Tuesday, 20 December 2016

చారిత్రక పెద్దాపురం : పార్వతీ పరమేశ్వర స్థూపాలు రాయభూపాల పట్నం

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

రాయభూపాల పట్నం చారిత్రక పెద్దాపురం లో పురాతన చరిత్రకలిగిన గ్రామం రాగమ్మ చెరువులో పార్వతీ పరమేశ్వర స్థూపాలు శాతవాహనుల నాటి చరిత్రకు ఆనవాలుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయం పడుతుంటే మరికొందరు ఇవి మహా శివభక్తులైన చాళుక్యులు నిర్మాణం చేయగా తురుష్కులు ధ్వంసం చేసిన మహా శివాలయం నాటి శిధిల ఆనవాళ్లు అని అభిప్రాయపడుతున్నారు అలనాటి చారిత్రిక సౌరభాలు శిధిలావస్తలో భూమి దొంతరల్లో మరుగున పడిపోయి ఉన్నప్పుడు పెద్దాపురం సంస్థానానికి చెందిన మహారాజులు త్రవ్వించినా తటాకాల మూలంగా చాలా వరకూ బయపడ్డాయి అలాంటి వాటిలో ఇదీ ఒక్కటి .... స్థానికులు మాత్రం రాగమ్మ చెరువులోని ఈ స్థూపాలను పార్వతీ పరమేశ్వర స్థూపాలు గా పిలుస్తారు




Whitteker Girls High School Near Peddapuram - Samalkota

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

An Old and Valuable Images of Samalkot Peddapuram Constituency Peddapuram Division

OLD Church at SAMALKOTA


WHITTLEKAR GIRL HIGH SCHOOL - SAMALKOT - PEDDAPURAM - HERE12 ACRES OF LAND  PURCHASED & THIS BUILDING CONSTRUCTED BY REV.ADAM LONG in the name of MISS.PAULINE WITTEKAR

Monday, 12 December 2016

VARIATIONS OF VANGALAPUDI SIVA KRISHNA PEDDAPURAM

మన పెద్దాపురం : ముగ్గురమ్మలు FAMOUS THREE OF PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర

మన పెద్దాపురం : ముగ్గురమ్మలు
ఒక అమ్మ మరిడమ్మ - మా ఊరి ఇలవేల్పు
ఒక అమ్మ సీతాయమ్మ - అన్నార్తుల ఇలవేల్పు
ఒక అమ్మ సీతమ్మ - వెండితెర ఇలవేల్పు

ఇలా పెద్దాపురం లో ప్రతీ చారిత్రక అంశాన్ని హోర్డింగులు ద్వారా పెద్దాపురం వచ్చే ప్రతీ ఒక్కరికీ తెలిసేలా ఏర్పాటు చెయ్యాలి - వీరి చరిత్ర ఏంటో - పెద్దాపురం అసలు చరిత్ర ఏంటో దాని గొప్పతనం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రతీ ఒక్కరిలో నింపుతాం - దీనికి పెద్దలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం - మనపెద్దాపురం గ్రూప్
VANGALAPUDI SIVAKRISHNA

VANGALAPUDI SIVA KRISHNA PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర
#పరుగుల పెడుతున్న ప్రపంచంలో #మన_పెద్దాపురం యొక్క #విశిష్టతలు,సాంకేతికంగా అభివృద్ధి జరుగుతున్న ఈ తరంలో కూడ పెద్దాపురం యొక్క #ప్రత్యేకతలని తనధైన రీతిలో ప్రపంచానికి అందిస్తున్నా మాVangalapudi Siva Krishna గారికి నా #ప్రత్యేక అభినందనలు

