వేస్తారు....
జాతర రోజు నుండి జాతర ముగిసే వరకూ అమ్మవారు మరియు ఆమె ఆడపడుచు లు అక్క చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనలు చూస్తారని భక్తుల విశ్వాసం….
ఈ ఉయ్యాల తాడిని రైతు లు వారి వారి పొలాల గట్లమీద ఏపుగా ఎదిగిన తాడి ని సమర్పించడాని కి ఎగబడతారు అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవలసి వుంటుంది....
ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు 100 మంది కి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మ్రోగుతుంటే ఆ తదుపరి గరగలు నడుస్తూ వుంటే దారిపొడవునా గ్రామ ప్రజలు ఆడపడుచులు తాడిలకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోటముందు మీదుగా గుడివద్దకు సాగనంపుతారు ........................................................................................... 
(వారిని కాదని వేరొకరు తేలేరు ఆ దారి కాదని వేరొక దారి పోరాదు) 
అది వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడివద్దకు రావాలి అది అనాదిగా వస్తున్న ఆచారం ......................................................................................................

పెద్దాపురం లో మరిడమ్మ అమ్మవారు వెలసినప్పటి నుండీ జాతర నిర్వహించుచున్న ఒకే ఒక వీది ఏమిటో తెలుసా ..... ?
* పాత పెద్దాపురం కోటముందు *                           **తొలి జాతర**
తొలి జాతర (జాగారం) వీరిదే............... 
వీరు నిర్వహించేది జాగారం మిగిలిన వీధుల వారు నిర్వహించేది సంబరం ............. !
బహులైక జేష్ఠ అమావాస్య సాయంత్రం మొట్టమొదట జాతర గరగలు **గుడి వద్ద జాతర గరగలు కంటే ముందు** ఎత్తి అమ్మవారి సమక్షం లో గరగ నృత్యం ఒక ఆట పులి నృత్యం ( పులి ఆటకి రాష్ట్రము లోనే ప్రసిద్ది చెందిన పులి ఆటకారులున్నారిక్కడ ) ఒక ఆట ఆడి పాత పెద్దాపురం కోటముందు కి పయనమవుతారు

...... మిగిలిన కార్యక్రమం అంతా కోటముందు లోనే జరుగుతుంది ......
ఇది వరకూ ఈ వీది వారికి ఇంటికి ఒక ఎద్దుల బండి వుండేది .....ప్రతీ ఒక్కరు వ్యవసాయంతో పాటుగా ఇటుక బట్టీ వ్యాపారాలను నిర్వహించేవారు...................... వ్యవసాయక్షేత్రం ద్వారా వచ్చే గడ్డితో ఎద్దులను …........... ఎద్దులద్వారా మట్టి తొక్కించి ఇటుకల వ్యాపారాన్ని జరుపుకునేవారు ...... దాదాపు 30 ఎద్దుల బళ్ళుతో ఒక మైలు (సుమారు కిలోమీటరున్నర దూరం) వరకూ రక రకాల వేషాలతో అంగరంగ వైభవం గా కాగడాల కాంతుల్లో అద్భుత రీతి లో జరిగేది పాత పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మ వారి జాతర మహోత్సవం …...........................................................................


ఇక్కడ పెద్దాపురం కళాకారులు ప్రదర్శించే పాత పెద్దాపురం కోటముందు వాసుల పులి నృత్యం ... మాల మరిడీ సాముగరిడీలు… బంగారమ్మ గుడి వీధి వారి కర్రసాము…. కళావంతుల కోలాటాలను వీక్షించడానికి రాష్ట్రం నలుమూలలనుండీ ప్రేక్షకులు వచ్చేవారు.
అయితే… తాగుడు, భోగం మేలాలకు బానిసలైన సదరు వ్యాపారస్తులు కాలక్రమంలో అహంకార పూరితులై ఒకే ఒక్క సంవత్సరం సంబరాన్ని నిలిపి వేసారు……… ? ………………………………………………………………
అదే అదనుగా ఎప్పటి నుంచో తొలి జాతర గరగలు ఎత్తడానికి ప్రయత్నిస్తున్న ఒక అధిక వర్గం జాతర గరగల ను ఎత్తి తొలి సంబరం జరిపేసింది..... అంతే............................... !
* ప్రకృతి వైపరీత్యాల వాళ్ళ పాత పెద్దాపురం కోటముందు వారి వ్యాపారాలన్నీ నాశనం అయ్యిపోయి విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నారు***.........
* కలరా వ్యాది ప్రబలి తొలి గరగలను ఎత్తిన వారి వీధి లోని చాలా మంది పాతిక సంవత్సరాలలోపు యువకులు చనిపోయారు పెద్దాపురం అంతా విషాదం అయోమయం ..........
........ఆర్ధికంగా అందరికీ గడ్డు కాలం దాపురించిది………
ఆ సంఘటన తరువాత కోటముందు వాసులు ఏనాడు జాతరను ఆపుచేయడానికి , వేరొక వీది వారు తొలి గరగలను ఎత్తడానికి సాహసించలేదు ....
**తినడానికి తిండిలేని కరువు పరిస్థితుల్లో కూడా వారు ఇళ్ళల్లో ఉన్న రాగి, ఇత్తడి వస్తువులను తాకట్టు పెట్టి * గరగలను * తల్లి వద్ద నుండి తీసుకు తెచ్చుకున్న సందర్బాలెన్నో** ...........……
చరిత్ర తెలియక ఇటీవల కాలం లో కొందరు తొలి గరగలను ఎత్తడానికి ప్రయత్నించి నప్పటికీ వారిని నిలువరించడానికి గుడి ప్రాంగణం లో చిన్నపాటి యుద్దమే జరిగింది. అయితే ఆ తరువాత వారి పెద్దల ద్వారా చరిత్ర తెలుసుకొని మరిడమ్మ తల్లి ఆలయ కమిటీ సలహా మేరకు వారే తగ్గి సుహ్రుద్బావ వాతావరణంలో జాతర జరిగేందుకు సర్వ సహకారాలు అందిచడం విశేషం.
ప్రస్తుత కాలం లో అంగరంగ వైబవంగా ప్రతి ఏడు జాతర జరుపుతున్న వీధులు వరుసక్రమంలో .....
* చేపల వీది (మత్స్యకారులు దాదాపు ఒక్కరోజు జాతరకు 2 లక్షల నుంచి మూడు లక్షల వరకూ వెచ్చిస్తారు) ఈ వీధి జాతరలో కొత్త కొత్త కార్యక్రమాలకు బాణా సంచా మోతలకు పెట్టింది పేరు
***పాసిల వీధి : ***కుమ్మరి వీధి : చేపల వీధి తో పోటీ గా జాతరను నిర్వహించగల సామర్ద్యం మరిడమ్మ తల్లి గుడి కి అతి దగ్గరగా కన్నుల విందు
***కొత్తపేట (రెండు జాతరలు), చిన పాసిలవీది, వ్యాపారపుంత, బంగారమ్మ గుడి వీది, ***నువ్వుల గుంట వీధి, కబడ్డీ వీధి, రెల్లి వీధి, మూలా పేట,....................................... ఇలా దాదాపు 18 జాతరలు నెల పొడవునా జరుగుతాయి.......... 
........................................................................* ఇంకా సరిదిద్దాల్సింది వుంది *
.............................................................. ఇట్లు మీ వంగలపూడి శివ కృష్ణ

కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి - KASIBATTA BRAHMAYYA SASTRY - PEDDAPURAM

మన పెద్దాపురం సంస్థాన చరిత్రము : బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి

------------------------------------------------------------------------------------------------------------
పెద్దాపురం సంస్థాన చరిత్రము ను విమర్శనాత్మకంగా రచించిన వారిలో విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు ఒకరు

1785 నాటికి పెద్దాపురం రాజ్యము అటు తోటపల్లి నుంచి ఇటు నగరం వరకు మొత్తం 585 గ్రామాలు మరియు పట్టణములతో విరాజిల్లింది అన్న విషయం నా ఇది వరకటి పోస్ట్ ల ద్వారా మీ అందరికీ తెలిసిందే


బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు .



తుని రాజా (పెద్దాపురం సంస్థానం లోని బాగం) వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు పెట్టించి శాస్త్రి గారి కుటుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత తమ’’ పెద్దాపురం సంస్థాన చరిత్ర ‘’రాయించి వెయ్యిన్నూట పదహారు రూపాయలు బహుమానంగా సమర్పించారు .ఇందులో శాస్త్రిగారి లోతైన చారిత్రిక అవగాహన ,పరిశీలనా ద్రుష్టి వ్యక్తమవుతుంది.



మీ వంగలపూడి శివకృష్ణ

తొమ్మిది మూరల సాహెబు - JANAB MADEENA PACHHA OWLIYA DARGA PEDDAPURAM


హజరత్ షేక్ మదీనా పాచ్ఛా  ఔలియా దర్గా  

HAZARATH SHAIK MADEENAA PASCHA OWLIYAA DARGA SHAREEF - 
JANAB MADEENA PACHHA OWLIYA DARGA -

ప్రపంచానికి పెద్దపండుగ పదిహేడు వరకూ
పెద్దాపురానికి ఇరవై వరకూ (జనవరి 20)

వేల సంఖ్య లో జనం
చిన్న పిల్లల కోలాహలం
యువతీ యువకుల సమ్మేళనం
పెద్దల పూజలు కళాకారుల ప్రదర్శనలు వెరసి గంధోత్సవం - ఉరుష్ ఉత్సవం కన్నుల పండుగ .




"ఉరుష్ అనగా అరబిక్ బాషలో వివాహము లేదా ఆనందకరమైన పండుగ అని అర్ధం"




గంధోత్సవం అనగానే నాకు గుర్తొచ్చేది

గంగాధరం ఆర్కెస్ట్రా

రాజమండ్రి బుచ్చి బాబు మిమిక్రీ
మ్యాజికల్ షోలు
కుర్రాళ్ళ డాన్సులు
బెల్లం బూందీ మిఠాయిలు
ప్రతిఒక్కరి నెత్తిన ముస్లీం కూఫీ టోపీలు
పది అడుగుల పొడవైన పెద్ద పవిత్ర సమాధి



ఆ సమాధి చూసినప్పుడల్లా దాని చరిత్ర తెలుసుకోవాలన్న తహ తహ - కుతూహలం ఎక్కువయ్యేది
సాదారణంగానే సమాదానం దొరికేవరకూ నిద్రపోని నాకు ప్రతి చోట ప్రతికూల సమాదానమే ఎదురేయ్యేది

అసలు ఎవరు ఈ జనాబ్...... ?

ఏంటి అతని కథ.................. ?

