Monday, 12 December 2016

AIDS DAY BY PEDDAPURAM YOUTH @ENTIRE ANDHRA PRADESH


VANGALAPUDI SIVAKRISHNA
-------------------------------------
రాష్ట్రమంతటా HIV / AIDS Campaign చేసిన ఆనాటి రోజులు గుర్తుకొచ్చాయి

అది పెద్దాపురాన్ని కాల సర్పం కసిగా కాటు వేసిన కాలం
కాలధర్మం కోసం కాలయముడు కాచుకు కూర్చున్న కాలం
ప్రపంచానికి పెద్దాపురాన్ని వేశ్యాపురంగా పరిచయం చేసిన కాలం

కడుపు దహించుకు పోతున్నా శరీరం కుచించుకు పోతున్నా
తప్పని సరి పరిస్థితులలో తప్పుడు మంచాలు చేరి
పడుపు వృత్తి పంచన వంచనలు భరించిన
కళావంతుల కన్నెల వేదనలు ఓవైపు


వ్యసనాలకు బానిసలై విష సంస్కృతి పీడితులై
విచ్చల విడి కామికులై వీధుల పడి తిరుగుతూ
వి.సి.డి లలో బూతు పురాణమ్ విలువైన కాలం వేశ్యార్పణం
వద్దని వారిస్తున్నా వినిపించని వైనంతో మూర్కత్వపు యువకులు వైపు


వెరసి ఆనాటి పెద్దాపురం లో ....... !
వీధి వీధి కి విగతజీవులు
ఊరి పొడవునా జీవచ్చవాలు
మరణ శాసనం మనో పలకం పై
ముద్రించుకున్న మూగజీవులు - ఎయిడ్స్ రోగులు

PEDDAPURAM MARIDITHALLI - BY VANGALAPUDI SIVAKRISHNA

పెద్దాపురం చరిత్ర
మమతల మా అమ్మ తల్లి
మము కాచే కల్పవల్లి
పెద్దాపుర మరిడితల్లి
మాపురపు ఇలవేల్పు

Bangaramma Temple Peddapuram, Bangaramma Gudi Veedhi Peddapruam

పెద్దాపురం చరిత్ర
#బంగారు_మాతల్లి #బంగారమ్మ_తల్లి
నీ ప్రేమ శాశ్వతం నీ కరుణ అమృతం
అరుణ కాంతుల తల్లి అందాల తల్లి
అసమాన దీప్తివై అతీంద్రియ శక్తివై
అవనిలో వర్ధిల్లు అపరంజి దేవత
బంగారు కాంతితో వజ్రాల వెలుగుతో
దర్శనం ఇచ్చేటి ధరణేలు తల్లి
భక్తులను కాపాడి కోర్కెలను తీర్చగా
భువిలోన వెలిసిన బంగారు తల్లి
మన పెద్దాపురం శ్రీ శ్రీ శ్రీ బంగారమ్మ అమ్మవారి దివ్యమంగళ విగ్రహం దర్శించండి

శ్రీ బంగారమ్మ అమ్మవారు
Bangaramma Thalli Temple Peddapuram Near Bangaramma Gudi Veedhi Peddapuram పెద్దాపురం బంగారమ్మ అమ్మవారి స్తోత్రం వంగలపూడి శివకృష్ణ

వంగలపూడి శివకృష్ణ పెద్దాపురం - Vangalapudi Siva Krishna Peddapuram

పెద్దాపురం చరిత్ర
వంగలపూడి శివ కృష్ణ - పెద్దాపురం 

Monday, 31 October 2016

Centinery Celbrations to Peddapuram Municipality : Councilors వందేళ్ళ పెద్దాపురం మున్సిపాలిటీ

పెద్దాపురం చరిత్ర
వందేళ్ళ పెద్దాపురం మున్సిపాలిటీ కి వందనం
----------------------------------------------
శత వసంతాల పురపాలకం
పెద్దాపురం ప్రాచీన వైభవానికి తలమానికం
పాలక సేవక సమ్మేళనమై
ప్రజానీకానికి భవభాందవులై
మమ్ము ఏలిన సత్కళా సంపన్నులు
మన పెద్దాపురం చైర్ పర్సన్ లు
















