Monday, 12 December 2016

JAI PEDDAPURAM JAI JAI PEDDAPURAM - BY VANGALAPUDI SIVA KRISHNA

పెద్దాపురం చరిత్ర

జై పెద్దాపురం..... జై జై చారిత్రక పెద్దాపురం

మహదైశ్వర్యములనుభవించి యువ పరాక్రమ చరిత్రతో విరాజిల్లిన చారిత్రక పెద్దాపురం అసలు చరిత్ర తెలుసుకో... 300 సంవత్సరాలు పెద్దాపుర మహా సంస్థానాన్ని పరిపాలించిన వత్సవాయ వంశ వైభవం తెలుసుకో

రణమున గుఱ్ఱంపు రౌతులఁ బరిమార్చె
వాసిగా నెఱజెర్ల వాక లోనఁ
బెద్దాపురంబున బిరుదాంకపురిలోన
యవనవీరులఁ బరా హతులఁ జేసెఁ
బ్రతిఘటించు నరేంద్ర సుతుని దర్ప మడంచెఁ
దిరుపతి చెంత భూవరులు మెచ్చఁ
దూరుపునాట శత్రుక్షత్రనక్షత్ర
రుచిరూపు మాపే సూర్యుం డనంగ

38 గ్రామాలతో ఉన్న కోఠాం ఎస్టేటు (గోదావరి జిల్లా, తుని) ఒకప్పుడు పెద్దాపురం సంస్థానంలో ఒక చిన్న భాగం అలాంటి 585 గ్రామాలు మరియు పట్టణములతో విరాజిల్లిన పెద్దాపుర మహా సంస్థానాన్ని, పురాణ పురుషులు, రాజులు, మహా రాజులు, మహారాణులు, కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులు, పోరాట యోధులు నడయాడిన పెద్దాపురాన్ని నా ఊరు పెద్దాపురం అని గర్వంగా చెప్పుకోలేక పోవడం కంటే హీనం మరొకటి ఉండదు .... జై పెద్దాపురం జై జై చారిత్రక పెద్దాపురం

VANGALAPUDI SIVA KRISHNA'S PEDDAPURAM HISTORY

పెద్దాపురం చరిత్ర
38 గ్రామాలతో ఉన్న కోఠాం ఎస్టేటు (గోదావరి జిల్లా, తుని) ఒకప్పుడు పెద్దాపురం సంస్థానంలో ఒక చిన్న భాగం అలాంటి 585 గ్రామాలు మరియు పట్టణములతో విరాజిల్లిన పెద్దాపుర మహా సంస్థానాన్ని, పురాణ పురుషులు, రాజులు, మహా రాజులు, మహారాణులు, కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులు, పోరాట యోధులు నడయాడిన పెద్దాపురాన్ని నా ఊరు పెద్దాపురం అని గర్వంగా చెప్పుకోలేక పోవడం కంటే హీనం మరొకటి ఉండదు ....

ఇలాంటివి ఎన్నో విషయాలు మనలో చాలా మందికి తెలియదు .. మన ఊరు చరిత్ర గొప్పతనాన్ని నిరంతరం పోస్ట్ ల ద్వారా తెలియచేస్తున్న మన మిత్రుడు Vangalapudi Siva Krishna గారికి ధన్యవాదాలు .. పెద్దాపురంలో ఉన్న చరిత్రకారులు మరియు మేధావులు సహకారంతో పెద్దాపురం చరిత్ర మొత్తాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావలని శివకృష్ణ ని కోరుకుంటున్నా. ఈ పుస్తకానికి అయ్యే ఖర్చులో పెద్దాపురం పౌరుడిగా నా వంతు సాయం చేస్తానని హామీ ఇస్తున్నా ..మరి మీరు ?

ఇది చారిత్రక అవసరం..భవిష్యత్ కు పునాది!!ప్రతీ పెద్దాపురం పౌరుడు స్పందిస్తారని ఆశిస్తూ !!