శ్రీ వత్సవాయి రాయ జగపతి వర్మ రచించిన పెద్దాపుర సంస్థాన చరిత్రము లో పెద్దాపురం యొక్క విశేష అంశాలలో మొట్టమొదటి గా ప్రస్తావించినది ఇదే

అసలు నిజం ఏమిటి తెలుసుకునే ముందు పెద్దాపురం పరిసర ప్రాంత ప్రజల - సామాన్య “జనాభిప్రాయంలో జనాబ్” ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


మా తాత చెప్పిన తొమ్మిది మూరల సాహేబు కథ
-----------------------------------------------

తొమ్మిది మూరల సాహెబు తాటి చెట్టు మీద బట్టలు అరేసాడంట

పూర్వ కాలంలో పెద్దాపురం లో ఒక పీరు సాయీబు సంచరించేవాడు

ఆ పీరు సాయీబు పిచ్చి మొక్కలు పీక్కుంటూ జనాలకి అర్ధం కాకుండా ఉండేవాడు

ఏటవాలు గా ఉన్న తాటిచెట్టు వంపులో బట్టలు అర బెట్టుకునేవాడట

అతని అరచెయ్యి అరిటాకు అంత వుండేది అంట పిల్లలు కొబ్బరి బొండాలు కావాలని అడిగితే చెట్టుని చేతితో కొడితే రాలేవంట




ఒక రోజు పెద్దాపురం ప్రభువు సరదాగా సికారుకి సాయీబు సంచరించే ప్రాంతానికి వచ్చాడంట ఈ లోపులోనే పెద్దాపురం ప్రభువులు పై శత్రు సైన్యం అకస్మాత్తుగా దాడి ప్రారంబించిందట అది చూసిన సాయీబు పరిగెత్తుకుంటూ పోయి పిచ్చిమొక్కలు పక్కన ఉన్న పొడవాటి వెదురు బొంగులు విరిచి రాజుకి సాయంగా పోరాటం చేయడం మొదలు పెట్టాడంట శత్రు మూక తగ్గుముఖం పట్టాకా రాజు గారికి రక్షణగా కోటవరకూ కాపు కాసి శత్రువులతో పోరాటం చేస్తూ సాగనంపాడంట.




ఆ తరువాత చాలా రోజుల వరకూ రాజుగారి ఆలోచనల నిండా ఆ పీరు సాయీబు - అతని సహాయ గుణం, పొడుగు - పోరాట పటిమ పదే పదే గుర్తొచ్చి నిద్రపట్టక అసలు అతని గురించి తెల్సుకోవాలనిపించి సబకి పిలిపించి అతనికి ఉచితాసనం ఏర్పరిచి సకల మర్యాదల నడుమ ఇతను నా రక్షకుడు అని ప్రకటించాడంట.




అదే సభలో అతని పూర్వ చరిత్ర గురించి అడగగా తానూ కొందరు అతని స్నేహితులు వర్తకం నిమిత్తం సముద్ర ప్రయాణం చేసే వాళ్ళమని మార్గమద్యం లో తుపాను వలన ఓడ మునిగి పోయే సమయం లో చిన్న పడవల ద్వారా బయట పడ్డామని నేను ఎక్కిన పడవ నా అధిక బరువు వల్ల మునిగి పోయే పరిస్థితి రావడం చేత మిగిలిన వారి రక్షణార్ధం తానే స్వయంగా సముద్రం లోకి దూకి ఈదుకుంటూ తీర ప్రాంతం చేరానని అక్కడినుంచి నడక దారి పట్టానని ఈ ప్రాంతం వద్ద స్పృహ తప్పి పడిపోతే ఇక్కడి వారు నన్ను ఆదరించారని నాకు తెలిసిన వారు ఇంకా ఎవరూ లేరని చెప్పాడంట.




అప్పటినుంచి రాజు గారు అతని ని కొలువులోనే ఉండమనీ అతని కి అత్యున్నత సైనిక బాద్యత అప్పగించారంట -- ఆ తరువాత కాలంలో జరిగిన గొప్ప యుద్దంలో శరీరం తునా తునక లవుతున్నా లెక్కచెయ్యక రాజుగారిని కాపాడే క్రమంలో సాహెబ్ అశువులు బాసాడంట అతన్ని కాపాడడానికి అతని పెంపుడు గుర్రం 25 అడుగుల వెడల్పు గల ఏలేరు కాలువ 20 అడుగుల ఎత్తు కోటగోడ దూకినా ప్రయోజనం లేకపోయిందట.




ఇలా గల్లీవర్ లిల్లీ పుట్ కథ మార్చి మార్చి చెప్పేవాడు మేము నోరెళ్ళ బెట్టుకుని చూసేవాళ్ళం తరువాత మా తాత చెప్పిన కథ నిజంగా కథే అని మా తాత సినిమా పరిజ్ఞానం అంతా ఉపయోగించి పాత కధలన్నీ మిక్స్ చేసి సృష్టించిన కధ అని అతి తక్కువ కాలంలోనే అర్ధం అయ్యింది.





మళ్ళీ వచ్చింది జనవరి 20

-------------------------------

నా ప్రాధమిక విద్యాబ్యాసం (బహుశా నేను 4 వ తరగతి అనుకుంటా) ఆ సంవత్సరం లో మా తరగతి మాస్టారు పున్నయ్య ఆయన అప్పుడప్పుడు రాజుల కథలు వారి చరిత్రలు చెప్పేవాడు. అయితే ఇతనికి ఖచ్చితంగా తొమ్మిది మూరల సాయిబు గారి అసలు కధ తెలిసే ఉంటుందనిపించి




" సర్ మన పెద్దాపురం కోటలో తొమ్మిది మూరల సాహెబు గారి 10 అడుగుల సమాధి ఉంది కదా దారి పూర్వ చరిత్ర ఏమైనా మీకు తెలుసా ... అని అడిగా ... !




వెంటనే పున్నయ్య మాష్టారు

ఒరే శివా .... !

సాయీబుల సమాదులంతే సానా పొడవుంటాయి . !

