Monday 12 December 2016

PEDDAAPURAM PALLE SUDDHULU - BY Vangalapudi Siva Krishna

పెద్దాపురం చరిత్ర

మన పెద్దాపురం : గొల్ల సుద్దులు, పల్లె సుద్దులు

కొమ్ములు దీరణాలు జిగుగుల్కెడు వ్రాతల కృష్ణ లీలలం
గ్రమ్ము గుడార్లు వీరుడగు కాటమ రాజు కాథానులాపముల్
బమ్మిన పుస్తకాలు ముఖ పట్టిడి కట్టురు మాలలున్నెటా
సొమ్ములు నావముల్ వెలయు సుద్దుల గొల్లలు వచ్చి రెంటయున్.

చాలా సంవత్సరాల క్రితం మొదలై ఇటీవల కంటికి కనిపించడమే కాదు కనీసం వినిపించకుండా పోయిన జాన పద కళా రూపాలివి
మహాశివుని ఢమరుఖం నుండే అక్షరాలు పుట్టాయి అని ఆ మహాశివుడు నాట్యం చేస్తున్నప్పుడు జాలువారిన తొలి చెమట చుక్క అయిన బీరప్ప ని గొల్లలు వారి కుల దైవంగా పూజించుకుంటారు. అయితే వీరిలో ఎర్ర గొల్లలు యాదవులు గా పిలువ బడుతూ శ్రీ కృష్ణ పరమాత్ముని వారి కులదైవంగా పూజించుకుంటారు, వీరంతా యాదవ యోధుడైన కాటమ రాయున్ని ఆరాధిస్తారు, అందుచేత జానపద కళా రూపాల ద్వారా వీరి కుల దైవాలైన బీరప్ప - కృష్ణ లీలలు, కాటమ రాయుడు కథలతో పాటుగా, వీరభద్రుడి కథ, స్థానిక చరిత్రలు, తాతల కాలం నాటి కథలు, పురాణాలలోని చిన్న కథలు ఈ కథాగాన కళా ప్రదర్శన ద్వారా తెలియజేసేవారు మన పెద్దాపురం చరిత్రని దాని వైభవాన్ని, గ్రామ దేవతల కథలనూ, పెద్దాపురం పాండవులమెట్ట ప్రాశస్త్యాన్ని, పాండవుల కధలను ఆంధ్ర రాష్ట్రమంతటా తెలియచేసింది ఈ జానపద కళలే... ఆ తరువాత కళ అనేది ఎదో ఒక కులానికే పరిమితం కాకుండా విస్తరింపబడాలి అనే సదుద్దేశం తో ప్రజా నాట్య మండలి వారు పల్లె సుద్దులు పేరుతో సామాజిక రాజకీయ అంశాలను ప్రజలకు చేరవేసేందుకు అనేక మైన బృందాలను తయారు చేశారు వీరు రాష్ట్రం నలుమూలలా ప్రదర్శన లిచ్చి అనేక మంది ప్రముఖల మన్ననలు పొందారు పల్లె సుద్దులు ద్వారా పెద్దాపురం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగించారు అందుకే చరిత్ర వైభవం నిలవాలంటే జానపద కళలు నిలవాలి.

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...