                                                                                                                                                                    పెద్దాపురం సంస్థానం 1847 వరకూ వత్సవాయ సూర్యనారాయణ జగపతి బహదూర్ పాలన కొనసాగింది. 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ / జాన్ వాట్స్ కంపెనీ పెద్దాపురంను ఆక్రమించడం జరిగింది. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురంను రెవిన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు నిర్మించారు. 1857 తిరుగుబాటు తర్వాత భారత దేశం లో కంపెనీ పాలన రద్దు చేయబడి 1858 నుండి బ్రిటీష్ రాజ్ ఆవిర్భవించింది. ఆ తరువాత కొంత కాలానికి 1902 లో బ్రిటీషు వారిచే "టౌన్ హాల్" నిర్మించబడి 1915 లో రాష్ట్రంలో నే రెండవ మున్సిపాలిటీ గా పెద్దాపురం ఆవిర్భవించబడింది. శ్రీ. వి. కె అనంత కృష్ణ అయ్యర్ మరియు శ్రీ. అభినవ పట్నాయక్ లు బ్రిటీషు గవర్నమెంటు వారిచే నియమించబడి 1915 నుండి 1918 వరకూ పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్ మెన్ లుగా వ్యవహరించగా వీరి అనంతరం బ్రిటీషు వారిచే నియమింపబడిన పెద్దాపురం వాస్తవ్యుడైన మొట్టమొదటి చైర్మెన్
శ్రీ పింగళి కృష్ణారావు పంతులు గారు (1918 – 1921)
శ్రీ గోలి పెద కొండయ్య గారు (1921 – 1924) పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు
శ్రీ గుర్రాల కృష్ణా రావు గారు (1924-1926)
శ్రీ ముప్పన చిన వీర్రాజు గారు (1926-1928)
శ్రీ చల్లా దొరయ్య గారు (1928-1931)
శ్రీ జనాబ్ ఇస్మాయిల్ ఖాన్ సాహెబ్ గారు (1931-1933)
శ్రీ నియోగి వెంకట సుబ్బారావు గారు (1933-1934)
శ్రీ గొల్లకోట వెంకట రత్నం గారు (1934-1936)
శ్రీ జనాబ్ M.A కరీం సాహెబ్ గారు (1938-1941)
శ్రీ ముప్పన చిన అంకయ్య గారు (1943-1947)
శ్రీ ముప్పన పెద వీరభద్ర రావు గారు (1947-1952)
శ్రీ చల్లా వెంకట రావు గారు (1952-1956)
శ్రీ ముప్పన రామారావు గారు (1956 – 1972 & 1981- 1986) వరుసగా 4 సార్లు పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై 1961-66 కాలానికి ఛాంబర్ చైర్మెన్ గా ఏకగ్రీవం గా ఎన్నిక కాబడి ఇప్పటి వరకూ ఎక్కువ కాలం చైర్మన్ గా చేసిన వ్యక్తి గా గుర్తింపు పొందారు.
శ్రీమతి తాళ్ళూరి గంగా భవాని గారు (1987-1992)
శ్రీమతి బచ్చు శ్రీదేవి గారు (1995-2000)
శ్రీమతి ముప్పన శ్యామలాంబ గారు (2005-2010)
శ్రీ రాజా వత్సవాయ సూరిబాబు రాజు గారు (2000 – 2005 & 2014 - ) రెండవ సారి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు
దినదిన ప్రవర్ధమాన మవుతూ నానాటికీ విస్తరిచబడుతూ నేటికి 28 వార్డులకు చేరుకున్న మన పెద్దాపురం మున్సిపాలిటీ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని పేదప్రజారహిత పెద్దాపురం కావాలని ఆకాంక్షిస్తూ ... మీ వంగలపూడి శివకృష్ణ
గమనిక: పైన ఉదహరించిన వాటి మద్య కాలాలలో ఏదేని కారణం చేత చైర్మన్ ఎన్నికలు నిర్వహించనప్పుడు ఆర్ డి. ఓ గారు గానీ జాయింటు కలక్టరు వారు గానీ లేక ఇతర అధికారులెవరైనా కానీ పురపాలకం నిర్వాహక భాద్యతను చేపట్టడం జరుగుతుంది దీనినే “స్పెషల్ ఆఫీసర్” పాలన గా వ్యవరిస్తారు.

