Tuesday, 20 December 2016

చారిత్రక పెద్దాపురం : పార్వతీ పరమేశ్వర స్థూపాలు రాయభూపాల పట్నం

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

రాయభూపాల పట్నం చారిత్రక పెద్దాపురం లో పురాతన చరిత్రకలిగిన గ్రామం రాగమ్మ చెరువులో పార్వతీ పరమేశ్వర స్థూపాలు శాతవాహనుల నాటి చరిత్రకు ఆనవాలుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయం పడుతుంటే మరికొందరు ఇవి మహా శివభక్తులైన చాళుక్యులు నిర్మాణం చేయగా తురుష్కులు ధ్వంసం చేసిన మహా శివాలయం నాటి శిధిల ఆనవాళ్లు అని అభిప్రాయపడుతున్నారు అలనాటి చారిత్రిక సౌరభాలు శిధిలావస్తలో భూమి దొంతరల్లో మరుగున పడిపోయి ఉన్నప్పుడు పెద్దాపురం సంస్థానానికి చెందిన మహారాజులు త్రవ్వించినా తటాకాల మూలంగా చాలా వరకూ బయపడ్డాయి అలాంటి వాటిలో ఇదీ ఒక్కటి .... స్థానికులు మాత్రం రాగమ్మ చెరువులోని ఈ స్థూపాలను పార్వతీ పరమేశ్వర స్థూపాలు గా పిలుస్తారు




Whitteker Girls High School Near Peddapuram - Samalkota

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

An Old and Valuable Images of Samalkot Peddapuram Constituency Peddapuram Division

OLD Church at SAMALKOTA


WHITTLEKAR GIRL HIGH SCHOOL - SAMALKOT - PEDDAPURAM - HERE12 ACRES OF LAND  PURCHASED & THIS BUILDING CONSTRUCTED BY REV.ADAM LONG in the name of MISS.PAULINE WITTEKAR

Monday, 12 December 2016

VARIATIONS OF VANGALAPUDI SIVA KRISHNA PEDDAPURAM

మన పెద్దాపురం : ముగ్గురమ్మలు FAMOUS THREE OF PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర

మన పెద్దాపురం : ముగ్గురమ్మలు
ఒక అమ్మ మరిడమ్మ - మా ఊరి ఇలవేల్పు
ఒక అమ్మ సీతాయమ్మ - అన్నార్తుల ఇలవేల్పు
ఒక అమ్మ సీతమ్మ - వెండితెర ఇలవేల్పు

ఇలా పెద్దాపురం లో ప్రతీ చారిత్రక అంశాన్ని హోర్డింగులు ద్వారా పెద్దాపురం వచ్చే ప్రతీ ఒక్కరికీ తెలిసేలా ఏర్పాటు చెయ్యాలి - వీరి చరిత్ర ఏంటో - పెద్దాపురం అసలు చరిత్ర ఏంటో దాని గొప్పతనం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రతీ ఒక్కరిలో నింపుతాం - దీనికి పెద్దలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం - మనపెద్దాపురం గ్రూప్
VANGALAPUDI SIVAKRISHNA

VANGALAPUDI SIVA KRISHNA PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర
#పరుగుల పెడుతున్న ప్రపంచంలో #మన_పెద్దాపురం యొక్క #విశిష్టతలు,సాంకేతికంగా అభివృద్ధి జరుగుతున్న ఈ తరంలో కూడ పెద్దాపురం యొక్క #ప్రత్యేకతలని తనధైన రీతిలో ప్రపంచానికి అందిస్తున్నా మాVangalapudi Siva Krishna గారికి నా #ప్రత్యేక అభినందనలు

FROM #SIVA FRNDSTO SUPPORT

OLDEST CINIMA THEATER IN PEDDAPURAM

Oldest Cinema Theater In E.G.Dt is #Somaraju Theatre
తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యంత పాత సినిమా థియేటర్ గా సోమరాజు థియేటర్ పేరు గాంచింది బహుశా ఇది జిల్లాలో రెండవ పురాతన సినిమా హాల్ కావచ్చు
మన జిల్లా వాసులకి సినిమాలంటే ఎంత క్రేజ్ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు :
ఈ అరుదైన "కింగ్ స్టార్" శోభన్ బాబు గారి #దేవాలయం సినిమా విజయాన్ని ఆశిస్తూ#పెద్దాపురం కంచర వీధికి చెందిన అతని అభిమానులు విడుదల చేసిన ఈ బులిటెన్ ను బట్టి ఆనాటి జిల్లా వాసుల అభిమానం అంచనా వేయచ్చు
VANGALAPUDI SIVA KRISHNA

