Monday, 12 December 2016

A VISIT OF THIRUPATHI - FROM PEDDAPURAM BY VANGALAPUDI SIVA KRISHNA

పెద్దాపురం చరిత్ర
పెద్దాపురం కళాఖండాల మధ్య సప్తగిరులు
శేషాచల కొండల్లో - సప్తగిరుల సందర్శనం
ఇటీవల తిరుపతి వెళ్ళినప్పుడు నన్ను బాగా ఆకర్షించిన అంశం నేను తిరుపతి వెళ్ళడానికి నన్ను పురిగొల్పిన ప్రధానాంశం #పెద్దాపురం కళాకారుల కళాసృష్టి అయిన #గరుడ మరియు#హనుమ విగ్రహాలు చూడడానికి...
#అలిపిరి ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవాలకునే భక్తులకు స్వాగతం పలుకుతాడు#గరుఖ్మంతుడు
ఇంకొంచెం దూరం వెళ్ళగానే దర్శనమిస్తాడు #హనుమంతుడు
ఈ రెండు విగ్రహాలు పెద్దాపురం శిల్ప కళాకారులైన #శ్రీ_తోగు_లక్ష్మణస్వామి గారి ఆధ్వర్యంలో శిల్పులు #శ్రీ_దాసరి_సుబ్బరాజు#శ్రీ_ప్యాసు_ధర్మరాజు... మొదలైన వారు తయారు చేయడం జరిగింది. ఇవి అక్కడ ఏర్పాటు చేయడానికి చిన్న కారణం ఉంది. ఒకనాడు తిరుమల కాలి నడక మార్గంలో ఒక మహిళ హత్యకు గురవడంతో భక్తులు భయ భ్రాంతులకు గురయ్యేవారు అందుచేత టి.టి.డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారు - భక్తులలో ధైర్యాన్ని నింపేదుకు అచ్చం దేవుడే మన ఎదుట ఉన్నాడా అనే రీతిలో ఉండే విగ్రహాలను తయారు చేయించడం జరిగింది.
ఈ రెండు విగ్రహాలూ తిరుమలకి ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఏమాత్రం సందేహం లేదు తిరుమల చేరిన తరువాత అక్కడక్కడా మీకు సప్తగిరులను విద్యుత్ దీపాలంకరణలో చూపించే కొన్ని ఎక్సిబిషన్స్ ఏర్పాటు చేస్తారు అక్కడ కూడా అటు #గరుడా ఇటు #హనుమా విగ్రహాలు మధ్యలో#శ్రీ_వెంకటేశ్వర_స్వామి వారి విగ్రహం చూపరులకు కన్నుల పండుగ గా ఉంటుంది.
తరువాత #తరిగొండ_వెంగమాంబ అన్నదాన సత్రం లో
శేషాచల, వృషభాచల, గరుడాచల ,అంజనాచల ,నీలాచల, వేంకటాచల నారాయణాచలాల నయనానంద కరమైన చిత్రరాజం #పెద్దాపురం_కళాకారుల కళా ఖండాలైన #గరూడ #హనూమవిగ్రహాల మధ్యలో ఉంటుంది నిజంగా చూడడానికి రెండు కళ్ళూ చాలవు... ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ రెండు విగ్రహాలను కూడా దర్శించి తరించగలరు.... వంగలపూడి శివకృష్ణ












No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...