Friday, 4 March 2016

Raya Bhupaala Patnam - RB Patnam - Peddapuram

రాయ భూపాల పట్నం - రాగమ్మ చెరువు - రత్నగర్భ వినాయకుడు 








రాయభూపాల పట్నం - వత్సవాయి రాయ జగపతి మహారాజు గారు కొంపెల్ల మహా లక్ష్మి (లక్ష్మీసోదెమ్మ) అనే బ్రాహ్మణ వితంతు మహిళకి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించిన లక్ష్మీపుర ఆగ్రహారానికి నామాంతరం.
అసలు ఈ కొంపెల్ల మహా లక్ష్మి ఎవరు రాజు గారు ఈమెకు ఎందుకు ఋణపడ్డారు అనే విషయం తెలియాలంటే ఈ చిన్న కదా చదవాల్సిందే .... !
రుస్తుం ఖాన్ పెద్దాపురం కోటను ఆక్రమించుకోవడానికి సైన్య సమేతం గా బయలుదేరాడన్న విషయం వేగుల(గూడాచారులు) ద్వారా రాగమ్మ గారికి తెలిసింది. ఏడాది బాలుడు, పెద్దాపురం సంస్థాన భావి వారసుడైన రాయగజపతిని తనకు అత్యంత సన్నిహితురాలైన కొంపెల్ల మహా లక్ష్మి (లక్ష్మీసోదెమ్మ) కి ఇచ్చి విజయనగర సంస్థాన మహారాజు పూసపాటి విజయరామరాజు గారి భార్య చంద్రాయమ్మకు ఇక్కడ జరిగినదంతా తెలియ చేసి ఈ బాలున్ని అప్పగించ వలసినదిగా ఆజ్ఞాపించింది. ఆతరువాత రాగమ్మ గారు మిగిలిన అంతపుర స్త్రీలు అందరు పెద్దాపుర సంస్థానానికి నమ్మకస్తుడైన సేవకుడు చల్లా పెద్ది చేత కోటకి నిప్పు పెట్టించుకుని అగ్నిప్రవేశం చేసారు.
కొంపెల్ల మహా లక్ష్మి పసిబాలుడు రాయ జగపతి ని ఎత్తుకుని విజయనగరం బయలు దేరుతుండగా మార్గమద్యంలో రుస్తుం ఖాన్ అనుచరులు ఆమెను ఆపి ఆబాలుడు ఎవరు అని ప్రశ్నించారు. దానికి ఆమె నా బాలుడే అని సమాదానం ఇచ్చింది. ఆ యొక్క వితంతు బ్రాహ్మణ స్త్రీ వేష దారణ చూసిన సైనికులకు ఆమెపై అనుమానం వచ్చి ఒక జామ పండు తెచ్చి ఆ బాలుడు తో కొరికించి ఆ ఎంగిలి పండును ఆమె ను తినమని చెప్పారు (ఆచార నియమాలు పవిత్రం గా బావించే ఆనాటి బ్రాహ్మణ స్త్రీలకు ఎంగిలి (యుచ్చిష్ట ఫలం) నిషిద్దం) అయినా బాలుని సంరక్షణార్ధం వారికి ఎటువంటి అనుమానం రాకుండా ఆ ఎంగిలి పండు తిని వారిని నమ్మించి అక్కడ నుండి బయలుదేరెను. ఆ వెనువెంటనే పెద్దాపురం కోట చేరుకున్న రుస్తుం ఖాన్ జరిగిన విషయం అంతా తెలుసుకుని సైనికులపై మండిపడి తక్షణమే బాలున్ని పట్టుకుని తీసుకు రావాల్సింది గా సైనికులను ఆజ్ఞాపించాడు.
ఆ బ్రాహ్మణ స్త్రీ సైనికులకు బాలుడుతో సహితం గా చేబ్రోలు వద్ద దొరికి పోయింది. బాలుడు రాయజగపతి ని చెరశాల లో వుంచవలసినది గా రుస్తుం ఖాన్ ఆజ్ఞాపించాడు. అంతట ఆ కొంపెల్ల మహా లక్ష్మి గారు నేనూ బాలుడితో సహా చెరలో ఉండేందుకు అనుమతించమని రుస్తుం ఖాన్ ను వేడుకుంది. చెర శాలలోనే ఉంటూ బాలున్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. రాయ జగపతి ని చెరనుండి విడిపించడానికి అహర్నిశలూ కృషి చేసింది.
రుస్తుం ఖాన్ బార్యతో సన్నిహితం గా ఉంటూ అదను చూసుకొని రాయ జగపతి రుస్తుం ఖాన్ వద్దనే బందీగా ఉన్నాడనే విషయం విజయనగరానికి చేర వేసింది.
రుస్తుం ఖాన్ ను తన సొంత కొడుకు నూరుద్దీన్ ఖాన్ చేతిలో నే దారుణంగా హత్య కావించబడ్డాడు.
విజయనగర మహారాజు పెద విజయరామ రాజు గారు పదివేల సైన్యంతో మరియు 2 వేల భోయీల తో నూరుద్దీన్ ఖాన్ పై దండెత్తి వచ్చి చేబ్రోలు దగ్గర పెద్దయుద్ధం చేసి నూరుద్దీన్ ఖాన్ ను హతమార్చి బాలున్ని చెరనుండి విడిపించి యుక్త వయస్సు వచ్చే వరకూ తమ వద్దనే ఉంచుకుని "నీమత్ ఆలీ” తో ఒప్పందం కుదుర్చుకుని పెద్దాపురం సంస్థానా నికి రాయ జగపతి ని రాజు చేసెను.
ఆ రకంగా ఎంతో సాహసంతో, తన ప్రాణాలకు తెగించి వత్సవాయ వంశాంకుర మైన తనను కాపాడినందుకు కృతజ్ఞతతో తాను సంస్తానాదీశుడైన వెంటనే కొంపెల్ల మహాలక్ష్మి గారి కి ఒక అగ్రహారాన్ని బహుమతి గా ఇచ్చారు. ఆ తరువాత రాజుగారి తాతగారు రాయపరాజు పేరుమీద అక్కడ ప్రతీ సంవత్సరం అనేక కార్యక్రమాలు, యజ్ఞ యాగాలు జరిగేవి. అందుచేత ఆ ఆగ్రహారానికి రాయభూపాల అగ్రహారం అని పేరు వచ్చింది. ఆ రాయభూపాల అగ్రహారమే ఇప్పటి రాయభూపాల పట్నం.
రాగవమ్మ చెరువు
ఆ తరువాత కాలంలో ఆ అగ్రహారమంతా పంటలు సుభిక్షం గా పండేందుకు వీలుగా రాయ జగపతి గారి నాయనమ్మ/ అగ్ని ప్రవేశం ఆత్మత్యాగం చేసుకున్న రాగమ్మ గారి పేరు మీద పెద్ద చెరువు త్రవ్వించినట్లు స్థానిక చరిత్రము నుండి తెలుస్తున్నది.
రత్నగర్భ వినాయకుడు.
అతి పురాతనమైన ఎంతో చరిత్రగలిగి తన పొట్టలో రత్నాలను దాచుకున్న శ్రీ రత్న గర్భ వినాయకుల వారికి రాజుల కాలం నుండీ కూడా ఎంతో వైబోగం జరిగిందని ప్రతీతి.
మీ వంగలపూడి శివకృష్ణ