పెద్దాపురం చరిత్ర

A VISIT OF THIRUPATHI - FROM PEDDAPURAM BY VANGALAPUDI SIVA KRISHNA

పెద్దాపురం చరిత్ర
పెద్దాపురం కళాఖండాల మధ్య సప్తగిరులు
శేషాచల కొండల్లో - సప్తగిరుల సందర్శనం
ఇటీవల తిరుపతి వెళ్ళినప్పుడు నన్ను బాగా ఆకర్షించిన అంశం నేను తిరుపతి వెళ్ళడానికి నన్ను పురిగొల్పిన ప్రధానాంశం #పెద్దాపురం కళాకారుల కళాసృష్టి అయిన #గరుడ మరియు#హనుమ విగ్రహాలు చూడడానికి...
#అలిపిరి ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవాలకునే భక్తులకు స్వాగతం పలుకుతాడు#గరుఖ్మంతుడు
ఇంకొంచెం దూరం వెళ్ళగానే దర్శనమిస్తాడు #హనుమంతుడు
ఈ రెండు విగ్రహాలు పెద్దాపురం శిల్ప కళాకారులైన #శ్రీ_తోగు_లక్ష్మణస్వామి గారి ఆధ్వర్యంలో శిల్పులు #శ్రీ_దాసరి_సుబ్బరాజు#శ్రీ_ప్యాసు_ధర్మరాజు... మొదలైన వారు తయారు చేయడం జరిగింది. ఇవి అక్కడ ఏర్పాటు చేయడానికి చిన్న కారణం ఉంది. ఒకనాడు తిరుమల కాలి నడక మార్గంలో ఒక మహిళ హత్యకు గురవడంతో భక్తులు భయ భ్రాంతులకు గురయ్యేవారు అందుచేత టి.టి.డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారు - భక్తులలో ధైర్యాన్ని నింపేదుకు అచ్చం దేవుడే మన ఎదుట ఉన్నాడా అనే రీతిలో ఉండే విగ్రహాలను తయారు చేయించడం జరిగింది.
ఈ రెండు విగ్రహాలూ తిరుమలకి ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఏమాత్రం సందేహం లేదు తిరుమల చేరిన తరువాత అక్కడక్కడా మీకు సప్తగిరులను విద్యుత్ దీపాలంకరణలో చూపించే కొన్ని ఎక్సిబిషన్స్ ఏర్పాటు చేస్తారు అక్కడ కూడా అటు #గరుడా ఇటు #హనుమా విగ్రహాలు మధ్యలో#శ్రీ_వెంకటేశ్వర_స్వామి వారి విగ్రహం చూపరులకు కన్నుల పండుగ గా ఉంటుంది.
తరువాత #తరిగొండ_వెంగమాంబ అన్నదాన సత్రం లో
శేషాచల, వృషభాచల, గరుడాచల ,అంజనాచల ,నీలాచల, వేంకటాచల నారాయణాచలాల నయనానంద కరమైన చిత్రరాజం #పెద్దాపురం_కళాకారుల కళా ఖండాలైన #గరూడ #హనూమవిగ్రహాల మధ్యలో ఉంటుంది నిజంగా చూడడానికి రెండు కళ్ళూ చాలవు... ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ రెండు విగ్రహాలను కూడా దర్శించి తరించగలరు.... వంగలపూడి శివకృష్ణ












VANGALAPUDI SIVA KRISHNA PEDDAPURAM

పెద్దాపురం చరిత్ర

దాదాపు 12 సంవత్సరాల క్రితం నాటి నా కవిత (పిచ్చి రాత) 
నేను M.R College లో ఇంటర్ చదువుతున్నప్పుడు రాసింది -#మొదటి_అక్షరాలన్నీ_కలిపితే_నాపేరు_వచ్చేలా... ! అప్పట్లో ఇదో సంచలనం... ! అద్భుతం... ! ఇది ఎప్పుడు చూసినా ఎదో తెలియని భావోద్వేగం ... అర్ధం పర్ధం లేని ఇలాంటి పిచ్చి రాతలెన్నో నా పాత నోటు పుస్తకాలల్లో