పోయి ద్యాస పుస్తకాల మీద పెట్టు పుకార్ల మీద కాదు.. ! అనేసాడు

చదువుకున్నోడు కదా చరిత్ర చెబుతాడంటే సోదనిచెప్పి కొట్టిపారేశాడు చెడ్డ కోపమొచ్చింది.

ఈ పిచ్చి పున్నయ్య కంటే మా తాత కొండయ్యే మేలు అనిపించిది (అన్నట్టు చెప్పలేదు కదూ మా తాత పేరు వంగలపూడి కొండయ్య మా పాత పెద్దాపురం పెజానీకం ముద్దుగా గుడ్డి కొండయ్య అని పిలుచుకొనేవారు)




కాలం గడుస్తూనే వుంది నా కుతూహలం పెరుగుతూనే వుంది

--------------------------------------------------------------------




ఇదేమీ పనయ్యేలా లేదు వజ్రాన్ని వజ్రం తోనే కోయ్యాలని చెప్పెసేసి నాకు ఉన్న అతి తక్కువ మహమ్మదీయ మిత్రులలో ఒక మిత్రుడ్ని అడిగితే నాకు తెలియదు మా నాన్న కి తెల్సు అన్నాడు ఛాన్స్ కొట్టేసాం అనుకుంటూ వెళ్లి వాళ్ళ నాన్నని అడిగితే అతనూ మా నాన్నకి తెల్సు అన్నాడు

మీ నాన్న గారు ఎక్కడ వున్నారు అంకులు అని అడిగితే

అతని చూపుడు వేలు ఆకాశానికి లేచింది నా ఆశ ఆవిరైపోయింది.







మళ్ళీ జనవరి ఇరవై వస్తూనే వుంది కుతూహలం నిప్పు రగులుతూనే వుంది

-------------------------------------------------------------------------------------




ఇంక పనయ్యేలా లేదని ఆన్ లైన్ కనిపించిన ప్రతీ ముస్లీం సోదరున్నీ అడుక్కుంటూ పోతే

ఒక ముస్లీం సోదరుడు

wa annal masajida lillah; walaa tad'u mallahi ahada!

waman yushrik billahi fakad harramallahu alaihi aljannath...!(Qur'an).




దాని మీనింగ్ ఏంటి రా అన్నయ్యా అని అడిగితే మూడు రోజులు బతిమాలించుకుని ఆడికి మూడొచ్చాక మసీదులు అల్లాకే వుండాలి ఆయన్ని కాకుండా వేరొకరికి నమస్కరిస్తే వాళ్లకి స్వర్గ దారాలు మూసివేయ బడతాయి అన్నాడు నాకు మెంటలెక్కి పోయింది

“మేలు చేసే మొక్కని మొక్కుతాం

భారం మోసే భూమిని మొక్కుతాం

మంచి చేసే మనిషిని మొక్కితే

చంపేసి స్వర్గం డోరు మూసేత్తావా “

సానా బావుందన్నయ్యో నీ వరస

అయినా మేము క్లియర్ గా హజరత్ షేక్ మదీనా పాచ్ఛా ఔలియా "దర్గా" అంటే నువ్వేంటన్నయ్య మసీదు గురించి మెసేజ్ లు ఇస్తున్నావు అన్నాను

నా వయోలన్స్ కి అన్న సైలన్స్ అయిపోయాడు.




“సరే ఇదేమి గోలరా బాబు జనాలు ఇలా ఉన్నారేంటి తెలియకపోతే తెలియదనాలి కానీ ఇలా ఓ ఉచిత సలహా పడేస్తున్నారేంటి అని బాధ పడుతున్న సమయంలో దొరికింది గురూ




“వత్సవాయి రాయ జగపతి వర్మ విరచితము - పెద్దాపుర సంస్థాన చరిత్రము”

పెద్దాపురం సంస్థాన విశేష అంశాలలో మొట్టమొదటి అంశం గా ఆయన దీన్ని రాసుకున్నారు.




ఈ గ్రంధం లో ఆయన ఈ దర్గా గురించి చెప్పిన ముఖ్య విషయం ఏమిటంటే

పెద్దాపురం లో 18 బురుజుల రక్షణ కోటని నిర్మించడానికి పూర్వమే దర్గా అక్కడ వుందని

అది బహు పురాతనమైనది అని

అరి వీర భయంకర దీర పరాక్రమవంతులైన పెద్దాపురం మహారాజులు సైతం ఈ సమాధిని చూసి ఆశ్చర్య చకితులై అనేక మంది మహమ్మదీయ మత పెద్దలను దర్గా విషయమై ఆరా తీయగా




ఈ స్థలం మహమ్మదీయులకు అతి పవిత్రమైన స్థలం గా మా మత గ్రంధములలో చెప్పబడినదని




అందుచేతనే ఆ మహామ్మదీయ సన్యాసి (పీర్ సెయింట్) ఖండాంతరాలు దాటి ఈ పరమ పవిత్ర స్థలంలో పరమపదించారని




ఆ యొక్క సమాధి కి విధిగా ఏటేటా ఉత్సవములు జరిపించ వలసినదని




అప్పుడు పెద్దాపురం సంస్థానానికి శ్రేయోదాయకం అని వివరించారు

అప్పటి నుండీ

మహమ్మదీయులయొక్క అన్ని పండుగ దినములలో సంస్థానాన్ని పరిపాలించిన ప్రభువులందరూ ఈ ప్రదేశం వద్ద జరిగే ఉత్సవాలకి విశేష ఏర్పాట్లు చేసే వారు




అనేక ప్రదేశాలనుంచి ఇక్కడికి ఘోరి దర్శనార్ధం అనేక మంది యాత్రికులు వచ్చేవారు అని మొక్కుబడులు చెల్లించుకునే వారు




