Wednesday, 18 January 2017

మన పెద్దాపురం మహానటి అంజలీ దేవి Anjali Devi Statue at Peddapuram

మన పెద్దాపురం మహానటి అంజలీ దేవి - వికీ పీడియా నుండి

అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన అంజలీదేవి (ఆగష్టు 241927 - జనవరి 132014) 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత.  ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్తపి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది 

బాల్యం
అంజలీదేవి 1927ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లాపెద్దాపురంలో జన్మించింది ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.

చిత్ర సమాహారం

నటిగా

1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996 లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.[7] సువర్ణసుందరిఅనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993) మరియు పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.

నిర్మాతగా అంజలీ పిక్చర్స్

అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973) మరియు చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు మరియు చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.

కుటుంబం

ఆమె భర్త ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు. ఆమెకు ఇద్దరు కుమారులు.


Anjali Devi Birthday celbrations at Old Busstand Peddapuram Anjali devi Statue

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Tuesday, 17 January 2017

SOCIAL ACTIVITIES OF MANA PEDDAPURAM FACE BOOK GROUP

మన పెద్దాపురం పేస్ బుక్ గ్రూప్ పెద్దాపురం అభివృద్ధి కార్యక్రమాలు
29-03-2015 మన పెద్దాపురం గ్రూపు ప్రారంభం (పెద్దాపురం చరిత్ర ప్రపంచానికి పరిచయం చేయడానికి నాంది) 

13-12-2015 మహా రక్తదాన శిబిరం (రక్తదాతలు 175 MEMBERS)

29-03-2016 చారిత్రిక నడక (వెంకటేశ్వర స్వామి గుడి నుండి మునిసిపల్ ఆఫీస్ వరకూ - పెద్దాపురం చరిత్ర పాట విడుదల)


05-06-2016 పర్యావరణ పరిరక్షణ దినోత్సవం (మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వద్ద 1000 మొక్కలు పంపిణీ )


13-08-2016 ప్రాణదాన ఉద్యమం (2000 మంది తో అవయవదాన అంగీకార పత్రాలపై సంతకాల సేకరణ)

29-08-2016 తెలుగు బాషా దినోత్సవ వేడుకలు (56 అక్షరాలు 56 మొక్కలు)

04-09-2016 మట్టి గణపతే మహా గణపతి (2000 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ)

02-10-2016 చారిత్రక గాంధీ విగ్రహ (పునః స్థాపన (ఆ రోడ్డుకి మహాత్మా గాంధీ రోడ్డుగా నామకరణ) 

09-10-2016 స్వచ్ఛ సైన్యం (CLEAN ARMY పేరుతో పట్టణం లోని 7 బస్టాప్ ల సుందరీకరణ)

16-10-2016 దత్తత వార్డుల పరిశుభ్రతా కార్యక్రమాల పనులకు శ్రీకారం (21వ వార్డు తో మొదలు)

18-12-2016 గ్రీన్ బ్లడ్ డొనేషన్ క్యాంపు (రక్తదాతలు100 MEMBERS) 

01-01-2017 వెన్నుముక్క వ్యాధి పీడితుడు బొగ్గు బాలాజీకి శాశ్వతగూడు (Rs. 1, 70, 000 ఆర్ధిక సహాయం )



ప్రతీ రోజూ పెద్దాపురం చరిత్ర పరిచయం చేస్తూనే ఉన్నాం ...
ప్రతీ సమస్య పైనా చర్చిస్తున్నాం ... స్పందిస్తున్నాం ... 
ప్రతీ ఒక్కరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ...

ప్రతీ అనారోగ్యానికి చిట్కాలందిస్తున్నాం ...
ప్రతీ వార్తా మీకు చేరవేస్తున్నాం ...
ప్రతీ నిముషం అందుబాటులోనే ఉంటున్నాం ... రక్తం అందిస్తున్నాం ...
ప్రతీ సేవా కార్యక్రమం లో పాలుపంచుకుంటున్నాం ...

ప్రతీ వార్డూ పరిశుభ్రంగా ఉండాలని ఆశిస్తున్నాం
కులం లేదు మతం లేదు మేమంతా ఒక్కటే 
ఏక తాటి పై ఉన్నాం ... చిత్తశుద్దితో ఉన్నాం ... 


అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటాం అందరికీ అండగా ఉంటాం
అవయవ దానం చేస్తాం శాశ్వతం గా జీవిస్తాం ధరిత్రి లోనూ... చరిత్రలోనూ


పెద్దాపురం యువకుల ఐక్యత వర్ధిల్లాలి ... జై పెద్దాపురం.... జై జై పెద్దాపురం 




పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

Monday, 16 January 2017

DONATE YOUR ORGANS TODAY NO RELIGION IS AGAINST TO ORGAN DONATION


అపోహలు వీడండి అవయవదానం చేయండి.
ఏ మతం చెప్పింది మంచి చెయ్యద్దని.
ఏ దేవుడు శాశించాడు దేహదానం వద్దని.
ఏంటి... ! అవయవ దాతకి స్వర్గ ప్రవేశం ఉండదా ...?
ఎంత మాట... ఎంత మాట... !
మహాశివునికి కళ్లుదానమిచ్చిన కన్నప్ప కథ వినలేదా ... !
పావురం ప్రాణానికి తన తనువునే తక్కెడలో నిల్పిన శిభి త్యాగం తెలియనిదా...!
పాప పంకిల జగతికోసం రక్తం చిందించిన జీసస్ ని మరిచావా... !
పవిత్ర యుద్దంలో అవయవాలు కోల్పోతున్న జవానులకీ స్వర్గ ప్రవేశం లేదంటావా ... ?
స్వార్దపరుడు ప్రపంచంలో అందరికన్నా దురదృష్ట వంతుడు.. కాదంటావా... ?
అన్నెం పున్నెం ఎరుగని చిన్న చిన్న పాపలు చనిపోతున్నా కూడా చలించకపోతే ఎలా చెప్పు
చచ్చి కూడా ఎవరికీ ఉపయోగపడక పోతే మనం పుట్టి ఏమి సాధించినట్టు
రా అవయవ దానం చేద్దాం అమరులమై జీవిద్దాం 

పెద్దాపురం - వంగలపూడి శివకృష్ణ

GREEN BLOOD CAMP AT PEDDAPURAM HELD ON 18/12/016 BY MANA PEDDAPURAM FACEBOOK TEAM HONORABLE DY CM MR. NIMMAKALAYALA CHINA RAJAPPA IS CHIEF GUEST


పెద్దాపురం -వంగలపూడి శివకృష్ణ
ప్రతీ మూడు నెలలకి ఒకసారి ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు రక్తదానం చేయవచ్చు ... కనీశం ఆరునెలలకు ఒక్కసారైనా  రక్తదానం చేయండి . ముగ్గురు ప్రాణాలను కాపాడటమే కాకుండా మనిషి పదికాలలపాటు పచ్చగా బతకడానికి మన పెద్దాపురం గ్రూప్ చేస్తున్న ఈ హృదయపూర్వక ప్రయత్నం లో మీరు భాగస్వాములకండి 

ఒక్క సారి ఆలోచిందండి సరైన సమయానికి రక్తం దొరకక అనేక మంది చనిపోతున్నారు .. వారిలో ఎంతో ఉజ్వల మైన భవిష్యత్తు కలిగిన చిన్న పిల్లలు ఉండటం అత్యంత బాధాకరం ... ఇకపై రక్తం దొరకక  ఏ ఒక్క ప్రాణం పోవడానికి వీల్లేదు ...  రండి రక్తదానం చేద్దాం ... ప్రాణదాన ఉద్యమం లో భాగస్వాములమౌదాం 

Thursday, 12 January 2017

అంజలీ దేవి కి అంజలి - నమః సుమాంజలి - TODAY GREAT ACTRESS ANJALI DEVI - PEDDAPURAM MOMORIAL DAY

అంజలీ దేవి కి అంజలి - నమః సుమాంజలి

ఈ రోజు మన పెద్దాపురం మహానటి ఆరాధ్య కధానాయకులకు సైతం ఆరాధ్య నటీమణి  తెలుగు సినీ కళామతల్లి ముద్దుల కూతురు...  సినీ సీతమ్మ తల్లి  అంజలీ దేవి వర్ధంతి సందర్భంగా - పెద్దాపురానికి గర్వకారణమైన అంశంగా నిలిచినా అంజలీ దేవికి అంజలి ఘటిద్దాం

చివరి శ్వాస వరకూ తన ఊరు పెద్దాపురం అని గర్వంగా చెప్పుకున్నారు
మరణం అనంతరం ఆమె అవయవాలను అవయవదానం చేసి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు ... జోహార్ అంజలీ దేవి - జై పెద్దాపురం


పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

PLEASE VISIT AMARAGIRI SATTEMMA TEMPLE AT PEDDAPURAM PANDAVULAMETTA



🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🙏 *రండి అమ్మవారిని దర్శించండి*🙏
*కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడి* *కష్టాలు కడదేర్చి కన్నీళ్లు తొలగించి* *కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కల్పవల్లి* *మన కోట సత్తెమ్మ అమ్మవారు*