CGK bhupathi, Peddpuram Father of Mahesh Bhupathi, Chennai

దిగ్గజాలకు దిక్సూచి - మన చిన గంధం కృష్ణ భూపతి








టెన్నీసు ప్రపంచానికి C.G.K భూపతి గా సుపరిచితులైన శ్రీ చిన గంధం కృష్ణ భూపతి గారి బాల్యం, విద్యాభ్యాసం, క్రీడాబ్యాసం అంతా పెద్దాపురం లోనే సాగింది.
చిన్నతనం నుండీ అతని టెన్నీసు ప్రాక్టీసు పెద్దాపురం 1902 లోనే బ్రీటీషు వారిచే నిర్మిపబడ్డ టౌన్ హాల్ లో ఉన్నటువంటి మట్టి కోర్టు లోనే జరిగింది.
ఈయన తండ్రిగారు శ్రీ చిన గంధం సూర్యనారాయణ మూర్తి గారు.
వీరి స్వగృహం లూధరన్ హై స్కూల్ ఎదురుగా (ఇప్పుడు ఆ స్థలం లో బాలాజీ కనస్ట్రక్షన్స్ , వారు నిర్మించిన అపార్ట్‌మెంట్ వుంది)
S.S.L.C వరకూ ఈయన విద్యాభ్యాసం 1963 పెద్దాపురం లూథరన్ హై స్కూల్ లోనే సాగింది.
• ప్రపంచ టెన్నిస్ దిగ్గజం తొమ్మిది సార్లు గ్రాండ్ స్లామ్ విజేత పద్మశ్రీ మహేష్ శ్రీనివాస్ భూపతి ఈయన కుమారుడే (DOB: జూన్ 07 – 1974, చెన్నై)
• స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి పద్మశ్రీ సానియా మీర్జా కి కోచ్ ఈయన
జాతీయ స్థాయిలో అనేక టెన్నిస్ పోటీలలో పాల్గొన్న భూపతి గారిని అనేక బహుమతులు వరించాయి.
1968 - 69 లలో శ్రీ లంక లో జరిగిన జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలలో అమ్రిత్రాజ్ మరియు యస్. ఎన్ మిశ్రా భాగస్వాములుగా వరుసగా 1968 ఫైనల్ లో బి. ఎల్ పింటో మరియు పి. యస్. కుమార లను 1969 ఫైనల్ లో B.L. వి ధావన్, శ్యామ్ మినోత్ర లను ఓడించి డబుల్స్ టైటిల్ విజయ కేతనం ఎగుర వేశారు.
1975 వ సంవత్సరంలో పురుషుల సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలలో రన్నరప్ గా నిలిచిన ఈయన టెన్నిస్ క్రీడను ఎంతగా ప్రేమించారంటే ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించడానికి చిన్న చిన్న అకాడమీ లతో మొదలై బెంగుళూరు మహానగరం లో టెన్నిస్ విలేజ్ నిర్మించేటంత.
భారత క్రీడారంగానికి ఎనలేని సేవలు చేస్తున్న మన C.G.K భూపతి గారు నిజంగా అబినంధనీయులు.............................................మీ వంగలపూడి శివకృష్ణ
***(తప్పులు ఉంటే తెలియజేయండి తప్పక సవరిస్తాను)***

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...