ఈ ఘోరీ పరమత సహనానికి ప్రతీకగా పెద్దాపురం లో ఆనాటి నుండీ ఈ నాటి వరకూ అలరారుతున్న పరమ పవిత్ర క్షేత్రం. ........................ఇట్లు మీ వంగలపూడి శివకృ

Thursday, 26 November 2015

తొలితిరుపతి - THOLI TIRUPATHI SRI SRUNGARA VALLABHA SWAMI TEMPLE - PEDDAPURAM

తొలితిరుపతి - - మనపెద్దాపురం - చదలాడ తిరుపతి



తొలితిరుపతి - - మనపెద్దాపురం - చదలాడ తిరుపతి
శృంగార వల్లభుని - స్వర్ణ రథ కాంతి
తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి
అయితే తూర్పు గోదావరి జిల్లాలోని మన పెద్దాపురం లోనే తిరుపతి వుందని

అదే తొలితిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు .. మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుందని ) చాలా మందికి తెలియదు.




విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ..
స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి





ఆలయ చరిత్ర :
--------------

ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో

ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.

అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా

ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.

ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట.

అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట

ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట

స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)

ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం)





ఆలయ విశిష్టత :
------------------
1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం )

2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది )

3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి

4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి.

5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది.

6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ





కార్యక్రమాలు - పూజా విధానం :
------------------------------
1) నిత్య ధూప దీప నైవేద్యం
2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం
3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు
4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.


చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు :
----------------------------------------------------
బోజమహా రాజు
బట్టీ విక్రమార్క
రాణీ రుద్రమదేవి
శ్రీ కృష్ణ దేవరాయలు
పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు

లక్ష్మీ నర సాపురం రాజులు ( లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి .. బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు )

https://plus.google.com/+vangalapudisivakrishna/posts

వంగలపూడి శివకృష్ణ

వణికించిన - వింత జంతువు మరణ మృగం - STRANGE CREATURE IN PEDDAPURAM

మన పెద్దాపురం : మరణ మృగం



వణికించిన - వింత జంతువు
మొర్రెల మెకం - మరణ మృగం
ఓ స్త్రీ రేపురా - నరరూప రాక్షసులు

మీకు గుర్తుందా గురూ నేనైతే మర్చి పోలేను .......


పెద్దాపురం పరిసర ప్రాంతాలను భయబ్రాంతులని చేసిన భయంకర ఘటన
1990 - 1992 ఓ స్త్రీ రేపురా అంటూ రక్తపుటక్షరాలు తలుపులపై రాసుకున్న జనం
1997 - 2000 నరరూప రాక్షసుల రక్త దాహం
2003 – 2004 మరణ మృగం వింత జంతువు సంచారం - ఆడవారిపైనే దాడి -




ప్రత్యక్ష బాదితులు పదిమందికి పైనే
పరోక్ష బాధితులు పెద్దాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ
కాద్రా... కాష్మోరా అంటూ తులసీ దళం కదలు ఊరూరా ప్రచారం
మేము చూసామంటే మేము చూసామంటూ వివిధ రకాల గుర్తులు
ఒకరు సింహం లా వుంది అని
మరొకరు సింహం శరీరం సింధువు ఆకారం మొసలి చర్మం తోడేలు బుర్ర రెండుకాళ్ళతో నడుస్తుంది కావాల్సి నప్పుడు ఎగురుతుంది అని రోజుకో పుకారు షికారు




అంతా పుకార్లే కట్టు కదలే అందామంటే
ప్రత్యక్షంగా గాయపడ్డ ప్రజలు వాళ్ళ గాయాలు ఇస్తున్న సాక్షాలు
పెద్దాపురం వాసుల తాత్కాలిక వలసలు
రెండాట సినిమాలు రద్దు
చుట్టూ పక్కల పల్లె గ్రామాల వారు, పాల వ్యాపారులు గుంపులు గానే రాక పోకలు సాగించేవారు
పట్టణంలో దుకాణాలన్నీ 7 గంటలకే బంద్
విద్యార్ధులకి ప్రయివేటు క్లాసుల్లేవు
రోడ్డ్లన్నీ నిర్మానుష్యం
పోలీసులకి పుల్ గా పని
పెట్రోల్ అంతా పెట్రోలింగ్ కె వినియోగం
మంత్రగాళ్ళకి జేబునిండా కాసులు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మనుషులకు - మంత్రాలూ
పిల్లలకూ - పశువులకు సాంబ్రాణీ పొగలు
ఇంటిముందు - చెరువులోన ఎర్ర నీళ్ళు పచ్చడి ముద్దలు
రోడ్డు మీద వూరు చివర
దిష్టి గుడ్లు - గుమ్మడి కాయలు
అటవీ శాఖ అధికారుల హడావుడి
కత్తులు బల్లాలతో కుర్రాళ్లు
కారాలు మిరియాలుతో ఆడాళ్ళు
ప్లాన్లు పధకాలతో పెద్దాళ్ళు
మేక మాసం ఎర
మరణ మృగానికి చెర
వింత జంతువుతో ఒక్కరికీ ఒక్కొక్క అనుభవం
వెన్నులో దడ పుడుతున్నా
వదనంలో ధీరత్వం
మేక వన్నె పులులు కాదు -
పులివన్నెల మేకలు
అయినా ............................................................. ?

