పేదల అవసరాలు తీర్చే పెద్దాపురం సంత
షాపింగ్ మాల్స్ లా కనిపించే తాత్కాలిక
దుకాణాలు
తిరనాళ్ళను తలపించే జన ప్రవాహం
పెద్దాపురం లో ప్రతీ
ఆదివారం జరిగే వారాంతపు సంతకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
దీనికి 250 సంవత్సరాలపైనే చరిత్ర ఉంది. ప్రతీ
శనివారం సాయంత్రం నుంచే
ఇక్కడ సందడి మొదలై ఆదివారం ఉదయం
6
గంటల నుంచీ కొనుగోలుదారులతో
కిటకిటలాడుతుంటుంది. ఆదివారం అందరికీ సెలవు దినం కావడంతో అదే రోజు సంత నిర్వహిస్తుండటంతో పెద్దాపురం ప్రజలే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా వేల
సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తారు. ధనిక
- భీద భేదం లేకుండా క్రమం తప్పకుండా ప్రతీ వారం సంతకి
వెళ్ళడం ఇక్కడి ప్రజలకు వ్యాపకం(అలవాటు)
చుట్టు ప్రక్కల అనేక
గ్రామాలనుండి రైతులు, వ్యాపారులు ఇక్కడకు వచ్చి తాజా కూరగాయలు, పండ్లు మరియు అనేక
ఇతర నిత్యావసర వస్తువులు అమ్ముతారు, చిరు వ్యాపారులు
రైతులతో పాటు రోడ్డుపై
కూర్చొని దుప్పట్లు, స్వెటర్లు , రెడీమేడ్ బట్టలు, ప్లాస్టిక్ , స్టీల్
సామగ్రి , చెప్పులు, తిను
బండారాలు విక్రయిస్తారు. సంచార
వ్యాపారులు సైతం వినియోగదారుల అవసరాలు గుర్తించి, అవసరమైన వస్తువులను తీసుకుని
వచ్చి సంతలో విక్రయిస్తున్నారు. ఈ సంతలో
తక్కువ ధరకు కావాల్సిన వస్తువులు దొరుకుతుండటంతో పేద, మధ్య తరగతి
ప్రజలు వారానికి సరిపడా సరుకులతో పాటు ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేయడానికి ఆదివారం వరకూ ఆగి కొనుగోలు
చేస్తారు.
సంతకి వచ్చిన
జనం చదలాడ బెల్లం - చోడవరం చింతపండు - రంప చీపుర్లు - గొల్లప్రోలు ఉల్లిపాయ - పెద్దాపురం పాలకోవా -
నాటు కోళ్ళు - పచ్చి చేపలు - ఎండు చేపలను ఎగబడి
కొంటారు.
No comments:
Post a Comment