Thursday, 12 January 2017

చారిత్రిక పెద్దాపురం సంస్థానం కోడి పందాలు : విజయ నగరం మహారాజు ఆనంద గజపతి Vs పెద్దాపురం సంస్థానం మహారాజు రాయ జగపతి (Peddapuram Cock Fight)

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

చారిత్రిక పెద్దాపురం సంస్థానం కోడి పందాలు :
పండగ వచ్చిందంటే చాలు మనందరి ఆలోచనలు అనుకోకుండానే కోడి పందాల వైపు మళ్ళుతాయి పెద్దాపురం మరియు పరిసర ప్రాంత ప్రజల కోడి పందాల పిచ్చి రాష్ట్రం నలుమూలలకు పాకింది ... కోడి పందాలకే కాదు పందెం కోళ్లకు శిక్షణ ఇచ్చే నిపుణులకూ పెద్దాపురం ప్రసిద్ధి .... రాష్ట్రం నలుమూలలనుంచీ పెద్దాపురం వచ్చి ఇక్కడి నిపుణులు పెంచిన కోళ్లను తీసుకుపోతుంటారు పందాల రాయుళ్లు .... అయితే ఈ పందాల ఆసక్తి ఈ నాటిది కాదు రాజుల కాలం నుండీ ఉంది... పెద్దాపురం చరిత్రలో కోడి పందాలు అనగానే టక్కున గుర్తొచ్చే రెండు పేర్లు విజయ నగరం సంస్థాన మహారాజు ఆనంద గజపతి మరియు పెద్దాపురం సంస్థానం మహారాజు రాయ జగపతి

వీరిద్దరూ విజయనగర సంస్థాన మహారాజు శ్రీ రాజా పెద విజయరామ గజపతి సంరక్షణలో కొన్ని సంవత్సరాలు పెరిగారు అయినప్పటికీ వీరిద్దరికీ ఒక్క క్షణం కూడా పడేదికాదు సకల విద్యా పారంగతులై ... సమ ఉజ్జీవులైన వీరిద్దరూ ప్రతీ విషయం లో పోటీ పడే వారు... మరీ ముఖ్యంగా కోడి పందాలలో...గెలుపోటములు ఇరువురికీ అటూ ఇటూ అయినా ఒకానొక సందర్భంలో పందెంలో ఓడిపోయిన ఆనంద గజపతి "మా పెంపుడు కోడే గెలిచింది" లే అంటూ గేలి చేసినట్టుగా కధనం...

  చారిత్రక పెద్దాపురం కోట వేదికగా కనుమ నాడు ఈ కోడి పందాలు అత్యంత వైభవంగా జరిగేవని ఆ పందాలలో పాల్గొనడానికి ... అనేక సంస్థానాల మహారాజులు వచ్చేవారని తెలుస్తుంది...

మరింత ఆసక్తి కరమైన కధనం ఏమిటంటే ఒకా నొక యుద్ధంలో  బ్రిటీషు వారి వైపు నిలిచి పోరాడాలని  ఆనంద గజపతి ... ప్రెంచి వారి వైపు నిలవాలని రాయ జగపతి పట్టు బట్టగా కోడి పందాల ద్వారా తేల్చుకున్నారని మరొక కధనం...

1758 చెందుర్తి యుద్ధంలో  1759 వ సంవత్సరంలో ఉండూరు వద్ద జరిగిన యుద్ధంలో  వీరిరువురూ హోరా హోరీ గా పోటీ పడగా ఉండూరు యుద్ధంలో పెద్దాపురం మహారాజు రాయ జగపతి తుపాకీ గుండు దెబ్బకు మరణించగా ... 1760 వ సంవత్సరంలో విజయ నగరం మహారాజు ఆనంద గజపతి అస్వస్థతతో మరణించినట్టుగా చరిత్ర చెబుతోంది.... మొత్తానికి పందెం కోళ్లు రెండూ ఉన్నన్నాళ్లూ విరుద్ధంగా ఉండడం ... మరణం కూడా స్వల్పకాల వ్యవధిలో సంభవించడం చరిత్రలో ఒక పోరు కధగా మిగిలి పోయింది ....

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...