ఇవి కధలా………
కలలా………………..
పుకార్లా…………. లేక

వీటి వెనుక ఏదైనా గూడు పుటాని ఉందా….. ! నాకైతే తెలియదు కానీ అదొక గొప్ప అనుభవం ( A Great memory )

Pictures placed here are just Representing thoughts of victims but nothing -

మీ వంగలపూడి శివ కృష్ణ

మన పెద్దాపురం మొట్టమొదటి M.L.A - దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు - 1st MLA of PEDDAPURAM

మన పెద్దాపురం మొట్టమొదటి M.L.A - దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు

-------------------------------------------------------------------------------------

జననం : 10-05-1911 విద్య : బి. ఎ - ఎల్ ఎల్ బి

న్యాయ వాది గా పనిచేస్తూ అమలాపురానికి పబ్లిక్ ప్రాసిక్యుటర్ గా నియమితులయ్యారు.

బ్రిటీషు వారి అరాచకాలకు సహించలేక తన పదవికి రాజీనామా చేసి భారతదేశం నుంచి బ్రిటీష్ పాలనను తరిమివేయటమే లక్ష్యంగా 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకొన్నందుకు గానూ 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు.

ఆయన యొక్క న్యాయవాద పట్టబద్రుని పట్టా రద్దు కి కేసు వేయబడగా పోరాడి సాదించుకొన్నారు. కేసు కొట్టి వేయబడింది స్వాతంత్ర్యానంతర పరిణామాల వల్ల కలత చెందిన దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాల పై విసుగు చెంది 1949 లో తన భావాలతో సారూప్యత కల్గిన కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు.

1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట రామస్వామి పై ఓటమి చవిచూశారు.

1953 లో ఆంద్ర రాష్ట్రావతరణ ప్రకటన వెలువడింది 1956 లో ఆంద్ర రాష్ట్రం అవతరించిది అన్న విషయం తెలిసిందే కదా .... ?

1955లో పెద్దాపురానికి దూర్వాసుల వెంకట సుబ్బారావు (సి.పి.ఐ = కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేసి సమీప ప్రత్యర్ది చల్లా అప్పారావు (కె ఎల్ పి = కిర్లావాలా లిబరల్ పార్టీ) పై విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసారు కార్మిక కర్షక ప్రగతి కామికులగా పెద్దాపురానికి మొదటి మండల లెజిస్లేటివ్ అసెంబ్లీ (ఎం. ఎల్. ఎ) గా సేవలందించారు.

తప్పులుంటే క్షమించాలి ............................... మీ వంగలపూడి శివకృష్ణ

Tuesday, 20 October 2015

పెద్దాపుర సంస్థాన ఆదాయం PEDDAPURA SAMSTHANAM BORDERS, INCOME, TRADITION AND CULTURE

పెద్దాపుర సంస్థాన సరి హద్దులు - ఆదాయం - పరిణామక్రమం 



పెద్దాపురం ప్రాచీన ఆంద్ర దేశము లో పురాతన సంస్థానములలో ఒకటి. ఇంచుమించు ఐదు వందల ఏళ్ల పూర్వ చరిత్ర కలది.

గోదావరి మండలము లోని చాలా భాగము,
కృష్ణా - గుంటూరు మండలాలలోని కొంత భాగము,

విశాఖ పట్టణం లోని కొన్ని గ్రామాలు అయిన తోటపల్లి, రంప , చోడవరం, మొదలగు మన్యం ప్రాంతాలు ఒకప్పటి పెద్దాపురం సంస్థానములోనివి.

సంస్థానములోని ముఖ్య పట్టణం అయిన "పెద్దాపురం" తూర్పు గోదావరి జిల్లా లో రాజ మహేంద్రవరం (ఇప్పటి రాజముండ్రి) కి ఈశాన్య దిక్కు గా పది కోసుల దూరంలో (కోసు = ఇంచుమించు 3.1/2 కిలో మీటర్లు) ఉన్నది.

1803 సంవత్సరం నాటికి పెద్దాపురం సంస్థానం ఆదాయం పది లక్షలు.



సాలు సరి పేష్కషు సాలుసరి పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఆరున్నర లక్షలు.

అంత పెద్ద సంస్థానం కాలక్రమంలో చిన్న చిన్న భాగాలుగా విభజించబడి చివరికి కొట్టాము, తుని ఎస్టేటు గా మారిపోయి, ఆ తరువాతి కాలంలో ఆంద్రప్రదేశ్ రాష్త్రం లో అంతర్భాగం అయ్యిపోయింది.


రాజా వేంకట సూర్య నారాయణ జగపతి రాజు గారి పేర నమోదయినటువంటి కొట్టాము ఎస్టేటు యొక్క రాబడి రెండున్నర లక్షలు పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఇరవై ఆరువేల నూట డెబ్బై మూడు రూపాయలు కొట్టాము ఎస్టేట్ యొక్క ముఖ్య పట్టణం తాండవ నది ఒడ్డున ఉన్న తుని. Ref : కిమ్మూరు కైఫీయతు https://plus.google.com/+vangalapudisivakrishna/posts

https://archive.org/details/kimmurukaifiyatu00unknsher

పెద్దాపురం సంస్థాన పాలకులు ఇంటి పేరు వత్సవాయి - RULERS OF PEDDAPURAM VATSAVAYI DYNASTY AND THEIR HORIZEN





' పెద్దాపురం సంస్థాన పాలకులు ఇంటి పేరు వత్సవాయి'


పెద్దాపురం సంస్థాన పాలకులు పూర్వము ఉత్తర దేశము నుండి వలస వచ్చి, గోదావరి, నెల్లూరు, కృష్ణా, విశాఖపట్టణం మండలాలలో స్థిర పడిన క్షత్రియ కుటుంబాలలో ఒక కోవకి చెందినవారు.