🙏🙏 *అమ్మ దయ అపారం* 🙏🙏 *అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే* *అమరిగిరి సత్తెమ్మ వారిని దర్శించండి**అన్ని అరిష్టాల నుండీ విముక్తి పొందండి*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

చారిత్రిక పెద్దాపురం సంస్థానం కోడి పందాలు : విజయ నగరం మహారాజు ఆనంద గజపతి Vs పెద్దాపురం సంస్థానం మహారాజు రాయ జగపతి (Peddapuram Cock Fight)

పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

చారిత్రిక పెద్దాపురం సంస్థానం కోడి పందాలు :
పండగ వచ్చిందంటే చాలు మనందరి ఆలోచనలు అనుకోకుండానే కోడి పందాల వైపు మళ్ళుతాయి పెద్దాపురం మరియు పరిసర ప్రాంత ప్రజల కోడి పందాల పిచ్చి రాష్ట్రం నలుమూలలకు పాకింది ... కోడి పందాలకే కాదు పందెం కోళ్లకు శిక్షణ ఇచ్చే నిపుణులకూ పెద్దాపురం ప్రసిద్ధి .... రాష్ట్రం నలుమూలలనుంచీ పెద్దాపురం వచ్చి ఇక్కడి నిపుణులు పెంచిన కోళ్లను తీసుకుపోతుంటారు పందాల రాయుళ్లు .... అయితే ఈ పందాల ఆసక్తి ఈ నాటిది కాదు రాజుల కాలం నుండీ ఉంది... పెద్దాపురం చరిత్రలో కోడి పందాలు అనగానే టక్కున గుర్తొచ్చే రెండు పేర్లు విజయ నగరం సంస్థాన మహారాజు ఆనంద గజపతి మరియు పెద్దాపురం సంస్థానం మహారాజు రాయ జగపతి

వీరిద్దరూ విజయనగర సంస్థాన మహారాజు శ్రీ రాజా పెద విజయరామ గజపతి సంరక్షణలో కొన్ని సంవత్సరాలు పెరిగారు అయినప్పటికీ వీరిద్దరికీ ఒక్క క్షణం కూడా పడేదికాదు సకల విద్యా పారంగతులై ... సమ ఉజ్జీవులైన వీరిద్దరూ ప్రతీ విషయం లో పోటీ పడే వారు... మరీ ముఖ్యంగా కోడి పందాలలో...గెలుపోటములు ఇరువురికీ అటూ ఇటూ అయినా ఒకానొక సందర్భంలో పందెంలో ఓడిపోయిన ఆనంద గజపతి "మా పెంపుడు కోడే గెలిచింది" లే అంటూ గేలి చేసినట్టుగా కధనం...

  చారిత్రక పెద్దాపురం కోట వేదికగా కనుమ నాడు ఈ కోడి పందాలు అత్యంత వైభవంగా జరిగేవని ఆ పందాలలో పాల్గొనడానికి ... అనేక సంస్థానాల మహారాజులు వచ్చేవారని తెలుస్తుంది...

మరింత ఆసక్తి కరమైన కధనం ఏమిటంటే ఒకా నొక యుద్ధంలో  బ్రిటీషు వారి వైపు నిలిచి పోరాడాలని  ఆనంద గజపతి ... ప్రెంచి వారి వైపు నిలవాలని రాయ జగపతి పట్టు బట్టగా కోడి పందాల ద్వారా తేల్చుకున్నారని మరొక కధనం...

1758 చెందుర్తి యుద్ధంలో  1759 వ సంవత్సరంలో ఉండూరు వద్ద జరిగిన యుద్ధంలో  వీరిరువురూ హోరా హోరీ గా పోటీ పడగా ఉండూరు యుద్ధంలో పెద్దాపురం మహారాజు రాయ జగపతి తుపాకీ గుండు దెబ్బకు మరణించగా ... 1760 వ సంవత్సరంలో విజయ నగరం మహారాజు ఆనంద గజపతి అస్వస్థతతో మరణించినట్టుగా చరిత్ర చెబుతోంది.... మొత్తానికి పందెం కోళ్లు రెండూ ఉన్నన్నాళ్లూ విరుద్ధంగా ఉండడం ... మరణం కూడా స్వల్పకాల వ్యవధిలో సంభవించడం చరిత్రలో ఒక పోరు కధగా మిగిలి పోయింది ....

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...