A Poem on Peddapuram maridamma - Vangalapudi Siva Krishna

పెద్దాపురం చరిత్ర

హరియైన హరుడైన నింద్రుడైనా అబ్జాసనుండైనా ని
న్నె ఱుంగజాలరు నీ మహిమ మాకెంచగ శఖ్యంబటే
పరదేవీ విషజాతమారుతవల త్పాదద్వయా దూరమై
మరిడీదేవతా ! మమ్ము బ్రోవగదటమ్మా పొమ్మ మాయమ్మవై

PEDDAAPURAM PALLE SUDDHULU - BY Vangalapudi Siva Krishna

పెద్దాపురం చరిత్ర

మన పెద్దాపురం : గొల్ల సుద్దులు, పల్లె సుద్దులు

కొమ్ములు దీరణాలు జిగుగుల్కెడు వ్రాతల కృష్ణ లీలలం
గ్రమ్ము గుడార్లు వీరుడగు కాటమ రాజు కాథానులాపముల్
బమ్మిన పుస్తకాలు ముఖ పట్టిడి కట్టురు మాలలున్నెటా
సొమ్ములు నావముల్ వెలయు సుద్దుల గొల్లలు వచ్చి రెంటయున్.

చాలా సంవత్సరాల క్రితం మొదలై ఇటీవల కంటికి కనిపించడమే కాదు కనీసం వినిపించకుండా పోయిన జాన పద కళా రూపాలివి
మహాశివుని ఢమరుఖం నుండే అక్షరాలు పుట్టాయి అని ఆ మహాశివుడు నాట్యం చేస్తున్నప్పుడు జాలువారిన తొలి చెమట చుక్క అయిన బీరప్ప ని గొల్లలు వారి కుల దైవంగా పూజించుకుంటారు. అయితే వీరిలో ఎర్ర గొల్లలు యాదవులు గా పిలువ బడుతూ శ్రీ కృష్ణ పరమాత్ముని వారి కులదైవంగా పూజించుకుంటారు, వీరంతా యాదవ యోధుడైన కాటమ రాయున్ని ఆరాధిస్తారు, అందుచేత జానపద కళా రూపాల ద్వారా వీరి కుల దైవాలైన బీరప్ప - కృష్ణ లీలలు, కాటమ రాయుడు కథలతో పాటుగా, వీరభద్రుడి కథ, స్థానిక చరిత్రలు, తాతల కాలం నాటి కథలు, పురాణాలలోని చిన్న కథలు ఈ కథాగాన కళా ప్రదర్శన ద్వారా తెలియజేసేవారు మన పెద్దాపురం చరిత్రని దాని వైభవాన్ని, గ్రామ దేవతల కథలనూ, పెద్దాపురం పాండవులమెట్ట ప్రాశస్త్యాన్ని, పాండవుల కధలను ఆంధ్ర రాష్ట్రమంతటా తెలియచేసింది ఈ జానపద కళలే... ఆ తరువాత కళ అనేది ఎదో ఒక కులానికే పరిమితం కాకుండా విస్తరింపబడాలి అనే సదుద్దేశం తో ప్రజా నాట్య మండలి వారు పల్లె సుద్దులు పేరుతో సామాజిక రాజకీయ అంశాలను ప్రజలకు చేరవేసేందుకు అనేక మైన బృందాలను తయారు చేశారు వీరు రాష్ట్రం నలుమూలలా ప్రదర్శన లిచ్చి అనేక మంది ప్రముఖల మన్ననలు పొందారు పల్లె సుద్దులు ద్వారా పెద్దాపురం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగించారు అందుకే చరిత్ర వైభవం నిలవాలంటే జానపద కళలు నిలవాలి.