FROM #SIVA FRNDSTO SUPPORT

OLDEST CINIMA THEATER IN PEDDAPURAM

Oldest Cinema Theater In E.G.Dt is #Somaraju Theatre
తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యంత పాత సినిమా థియేటర్ గా సోమరాజు థియేటర్ పేరు గాంచింది బహుశా ఇది జిల్లాలో రెండవ పురాతన సినిమా హాల్ కావచ్చు
మన జిల్లా వాసులకి సినిమాలంటే ఎంత క్రేజ్ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు :
ఈ అరుదైన "కింగ్ స్టార్" శోభన్ బాబు గారి #దేవాలయం సినిమా విజయాన్ని ఆశిస్తూ#పెద్దాపురం కంచర వీధికి చెందిన అతని అభిమానులు విడుదల చేసిన ఈ బులిటెన్ ను బట్టి ఆనాటి జిల్లా వాసుల అభిమానం అంచనా వేయచ్చు
VANGALAPUDI SIVA KRISHNA

పెద్దాపురం చరిత్ర

A VISIT OF THIRUPATHI - FROM PEDDAPURAM BY VANGALAPUDI SIVA KRISHNA

పెద్దాపురం చరిత్ర
పెద్దాపురం కళాఖండాల మధ్య సప్తగిరులు
శేషాచల కొండల్లో - సప్తగిరుల సందర్శనం
ఇటీవల తిరుపతి వెళ్ళినప్పుడు నన్ను బాగా ఆకర్షించిన అంశం నేను తిరుపతి వెళ్ళడానికి నన్ను పురిగొల్పిన ప్రధానాంశం #పెద్దాపురం కళాకారుల కళాసృష్టి అయిన #గరుడ మరియు#హనుమ విగ్రహాలు చూడడానికి...
#అలిపిరి ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవాలకునే భక్తులకు స్వాగతం పలుకుతాడు#గరుఖ్మంతుడు
ఇంకొంచెం దూరం వెళ్ళగానే దర్శనమిస్తాడు #హనుమంతుడు
ఈ రెండు విగ్రహాలు పెద్దాపురం శిల్ప కళాకారులైన #శ్రీ_తోగు_లక్ష్మణస్వామి గారి ఆధ్వర్యంలో శిల్పులు #శ్రీ_దాసరి_సుబ్బరాజు, #శ్రీ_ప్యాసు_ధర్మరాజు... మొదలైన వారు తయారు చేయడం జరిగింది. ఇవి అక్కడ ఏర్పాటు చేయడానికి చిన్న కారణం ఉంది. ఒకనాడు తిరుమల కాలి నడక మార్గంలో ఒక మహిళ హత్యకు గురవడంతో భక్తులు భయ భ్రాంతులకు గురయ్యేవారు అందుచేత టి.టి.డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారు - భక్తులలో ధైర్యాన్ని నింపేదుకు అచ్చం దేవుడే మన ఎదుట ఉన్నాడా అనే రీతిలో ఉండే విగ్రహాలను తయారు చేయించడం జరిగింది.
ఈ రెండు విగ్రహాలూ తిరుమలకి ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఏమాత్రం సందేహం లేదు తిరుమల చేరిన తరువాత అక్కడక్కడా మీకు సప్తగిరులను విద్యుత్ దీపాలంకరణలో చూపించే కొన్ని ఎక్సిబిషన్స్ ఏర్పాటు చేస్తారు అక్కడ కూడా అటు #గరుడా ఇటు #హనుమా విగ్రహాలు మధ్యలో#శ్రీ_వెంకటేశ్వర_స్వామి వారి విగ్రహం చూపరులకు కన్నుల పండుగ గా ఉంటుంది.
తరువాత #తరిగొండ_వెంగమాంబ అన్నదాన సత్రం లో
శేషాచల, వృషభాచల, గరుడాచల ,అంజనాచల ,నీలాచల, వేంకటాచల నారాయణాచలాల నయనానంద కరమైన చిత్రరాజం #పెద్దాపురం_కళాకారుల కళా ఖండాలైన #గరూడ #హనూమవిగ్రహాల మధ్యలో ఉంటుంది నిజంగా చూడడానికి రెండు కళ్ళూ చాలవు... ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ రెండు విగ్రహాలను కూడా దర్శించి తరించగలరు.... వంగలపూడి శివకృష్ణ












Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...