Tuesday, 3 January 2017

JANAB MADEENAA PASCHA OWLIYA DARGA SHARIF - PEDDAPURAM

మానవతా తత్వానికి - మత సామరస్యానికి
మచ్చు తునక ఉత్సవం - మా ఉరుష్ గందోత్సవం.
హిందూ... ముస్లీమ్...  క్రైస్తవ సోదరుల...  ఐక్యతతో  హజరత్ షేక్ మదీనా పాశ్చా ఔలియా దర్గా వద్ద తొమ్మిది మూరల నవాబు గారి ఉత్సవం... ప్రతీ సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్దలతో ఆనందంగా జరుపుకుందాం రండి.

తొమ్మిది మూరల సాయిబు గారి పండుగ అంటే ...
వేల సంఖ్య లో జనం - చిన్న పిల్లల కోలాహలం
యువతీ యువకుల సమ్మేళనం...  పెద్దల పూజలు...  కళాకారుల ప్రదర్శనలు..  వెరసి గంధోత్సవం - ఉరుష్ ఉత్సవం కన్నుల పండుగ . "ఉరుష్ అనగా అరబిక్ బాషలో వివాహము లేదా ఆనందకరమైన పండుగ అని అర్ధం" కానీ మనందరికీ గుర్తొచ్చేది మాత్రం
గంగాధరం ఆర్కెస్ట్రా,  రాజమండ్రి బుచ్చి బాబు మిమిక్రీ, మ్యాజికల్ షోలు, కుర్రాళ్ళ డాన్సులు, బెల్లం బూందీ మిఠాయిలు, ప్రతిఒక్కరి నెత్తిన ముస్లీం కూఫీ టోపీలు, పది అడుగుల పొడవైన పెద్ద పవిత్ర సమాధి, ఆ సమాధి చూసినప్పుడల్లా దాని చరిత్ర తెలుసుకోవాలన్న కుతూహలం... మీరేమంటారు మిత్రులారా... ?

PEDDAPURAM URUSH FESTIVAL 

Monday, 2 January 2017

HELP POOR DONATE POOR - LET US SEE THE BEGGERS LESS SOCIETY @ PEDDAPURAM

పెద్దాపురం- వంగలపూడి శివకృష్ణ
ఈ నూతన సంవత్సరాన్ని 
రోడ్డు మీద నిద్రించే అభాగ్యులతో జరుపుకుందాం రండి 
ఇరగ కాసే ఎండలోనూ రోడ్డు మీదే వారి జీవనం 
ఎముకలు కొరికే చలిలోనూ రోడ్డుమీదే వారి జీవనం
ఎండకు_ఎండుతూ ... చలికి_వణుకుతూ... 
వీధిలలో నిద్రించే అభాగ్యులతో ...
గత ఎనిమిది సంవత్సరాలుగా
నూతన సంవత్సారాన్ని జరుపుకుంటున్నాం...
ప్రతీ సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వారికి  ఆహరం, బట్టలు, దుప్పట్లు పంచుతూ నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకోవడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ



LET US WELCOME THIS NEW YEAR PURELY @PEDDAPURAM

పెద్దాపురం : #మద్యపాన రహిత సమాజం కోసం భారీ ర్యాలీ
#పాశ్చాత్యసంస్కృతి ప్రభావంతో నేటియువత నూతన సంవత్సరాన్ని మద్యం మత్తులో ఆహ్వానిస్తుండాన్ని నిరశిస్తూ... ది. 30.12.2016 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక పెద్దాపురం వెంకటేశ్వర స్వామి గుడినుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకూ... భారీ ర్యాలీ నిర్వహించారు
SFI, జన విజ్ఞాన వేదిక, ఐద్వా , డి వై ఎప్ ఐ, ప్రజానాట్యమండలి,ఉపాధ్యాయ సంఘం,
మన పెద్దాపురం పేస్ బుక్ గ్రూపులు సంయుక్తంగా మరియు మద్యపాన రహిత సమాజాన్ని ఆకాంక్షించే అందరూ కలసికట్టుగా
#వెంకటేశ్వరస్వామి వారి గుడి వద్దనుండి #మునిసిపల్_సెంటర్ వరకూ నడిచి...
మునిసిపల్ కార్యాలయం వద్ద మానవహారం గా ఏర్పడి మద్యం వల్ల ఏటా అనేక కుటుంబాలు చిద్రమైపోతున్నాయని ఇది చాలా భాదాకరమని... మరీ ముఖ్యంగా యువత పాశ్చాత్య పోకడలు పోతూ... మద్యం సేవించి వేగంగా వాహనాలు నడుపుతూ... రోడ్డు ప్రమాదాల భారిన పడుతుండడం విచారించదగ్గ విషయం అని ఆయా సంఘాల నాయకులు వాపోయారు... మద్య రహిత దేశం త్వరలోనే రావాలని ఆకాంక్షించారు...






- వంగలపూడి శివకృష్ణ

PEDDAPURAM SPORTS AND SPORTS PERSONALITIES

పెద్దాపురం - వంగలపూడి శివకృష్ణ

2016 లో మన పెద్దాపురం క్రీడాకారులు అనేక క్రీడంశాలలో, ఎన్నో విజయాలతో జయకేతనం ఎగురవేశారు. సరయిన ప్రోత్సహాలు సదుపాయాలు లేకున్నా, మన పెద్దాపురం క్రీడాకారులు రెట్టించిన ఉత్సహంతో తలెత్తుకుని నిలబడ్డారు.
పట్టణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలలో మన క్రీడాకారులు ప్రతిభ కనపరిచారు.
క్రికెట్ లో స్టీఫెన్,
టెన్నిస్ లో ముప్పన సూర్య ప్రకాష్,
షటిల్ లో మహేష్, కరీముల్లా
చదరంగం లో ముప్పన జ్ఞాన సాయి సంతోష్
హెమ్మర్ త్రో లో ఓం నమశివాయ
హై జంప్ లో పెదకామరాజు
కరాటే, ఫుట్ బాల్ లో శ్రీనివాస్ రాజ్
రోప్ స్కిప్పింగ్, అథెలిటిక్స్ లో సిద్దార్థ
బాడీ బిల్డింగ్ లో మౌనింద్ర
ఇలా ఇంకా అనేక మంది క్రీడాకారులు.

రాబోవు 2017 లో మన క్రీడాకారులకు మరింత ప్రోతాహం లభించి, మన పెద్దాపురం నుంచి మరింతమంది క్రీడాకారులు ముందుకు రావాలని, మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటూ, అందరికి All the Best & Wish you a Happy New Year. - BY Peddapuram Chess










SAY NO TO ALCOHOL @PEDDAPURAM


మద్యానికి బానిసై నిండు జీవితాల్ని నాశనం చేసుకుంటున్న వారికోసం మద్యం వద్దు - మంచినీళ్లు ముద్దు - తాగి తందనాలాడద్దు - జీవితాల్ని మద్యం రాక్షసికి పణంగా పెట్టద్దు అంటూ ర్యాలీ చేసాం

MAKING PLANTATION WITH THE POOR @PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
Help the Poor and Made them Plantation మేము బొగ్గు బాలాజీ కుటుంబానికి సహాయం అందించాం... వారు మా ఋణం తీర్చుకోలేనిది కన్నీటి పర్యంతమయ్యారు ... మా ఋణం తీర్చుకునేదానికి బదులుగా  వారిని మొక్కను నాటమని అది పెరిగి  పెద్దయ్యే వరకూ సంరక్షించామని అభ్యర్ధించాం
బొగ్గు బాలాజీ గారి ఇద్దరి పాపలతో వాళ్ళ ఇంటి ముందు మొక్కలు నాటించిన మన పెద్దాపురం గ్రూప్ సభ్యులు 



Mana Peddapuram Fan Made Video



పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...