JAI PEDDAPURAM JAI JAI PEDDAPURAM - BY VANGALAPUDI SIVA KRISHNA

పెద్దాపురం చరిత్ర

జై పెద్దాపురం..... జై జై చారిత్రక పెద్దాపురం

మహదైశ్వర్యములనుభవించి యువ పరాక్రమ చరిత్రతో విరాజిల్లిన చారిత్రక పెద్దాపురం అసలు చరిత్ర తెలుసుకో... 300 సంవత్సరాలు పెద్దాపుర మహా సంస్థానాన్ని పరిపాలించిన వత్సవాయ వంశ వైభవం తెలుసుకో

రణమున గుఱ్ఱంపు రౌతులఁ బరిమార్చె
వాసిగా నెఱజెర్ల వాక లోనఁ
బెద్దాపురంబున బిరుదాంకపురిలోన
యవనవీరులఁ బరా హతులఁ జేసెఁ
బ్రతిఘటించు నరేంద్ర సుతుని దర్ప మడంచెఁ
దిరుపతి చెంత భూవరులు మెచ్చఁ
దూరుపునాట శత్రుక్షత్రనక్షత్ర
రుచిరూపు మాపే సూర్యుం డనంగ

38 గ్రామాలతో ఉన్న కోఠాం ఎస్టేటు (గోదావరి జిల్లా, తుని) ఒకప్పుడు పెద్దాపురం సంస్థానంలో ఒక చిన్న భాగం అలాంటి 585 గ్రామాలు మరియు పట్టణములతో విరాజిల్లిన పెద్దాపుర మహా సంస్థానాన్ని, పురాణ పురుషులు, రాజులు, మహా రాజులు, మహారాణులు, కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులు, పోరాట యోధులు నడయాడిన పెద్దాపురాన్ని నా ఊరు పెద్దాపురం అని గర్వంగా చెప్పుకోలేక పోవడం కంటే హీనం మరొకటి ఉండదు .... జై పెద్దాపురం జై జై చారిత్రక పెద్దాపురం

VANGALAPUDI SIVA KRISHNA'S PEDDAPURAM HISTORY

పెద్దాపురం చరిత్ర
38 గ్రామాలతో ఉన్న కోఠాం ఎస్టేటు (గోదావరి జిల్లా, తుని) ఒకప్పుడు పెద్దాపురం సంస్థానంలో ఒక చిన్న భాగం అలాంటి 585 గ్రామాలు మరియు పట్టణములతో విరాజిల్లిన పెద్దాపుర మహా సంస్థానాన్ని, పురాణ పురుషులు, రాజులు, మహా రాజులు, మహారాణులు, కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులు, పోరాట యోధులు నడయాడిన పెద్దాపురాన్ని నా ఊరు పెద్దాపురం అని గర్వంగా చెప్పుకోలేక పోవడం కంటే హీనం మరొకటి ఉండదు ....

ఇలాంటివి ఎన్నో విషయాలు మనలో చాలా మందికి తెలియదు .. మన ఊరు చరిత్ర గొప్పతనాన్ని నిరంతరం పోస్ట్ ల ద్వారా తెలియచేస్తున్న మన మిత్రుడు Vangalapudi Siva Krishna గారికి ధన్యవాదాలు .. పెద్దాపురంలో ఉన్న చరిత్రకారులు మరియు మేధావులు సహకారంతో పెద్దాపురం చరిత్ర మొత్తాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావలని శివకృష్ణ ని కోరుకుంటున్నా. ఈ పుస్తకానికి అయ్యే ఖర్చులో పెద్దాపురం పౌరుడిగా నా వంతు సాయం చేస్తానని హామీ ఇస్తున్నా ..మరి మీరు ?

ఇది చారిత్రక అవసరం..భవిష్యత్ కు పునాది!!ప్రతీ పెద్దాపురం పౌరుడు స్పందిస్తారని ఆశిస్తూ !!