వీరిలో మందపాటివారు - వత్సవాయి వారు అని రెండు వర్గాల వారు ముఖ్యులు.


కాశ్యపస గోత్రానికి చెందిన మందపాటి వారు ఒంగోలు లోనూ, వశిష్ట గోత్రానికి చెందిన వత్సవాయి వారు పెద్దాపురం లోనూ పాలకులుగా ప్రసిద్ధి చెందారు. వత్సవాయి వారు సూర్య వంశోద్భావులగు ఆంధ్రక్షత్రియులలో మిక్కిలి గొప్పవారు. వీరి మూల పురుషుడు దుర్జయుడని, గుడిమెట్ల సాగిపోతరాజు వీరి పూర్వులలో ఒక్కడని. వీరి ముని మనమడు (మనవడు కి మనవడు ) అయిన వత్సవాయి శ్రీ రామ రాజు గారు కాలమున వత్సవాయి అనే గ్రామ వీరి రాజ్యానికి రాజధాని అవడం చేత వీరి ఇంటి పేరు వత్సవాయి అయ్యిందని తెలుస్తున్నది *
                                                                                                                     మీ వంగలపూడి శివకృష్ణ

చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు - CHATHURBUJA TIMMARAYA JAGAPATHI BAHADDARU (1555 - 1607) PEDDAPURAM

పెద్దాపుర సంస్థాన చరిత్రము : చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు

                                తిమ్మరాజు గారి కాలం పదునాల్గవ శతాబ్దం ఉత్తరార్ధం (1555-1607)


శ్రీ రాజా వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు సంస్థాన సంపాదకులు. ఆయన పరిసర ప్రాంతాలలో ఉన్న పాలకులు అందరినీ ఓడించి రాజ్యమును విస్తరింప చేసి పెద్దాపురం లో ఒక కోటను నిర్మించారంట.

తండ్రి శ్రీ వత్సవాయి పేర రాజు గారు, తల్లి గొట్టుముక్కల వారి ఆడపడుచు నారమాంబ గారు.

'తిమ్మరాజ శిఖామణి తేజరిల్లె
నతని కీర్తి నటించు శీతాద్రిసేతు
మధ్య పృధ్వీశ్వరాస్థాన మంటపములు'

- రామ విలాసము, అవతారిక, పు. 21.

ఆనాటి సుబేదారైన షేర్ మొహమ్మద్ ఖాన్ చతుర్బుజ తిమ్మ రాయ జగపతి బహద్దరు గారి యొక్క వీరోచిత కార్యాలను మెచ్చి ఒక కత్తి ని బహుమానం గా ఇచ్చాడట.

' షేరు మొహమ్మదు క్షీతిప శేఖరుఁ డద్భుత శౌర్య ధైర్య దు
ర్వారుఁడు మెచ్చి పైడిఁయొఱవాల్దన కేల నొసంగు వేళ దై
త్యారిసమానమూర్తి తన హస్తము మీఁ దుగ నందె వార్దిగం
భీరుఁడు వత్సవాయికుల పేరయ తిమ్మనృపాలుడుఁన్నతిన్’ - పైది, పు. 23.

విజయ నగర మహారాజు శ్రీ విజయరామరాజు గారు వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారి వీరత్వాన్ని వర్ణిస్తూ రచించిన చాటువు





ఆంభోజం కలయం సదృక్ష మవనే సాహిత్యరీత్యామ్ దృశో
ర్మాంధా తార మపార సంపది మహా బావే యశో రాశిషు
శత్రూణాం పురభంజనే దృతి గుణేకిం చోరగేంద్రంమతి
ప్రాగాల్భ్యే ప్రతిధాతి తిమ్మ నృపతిః పాకాహిత ప్రాభవః - విజయరామరాజు చాటువు


-------------------------------------------------------------- మీ వంగలపూడి శివకృష్ణ


https://plus.google.com/+vangalapudisivakrishna/posts

Monday, 19 October 2015

వడ్ల గింజలు - SRI PADA SUBRAMANYA SASTRY

మన పెద్దాపురం - వడ్ల గింజలు   శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి గారు 