KASI YATHRA CHARITHAM - PEDDAPURAM BY VANGALAPUDI SIVA KRISHNA

పెద్దాపురం చరిత్ర

Yenugula Veeraswamayya kaseeyatra Charitra Saying about Peddapuram

#కాశీయాత్రా_చరిత్ర: ఏనుగుల వీరాస్వామయ్య గారు #పెద్దాపురం_సందర్శనం
1831 జులై 20వ తేదీ, దాదాపు 185 సంవత్సరాల క్రితం ఏనుగుల వీరాస్వామయ్య గారు పెద్దాపురాన్ని సందర్శించడం జరిగింది - ఆ సమయంలోనే ఆయన
పెద్దాపురం పిఠాపురం ల మధ్య ప్రవహించే #యేలా నది గురించి,
పెద్దాపురం అనే ఊరు #పిఠాపురం కంటే గొప్పది ఇక్కడి ఇల్లు చాలా పెద్దవి,
పెద్దాపురం తాలూకాలో 3,00,000 అంగళ్ళు (సరుకులు అమ్మేవి) ఉన్నాయి అన్ని రకాల పదార్థాలు దొరుకుతున్నాయి,
పెద్దాపురం #మహారాణీ శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ దేవి అప్పటికి 3 సంవత్సరాలుగా సత్రం నడుపుతూ ఉండడం లాంటి పలు ఆసక్తి కరమైన విషయాలు కూడా ప్రస్తావించారు.....
#చారిత్రక పెద్దాపురంలో ఇలాంటి విశేషాలెన్నో చారిత్రిక గ్రంధాలలో పెద్దాపురం గురించి ఇలాంటి ప్రస్తావనలెన్నో ఉన్నాయి అవన్నీ మీముందు ఉంచే ప్రయత్నం చేస్తాను మీ యొక్క సహాయ సహాకారాలను ఆకాంక్షిస్తూ .... మీ #వంగలపూడి_శివకృష్ణ -


AIDS DAY BY PEDDAPURAM YOUTH @ENTIRE ANDHRA PRADESH


VANGALAPUDI SIVAKRISHNA
-------------------------------------
రాష్ట్రమంతటా HIV / AIDS Campaign చేసిన ఆనాటి రోజులు గుర్తుకొచ్చాయి

అది పెద్దాపురాన్ని కాల సర్పం కసిగా కాటు వేసిన కాలం
కాలధర్మం కోసం కాలయముడు కాచుకు కూర్చున్న కాలం
ప్రపంచానికి పెద్దాపురాన్ని వేశ్యాపురంగా పరిచయం చేసిన కాలం

కడుపు దహించుకు పోతున్నా శరీరం కుచించుకు పోతున్నా
తప్పని సరి పరిస్థితులలో తప్పుడు మంచాలు చేరి
పడుపు వృత్తి పంచన వంచనలు భరించిన
కళావంతుల కన్నెల వేదనలు ఓవైపు


వ్యసనాలకు బానిసలై విష సంస్కృతి పీడితులై
విచ్చల విడి కామికులై వీధుల పడి తిరుగుతూ
వి.సి.డి లలో బూతు పురాణమ్ విలువైన కాలం వేశ్యార్పణం
వద్దని వారిస్తున్నా వినిపించని వైనంతో మూర్కత్వపు యువకులు వైపు


వెరసి ఆనాటి పెద్దాపురం లో ....... !
వీధి వీధి కి విగతజీవులు
ఊరి పొడవునా జీవచ్చవాలు
మరణ శాసనం మనో పలకం పై
ముద్రించుకున్న మూగజీవులు - ఎయిడ్స్ రోగులు

PEDDAPURAM MARIDITHALLI - BY VANGALAPUDI SIVAKRISHNA

పెద్దాపురం చరిత్ర
మమతల మా అమ్మ తల్లి
మము కాచే కల్పవల్లి
పెద్దాపుర మరిడితల్లి
మాపురపు ఇలవేల్పు

Bangaramma Temple Peddapuram, Bangaramma Gudi Veedhi Peddapruam

పెద్దాపురం చరిత్ర
#బంగారు_మాతల్లి #బంగారమ్మ_తల్లి
నీ ప్రేమ శాశ్వతం నీ కరుణ అమృతం
అరుణ కాంతుల తల్లి అందాల తల్లి
అసమాన దీప్తివై అతీంద్రియ శక్తివై
అవనిలో వర్ధిల్లు అపరంజి దేవత
బంగారు కాంతితో వజ్రాల వెలుగుతో
దర్శనం ఇచ్చేటి ధరణేలు తల్లి
భక్తులను కాపాడి కోర్కెలను తీర్చగా
భువిలోన వెలిసిన బంగారు తల్లి
మన పెద్దాపురం శ్రీ శ్రీ శ్రీ బంగారమ్మ అమ్మవారి దివ్యమంగళ విగ్రహం దర్శించండి

శ్రీ బంగారమ్మ అమ్మవారు
Bangaramma Thalli Temple Peddapuram Near Bangaramma Gudi Veedhi Peddapuram పెద్దాపురం బంగారమ్మ అమ్మవారి స్తోత్రం వంగలపూడి శివకృష్ణ

వంగలపూడి శివకృష్ణ పెద్దాపురం - Vangalapudi Siva Krishna Peddapuram

పెద్దాపురం చరిత్ర
వంగలపూడి శివ కృష్ణ - పెద్దాపురం 

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...