KASI YATHRA CHARITHAM - PEDDAPURAM BY VANGALAPUDI SIVA KRISHNA

పెద్దాపురం చరిత్ర

Yenugula Veeraswamayya kaseeyatra Charitra Saying about Peddapuram

#కాశీయాత్రా_చరిత్ర: ఏనుగుల వీరాస్వామయ్య గారు #పెద్దాపురం_సందర్శనం
1831 జులై 20వ తేదీ, దాదాపు 185 సంవత్సరాల క్రితం ఏనుగుల వీరాస్వామయ్య గారు పెద్దాపురాన్ని సందర్శించడం జరిగింది - ఆ సమయంలోనే ఆయన
పెద్దాపురం పిఠాపురం ల మధ్య ప్రవహించే #యేలా నది గురించి,
పెద్దాపురం అనే ఊరు #పిఠాపురం కంటే గొప్పది ఇక్కడి ఇల్లు చాలా పెద్దవి,
పెద్దాపురం తాలూకాలో 3,00,000 అంగళ్ళు (సరుకులు అమ్మేవి) ఉన్నాయి అన్ని రకాల పదార్థాలు దొరుకుతున్నాయి,
పెద్దాపురం #మహారాణీ శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ దేవి అప్పటికి 3 సంవత్సరాలుగా సత్రం నడుపుతూ ఉండడం లాంటి పలు ఆసక్తి కరమైన విషయాలు కూడా ప్రస్తావించారు.....
#చారిత్రక పెద్దాపురంలో ఇలాంటి విశేషాలెన్నో చారిత్రిక గ్రంధాలలో పెద్దాపురం గురించి ఇలాంటి ప్రస్తావనలెన్నో ఉన్నాయి అవన్నీ మీముందు ఉంచే ప్రయత్నం చేస్తాను మీ యొక్క సహాయ సహాకారాలను ఆకాంక్షిస్తూ .... మీ #వంగలపూడి_శివకృష్ణ -


AIDS DAY BY PEDDAPURAM YOUTH @ENTIRE ANDHRA PRADESH


VANGALAPUDI SIVAKRISHNA
-------------------------------------
రాష్ట్రమంతటా HIV / AIDS Campaign చేసిన ఆనాటి రోజులు గుర్తుకొచ్చాయి

అది పెద్దాపురాన్ని కాల సర్పం కసిగా కాటు వేసిన కాలం
కాలధర్మం కోసం కాలయముడు కాచుకు కూర్చున్న కాలం
ప్రపంచానికి పెద్దాపురాన్ని వేశ్యాపురంగా పరిచయం చేసిన కాలం

కడుపు దహించుకు పోతున్నా శరీరం కుచించుకు పోతున్నా
తప్పని సరి పరిస్థితులలో తప్పుడు మంచాలు చేరి
పడుపు వృత్తి పంచన వంచనలు భరించిన
కళావంతుల కన్నెల వేదనలు ఓవైపు


వ్యసనాలకు బానిసలై విష సంస్కృతి పీడితులై
విచ్చల విడి కామికులై వీధుల పడి తిరుగుతూ
వి.సి.డి లలో బూతు పురాణమ్ విలువైన కాలం వేశ్యార్పణం
వద్దని వారిస్తున్నా వినిపించని వైనంతో మూర్కత్వపు యువకులు వైపు


వెరసి ఆనాటి పెద్దాపురం లో ....... !
వీధి వీధి కి విగతజీవులు
ఊరి పొడవునా జీవచ్చవాలు
మరణ శాసనం మనో పలకం పై
ముద్రించుకున్న మూగజీవులు - ఎయిడ్స్ రోగులు

PEDDAPURAM MARIDITHALLI - BY VANGALAPUDI SIVAKRISHNA

పెద్దాపురం చరిత్ర
మమతల మా అమ్మ తల్లి
మము కాచే కల్పవల్లి
పెద్దాపుర మరిడితల్లి
మాపురపు ఇలవేల్పు

Bangaramma Temple Peddapuram, Bangaramma Gudi Veedhi Peddapruam

పెద్దాపురం చరిత్ర
#బంగారు_మాతల్లి #బంగారమ్మ_తల్లి
నీ ప్రేమ శాశ్వతం నీ కరుణ అమృతం
అరుణ కాంతుల తల్లి అందాల తల్లి
అసమాన దీప్తివై అతీంద్రియ శక్తివై
అవనిలో వర్ధిల్లు అపరంజి దేవత
బంగారు కాంతితో వజ్రాల వెలుగుతో
దర్శనం ఇచ్చేటి ధరణేలు తల్లి
భక్తులను కాపాడి కోర్కెలను తీర్చగా
భువిలోన వెలిసిన బంగారు తల్లి
మన పెద్దాపురం శ్రీ శ్రీ శ్రీ బంగారమ్మ అమ్మవారి దివ్యమంగళ విగ్రహం దర్శించండి

శ్రీ బంగారమ్మ అమ్మవారు
Bangaramma Thalli Temple Peddapuram Near Bangaramma Gudi Veedhi Peddapuram పెద్దాపురం బంగారమ్మ అమ్మవారి స్తోత్రం వంగలపూడి శివకృష్ణ

వంగలపూడి శివకృష్ణ పెద్దాపురం - Vangalapudi Siva Krishna Peddapuram

పెద్దాపురం చరిత్ర
వంగలపూడి శివ కృష్ణ - పెద్దాపురం 

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...