మన పెద్దాపురం - వడ్ల గింజలు కథని ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి గారు రచించారు. ఈ కథ 1941 సంవత్సరం ఆంధ్రవారపత్రిక లో ప్రచురించబడింది. శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి కథలు రెండవ సంపుటంలో ఈ కథను మరి కొన్ని మంచి కథలతో పాటూ మళ్ళీ ప్రచురించారు. కథలో వెళ్ళే ముందు రచయిత గురించి తెలుసుకొందాం.
రచయిత పరిచయం
శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు ఏప్రిల్ నాలుగవ తేది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిష్యం, ధర్మ శాస్త్రాలను అభ్యసించి అవధానాలు కూడా చేసారు. వీరు పిఠాపురం సంస్థాన కవులు శ్రీ వేంకట రామకృష్ణ కవి గారి శిష్యులు. శ్రీపాద గారు సుమారు 75 కథలు వ్రాసారు. ఇంకా నాటకాలు, రేడియో నాటికలు, నవలలు, పద్య రచనలు కూడా చేసారు. శ్రీపాద గారి సాహిత్య సేవకు 1956 లో కనకాభిషేకం జరిగింది.
కథ
తణుకుకి చెందిన తంగిరాల శంకరప్ప చదరంగంలో దిట్ట. పెద్దాపురం మహరాజు దర్శనం కోసం శంకరప్ప కోటకు చేరుకుంటాడు. పేద బ్రాహ్మడయిన శంకరప్పకి కోటలోకి ప్రవేశం లభించదు. ఠానేదారు, దీవాంజీలు శంకరప్పకి కోటలోకి అనుమతి లభించకుండా అడ్డుపడి వీధిలోకి గెంటేస్తారు. దిగులుతో సత్రానికి చేరుకున్న శంకరప్పని చూసి పేదరాసి పెద్దమ్మ ఓదారుస్తుంది. మహరాజు దర్శనం సంపాదించడానికి ఉపాయం చెప్తుంది. ముందు పట్టణంలో పేరు తెచ్చుకుని తద్వారా మహరాజు దర్శనం సంపాదించమని హితబోధ చేస్తుంది. శంకరప్పకి జ్ఞానోదయం కలిగి ఊరి మీద పడతాడు.
అంచెలంచలుగా పెద్దాపురంలోని చదరంగ ప్రావీణ్యులనందరినీ ఓడించి, తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఊరిలో శంకరప్ప పేరు మారు మ్రోగుతుంది. ఈ వార్త చివరికి మహరాజుని చేరి, శంకరప్ప గురించి వాకబు చేస్తాడు. శంకరప్ప చదరంగ ప్రావీణ్యం గురించి తెలుసుకుని తనతో ఆడవలసిందిగా కబురు పంపుతాడు.పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని శంకరప్ప పల్లకీలో కోటకు వెళ్ళి మహరాజుతో చదరంగం ఆడడానికి సిద్ధపడుతాడు. ఆటలో తను గెలిస్తే చదరంగంలో మొదటి గడిలో ఒక వడ్ల గింజ, రెండో గడిలో రెండు వడ్ల గింజలు, మూడో గడిలో నాలుగు వడ్ల గింజలు ఇలా చదరంగంలోని అన్ని గడులలో గింజలు రెట్టింపు చేసుకుంటూ ఇవ్వాలని కోరుతాడు.
చదరంగం ఆటలో మహరాజు శంకరప్పని ఓడించాడా? లేక శంకరప్ప గెలిచి తను కోరుకున్న వడ్లగింజలని రాజు దగ్గర నుండి అందుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే!
శ్రీపాద గారు కథలని నడిపించే విధానం చాలా బాగుంటుంది. మామూలుగా ప్రతి కథలో, నవలలో, నాటికలో రచయిత అపుడపుడూ మన ముందుకు వచ్చి కథ ఉద్దేశం చెప్తూ ఉంటారు. శ్రీపాద గారి కథలలో పాత్రలు మాట్లాడుకుంటూ కథని చెప్తూ ఉంటాయి. మాటలు ఎక్కడా ఆగవు, కథతో పాటూ మాటలు కూడా ఆగుతాయి. ఈ మాటలు కూడా వేగంగా తూటాల్లాగా పేలుతూ వెళ్ళిపోతాయి.
కథలో శంకరప్ప ప్రధానంగా నాలుగు, అయిదు ఆటలు ఆడుతాడు. ముందుగా వీధి అరుగులో ఆడుకుంటున్న ఒక ఇద్దరు చిన్న తరహా ఆటగాళ్ళయిన శాస్త్రి, యాజులుతో మొదలుపెట్టి చేయి తిరిగిన పోటుగాళ్ళతో ఆడే విధానం శ్రీపాద గారు మనకి కళ్ళకి కట్టినట్టు చెప్తారు. ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళే కొద్దీ ఆట కూడా వారి తరహాలో, వారి అంతస్థుకి తగినట్టు వారి ఇళ్ళు, భవనాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాన్ని మనం బాగా దగ్గరగా చూడగలం ఈ కథలో. మూడు, నాలుగు ఎత్తుల్లో ఆట ముగించేసరికి శాస్త్రి, యాజులు శంకరప్పకి ప్రియ శిష్యులయిపోతారు. అప్పటినుండీ చివరివరకు గురువుగారిని అంటిపెట్టుకునే ఉంటారు.
రాజనర్తకి రంగనాయకి తన విటుడుతో ఆడే ఆటలో శంకరప్ప ఇంటి బయట నుండి గోడ చాటుగా వారి మాటలు వింటూ వారి ఆటలో పాల్గొనే సన్నివేశం చాలా ఆసక్తిగా ఉంటుంది. శంకరప్ప ఆటే కాదు, మాటలు కూడా పదునుగా ఉంటాయి. ఈ మాటలు పౌరుషంలో కోటలు దాటే విధంగా ఉంటాయి. దాట్ల అప్పల నరసింహారాజు గారి మేనల్లుడు విజయరామరాజుతో ఆడేముందు అతిథులకి మర్యాదలు, ఆడేటపుడు సపర్యలు అప్పటి కాలం రాచమర్యాదలని మనకి మళ్ళీ గుర్తు చేస్తాయి. ఆటలో శంకరప్ప ఏకాగ్రతకి భంగం కలిగించడానికి అతని పక్కన ఇద్దరు చక్కని చుక్కలని కూర్చుని తాంబూలం అందిస్తూ ఉంటారు. మహరాజుతో ఆడేటపుడు కూడా ఇంకొంచెం పెద్ద మోతాదులో ఈ మర్యాదలు ఉంటాయి. మహారాజుతో ఆట హోరాహోరీగా ఆరు నెలలపాటూ సాగడం, ఆట మధ్యలో వీరిద్దరి సంభాషణ మనల్ని బాగా ఆకట్టుకుంటాయి.
చివరగా వడ్లగింజల వరం కోరిక చదువుతూ ఉంటే మనకి సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో మీనా కోరిక గుర్తుకు వస్తుంది. ఆ కోరికకి స్పూర్తి మన వడ్లగింజలు కథ నుండే అన్నమాట!












Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...